28-7-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ”
(లేదా...)
“ఉన్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే”
(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో వేదాల గాయత్రి గారి సమస్య)
జన్మము నొందిన మొదలుగ చిన్మయుని స్మరణ తోడ చిత్తము నందున్ తన్మయుడై యున్న కతనఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెండవ పాదంలో గణభంగం. "చిన్మయు సంస్మరణతోడ" అనండి.
హమ్మయ్య!మానడు మంచిని గోరు, గుణానుక్రమముగ విభుడు జనహితోన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ నడచ బరిణెపురుగుల రౌద్రమ్మునయోజిలేబీయము
అబ్బో... సమస్యాపాదాన్ని స్థానభ్రంశం చేసి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
అర్థమయ్యిందాండీ ? :)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. కందంలో "జ్ఞానం బున్మత్తుండైన" అనండి.వృత్తంలో "జన్మస్థానము నుజ్జగించి" టైపాటు.
ఉన్మాదియైన ప్రభువుకుసన్మార్గము జూపునట్టి సచివుల వలనన్జన్మించినచో జ్ఞానంబున్మత్తుండైన నృపతి యుద్దండుండౌజన్మస్థానము నుజ్జగించి చనియెన్ సామాన్యుడే భీరువైతన్మాత్రంబగు శక్తియున్న ప్రభువున్ దాజేరి సేవించగాసన్మార్గమ్మును వీడినట్టి తులువే సైన్యానికధ్యక్షుడైయున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే
సన్మార్గము జరియించు జ గన్మోహన రూపు గల్గి కల్పంబున తా నున్మాదు లైన వారికి నున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ”*జన్మంబియ్యది శిష్ట సుమ్నమను విశ్వాసమ్ము తో నిత్యమున్ సన్మార్గమ్ము జరించు నట్టి జనులన్ సచ్చీలురౌ వారికిన్ సన్మానమ్ములు జేయువాడట దురాచారుండ్ర చిత్తమ్ములో నున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే.
జన్మంబెత్తిన నాటినుండి యఘముల్ సాగ్రంబుగా జేయుచున్సన్మార్గంబున పోవువారిని సదా సాధించు చున్ నీచుడాయున్మత్తుండగు రాజ పాలనములో నుద్దండుడై వెల్గెనేసన్మానంబులు నందుకొంచు సతతమ్ సౌశీల్యమే లేకయున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."సతమున్ సౌశీల్యమే..." అనండి.
కం:సన్మంత్రుల సూచనలకుసన్మానము నిచ్చు రాజు శస్తు, డెటుల స్త్రీలన్ మోహితుడౌచున్, మద్యోన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ?
శా:సన్మార్గమ్మును దెల్ప తిమ్మరుసు తా సమ్రాట్టు తో బల్కె "నీషన్మాత్రమ్మును చింత జేయకయె శిక్షల్ వేయకో వత్స! ప్రే మన్,మర్యాదను జూపు మంత్రుల యెడన్,మద్యమ్ము లో నెన్నడేనున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే?
ఉన్మేషమ్ముగ ప్రజలనుసన్మార్గమ్మున నడుపఁగ సతతము మదిలోతన్మయుడై తలబోయుచునున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉన్మేషమ్ముగ దేశవాసులకు తానుద్బోధలన్ జేయుచున్సన్మార్గమ్మున సాగుడీ యనుచు నుత్సాహించు నెల్లప్పుడున్సన్మానమ్ములుజేయు పండితులకున్ సచ్ఛీలురన్ గాఁచునాయున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు."సాగిపొమ్మనుచు" అనండి.
జ న్మా o శ యుత్త మంబై సన్మార్గము నందు నడచు నట్టి సజ్జను డ గు చున్ తన్మయ పాలన మున దా ను న్మ త్తు o డైన నృప తి యు ద్ధ o డు డౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెండవ పాదంలో గణభంగం. *నడచు సజ్జను డగుచున్* అనండి.
