9, జూన్ 2026, మంగళవారం

సమస్య - 5493

10-6-2026 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”

(లేదా...)

“ఎవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో”

32 కామెంట్‌లు:


  1. ఎవడని‌ గుర్తింతు మిపుడు‌
    ఎవడో చేసిన‌ గడబిడ‌ కేదో‌ జరిగెన్‌
    వివరము‌ తెలియాలిప్పుడు
    ఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తెలియాలి' అన్నది వ్యావహారికం. "వివరములు తెలియవలె నిపు డెవఁడో..." అనండి.

      తొలగించండి
    2. ఎవడని‌ గుర్తింతు మిపుడు‌
      ఎవడో చేసిన‌ గడబిడ‌ కేదో‌ జరిగెన్‌
      వివరము‌లు తెలియ వలెనిపు
      డెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”

      తొలగించండి
  2. కందం
    అవగుణ వర్తనులసురుల్
    భువినమరత్వముగొను భ్రమఁ బొంద వరమ్ముల్
    స్తవముల నడంచె హరి గా
    కెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో?

    మత్తేభవిక్రీడితము
    అవధుల్ మీరిన రాక్షసత్వమున సర్వానర్థముల్ సల్పుచున్
    భువిపై తామమరత్వపున్ భ్రమను నిర్మూలింపగాఁ జూచినన్
    స్తవనీయమ్మగు భంగి వారలనె తా దామోదరుండొంచె! వే
    రెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో?

    రిప్లయితొలగించండి
  3. ఎవరీ తప్పు సలిపిరో !
    సవరించుట యెవరికైన సాధ్యంబగునా !
    కవనపు దోషము దిద్ధున
    దెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”

    రిప్లయితొలగించండి
  4. సివరపు చర్మముఁ దాల్చును
    భవబంధమ్ములను ద్రెంచి పరమపదమిడున్
    భవుడని పేరొందినవా
    డెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో

    శవమున్ గాల్చిన బూది మేనిపయినన్ సంపూర్తిగా దాల్చునే
    భవబంధమ్ములఁ ద్రెంచి యిచ్చును సదా భక్తాళికిన్ మోక్షమే
    దివిజుల్ వేడగ కాలకూటవిషమున్ ద్రెక్కొన్న వాడందురే
    యెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో

    రిప్లయితొలగించండి
  5. భువి లో జీవుల పోషణ
    కవసర మగు సకల మొ సగి న న్నీ తానై
    యెవ రికి కనబడని మహితు
    డె వ డో యె వ్వ డొ యె వం డొ యె వడో యెవ డో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "... మొసగి యన్నియు తానై" అనండి.

      తొలగించండి
  6. -
    భవుడో? మాధవుడో ? వా
    డెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో?
    భవజలధి మాయని జనుల
    నవలీలగ త్రోసినట్టి నటరాజెవడో?

    జిలేబి మాత్రము కాదు :)




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో అఖండయతి.. దోషం కాదు కానీ... !

      తొలగించండి
    2. ఆ శివుడెవడో :) అంటే సరిపోతుందాండీ ??

      తొలగించండి
  7. కం॥
    భువికంఘ్రై,పుట్టుటకు
    న్నెవమై, యీషణ త్రయంపు నెపమై,వెదుకన్
    తువుకొన కడిదౌ విస్మితి
    ఎవడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో!

    రిప్లయితొలగించండి
  8. ఎవఁడో హరియవతార
    మ్మెవఁడో ద్రోవదికి చీరలిచ్చెఁ గురుసభన్
    భవహరమొనరించెడువా
    డెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో

    రిప్లయితొలగించండి
  9. భువనంబుల్ తన నోటఁజూపెనెవఁడో, పోకార్చెనో పూతనన్
    బవరంబందు కిరీటి స్యందనముపై భాసిల్లె నెవ్వండొ తా
    నెవఁడో ద్రోవది మానరక్షణముకైనిచ్చెన్ దుకూలంబులే
    యెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో

    రిప్లయితొలగించండి
  10. కం: ఎవడీ బొద్దింక? యితం
    డెవనికి జన్మించె? వీని దే దేశమ్మో?
    యెవ డీతని ప్రేరకుడో
    ఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”

