27, జులై 2026, సోమవారం

సమస్య - 5541

28-7-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ”

(లేదా...)

“ఉన్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో వేదాల గాయత్రి గారి సమస్య)

32 కామెంట్‌లు:

  1. జన్మము నొందిన మొదలుగ
    చిన్మయుని స్మరణ తోడ చిత్తము నందున్
    తన్మయుడై యున్న కతన
    ఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "చిన్మయు సంస్మరణతోడ" అనండి.

      తొలగించండి
  2. హమ్మయ్య!


    మానడు మంచిని గోరు, గు
    ణానుక్రమముగ విభుడు జనహితోన్మత్తుం
    డైన నృపతి యుద్దండుం
    డౌ నడచ బరిణెపురుగుల రౌద్రమ్మునయో

    జిలేబీయము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అబ్బో... సమస్యాపాదాన్ని స్థానభ్రంశం చేసి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కందంలో "జ్ఞానం బున్మత్తుండైన" అనండి.
      వృత్తంలో "జన్మస్థానము నుజ్జగించి" టైపాటు.

      తొలగించండి
    2. ఉన్మాదియైన ప్రభువుకు
      సన్మార్గము జూపునట్టి సచివుల వలనన్
      జన్మించినచో జ్ఞానం
      బున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ

      జన్మస్థానము నుజ్జగించి చనియెన్ సామాన్యుడే భీరువై
      తన్మాత్రంబగు శక్తియున్న ప్రభువున్ దాజేరి సేవించగా
      సన్మార్గమ్మును వీడినట్టి తులువే సైన్యానికధ్యక్షుడై
      యున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే

      తొలగించండి

  5. సన్మార్గము జరియించు జ
    గన్మోహన రూపు గల్గి కల్పంబున తా
    నున్మాదు లైన వారికి
    నున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ”*


    జన్మంబియ్యది శిష్ట సుమ్నమను విశ్వాసమ్ము తో నిత్యమున్
    సన్మార్గమ్ము జరించు నట్టి జనులన్ సచ్చీలురౌ వారికిన్
    సన్మానమ్ములు జేయువాడట దురాచారుండ్ర చిత్తమ్ములో
    నున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే.

    రిప్లయితొలగించండి
  6. జన్మంబెత్తిన నాటినుండి యఘముల్ సాగ్రంబుగా జేయుచున్
    సన్మార్గంబున పోవువారిని సదా సాధించు చున్ నీచుడా
    యున్మత్తుండగు రాజ పాలనములో నుద్దండుడై వెల్గెనే
    సన్మానంబులు నందుకొంచు సతతమ్ సౌశీల్యమే లేకయున్

    రిప్లయితొలగించండి
  7. కం:సన్మంత్రుల సూచనలకు
    సన్మానము నిచ్చు రాజు శస్తు, డెటుల స్త్రీ
    లన్ మోహితుడౌచున్, మ
    ద్యోన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ?



    రిప్లయితొలగించండి
  8. శా:సన్మార్గమ్మును దెల్ప తిమ్మరుసు తా సమ్రాట్టు తో బల్కె "నీ
    షన్మాత్రమ్మును చింత జేయకయె శిక్షల్ వేయకో వత్స! ప్రే
    మన్,మర్యాదను జూపు మంత్రుల యెడన్,మద్యమ్ము లో నెన్నడే
    నున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే?


    రిప్లయితొలగించండి
  9. ఉన్మేషమ్ముగ ప్రజలను
    సన్మార్గమ్మున నడుపఁగ సతతము మదిలో
    తన్మయుడై తలబోయుచు
    నున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ

    రిప్లయితొలగించండి
  10. ఉన్మేషమ్ముగ దేశవాసులకు తానుద్బోధలన్ జేయుచున్
    సన్మార్గమ్మున సాగుడీ యనుచు నుత్సాహించు నెల్లప్పుడున్
    సన్మానమ్ములుజేయు పండితులకున్ సచ్ఛీలురన్ గాఁచునా
    యున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే

    రిప్లయితొలగించండి
  11. జ న్మా o శ యుత్త మంబై
    సన్మార్గము నందు నడచు నట్టి సజ్జను డ గు చున్
    తన్మయ పాలన మున దా
    ను న్మ త్తు o డైన నృప తి యు ద్ధ o డు డౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. *నడచు సజ్జను డగుచున్* అనండి.

      తొలగించండి
  12. శా॥ చిన్మాత్రమ్ము సుయోధనుండు గనునే చిత్తంబు స్వశ్రేయమే
    సన్మార్గమ్మును వీడి కాంచుఁ గద విశ్వాసమ్ముతోఁ గర్ణునిన్
    సన్మానించె సదా స్వసార్థకపు కాంక్షా సిద్ధికిన్ గర్ణుఁడో
    ఉన్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే

    చిన్మాత్రము శుద్ధజ్ఞానము

    రిప్లయితొలగించండి
  13. సన్మతి నారాధింపక
    విన్మా నారాయణాది విగ్రహ గణ రా
    జన్మందిరములఁ బౌరుం
    డున్మత్తుం డైన నృపతి యుద్దండుండౌ


    సన్మార్గాచర ణాభిలాషుఁ డిల నిస్వార్థుండు నిత్యమ్ము కిం
    చిన్మాత్రుం డన నర్థ హీన మగు సంక్షిప్తమ్ముగం బల్కినన్
    సన్మానమ్ముల దండనమ్ములను సచ్చారిత్రుఁ డత్యంత ధ
    ర్మోన్మత్తుం డగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే

    రిప్లయితొలగించండి
  14. జన్మకు కారణ మియ్యది
    తన్మయతన్ గొలువవలెను దైవము నెపుడున్
    చిన్మయ రూపుఁడు గావున
    నున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ”

    రిప్లయితొలగించండి
  15. సన్మానింపక రాజ్యమందుగల విశ్వాసాత్ములన్ సుంతయున్
    మన్మందున్ సతతమ్ము స్వార్థమొదవన్ మారించగా శిష్టులన్
    సన్మిత్రుల్ బ్రజ లండగా నిలువగా సాధించి స్వాతంత్ర్యమున్
    ఉన్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుడై వెల్గెనే

    రిప్లయితొలగించండి
  16. జన్మంబొందిన దాదిగాజనుఁడహో సాలోచనాధీనుఁడై
    చిన్మయ్యాకరుఁడౌట చూడగఁదమిన్ జింతించ నోపుండునై
    సన్మార్గంబున నెల్లవేళల రతిన్ సాయంబుఁజేయంగఁదా
    నున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే”

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    జన్మము సార్థకమౌనటు
    సన్మార్గ పథమ్మునందు సాగగ బ్రతుకున్
    తన్మయమును చెందుచు శాం
    తోన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ.

    రిప్లయితొలగించండి