10-6-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”
(లేదా...)
“ఎవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో”
ఎవడని గుర్తింతు మిపుడుఎవడో చేసిన గడబిడ కేదో జరిగెన్వివరము తెలియాలిప్పుడుఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'తెలియాలి' అన్నది వ్యావహారికం. "వివరములు తెలియవలె నిపు డెవఁడో..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఎవడని గుర్తింతు మిపుడుఎవడో చేసిన గడబిడ కేదో జరిగెన్వివరములు తెలియ వలెనిపుడెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”
కందంఅవగుణ వర్తనులసురుల్భువినమరత్వముగొను భ్రమఁ బొంద వరమ్ముల్స్తవముల నడంచె హరి గాకెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో?మత్తేభవిక్రీడితముఅవధుల్ మీరిన రాక్షసత్వమున సర్వానర్థముల్ సల్పుచున్భువిపై తామమరత్వపున్ భ్రమను నిర్మూలింపగాఁ జూచినన్స్తవనీయమ్మగు భంగి వారలనె తా దామోదరుండొంచె! వేరెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో?
ఎవరీ తప్పు సలిపిరో ! సవరించుట యెవరికైన సాధ్యంబగునా !కవనపు దోషము దిద్ధునదెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సివరపు చర్మముఁ దాల్చునుభవబంధమ్ములను ద్రెంచి పరమపదమిడున్భవుడని పేరొందినవాడెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడోశవమున్ గాల్చిన బూది మేనిపయినన్ సంపూర్తిగా దాల్చునేభవబంధమ్ములఁ ద్రెంచి యిచ్చును సదా భక్తాళికిన్ మోక్షమేదివిజుల్ వేడగ కాలకూటవిషమున్ ద్రెక్కొన్న వాడందురేయెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
భువి లో జీవుల పోషణ కవసర మగు సకల మొ సగి న న్నీ తానై యెవ రికి కనబడని మహితుడె వ డో యె వ్వ డొ యె వం డొ యె వడో యెవ డో?
మీ పూరణ బాగున్నది. అభినందనలు."... మొసగి యన్నియు తానై" అనండి.
-భవుడో? మాధవుడో ? వాడెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో?భవజలధి మాయని జనులనవలీలగ త్రోసినట్టి నటరాజెవడో?జిలేబి మాత్రము కాదు :)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.చివరి పాదంలో అఖండయతి.. దోషం కాదు కానీ... !
ఆ శివుడెవడో :) అంటే సరిపోతుందాండీ ??
కం॥భువికంఘ్రై,పుట్టుటకున్నెవమై, యీషణ త్రయంపు నెపమై,వెదుకన్తువుకొన కడిదౌ విస్మితిఎవడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో!
ధన్యవాదములు సర్🙏🙏
ఎవఁడో హరియవతారమ్మెవఁడో ద్రోవదికి చీరలిచ్చెఁ గురుసభన్భవహరమొనరించెడువాడెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో
భువనంబుల్ తన నోటఁజూపెనెవఁడో, పోకార్చెనో పూతనన్బవరంబందు కిరీటి స్యందనముపై భాసిల్లె నెవ్వండొ తానెవఁడో ద్రోవది మానరక్షణముకైనిచ్చెన్ దుకూలంబులేయెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో
అద్భుతమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలు గురువుగారూ🙏
కం: ఎవడీ బొద్దింక? యితం డెవనికి జన్మించె? వీని దే దేశమ్మో?యెవ డీతని ప్రేరకుడోఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”
మ: ఎవడో సృష్టిని జేసె నంట,తనయందే యుంచునంటయ్య, దానె వినాశమ్మును జేసి వేయు నట, తానే యీశు డౌనంట,వాడవినాశుండట,వాడె సర్వమట, యే యర్ధమ్ము లేనట్టి వాడెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో(పోతన గారి ఎవ్వనిచే జనించు అనే పద్యం లో మాటలనే ఒక నాస్తికుడు ఇలా తిప్పి అడిగినట్లు )
కం॥ భవ బాధల తాపమొదవిభువిని నరకమనుభవించి పొరలు మనుజులన్ జవితో దయఁగను మిత్రుఁడునెవఁడో యెవ్వఁడో యెవండొ యెవఁడో యెవఁడోమ॥ భవ బాధాబ్ధినిఁ బాపి కాచు సఖుఁడై పాలించి సద్భాగ్య ప్రాభవ దానమ్మిడి ప్రోచు వాఁడిలను సంభావించి కీర్తించఁగన్జవితో ముక్తి నొసంగు శాశ్వతుఁడు విశ్వాకారునిన్ దెల్పుమాయెవఁడెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో
నృవరప్రవరుఁడు సమయమ్ము వృథ యగును దలఁచిన సతముం గావఁగ నీయవని నరుదెంచు నని మదినెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో శివు వింటిన్ విఱిచెన్ నరుం డొకఁ డనం జిత్రమ్ముగా రాముఁడే యవనిం గూల్చి రనంగ వీరు నభిమన్యాఖ్యున్ రుషం బార్థుఁడే రవముప్పొంగ సుయోధనుండు విని మల్లశ్రేష్ఠు చా వార్చిరే యెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వం డొకో
సమస్య : "ఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో "భవకారకుండెవండనుభవవేద్యుడకల్మషుండెవండవ్యక్తుండెవడభవుడాత్మరూపుండెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో
ఎవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతఁ డెవ్వాఁడొ యెవ్వండొకో”భువిలో భారత మాతకున్ సకల సంపూర్ణ త్వమున్ తెచ్చువాడెవడో ! శత్రువులెల్లమిత్రులయి పోటీలో ధృడంబౌ విజేత, విశేషంబగు శక్తిగా నిలుపు నేతాజీ మరెవ్వండొకో
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.వివరించుచు పాఠము గురువటు తిరిగి వ్రాయుచుండ రొద వినిపించన్ఎవడా యల్లరి కారకుడెవడో యెవ్వడొ యెవండొ యెవడో యెవడో?
