(ఆటవెలదిలో చక్కని రూపుతో పాటు పొట్టయున్న అనే విధంగానండి. ఎంత జ్ఞానియైన తొలుత ఎదుటి వారికి గౌరవము కలిగించేది ఆకారము. ఆ ఆకారినికి కొంత పొట్ట ఉన్న (మగవారికి) అందము మరీ ఇనుమడిస్తుందండి)
మరొక హాస్య పూరణ అండి (ఒక బానపొట్ట యున్న వాని ఆవేదన)
పట్టు నింతయు వీడ కుండినఁ బంత మూనిన సంతతం బట్టి వానిని మూర్ఖుఁ డంచును నందు రడ్గిన యంతటం జట్టనన్ వచియించు నేర్పున శబ్ద పూరిత మైనదౌ పొట్ట గల్గినవాని నందురు భూమి పైన బుధుండుగన్
రిప్లయితొలగించండివిఘ్నరాజు బొజ్జ పెద్దదిగ నెరుగు
తీపి వస్తువులను దినగ బొఱ్ఱ
పెరుగుచున్నదనుచు వెక్కిరించెద వేల ?
పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము
రిప్లయితొలగించండివిఘ్నములను బాపి విద్యల నొసగెడి
వాడటంచు కొలుతు భక్తి తోడ
శూలి సుతుల లోన చూడ నగ్రజుడగు
పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము.
పట్టు పంచెలు కట్టుకుందురు భస్మ రేఖలు ఫాలమున్
బెట్టుకుంచును భక్తి తోడను ప్రీతిగా నిట శంకరున్
బట్టి యంచును కొల్చు చుందురు వక్ర తుండుడు వాడె యా
పొట్ట గల్గినవాని నందురు భూమి పైన బుధుండుగన్.
ఆటవెలది
రిప్లయితొలగించండితుందిలుండునౌచుఁ బొంది పరీక్షను
తల్లితండ్రు లొప్పఁ దానె నెగ్గి
యగ్గణాధిపత్యమందె గజముఖుండు!
పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము!
మత్తకోకిల
చుట్టె నాతడుఁ దల్లిదండ్రులఁ జూపినట్టి పరీక్షకే
యట్టె నెగ్గియు తుందిలుండుగ నాశిషంపు ఫలంబుగన్
దిట్టయౌచు గణాధిపుండుగ తీరె గజాననుండహో!
పొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్!
సవరించిన వృత్త పూరణ:
తొలగించండిమత్తకోకిల
చుట్టె నాతడుఁ దల్లిదండ్రులఁ జూపినట్టి పరీక్షకే
యట్టె నెగ్గియు తుందిలుండుగ నాశిషంపు ఫలంబుగన్
దిట్టయౌచు గణాధిపుండుగ తీరఁ దా గజవక్త్రుడున్
బొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్!
పొట్టనింపనెంచి బొజ్జవేల్పునుగొల్చి
రిప్లయితొలగించండిచట్ట సభను జొచ్చి చకచకమని
గుట్టుగా భుజించి కోట్లతో పెంచిన
పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము
పొట్టనిండ భుజించి నాడట బొజ్జదేవర మెండుగాఁ
బొట్ట గల్గిన వక్రతుండుడు బూజితుండని గొల్వరే
గుట్టు గామరి బొక్కునేతను కుంభకోణపు ముఖ్యుడై
పొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్
నిట్టనిల్చిన ధాన్యరాసులు నిండు కొట్టము లుండగన్
రిప్లయితొలగించండిపట్టుపట్టిన భూములన్నియు పండి సంపద లీయగన్
మట్టిలోపల బంగరుండగ మాన్యుడై తన తేజమున్
పొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్
#ఛందం #యంత్రం
మత్తకోకిల:
రిప్లయితొలగించండిచిట్టిపంతులు నామధేయుని చిన్ననాటి వయస్యునిన్
పొట్టివాడని గట్టివాడని పుట్టినప్పటి నుండియున్
జెట్టి విద్యలలోన వాడని చేరి మెచ్చుచు నెల్లరున్
పొట్ట గల్గిన వాని నందురు భూమిపైన బుధుండుగన్
చిట్టిపంతులతఁడు చిననాటి మిత్రుఁడు
రిప్లయితొలగించండివిద్య లందు నొజ్జ వినయశీలి
కుబ్జుడైన నేమి గుణవంతు డాతఁడు
పొట్ట యున్న వాఁడె బుధుఁడు సుమ్ము
ఆ.వె: పొట్ట బెంచినట్టి భోజనప్రియులైన
రిప్లయితొలగించండివిప్రతతియె యిచట విడిది జేసె
గాని,నన్నె యడుగు దేని! యా సన్నని
పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము”
ఆ॥ ఎంత చదివియున్న నెన్ని నేర్చిన నహో
రిప్లయితొలగించండివిగ్రహమును జూచి విజ్ఞుఁడనరె
శాస్త్ర విద్యలొంది చక్కని రూపునఁ
బొట్టయున్న, వాఁడె బుధుఁడు సుమ్ము
మత్త॥ దిట్టయైనను విగ్రహమ్మున దీటుఁ గాంచక యున్నచో
నెట్టులీ ధర గొప్ప వాఁడుగ నెంచుచుందురు? శాస్త్రముల్
పట్టుబట్టుచు నేర్చి జ్ఞానిగ భవ్య రూపునఁ గొంతగన్
బొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్
(ఆటవెలదిలో చక్కని రూపుతో పాటు పొట్టయున్న అనే విధంగానండి.
