4-8-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రతి ముద్దు సుతుఁడు మకరధ్వజుఁడె కదా”
(లేదా...)
“రతి ముద్దుబిడ్డ మకరధ్వజుఁడన్న విశేషమౌనొకో”
(ఛందోగోపనం)
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో కటకం వేంకటరామ శర్మ గారి సమస్య)
కందం"నీరజనాభ! గిరిజకున్గూరిచి శంకరునిఁ బొందఁ గొమరున్ జగతిన్బేరుఁ గొనఁ బట్టిరి సురల్హారతి! ముద్దు సుతుఁడు మకరధ్వజుఁడె కదా!"ఉత్పలమాలచేరువ జేయువాడనఁగ స్త్రీపురుషాళిని, వింతశోభలన్గూరుచ సృష్టికిన్! గలిపె గోపతిఁ బార్వతిఁ బట్ట దేవతల్హారతి! ముద్దుబిడ్డ మకరధ్వజుఁడన్న విశేషమౌనొకోనీరజనాభుడౌ హరికి నేత్రికిఁ గల్గిన సుందరాంగునిన్?
కందం
రిప్లయితొలగించండి"నీరజనాభ! గిరిజకున్
గూరిచి శంకరునిఁ బొందఁ గొమరున్ జగతిన్
బేరుఁ గొనఁ బట్టిరి సురల్
హారతి! ముద్దు సుతుఁడు మకరధ్వజుఁడె కదా!"
ఉత్పలమాల
చేరువ జేయువాడనఁగ స్త్రీపురుషాళిని, వింతశోభలన్
గూరుచ సృష్టికిన్! గలిపె గోపతిఁ బార్వతిఁ బట్ట దేవతల్
హారతి! ముద్దుబిడ్డ మకరధ్వజుఁడన్న విశేషమౌనొకో
నీరజనాభుడౌ హరికి నేత్రికిఁ గల్గిన సుందరాంగునిన్?