తపమని యెంచిపండితులు తప్పక బోధన సల్పగావలెన్ శపథము చేసిశిష్యులిట చక్కని విద్యలు నేర్వగావలెన్ సుపథము చూపి విద్య కడుసుందర జీవన మిచ్చుచుండు రా యప! యశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్యలన్నియున్
చం॥ నిపుణుఁడునిత్య శోధనల నెమ్మినిఁ జేయచుఁ దత్పరుండునై విపులము గాను కన్గొనఁగఁ బ్రేలెడు మందును దాని తోనహో యపరిమితంబుగా జరుగ నాగని మారణకాండ లయ్యయో అపయశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్యలన్నియున్
(Alfred Nobel dynamite కనుకుంటారండి. దానితో ఆయన భోఫర్స్ ఫింరంగుల తయారుచేసి అధిక ధనము పొందుతాడు కానీ Messiah of death అని అపకీర్తి వస్తుంది. ఆయన మరణానంతరము ఆధనము ఆయన కోరిక మేరకు Nobel Prizes కు వినియోగిస్తున్నారు)
కృప నూని వీడు మింక ని రుపయోగము లయ్య యిల మహోగ్ర తపమ్ముల్ విపరీత ఫలము లొసఁగిన నపకీర్తినిఁ గూర్చు విద్య లన్ని జనులకున్
సుపరిచితమ్ము నానుడి పశుప్రతి విద్య నెఱుంగకున్న ని ట్టి పలుకు సుప్రసిద్ధము సుఁడీ జన వాసము లందు వింటిరే శపథము సేసి సెప్పుదును సంపద లున్నను నేరకున్నచో యపయశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్య లన్నియున్
చం: అపరిమితమ్ముగా ధనము నందగ జేయ బ్రభుత్వ మీ బడిన్, గృప బ్రసరించి పేద లని యేర్పడ జేయగ భోజనమ్ము నీ చపలత యేమొ యెల్లరును సాగెద రా ప్రయివేటు బళ్లకే అపయశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్యలన్నియున్” (గవర్నమెంట్ బడిలో ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టినా, ఉచిత భోజనం పెట్టినా ప్రభుత్వ పాఠశాలలో చదవటం స్టేటస్ తక్కువ అనుకొని ప్రైవేట్ బళ్లకి పోతుంటారు అని ప్రభుత్వ పాఠశాలల ఆందోళన. )
(కాకతీయ గణపతి దేవుడు తన సేనాని జాయపతో రామప్ప దేవాలయ నిర్మాణం చేయించుమని కోరుతున్నట్లుగా...)
రిప్లయితొలగించండిఅపరిమితమ్ముగా కళల కాదరమిచ్చెడి కాకతీయ రా
జ్యపు విధులం జరించుచుఁ బ్రశస్త మనోహర దేవళంబుఁ గూ
రుపుమది నాట్యశాస్త్రమున రూఢిని లక్ష్యముగా వెలుంగ జా
యప! యశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్యలన్నియున్.
జపతపముల విడి జనులకు
రిప్లయితొలగించండివిపులమగు విధముగ క్షుద్రవిద్యలు నేర్వన్
చపలతతో జీవించగ
నపకీర్తినిఁ గూర్చు విద్యలన్ని జనులకున్
రిప్లయితొలగించండిఅపకృతము కాదు చదువన
సుపథమ్మును జూప గలదు క్షోణిని కనగన్
విపుల వివేక మొసగునే
యప, కీర్తినిఁ గూర్చు విద్యలన్ని జనులకున్.
అపకృత మంచు నర్భకునకయ్యది కష్టమటంచు నెంచు చున్
విపుల వివేక మిచ్చునది విద్య యటంచును మర్చి నావుగా
సుపథము జూపి దిద్దునది క్షోణిని విద్యయె యాల కింపుమా
యప, యశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్యలన్నియున్.
