4, ఆగస్టు 2026, మంగళవారం

సమస్య - 5549

5-8-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శిష్యుఁడు గురువయ్యె గురులు శిష్యుండ్రగుటన్”

(లేదా...)

“శిష్యుం డొక్కఁడు సద్గురుండగు గురుల్ శిష్యాళిగన్ మారగన్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో జాన దుర్గామల్లికార్జున రావు గారి సమస్య)

17 కామెంట్‌లు:

  1. -

    జగడములు తదుపరి తృటిన్
    సిగబట్టుకొనిరి భళారె శిష్యుఁడు గురువ
    య్యె గురులు శిష్యుండ్రగుటన్
    జగమెరిగిన సత్యమాయె సాఫ్ట్వేర్ కళలోన్


    రిప్లయితొలగించండి
  2. ఇష్యులు ముదుకడు లగుటన
    పుష్యమున సదా వెర పనిముట్టులు పుట్టన్
    శిష్యుని వాటి కొరనరయ
    శిష్యుఁడు గురువయ్యె గురులు శిష్యుండ్రగుటన్

    రిప్లయితొలగించండి
  3. ఋష్యాశ్రమ చరితములో
    శిష్యుఁడు గురువయ్యె గురులు శిష్యుండ్రగుటన్
    ఋష్యేంద్రా చూచితివా
    శిష్యోదంతంబులెన్ని చెప్పంగవలెన్

    ఋష్యప్రోక్తములందు స్పష్టమగునా రేకెత్తు సందేహముల్
    ఋష్యేంద్రా! వివరింపుమా మనసులో ప్రేరేచెనీ ప్రశ్నమే
    శిష్యుం డొక్కఁడు సద్గురుండగు గురుల్ శిష్యాళిగన్ మారగన్
    శిష్యోదంతములెన్ని లభ్యమగునో చింతించి వాక్రుచ్చుమా

    రిప్లయితొలగించండి
  4. కం:భాష్య మొసగు తాత్త్విక వై
    దుష్యమ్మున్ గల్గి "తెలియదుర కంప్యూటర్
    శిష్యా ! యిది యె?"ట్లనగా
    శిష్యుఁడు గురువయ్యె గురులు శిష్యుండ్రగుటన్.
    (వాళ్లు గొప్ప తాత్త్వికోపన్యాసకులే కానీ కంప్యూటర్ నాలెడ్జ్ లేక ఇది ఎలారా? అని శిష్యుణ్ని అడిగారు.ఆ విద్యలో శిష్యుడే గురు వయ్యాడు.)

    రిప్లయితొలగించండి
  5. శా॥ శిష్యుల్ శాస్త్రపు శోధనా విధినిఁ బ్రశ్నించంగ నధ్యాపకుల్
    శిష్యుల్ నేర్వఁగఁ జూప దారులనటుల్ స్థేమమ్ముతో సాగుచున్
    శిష్యండే ఘన విజ్ఞతాధృతినిఁ బ్రశస్తిన్ గాంచ నుద్దండుఁడై
    శిష్యుండొక్కఁడు సద్గురుండగు గురుల్ శిష్యాళిగన్ మారఁగన్

    (ఇది రీసెర్చ్ లో అరుదుగా జరిగేదనండి. మొదట మెంటర్ వద్ద పరిశోధన చేసి పట్టా పొందిన శిష్యుడు తరువాత శోధనలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తే అతని మెంటర్ అలాంటి వారు అతనిని (ఆమెను) సంప్రదించడం జరుగుతుందండి)

    రిప్లయితొలగించండి
  6. శా: భాష్యమ్ముల్ బ్రకటించు తత్త్వవిదులై పాండిత్యముల్ గల్గి వై
    దుష్య మ్మింతయు లేక కంప్యుటరునందున్ దాని జొప్పించగా
    ఋష్యశృంగుల వోలె శిష్యతతిలో నే శిష్యునో కోరగా
    శిష్యుం డొక్కఁడు సద్గురుండగు గురుల్ శిష్యాళిగన్ మారగన్”
    (భావం పై పద్యం లోనిదే.ఋష్యశృంగుడు ఒక గొప్ప మహర్షి కానీ లౌకికజ్ఞానం లేని వాడు.గొప్ప ఆథ్యాత్మిక జ్ఞానము కలిగినా కంప్యూటర్ పరిజ్ఞానం లేకుంటే వాళ్లు ఋష్యశృంగుని వంటి వారే. )

    రిప్లయితొలగించండి
  7. భాష్యము జెప్పుచు నని యెను
    శిష్యరికము జేసి యొ కడు జెల గెను గురువై
    చోష్య ము గా వర్ణిo ప గ
    శి ష్యుడు గురు వ య్యె గురులు శి ష్యు o డ్ర గు ట న్

    రిప్లయితొలగించండి
  8. పుష్యమ్మున్ జనియించి ధాత్రిపయి, సంపూర్ణమ్ముగా నొజ్జచే
    భాష్యమ్ముల్ పఠియించి యిచ్చమయి, సౌభాగ్యమ్ము ప్రాప్తించ, మా
    నుష్యమ్మైన మనస్సుతో, గురువు తా నోరార వాంఛించగా
    శిష్యుం డొక్కఁడు సద్గురుండగు గురుల్ శిష్యాళిగన్ మారగన్

    రిప్లయితొలగించండి
  9. తుష్యద్హృత్శంకరుఁ డా
    యుష్యాల్పుఁడు సద్గురుండు నుదరి గ్రహించెన్
    శిష్యులుగ నొజ్జలఁ బుడమి
    శిష్యుఁడు గురు వయ్యె గురులు శిష్యుం డ్రగుటన్


    శిష్యుండై బలభద్రు తోడుతఁ దమిం జిత్రమ్ము సుమ్మీ సద
    న్వేష్యాచార్యున కిద్ధరిత్రి సదసద్వేద్యమ్ము బోధించె స
    ద్భాష్యవ్రాతములన్ వచించి హరి పార్థా యంచు శ్రీకృష్ణుఁడే
    శిష్యుం డొక్కఁడు సద్గురుం డగు గురుల్ శిష్యాళిగన్ మారగన్

    రిప్లయితొలగించండి
  10. కందం
    శిష్యుడు మును వారందరి
    భాష్యము విడి రాజకీయపక్షము వెట్టెన్
    బోష్యమని చేర నేతను
    శిష్యుఁడు గురువయ్యె గురులు శిష్యుండ్రగుటన్

    శార్దూలవిక్రీడితము
    శిష్యుండై మును విర్రవీగి తగునౌచిత్యమ్ములన్ బాసి స
    ద్భాష్యమ్ముల్ విడి రాజకీయముగఁ దా పక్షమ్ము నే కూర్చఁగన్
    బోష్యమ్మైననె చేరి నేతయనుచున్ బోధింపఁ బాటింపగన్
    శిష్యుం డొక్కఁడు సద్గురుండగు గురుల్ శిష్యాళిగన్ మారగన్

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    శిష్యుడు చదివె గురువు కడ
    శిష్యుడు పై చదువు చదివి చేరెను పదవిన్
    శిష్యు డధికారిగ నిలిచి
    శిష్యుడు గురువయ్యె గురులు
    శిష్యుండ్రగుటన్.

    రిప్లయితొలగించండి