7, జులై 2026, మంగళవారం

సమస్య - 5521

8-7-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్”
(లేదా...)
“భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్”

12 కామెంట్‌లు:

  1. ముక్తీ నొసగునని నమ్ముచు
    భక్తిగ నిత్యము భజించు బత్తుడు దనపై
    రక్తిగొనుట దగ్గుటగని
    భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. కందం
      సక్తత భిక్షకు వెడలగ
      భుక్తికి వ్యాసునకు ముద్ద పుట్టక తాను
      ద్యుక్తుడుగ నెంచ శాపము
      భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్!

      ఉత్పలమాల
      సక్తత విశ్వనాథునకు సద్మమటంచును శిష్యకోటితో
      భుక్తికి భిక్షకై వెడలి పుట్టక ముద్దయు శాపమెంచ ని
      ర్యుక్తికమంచు వ్యాసుముని నోపక శంకరుడంపె నక్కటా!
      భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్!

      తొలగించండి
  3. నక్తంచరునకు వరమిడి
    భక్తునిచే భంగపడెను భర్గుఁడు, గాశిన్
    భక్తవశంకరుడు నిలిచె
    భక్తులు కోరుకొను నట్టి పరము నొసంగన్.


    ముక్తిని గోరి కాదు నరభోజనుడే తప మాచరించి తా
    భక్తవ శంకరున్ గరము భాస్మమొనర్చు వరమ్ము గోరె, యా
    భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్, వర కాశికాపురిన్
    ముక్తి నొసంగ నిల్చెనట మూర్ఖుని కైనను విశ్వనాథుడై

    రిప్లయితొలగించండి
  4. రక్తగ్రహులకు వరమిడి
    భక్తునిచే భంగపడెను భర్గుఁడు; గాశిన్
    ముక్తినొసగుచుండు సతము
    భక్తింగొలిచెడి జనులకు పరమేశ్వరుడే

    వ్యక్తికిఁ దేహమందుగల వైదుషికిన్ గల భేదమేమిటో
    వ్యక్తమొనర్చు రీతి తను పంచము డైనను ప్రశ్నరేచెనా
    భక్తుడు తప్పుకోమనుచు పావన జన్ముడు శంకరుండనన్
    భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్

    [శంకరుఁడు = ఆది శంకరాచార్యుడు]

    రిప్లయితొలగించండి
  5. భుక్తికి బిక్షము దొరకక
    శక్తియు నశియించి యొకడు శాపంబి చ్చె న్
    భక్తుని యావే శము తో
    భక్తుని చే భంగ పడెను భర్గుడు కాశి న్

    రిప్లయితొలగించండి
  6. కం: భక్తు ననుచు గుడిలో కడు
    యుక్తిగ సొమ్ముల గణించు నొకడై ధనమున్
    శక్తి కొలది దోచె గపట
    భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్”



    రిప్లయితొలగించండి
  7. ఉ:ముక్తి నొసంగు క్షేత్రమని మ్రొక్కుల బొందెడు కాశి లోననే
    భక్తునిగా నటించు నొక పాపి ధనమ్ము గణించు వానిగా
    యుక్తిగ జేరుకన్ గుడిని నున్న ధనమ్మును దోచె మోసపుం
    భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్”


    రిప్లయితొలగించండి
  8. ఉ॥ భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్
    యుక్తిగ సత్యదూరముల యోగ్యత నెంచక కించపర్చఁగన్
    ముక్తినిఁ గాంచు ధర్మమును మూఢులు నిల్పి కుతర్కమందు నా
    సక్తిని యట్లు పల్కినను శంకరుఁ డెప్పుడు భక్తవంద్యుఁడే!

    రిప్లయితొలగించండి
  9. దిక్తటములు తిరుగఁ దిరుగ
    భుక్తికి నన్నము దొరకమి పురమున నెందున్
    రిక్తోదర విప్రునిచే
    భక్తునిచే భంగపడెను భర్గుఁడు కాశిన్


    ముక్తి నొసంగు లింగ వర మూర్తియె పాశుప తాస్త్ర రాజ మా
    సక్తి నొసంగఁ బార్థునకు సత్వము ధైర్య పరాక్రమమ్ములన్
    రక్తిఁ బరీక్ష సేయఁగ నరణ్యము దూఱఁ ద్యజించి వీటినిన్,
    భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్, వర కాశికాపురిన్

    రిప్లయితొలగించండి

  10. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నక్తచరు తపము మెచ్చుచు
    భక్తుడు భస్మాసురునకు వరమీయ భవున్
    యుక్తిగ శివు వెంట పడెను
    భక్తునిచే భంగపడెను భర్గుడుఁ గాశిన్.

    రిప్లయితొలగించండి