ఎంత జ్ఞానియైన తొలుత ఎదుటి వారికి గౌరవము కలిగించేది ఆకారము. ఆ ఆకారినికి కొంత పొట్ట ఉన్న (మగవారికి) అందము మరీ ఇనుమడిస్తుందండి)
మరొక హాస్య పూరణ అండి
(ఒక బానపొట్ట యున్న వాని ఆవేదన)
మత్త॥ గట్టి వేల్పుగ విఘ్న రాజును గౌరవించుచు నుందురే
పొట్టగల్గిన వాని నందురు భూమిపైన బుధుండుఁగన్
బొట్టగల్గిన మానవుల్ ధరఁ బొందరేలనొ మన్ననే
యిట్టి భేదము చూపఁ దప్పని యెంచ నేర్పు గణాధిపా
కోరె మిత్రు డొకడు కోవిదు o డెవ రంచు
రిప్లయితొలగించండిపొట్ట యున్న వాడె బుధుడు సుమ్ము
కవిత లల్లు టందు ఘనత వహించి న
పండి తుండు నగుచు వాసి కెక్కె
ఉ:పొట్ట సన్నన వానికిన్ మితభోజనమ్మును జేసెడిన్
రిప్లయితొలగించండిగట్టిగా విసరంగ నాతడు గాలికే పడి పోయెడిన్
పుట్టె డాతని విద్య ,విద్యనె బొజ్జ నుంచిన సన్ననౌ
పొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్
(అతని పొట్ట నిండా విద్య అని,అతనికి పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదని అనటం ఒక జాతీయం. దాన్నే ఉపయోగించాను. )
ఆదరింపఁ దగునె యాకారమును గాంచి
రిప్లయితొలగించండిపాత్రుఁ డాదరింపఁ బండితుండు
చెన్ను మీఱ నచ్చ టున్న వారల బాన
పొట్ట యున్న వాఁడె బుధుఁడు సుమ్ము
పట్టు నింతయు వీడ కుండినఁ బంత మూనిన సంతతం
బట్టి వానిని మూర్ఖుఁ డంచును నందు రడ్గిన యంతటం
జట్టనన్ వచియించు నేర్పున శబ్ద పూరిత మైనదౌ
పొట్ట గల్గినవాని నందురు భూమి పైన బుధుండుగన్
గట్టిగా భుజియించు చుండిన గల్గు మాద్యమె యెంచగా
రిప్లయితొలగించండిపట్టురోగము నిశ్చయమ్ముగ ప్రౌఢి తగ్గును విద్యలన్
కట్టుబాటుల నమ్మసౌఖ్యము కల్గు నెప్పుడు, చిట్టిదౌ
పొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్
సభను జూడు దిగ్గజములఁబోలుచు పెద్ద
రిప్లయితొలగించండిపొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము”
మంచి చెడును నరసి మాట్లాడ వలయును
దప్పు పలుక రాదు దార లక్ష్శి!
పొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్”
రిప్లయితొలగించండిపొట్ట పెంచిన యంద మంతయు పూర్తిగాఁజెడి పోవుగా
పట్టు మంచును నెవ్వ రేనియు పల్కరెప్పుడు ప్రేమతోఁ
బొట్ట గర్భముఁదాల్చు భామలు బొందురాశిసులెప్పుడున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పొట్ట లేని వారు బుధులెంత మందియో
పొట్ట యున్న వారు బుధులు సుమ్మ
టంచు పలుక నవని యందున భావ్యమా?
పోషణమును బట్టి పొట్ట వచ్చు.