శా॥ చిన్మాత్రమ్ము సుయోధనుండు గనునే చిత్తంబు స్వశ్రేయమేసన్మార్గమ్మును వీడి కాంచుఁ గద విశ్వాసమ్ముతోఁ గర్ణునిన్సన్మానించె సదా స్వసార్థకపు కాంక్షా సిద్ధికిన్ గర్ణుఁడోఉన్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనేచిన్మాత్రము శుద్ధజ్ఞానము
సన్మతి నారాధింపక విన్మా నారాయణాది విగ్రహ గణ రాజన్మందిరములఁ బౌరుండున్మత్తుం డైన నృపతి యుద్దండుండౌ సన్మార్గాచర ణాభిలాషుఁ డిల నిస్వార్థుండు నిత్యమ్ము కించిన్మాత్రుం డన నర్థ హీన మగు సంక్షిప్తమ్ముగం బల్కినన్ సన్మానమ్ముల దండనమ్ములను సచ్చారిత్రుఁ డత్యంత ధర్మోన్మత్తుం డగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే
అద్భుతమైన పూరణలు. అభినందనలు.
జన్మకు కారణ మియ్యది తన్మయతన్ గొలువవలెను దైవము నెపుడున్ చిన్మయ రూపుఁడు గావున నున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ”
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
సన్మానింపక రాజ్యమందుగల విశ్వాసాత్ములన్ సుంతయున్ మన్మందున్ సతతమ్ము స్వార్థమొదవన్ మారించగా శిష్టులన్సన్మిత్రుల్ బ్రజ లండగా నిలువగా సాధించి స్వాతంత్ర్యమున్ ఉన్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుడై వెల్గెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మన్మందున్... మారించగా' ?
జన్మంబొందిన దాదిగాజనుఁడహో సాలోచనాధీనుఁడై చిన్మయ్యాకరుఁడౌట చూడగఁదమిన్ జింతించ నోపుండునై సన్మార్గంబున నెల్లవేళల రతిన్ సాయంబుఁజేయంగఁదానున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే”
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.జన్మము సార్థకమౌనటుసన్మార్గ పథమ్మునందు సాగగ బ్రతుకున్తన్మయమును చెందుచు శాంతోన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ.
జన్మము నొందిన మొదలుగ
రిప్లయితొలగించండిచిన్మయుని స్మరణ తోడ చిత్తము నందున్
తన్మయుడై యున్న కతన
ఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. "చిన్మయు సంస్మరణతోడ" అనండి.
హమ్మయ్య!
రిప్లయితొలగించండిమానడు మంచిని గోరు, గు
ణానుక్రమముగ విభుడు జనహితోన్మత్తుం
డైన నృపతి యుద్దండుం
డౌ నడచ బరిణెపురుగుల రౌద్రమ్మునయో
జిలేబీయము
అబ్బో... సమస్యాపాదాన్ని స్థానభ్రంశం చేసి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
తొలగించండిఅర్థమయ్యిందాండీ ? :)
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికందంలో "జ్ఞానం బున్మత్తుండైన" అనండి.
వృత్తంలో "జన్మస్థానము నుజ్జగించి" టైపాటు.
ఉన్మాదియైన ప్రభువుకు
తొలగించండిసన్మార్గము జూపునట్టి సచివుల వలనన్
జన్మించినచో జ్ఞానం
బున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ
జన్మస్థానము నుజ్జగించి చనియెన్ సామాన్యుడే భీరువై
తన్మాత్రంబగు శక్తియున్న ప్రభువున్ దాజేరి సేవించగా
సన్మార్గమ్మును వీడినట్టి తులువే సైన్యానికధ్యక్షుడై
యున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే
రిప్లయితొలగించండిసన్మార్గము జరియించు జ
గన్మోహన రూపు గల్గి కల్పంబున తా
నున్మాదు లైన వారికి
నున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ”*
జన్మంబియ్యది శిష్ట సుమ్నమను విశ్వాసమ్ము తో నిత్యమున్
సన్మార్గమ్ము జరించు నట్టి జనులన్ సచ్చీలురౌ వారికిన్
సన్మానమ్ములు జేయువాడట దురాచారుండ్ర చిత్తమ్ములో
నున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజన్మంబెత్తిన నాటినుండి యఘముల్ సాగ్రంబుగా జేయుచున్
రిప్లయితొలగించండిసన్మార్గంబున పోవువారిని సదా సాధించు చున్ నీచుడా
యున్మత్తుండగు రాజ పాలనములో నుద్దండుడై వెల్గెనే
సన్మానంబులు నందుకొంచు సతతమ్ సౌశీల్యమే లేకయున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సతమున్ సౌశీల్యమే..." అనండి.
