7-9-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి”
(లేదా...)
“ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్”
(పట్వర్ధన్ గారి శతావధానంలో తక్కళ్ళపల్లి స్వాతి గారి సమస్య)
తెల్ల బంగారమనెదరు తెలుగు నాట ,దాని రంగు రంగుల పూలు దర్శనమిడె ప్రత్తిచేనులో ; వికసించెఁ బద్మమొకటిచేరువన గల కొండిక చెరువు నందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విరివిగా గడ్డి పూవులు వింతగానుపత్తిచేనులో వికసించె; పద్మమొకటి ప్రక్కకొలనులో వింతగా ప్రజలుచూడ ముచ్చటగ వికసించెను ముదముజెంద
తేటగీతిప్రత్తి పూవులు విచ్చఁగ రైతు మురిసికూళి వారలతోఁ గోసి గొప్ప రాశినట్టనడుమన వేయగ నల్గురనిరిప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి! మత్తకోకిలగుత్తులట్లుగఁ పూలు విచ్చఁగ కూలి వారల బిల్చియున్మొత్తమున్ దగ కోసి రాశిగ పోసినంతట మధ్యనున్నెత్తిమీదను నింప వెన్నెల నిండు జాబిలి, పల్కిరేప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్!
ప్రత్తి సేకరణ కొరకు బయలుదేరి క్రొత్త జంటలు చేరిరి ప్రత్తి చేనుభామ మోము గాంచిన కవి వక్కణించె ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటిక్రొత్తజంటలు ప్రత్తి తీయగ కోరి వచ్చిన చేనులోమత్తుకన్నుల చిన్నదొక్కటి మందహాసము సేయగానత్తరిన్ వచియించె సత్కవి హాయిగా కడు తీయగాప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మిసిమి వర్ణమున్ మెరిసిడి మేను గలిగి చేత గొడవలి ధరియించి చెలమరులతొ కదలి వచ్చు మర్దలి గాంచి కాంతు డనియె ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి.చిత్తగింపుము రామచంద్రుడ చెప్పు చుంటిని సంగతిన్ మత్త కాశిని బంది సేసిన మానుషాదుని రాజ్యమం దుత్తముండు విభీషణుండట యోగ్యుడాతడె కాంచగన్ ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్.
తెల్ల బంగారమనెదరు తెలుగు నాట ,
రిప్లయితొలగించండిదాని రంగు రంగుల పూలు దర్శనమిడె
ప్రత్తిచేనులో ; వికసించెఁ బద్మమొకటి
చేరువన గల కొండిక చెరువు నందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిరివిగా గడ్డి పూవులు వింతగాను
రిప్లయితొలగించండిపత్తిచేనులో వికసించె; పద్మమొకటి
ప్రక్కకొలనులో వింతగా ప్రజలుచూడ
ముచ్చటగ వికసించెను ముదముజెంద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిప్రత్తి పూవులు విచ్చఁగ రైతు మురిసి
కూళి వారలతోఁ గోసి గొప్ప రాశి
నట్టనడుమన వేయగ నల్గురనిరి
ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి!
మత్తకోకిల
గుత్తులట్లుగఁ పూలు విచ్చఁగ కూలి వారల బిల్చియున్
మొత్తమున్ దగ కోసి రాశిగ పోసినంతట మధ్యనున్
నెత్తిమీదను నింప వెన్నెల నిండు జాబిలి, పల్కిరే
ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్!
ప్రత్తి సేకరణ కొరకు బయలుదేరి
రిప్లయితొలగించండిక్రొత్త జంటలు చేరిరి ప్రత్తి చేను
భామ మోము గాంచిన కవి వక్కణించె
ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి
క్రొత్తజంటలు ప్రత్తి తీయగ కోరి వచ్చిన చేనులో
మత్తుకన్నుల చిన్నదొక్కటి మందహాసము సేయగా
నత్తరిన్ వచియించె సత్కవి హాయిగా కడు తీయగా
ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమిసిమి వర్ణమున్ మెరిసిడి మేను గలిగి
చేత గొడవలి ధరియించి చెలమరులతొ
కదలి వచ్చు మర్దలి గాంచి కాంతు డనియె
ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి.
చిత్తగింపుము రామచంద్రుడ చెప్పు చుంటిని సంగతిన్
మత్త కాశిని బంది సేసిన మానుషాదుని రాజ్యమం
దుత్తముండు విభీషణుండట యోగ్యుడాతడె కాంచగన్
ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్.