(అప = అమ్మ )
తపనను జూపెడు శిష్యులు
రిప్లయితొలగించండిశపనముతో నేర్వవలయు చక్కని విద్యల్
సుపథము విశదంబై రా
యప! కీర్తినిఁ గూర్చు విద్యలన్ని జనులకున్
తపమని యెంచిపండితులు తప్పక బోధన సల్పగావలెన్
శపథము చేసిశిష్యులిట చక్కని విద్యలు నేర్వగావలెన్
సుపథము చూపి విద్య కడుసుందర జీవన మిచ్చుచుండు రా
యప! యశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్యలన్నియున్
[విజయనగర రాజైన శ్రీరంగరాయలు రాయప నాయకునితో పల్కిన మాటలు]
కం:కృప గల భక్తియె శ్రేష్ఠ
రిప్లయితొలగించండిమ్మపకారము జేయ బూను నా క్షుద్రములౌ
జపములు,చేతబడులు కడు
నపకీర్తినిఁ గూర్చు విద్యలన్ని జనులకున్”
చం॥ నిపుణుఁడునిత్య శోధనల నెమ్మినిఁ జేయచుఁ దత్పరుండునై
రిప్లయితొలగించండివిపులము గాను కన్గొనఁగఁ బ్రేలెడు మందును దాని తోనహో
యపరిమితంబుగా జరుగ నాగని మారణకాండ లయ్యయో
అపయశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్యలన్నియున్
(Alfred Nobel dynamite కనుకుంటారండి. దానితో ఆయన భోఫర్స్ ఫింరంగుల తయారుచేసి అధిక ధనము పొందుతాడు కానీ Messiah of death అని అపకీర్తి వస్తుంది. ఆయన మరణానంతరము ఆధనము ఆయన కోరిక మేరకు Nobel Prizes కు వినియోగిస్తున్నారు)
కృప గల వాణీ దయతో
రిప్లయితొలగించండినుప యోగ పడేడు నట్టి యుత్తమ విద్యల్
సు పరి చి త మైన నె టుల
నప కీర్తిని గూర్చు విద్య లన్ని జనుల కున్?
కృప నూని వీడు మింక ని
రిప్లయితొలగించండిరుపయోగము లయ్య యిల మహోగ్ర తపమ్ముల్
విపరీత ఫలము లొసఁగిన
నపకీర్తినిఁ గూర్చు విద్య లన్ని జనులకున్
సుపరిచితమ్ము నానుడి పశుప్రతి విద్య నెఱుంగకున్న ని
ట్టి పలుకు సుప్రసిద్ధము సుఁడీ జన వాసము లందు వింటిరే
శపథము సేసి సెప్పుదును సంపద లున్నను నేరకున్నచో
యపయశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్య లన్నియున్
చం: అపరిమితమ్ముగా ధనము నందగ జేయ బ్రభుత్వ మీ బడిన్,
రిప్లయితొలగించండిగృప బ్రసరించి పేద లని యేర్పడ జేయగ భోజనమ్ము నీ
చపలత యేమొ యెల్లరును సాగెద రా ప్రయివేటు బళ్లకే
అపయశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్యలన్నియున్”
(గవర్నమెంట్ బడిలో ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టినా, ఉచిత భోజనం పెట్టినా ప్రభుత్వ పాఠశాలలో చదవటం స్టేటస్ తక్కువ అనుకొని ప్రైవేట్ బళ్లకి పోతుంటారు అని ప్రభుత్వ పాఠశాలల ఆందోళన. )
చంపకమాలిక.
రిప్లయితొలగించండికపటముతోద్విజుండనని కర్ణుడు నేర్చిన గొప్పవిద్యలున్
రెపరెపలాడుకాగితపు లెక్కలుమార్చెడి దొంగవిద్యలున్
తపములుజేసిపంతమున దైత్యులుబొందిన తంత్రవిద్యలున్
సుపథులశత్రువౌశకుని జూదముమోసముజేయువిద్యయున్
నెపములనెంచిడంభముననీల్గెడివారలునేర్చువిద్యలున్
*అపయశమందజేయుగద* *యందరకున్ మన* *విద్యలన్నియున్* .
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కపటము నేర్చిన చదువులు
నపకీర్తిని గూర్చు; విద్యలన్ని జనులకున్
ఉపయుక్తము కలిగి బ్రతుకు
లుపాధి లభియించి చేరు నున్నత స్థితికిన్.
కందం
రిప్లయితొలగించండితపమున వేదములెఱుఁగుచుఁ
బ్రపంచమున కందఁజేయ బారతమొప్పెన్
గపటమ్మూనఁ బ్రవాసిగ
నపకీర్తినిఁ గూర్చు విద్యలన్ని జనులకున్
చంపకమాల
తపమున వేదముల్ దెలిసి తాపసులెందరొ కూర్చ భారతిన్
విపుల ప్రపంచమందునఁ బ్రవీణులు గౌరవనీయులంచనన్
రెపరెపలాడు కీర్తి స్మరణీయ, మనైతికమై విదేశమం
దపయశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్యలన్నియున్
అపకారమ్మును చేయగ
రిప్లయితొలగించండికపటపువిద్యలనునేర్చి గారడిచేయన్
చపల మనంబున నవియే
*యపకీర్తిని గూర్చు విద్యలన్ని జనులకున్
నిపుణతతోడనొజ్జలికనేర్పకవిద్యలనెల్లవేళలన్
విపులముగానుబోధనలువేగమెచేయుచు వైరభావమున్
కపటపుబుద్దిచూపుచునుకంసహరున్గురియించిదెల్పనా
*“యపయశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్యలన్నియున్.