తే.గీ: వేద వేదాంగముల పైన విషము జిమ్ము నతడు నాస్తిక సాహిత్య మంత జదివి దాని వీడి జెప్పుచు నుండె తత్త్వ మిపుడు విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు” (అతడు వేదాల పై విషయం చిమ్మాడు, విషపు సాహిత్యం చదివాడు కానీ మారి పోయి ఇపుడు వేదాంతం మాట్లాడుతున్నాడు .అంటే విషం త్రాగి పాలు ఇచ్చినట్టు. )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిసోదరులగు పాండవులకు శోకమిడుచు
సఖునిగా నొంది కర్ణుని సాయమెంచి
రాజరాజౌచు కర్ణుని రాజుఁజేసె!
విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు!
చంపకమాల
ఋషినుత పాండుసోదరుల రిక్తపు చేతులనుంచి మీరి పౌ
రుషమున స్వార్థచిత్తమున రోయుచు కర్ణుని యంగరాజుగన్
ధిషణ విహీనుడై మసలి తీర్చెను లోకులు నిందనిట్లనన్
విషమునుఁ ద్రాగి సర్పమది వింతగ క్షీరమొసంగెఁ బ్రీతితోన్!
విషమునుమించుస్వార్ధమదివింతగయెన్నికవేళలందునీ
రిప్లయితొలగించండివిషయమువిన్నవించెదరువేగిరమేముసమస్యమూలమున్
శషబిషలేకతేల్తుమనిసారెలుచీరలుపేర్మినీయరే
*విషమునుఁ ద్రాగి సర్పమది వింతగ క్షీరమొసంగెఁ బ్రీతితోన్”*
రిప్లయితొలగించండివిహగముల జంపి జీవించు వేటగాడు
మారుచున్ రచియించె రామాయణమ్మ
టంచు తెలిపె నంతేవాసి కాతడిటుల
విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు.
ఝషమున సంచ రించుచు ఖజాకములన్ గడతీర్చు బోయ యే
యిషువును వేయ జిహ్వరద మీలిగి నంతట శోక మందునన్
ఋషిగను మారె, వాల్మికి చరిత్ర వచించుచు నొజ్జ యిట్లనెన్
విషమునుఁ ద్రాగి సర్పమది వింతగ క్షీరమొసంగెఁ బ్రీతితోన్.
తపనముకు వేడి కలియ శీతలమగు గది ,
రిప్లయితొలగించండితలనుగల గరళమునకు , త్రాగి నట్టి
విషము కలియగ మారుచు పేయమయ్యె ,
విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు
పృచ్ఛకుడనుచుఁ దొలుదొల్త పిలిచినపుడు
రిప్లయితొలగించండిపాన శౌరుని మదిలోనఁ దానుబుట్టె
కల్లు సేవించి నంతలోఁ గైపదమ్ము
'విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు'
దిషణము పానశాల పరదేశము నేగిన పానశౌరుడే
చషకమదేల వద్దనుచు చప్పున దోసిలి పట్టినంతలోఁ
దృషితుని చిత్తమందు నరుదెంచిన చోద్యపు కైపదమ్మిదే
'విషమునుఁ ద్రాగి సర్పమది వింతగ క్షీరమొసంగెఁ బ్రీతితోన్'
ఎవరండీ ఆ పానశౌరుల్ :)
తొలగించండికేవలం వ్యంగ్యం కోసం చేసిన పూరణ. ఎవరినీ ఉద్దేశించినది కాదు. అన్యథా భావింపవలదని మనవి.
తొలగించండివిషపు ఫణీంద్రముం గనుచు వీగిన జీవుల గుండె ఝల్లనన్
రిప్లయితొలగించండివిషమగు కాలసర్పమిటు వీఁకగ జూచిన లోకమెల్లరున్
విషయమిదేమి యంచు భయవిస్మయమంది జనుల్ వడంకఁగాన్
విషమునుఁ ద్రాగి సర్పమది వింతగ క్షీరమొసంగెఁ బ్రీతితోన్
వీఁక =గర్వం
#ఛందం #యంత్రం
భయానక రసంలో అతిశయ ఆశ్చర్యాలు
తొలగించండి-
రిప్లయితొలగించండిగంటి కలయొక్కటిని యేసు కరుణ జూప
విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు
ప్రభువు పాలించు మనలెల్ల పాపములను
ద్రోలి పరుగిడి రండు ప్రత్యూష మందు
విశ్వమును గావ రుద్రుడు విషము మ్రింగె
రిప్లయితొలగించండిహరియు కచ్చ మై మోసె నవని కాదె
కలియుగమ్మున వింతలు గాను పించు
విషము ద్రాగి క్షిర మొ సగె భేక భుక్కు
తే.గీ: వేద వేదాంగముల పైన విషము జిమ్ము
రిప్లయితొలగించండినతడు నాస్తిక సాహిత్య మంత జదివి
దాని వీడి జెప్పుచు నుండె తత్త్వ మిపుడు
విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు”
(అతడు వేదాల పై విషయం చిమ్మాడు, విషపు సాహిత్యం చదివాడు కానీ మారి పోయి ఇపుడు వేదాంతం మాట్లాడుతున్నాడు .అంటే విషం త్రాగి పాలు ఇచ్చినట్టు. )
చం:విషమును గ్రక్కి యెల్లపుడు వేదము పైన , బఠించుచుండియా
రిప్లయితొలగించండివిషమయ వాజ్ఞ్మయమ్మునె, వివేకము బొందె నదేమి చిత్రమో
ఋషులను మెచ్చి నేడు ప్రవచించును యోగము, నాత్మతత్త్వమున్
విషమునుఁ ద్రాగి సర్పమది వింతగ క్షీరమొసంగెఁ బ్రీతితోన్”
చం॥ ధిషణ విహీనుఁ డొక్కఁడటు తెల్పెను విజ్ఞుఁడటంచుఁ దాను పౌ
రిప్లయితొలగించండిరుషముగఁ బల్కుచున్ గలిని లోకమునందునఁ కొన్ని చోటులన్
వృషభము మాంస భక్షణముఁ బేర్మినిఁ జేయుచు నుండెఁ గాంచుడీ
విషమునుఁ ద్రాగి సర్పమది వింతగ క్షీరమొసంగెఁ బ్రీతితోన్
కాంచుడీ వృషభముకు సర్పముకు రెండింటికి అన్వయమండి
పూర్వ జన్మ వృత్తాంతము సర్వ మరసి
రిప్లయితొలగించండినట్టి గంధర్వుఁ డొక్కండు పుట్ట సర్ప
జాతిలో శాప మోక్షమునే తలంచి
విషముఁ ద్రాగి క్షీర మొసఁగె భేకభుక్కు
విషమును జిమ్ము పుర్వయిన భీతిల కింపుగఁ బాల నీయఁ గి
ల్బిష మతి సంచరించుఁ బగ వృద్ధిల నిత్యము దందశూకమే
రుష సెలగంగ మిక్కిలి విరోధి శరీరినిఁ గాటు వేసి వే
విషమునుఁ, ద్రాగి సర్ప మది వింతగ క్షీర, మొసంగెఁ బ్రీతితోన్
[త్రాగి సర్ప మది క్షీరము వే విషము నొసఁగె – అన్వయము]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
(క్రమాలంకారము)
శంకరు డెటుల రక్షించె జగతినెల్ల?
నింటి కేగి పాడి పశువు లేమి యిచ్చె?
ప్రాకు నుదరము తోడను ప్రాణి యేది?
విషముఁ ద్రాగి;క్షీరమొసగె; భేకభుక్కు.