శ్రవణంబాదిగగలవటనవవిధ భకుతులుకొలువగనరునకుహరిగా కెవరు గలరా డతడేయెవడో యెవ్వడొ యెవండొ యెవడో యెవడో
ఆపద మ్రొక్కులవానిని బాపుము దుఃఖముల టంచు ప్రార్థన చేయన్నాపదలు తొలగ మ్రొక్కులు*శ్రీపతి గని యైదు పదిగజేతురు భక్తుల్*దీపము నింటపెట్టచును దేవుని కెల్లరు మ్రొక్కుచున్సదాయాపకకీర్తనమ్ములనుహర్షముతోడనునాలపించుచున్తాపములెల్లబాపి వడిదారినిచూపుమటంచుభక్తితో*శ్రీపతి గాంచి రైదుపది జేతురు భక్తులు శాంతచిత్తులై*
రిప్లయితొలగించండిఎవడని గుర్తింతు మిపుడు
ఎవడో చేసిన గడబిడ కేదో జరిగెన్
వివరము తెలియాలిప్పుడు
ఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తెలియాలి' అన్నది వ్యావహారికం. "వివరములు తెలియవలె నిపు డెవఁడో..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఎవడని గుర్తింతు మిపుడు
తొలగించండిఎవడో చేసిన గడబిడ కేదో జరిగెన్
వివరములు తెలియ వలెనిపు
డెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”
కందం
రిప్లయితొలగించండిఅవగుణ వర్తనులసురుల్
భువినమరత్వముగొను భ్రమఁ బొంద వరమ్ముల్
స్తవముల నడంచె హరి గా
కెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో?
మత్తేభవిక్రీడితము
అవధుల్ మీరిన రాక్షసత్వమున సర్వానర్థముల్ సల్పుచున్
భువిపై తామమరత్వపున్ భ్రమను నిర్మూలింపగాఁ జూచినన్
స్తవనీయమ్మగు భంగి వారలనె తా దామోదరుండొంచె! వే
రెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో?
ఎవరీ తప్పు సలిపిరో !
రిప్లయితొలగించండిసవరించుట యెవరికైన సాధ్యంబగునా !
కవనపు దోషము దిద్ధున
దెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసివరపు చర్మముఁ దాల్చును
రిప్లయితొలగించండిభవబంధమ్ములను ద్రెంచి పరమపదమిడున్
భవుడని పేరొందినవా
డెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో
శవమున్ గాల్చిన బూది మేనిపయినన్ సంపూర్తిగా దాల్చునే
భవబంధమ్ములఁ ద్రెంచి యిచ్చును సదా భక్తాళికిన్ మోక్షమే
దివిజుల్ వేడగ కాలకూటవిషమున్ ద్రెక్కొన్న వాడందురే
యెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిభువి లో జీవుల పోషణ
రిప్లయితొలగించండికవసర మగు సకల మొ సగి న న్నీ తానై
యెవ రికి కనబడని మహితు
డె వ డో యె వ్వ డొ యె వం డొ యె వడో యెవ డో?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"... మొసగి యన్నియు తానై" అనండి.
-
రిప్లయితొలగించండిభవుడో? మాధవుడో ? వా
డెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో?
భవజలధి మాయని జనుల
నవలీలగ త్రోసినట్టి నటరాజెవడో?
జిలేబి మాత్రము కాదు :)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచివరి పాదంలో అఖండయతి.. దోషం కాదు కానీ... !
ఆ శివుడెవడో :) అంటే సరిపోతుందాండీ ??
