చం: సరిగ నెరుంగుమీ భరత సంస్కృతిలో కథ లెల్ల తప్పులన్ పరి పరి చెప్పకోయి! సతి పార్వతి చేసిన పుత్రుడయ్య యా కరివదనుండు , శ్రీసతికిఁ గన్న! కుమారుఁ డటంద్రు పండితుల్ సరసత నిచ్చు మన్మథుని, చక్కని వాడగు బుష్పబాణునిన్. (పిల్ల వాడు పురాణకథలు తప్పు చెపుతుంటే తండ్రి ఎవరి కొడుకు ఎవరో సరి చేసి చెప్పాడు. శ్రీసతికి కన్న! అని సంబోధన గా చెప్ప వచ్చు. శ్రీసతికి గన్నకుమారుడు అన్నా సరిపోతుంది. )
ఆ.వె.
రిప్లయితొలగించండిగౌరి సుతుఁడు గాదె గణముల కధిపతి
కరివదనుఁడు, లక్ష్మి గన్నకొడుకు
పరువమందు మదిని మరులను బుట్టించు
కామదేవుడనుట కల్ల గాదు
చంపకమాల:
గిరిజ సుతుండు విఘ్నముల కేళిగ నాశమొనర్చు దైవమే
కరివదనుండు, శ్రీసతికిఁ గన్నకుమారుఁ డటంద్రు పండితుల్
విరుల శరమ్ములన్ విసరి వేసటగూర్చుచు నెల్లవారికిన్
మరులను కల్గజేయు మహిమాన్వితుఁడాతఁడు మారుడే సుమా
రిప్లయితొలగించండిప్రశ్న లంచు వేసె పండితుండీ విధిన్
గౌరి పుత్రుడెవరు? కందు డెవర
టంచు, బదులు చెబితి నంత నేనిట్టుల
కరివదనుఁడు, లక్ష్మి గన్నకొడుకు.
సరియగు నుత్తరమ్మిడిన సంతస మందెద నంచు నొజ్జయే
పరుల సుపుత్రుడెవ్వడనె ప్రశ్ననువేసి మరొక్కటంచు నా
స్మరుడన నెవ్వడో తెలుపు సత్వర మందు ననంగ చెప్పెనే
కరివదనుండు, శ్రీసతికిఁ గన్నకుమారుఁ డటంద్రు పండితుల్.
కొండచూలి కనుగు కొమరుడెవరనంగ
రిప్లయితొలగించండికరివదనుఁడు ; లక్ష్మి గన్నకొడుకు
లిరువురు రఘురాము నింతిగ నుండగ ,
కుశల వులన బడెడి గురుతులొంది
పరమ శివుని పైన శరములు గురివెట్టి
రిప్లయితొలగించండిభర్గ్యు డాగ్రహింప భస్మమైన
మదను డెవరు చెప్పుమని కోర తెల్పెనా
కరివదనుఁడు 'లక్ష్మి గన్నకొడుకు'
హరిసుతుడా మనోభవుడు? హంసుని పై గురివెట్టి వైచెనా
శరములు? నందివర్ధనుని సంజ్వరమాతనిఁ బూదిచేసెనా?
యెరుగకనుంటి పూవిలుతు డెవ్వరి పుత్రుడనంగ తెల్పెనా
కరివదనుండు 'శ్రీసతికిఁ గన్నకుమారుఁ డటంద్రు పండితుల్'
[సంజ్వరము = కోపము]
క్రమాలాంకారంలో --
రిప్లయితొలగించండివిఘ్న ములను బాపు వేలు ప దె వ్వ రు?
పాల కడలి నెవరు ప్రభవ మందె?
తెలు పు మేమి యగును దేవకి కి మురారి?
కరి వ ద నుడు : లక్ష్మి :: కన్న కొడుకు
-
రిప్లయితొలగించండివిఘ్నములను ద్రోలు విభుడెవడు జిలేబి?
చపల చిత్తురాలు చాన యెవరు ?
తనను పోలినట్టి తత్వము గలవాడు ?
కరివదనుఁడు; లక్ష్మి; గన్నకొడుకు
చం॥ అరయఁ బురాణముల్ చదివి యన్నియు శ్రద్ధగఁ దేటతెల్లమౌఁ
రిప్లయితొలగించండిగరివదనుండు నేసతికిఁ గన్న కుమారుఁడు కాదటంచు నె
వ్వరు మరి యేల పల్కిరొకొ వాక్యముఁ గాంచను తప్పునిట్టులన్
గరివదనుండు శ్రీసతికిఁ గన్న కుమారుఁ డటంద్రు పండితుల్
ఆ.వె:పతి యొసంగి నట్టి స్పర్థలో శరవణున్
రిప్లయితొలగించండిగెలిచి విఘ్నపతిగ వెలిగి శ్రేష్ఠ
పదపు సిరిని బడయ పార్వతీ మాతకు
కరివదనుఁడు లక్ష్మి గన్నకొడుకు”
(శివుడు కుమారస్వామికి,విఘ్బేశ్వరునికి పోటీ పెడితే విఘ్నేశ్వరుడు గెలిచి ఆధిపత్య లక్ష్మిని పొందాడు కనుక ఆయన లక్ష్మిన్ గన్న కొడుకు. అంటే లక్ష్మిని పొందిన కొడుకు.)
చం: సరిగ నెరుంగుమీ భరత సంస్కృతిలో కథ లెల్ల తప్పులన్
రిప్లయితొలగించండిపరి పరి చెప్పకోయి! సతి పార్వతి చేసిన పుత్రుడయ్య యా
కరివదనుండు , శ్రీసతికిఁ గన్న! కుమారుఁ డటంద్రు పండితుల్
సరసత నిచ్చు మన్మథుని, చక్కని వాడగు బుష్పబాణునిన్.
(పిల్ల వాడు పురాణకథలు తప్పు చెపుతుంటే తండ్రి ఎవరి కొడుకు ఎవరో సరి చేసి చెప్పాడు. శ్రీసతికి కన్న! అని సంబోధన గా చెప్ప వచ్చు. శ్రీసతికి గన్నకుమారుడు అన్నా సరిపోతుంది. )