    రిప్లయితొలగించండి

  11. మ: ఎవడో సృష్టిని జేసె నంట,తనయందే యుంచునంటయ్య, దా
    నె వినాశమ్మును జేసి వేయు నట, తానే యీశు డౌనంట,వా
    డవినాశుండట,వాడె సర్వమట, యే యర్ధమ్ము లేనట్టి వా
    డెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో
    (పోతన గారి ఎవ్వనిచే జనించు అనే పద్యం లో మాటలనే ఒక నాస్తికుడు ఇలా తిప్పి అడిగినట్లు )

    రిప్లయితొలగించండి
  12. కం॥ భవ బాధల తాపమొదవి
    భువిని నరకమనుభవించి పొరలు మనుజులన్
    జవితో దయఁగను మిత్రుఁడు
    నెవఁడో యెవ్వఁడో యెవండొ యెవఁడో యెవఁడో

    మ॥ భవ బాధాబ్ధినిఁ బాపి కాచు సఖుఁడై పాలించి సద్భాగ్య ప్రా
    భవ దానమ్మిడి ప్రోచు వాఁడిలను సంభావించి కీర్తించఁగన్
    జవితో ముక్తి నొసంగు శాశ్వతుఁడు విశ్వాకారునిన్ దెల్పుమా
    యెవఁడెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో

    రిప్లయితొలగించండి
  13. నృవరప్రవరుఁడు సమయ
    మ్ము వృథ యగును దలఁచిన సతముం గావఁగ నీ
    యవని నరుదెంచు నని మది
    నెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో


    శివు వింటిన్ విఱిచెన్ నరుం డొకఁ డనం జిత్రమ్ముగా రాముఁడే
    యవనిం గూల్చి రనంగ వీరు నభిమన్యాఖ్యున్ రుషం బార్థుఁడే
    రవముప్పొంగ సుయోధనుండు విని మల్లశ్రేష్ఠు చా వార్చిరే
    యెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వం డొకో

    రిప్లయితొలగించండి
  14. సమస్య : "ఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో "

    భవకారకుండెవండను
    భవవేద్యుడకల్మషుండెవండవ్యక్తుం
    డెవడభవుడాత్మరూపుం
    డెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో

    రిప్లయితొలగించండి
  15. ఎవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతఁ డెవ్వాఁడొ యెవ్వండొకో”
    భువిలో‌ భారత‌ మాతకున్ సకల సంపూర్ణ త్వ‌మున్‌ తెచ్చు‌వా‌
    డెవడో‌ ! శత్రువులెల్లమిత్రులయి‌ పోటీలో‌ ధృడంబౌ‌ విజే
    త, విశేషంబగు‌ శక్తిగా‌ నిలుపు‌ నేతాజీ మరెవ్వండొకో

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వివరించుచు పాఠము గు
    రువటు తిరిగి వ్రాయుచుండ రొద వినిపించన్
    ఎవడా యల్లరి కారకు
    డెవడో యెవ్వడొ యెవండొ యెవడో యెవడో?

    రిప్లయితొలగించండి
  17. శ్రవణంబాదిగగలవట
    నవవిధ భకుతులుకొలువగనరునకుహరిగా
    కెవరు గలరా డతడే
    యెవడో యెవ్వడొ యెవండొ యెవడో యెవడో

    రిప్లయితొలగించండి
  18. ఆపద మ్రొక్కులవానిని
    బాపుము దుఃఖముల టంచు ప్రార్థన చేయన్
    నాపదలు తొలగ మ్రొక్కులు
    *శ్రీపతి గని యైదు పదిగజేతురు భక్తుల్*

    దీపము నింటపెట్టచును దేవుని కెల్లరు మ్రొక్కుచున్సదా
    యాపకకీర్తనమ్ములనుహర్షముతోడనునాలపించుచున్
    తాపములెల్లబాపి వడిదారినిచూపుమటంచుభక్తితో
    *శ్రీపతి గాంచి రైదుపది జేతురు భక్తులు శాంతచిత్తులై*


    రిప్లయితొలగించండి