తొలగించండికం॥
రిప్లయితొలగించండిభువికంఘ్రై,పుట్టుటకు
న్నెవమై, యీషణ త్రయంపు నెపమై,వెదుకన్
తువుకొన కడిదౌ విస్మితి
ఎవడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు సర్🙏🙏
తొలగించండిఎవఁడో హరియవతార
రిప్లయితొలగించండిమ్మెవఁడో ద్రోవదికి చీరలిచ్చెఁ గురుసభన్
భవహరమొనరించెడువా
డెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభువనంబుల్ తన నోటఁజూపెనెవఁడో, పోకార్చెనో పూతనన్
రిప్లయితొలగించండిబవరంబందు కిరీటి స్యందనముపై భాసిల్లె నెవ్వండొ తా
నెవఁడో ద్రోవది మానరక్షణముకైనిచ్చెన్ దుకూలంబులే
యెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువుగారూ🙏
తొలగించండికం: ఎవడీ బొద్దింక? యితం
రిప్లయితొలగించండిడెవనికి జన్మించె? వీని దే దేశమ్మో?
యెవ డీతని ప్రేరకుడో
ఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”
రిప్లయితొలగించండిమ: ఎవడో సృష్టిని జేసె నంట,తనయందే యుంచునంటయ్య, దా
నె వినాశమ్మును జేసి వేయు నట, తానే యీశు డౌనంట,వా
డవినాశుండట,వాడె సర్వమట, యే యర్ధమ్ము లేనట్టి వా
డెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో
(పోతన గారి ఎవ్వనిచే జనించు అనే పద్యం లో మాటలనే ఒక నాస్తికుడు ఇలా తిప్పి అడిగినట్లు )
కం॥ భవ బాధల తాపమొదవి
రిప్లయితొలగించండిభువిని నరకమనుభవించి పొరలు మనుజులన్
జవితో దయఁగను మిత్రుఁడు
నెవఁడో యెవ్వఁడో యెవండొ యెవఁడో యెవఁడో
మ॥ భవ బాధాబ్ధినిఁ బాపి కాచు సఖుఁడై పాలించి సద్భాగ్య ప్రా
భవ దానమ్మిడి ప్రోచు వాఁడిలను సంభావించి కీర్తించఁగన్
జవితో ముక్తి నొసంగు శాశ్వతుఁడు విశ్వాకారునిన్ దెల్పుమా
యెవఁడెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో
నృవరప్రవరుఁడు సమయ
రిప్లయితొలగించండిమ్ము వృథ యగును దలఁచిన సతముం గావఁగ నీ
యవని నరుదెంచు నని మది
నెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో
శివు వింటిన్ విఱిచెన్ నరుం డొకఁ డనం జిత్రమ్ముగా రాముఁడే
యవనిం గూల్చి రనంగ వీరు నభిమన్యాఖ్యున్ రుషం బార్థుఁడే
రవముప్పొంగ సుయోధనుండు విని మల్లశ్రేష్ఠు చా వార్చిరే
యెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వం డొకో
సమస్య : "ఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో "
రిప్లయితొలగించండిభవకారకుండెవండను
భవవేద్యుడకల్మషుండెవండవ్యక్తుం
డెవడభవుడాత్మరూపుం
డెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో
ఎవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతఁ డెవ్వాఁడొ యెవ్వండొకో”
రిప్లయితొలగించండిభువిలో భారత మాతకున్ సకల సంపూర్ణ త్వమున్ తెచ్చువా
డెవడో ! శత్రువులెల్లమిత్రులయి పోటీలో ధృడంబౌ విజే
త, విశేషంబగు శక్తిగా నిలుపు నేతాజీ మరెవ్వండొకో
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వివరించుచు పాఠము గు
రువటు తిరిగి వ్రాయుచుండ రొద వినిపించన్
ఎవడా యల్లరి కారకు
డెవడో యెవ్వడొ యెవండొ యెవడో యెవడో?
శ్రవణంబాదిగగలవట
రిప్లయితొలగించండినవవిధ భకుతులుకొలువగనరునకుహరిగా
కెవరు గలరా డతడే
యెవడో యెవ్వడొ యెవండొ యెవడో యెవడో
ఆపద మ్రొక్కులవానిని
రిప్లయితొలగించండిబాపుము దుఃఖముల టంచు ప్రార్థన చేయన్
నాపదలు తొలగ మ్రొక్కులు
*శ్రీపతి గని యైదు పదిగజేతురు భక్తుల్*
దీపము నింటపెట్టచును దేవుని కెల్లరు మ్రొక్కుచున్సదా
యాపకకీర్తనమ్ములనుహర్షముతోడనునాలపించుచున్
తాపములెల్లబాపి వడిదారినిచూపుమటంచుభక్తితో
*శ్రీపతి గాంచి రైదుపది జేతురు భక్తులు శాంతచిత్తులై*