28, జూన్ 2026, ఆదివారం

సమస్య - 5512

29-6-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుంతి కొడుకు రావణుండు కుండను బుట్టెన్”
(లేదా...)
“కుంతీపుత్రుఁడు రావణుండు గరిమన్ గుంభంబునన్ బుట్టెగా”

14 కామెంట్‌లు:

  1. ఎంతగ నేర్పిన కూడను
    సుంతయు గుర్తుంచుకొనక శుంఠడి రీతిన్
    వింతగ వచించె నిట్టుల
    "కుంతి కొడుకు రావణుండు కుండను బుట్టెన్”

    రిప్లయితొలగించండి
  2. కందం
    సుంతయు కూర్పు నెరుంగక
    పంతంబున ద్వ్యర్థి కావ్య పఠనమొనర్పన్
    వింతగ నాతని కూతల
    “కుంతి కొడుకు రావణుండు కుండను బుట్టెన్! ”

    శార్దూలవిక్రీడితము
    ఎంతన్ రాఘవపాండవీయ కృతిఁ దా నిష్టాన వాచించినన్
    సుంతైనన్ గవి కూర్పు పట్టు పడకే చోద్యంపు టర్థాలతో
    వింతౌ వ్యాఖ్యలు పుట్టి వచ్చు! నటులన్ ప్రేలాపనల్ జేసితే
    “కుంతీపుత్రుఁడు రావణుండు గరిమన్ గుంభంబునన్ బుట్టెగా! ”

    రిప్లయితొలగించండి

  3. శాంతా! ధర్మజు డెవ్వం
    డింతి యయోనిజను బంధి యెవ్వడు జేసెన్
    గాంత యగస్త్యుడెటు లడరె
    కుంతి కొడుకు, రావణుండు, కుండను బుట్టెన్.


    కాంతన్ గోరెను ధర్మరాజెవరు లంకాధీశుడై రాము జే
    యంతంబైన దెవండు ఖ్యాతి గల ద్రోణాచార్యు డేరీతినిన్
    క్షాంతిన్ బుట్టెనొ తెల్పు మంచనగ నా శ్వంపాంగి తా జెప్పె నే
    కుంతీపుత్రుఁడు, రావణుండు, గరిమన్ గుంభంబునన్ బుట్టెగా.

    రిప్లయితొలగించండి
  4. కం॥
    పంతము నెవడింతి నదుమె?
    శ్రాంతుండైనాచెనెవడు సాధ్వి ధరణిజన్?
    వింతౌ ద్రోణోద్గమెదియొ
    కుంతికొడుకు; రావణుండు; కుండను బుట్టెన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదం " వింతౌ ద్రోణోద్గమమెది" గా చదువుకొన ప్రార్థన🙏

      తొలగించండి

  5. [ క్రమాలంకారములో..... ]

    కుంతికి జన్మించినచో
    చింతింపగ పుష్పకమును జేకొనెనెవడో
    వింతగఁ బుట్టె నగస్త్యుడు
    కుంతి కొడుకు; రావణుండు; కుండను బుట్టెన్

    సంతోషమ్మున సూర్యునిన్ గొలువగా సంప్రాప్తమైనెవ్వడో
    చింతింపన్ విజయాన పుష్పకమునే జేకొన్న వాడెవ్వడో
    వింతౌనందురగస్త్య సంభవమునే వీర్యంబుఁ గాపాడగా
    కుంతీపుత్రుఁడు; రావణుండు గరిమన్; గుంభంబునన్ బుట్టెగా

    రిప్లయితొలగించండి
  6. అంతేవాసిగ నింటనుంచుకొని మేనల్లుండు తిక్కన్నకున్
    ఎంతో కొంచము నాకు వచ్చినది నేనిష్టంబుతో సెప్పినన్
    సుంతజ్ఞానము లేక వాడు నుడివెన్ చోద్యంబుగా నిట్టులన్
    కుంతీ పుత్రుడు రావణుండు గరిమన్ గుంభంబునన్ బుట్టెరా

    రిప్లయితొలగించండి
  7. క్రమాలంకారములోనండి

    శా॥ ఎంతో ధర్మ పరాయణండు మహిలో నీతండు వాక్రుచ్చఁగన్
    బంతమ్మున్ గని జానకిన్ జెరనిడెన్ భ్రష్టుండు వాఁడెవ్వడో
    సంతోషమ్ముగఁ దెల్పుమా ధరనగస్త్యుండెట్లు జన్మించెనో
    కుంతీపుత్రుఁడు రావణుండు గరిమన్ గుంభంబునన్ బుట్టెగా

    రిప్లయితొలగించండి
  8. క్రమాలంకారం లో ----
    శాంత యుధి ష్ట రు డెవ్వరు?
    పంత మున ధర ణి జ నెవరు బంధించి రి లన్?
    వింత గు ద్రోణుని జననము
    కుంతి కొడుకు : రావణు o డు :: కుండను బు ట్టెన్

    రిప్లయితొలగించండి
  9. అయ్యవారు హాలిడే ట్రిప్పా‌:) ఇల్లాంటి సమస్య యిచ్చినారు ? :)


    నెంతయొ బుర్రను చించితి
    సుంతయు తోచదు నెటుల కుసుమకోమలమౌ
    పొంతన కైపదమునకయొ
    కుంతి కొడుకు రావణుండు కుండను బుట్టెన్?

    రిప్లయితొలగించండి
  10. అంత వరుణేంద్రుల కహో
    సంతస ముప్పొంగ నెదల సంయమి యుగమే,
    సాంతమును వెల్లడించిరి
    కుంతి, కొడుకు, రావణుండు, కుండను బుట్టెన్


    సంతానం బగు హర్ష దాయకము నిస్సందేహ మెల్లప్పుడున్
    వింతెట్లౌనయ ద్రోణు జన్మ విధి యీ విశ్వమ్ము నం దెన్న నో
    యంతేవాసి యగస్త్యు పుట్టుక రహస్యం బంతయున్ నేరరే
    కుంతీపుత్రుఁడు, రావణుండు గరిమన్, గుంభంబునన్ బుట్టెఁగా

    రిప్లయితొలగించండి
  11. ఎంతో ప్రేమగ సూర్యునిన్ గొలువగా నిందీవ రాక్షాస్థతో
    ద్వాంతారాతి దయన్ జనించె నెవరో? దర్పమ్ముతో జానకిన్
    పంతమ్మూని హరించె నెవ్వరిల?, చాపాచార్యు జాతమ్మెటన్?
    కుంతీపుత్రుఁడు, రావణుండు, గరిమన్ గుంభంబునన్ బుట్టెగా

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వింతగ కర్ణుడెవరి సుతు?
    డింతిన్ చెఱబట్టి లంక నెవ్వరు బెట్టెన్?
    వింతౌ ద్రోణుని జననము?
    కుంతి కొడుకు;రావణుండు;కుండను బుట్టెన్.

    రిప్లయితొలగించండి