కం:సన్మంత్రుల సూచనలకు
రిప్లయితొలగించండిసన్మానము నిచ్చు రాజు శస్తు, డెటుల స్త్రీ
లన్ మోహితుడౌచున్, మ
ద్యోన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశా:సన్మార్గమ్మును దెల్ప తిమ్మరుసు తా సమ్రాట్టు తో బల్కె "నీ
రిప్లయితొలగించండిషన్మాత్రమ్మును చింత జేయకయె శిక్షల్ వేయకో వత్స! ప్రే
మన్,మర్యాదను జూపు మంత్రుల యెడన్,మద్యమ్ము లో నెన్నడే
నున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే?
ఉన్మేషమ్ముగ ప్రజలను
రిప్లయితొలగించండిసన్మార్గమ్మున నడుపఁగ సతతము మదిలో
తన్మయుడై తలబోయుచు
నున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉన్మేషమ్ముగ దేశవాసులకు తానుద్బోధలన్ జేయుచున్
రిప్లయితొలగించండిసన్మార్గమ్మున సాగుడీ యనుచు నుత్సాహించు నెల్లప్పుడున్
సన్మానమ్ములుజేయు పండితులకున్ సచ్ఛీలురన్ గాఁచునా
యున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సాగిపొమ్మనుచు" అనండి.
జ న్మా o శ యుత్త మంబై
రిప్లయితొలగించండిసన్మార్గము నందు నడచు నట్టి సజ్జను డ గు చున్
తన్మయ పాలన మున దా
ను న్మ త్తు o డైన నృప తి యు ద్ధ o డు డౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. *నడచు సజ్జను డగుచున్* అనండి.
శా॥ చిన్మాత్రమ్ము సుయోధనుండు గనునే చిత్తంబు స్వశ్రేయమే
రిప్లయితొలగించండిసన్మార్గమ్మును వీడి కాంచుఁ గద విశ్వాసమ్ముతోఁ గర్ణునిన్
సన్మానించె సదా స్వసార్థకపు కాంక్షా సిద్ధికిన్ గర్ణుఁడో
ఉన్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే
చిన్మాత్రము శుద్ధజ్ఞానము
సన్మతి నారాధింపక
రిప్లయితొలగించండివిన్మా నారాయణాది విగ్రహ గణ రా
జన్మందిరములఁ బౌరుం
డున్మత్తుం డైన నృపతి యుద్దండుండౌ
సన్మార్గాచర ణాభిలాషుఁ డిల నిస్వార్థుండు నిత్యమ్ము కిం
చిన్మాత్రుం డన నర్థ హీన మగు సంక్షిప్తమ్ముగం బల్కినన్
సన్మానమ్ముల దండనమ్ములను సచ్చారిత్రుఁ డత్యంత ధ
ర్మోన్మత్తుం డగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే
అద్భుతమైన పూరణలు. అభినందనలు.
తొలగించండిజన్మకు కారణ మియ్యది
రిప్లయితొలగించండితన్మయతన్ గొలువవలెను దైవము నెపుడున్
చిన్మయ రూపుఁడు గావున
నున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ”
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిసన్మానింపక రాజ్యమందుగల విశ్వాసాత్ములన్ సుంతయున్
రిప్లయితొలగించండిమన్మందున్ సతతమ్ము స్వార్థమొదవన్ మారించగా శిష్టులన్
సన్మిత్రుల్ బ్రజ లండగా నిలువగా సాధించి స్వాతంత్ర్యమున్
ఉన్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుడై వెల్గెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మన్మందున్... మారించగా' ?
జన్మంబొందిన దాదిగాజనుఁడహో సాలోచనాధీనుఁడై
రిప్లయితొలగించండిచిన్మయ్యాకరుఁడౌట చూడగఁదమిన్ జింతించ నోపుండునై
సన్మార్గంబున నెల్లవేళల రతిన్ సాయంబుఁజేయంగఁదా
నున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
జన్మము సార్థకమౌనటు
సన్మార్గ పథమ్మునందు సాగగ బ్రతుకున్
తన్మయమును చెందుచు శాం
తోన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ.