22-9-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వధువు లేకుండఁ గట్టెను వరుఁడు దాళి”
(లేదా...)
“మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో”
(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో సంగనభట్ల నర్సయ్య గారి సమస్య)
తేటగీతికానలకు నంపి రాముడు జానకి నటజన్నమొనరించు దీక్షకై స్వర్ణసీతమూర్తి ప్రక్కన కూర్చుండి మును, సజీవవధువు లేకుండఁ గట్టెను వరుఁడు దాళి! ఉత్పలమాలకానలకంపి జూనకిని కాదన లేకయె రామచంద్రుఁడున్ ధీనిధి యశ్వమేధమును దీక్షఁగ జేయగ నగ్ని సాక్షిగాజానకి స్వర్ణమూర్తినిటఁ జక్కఁగ బెట్టి, సజీవ కాంతులన్మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో!
పెండ్లి యని రమ్మనుచు తాను పిలువ నేమి పరుల దేశాన యున్నట్టి బంధు వామె వచ్చుట కుదరదను వార్త పంప నట్టి వధువు లేకుండఁ గట్టెను వరుఁడు దాళి.*(వధువు =స్త్రీ, ఆడది)*సూనను వానికిచ్చుట ప్రసూతికి నచ్చక నాగడించగా నా ననబోడి చెయి విడ నంచు దలంచిన వాడటన్ సదా దానుని మందిరమ్ము జని తక్షణమే మనువాడె తల్లి యా మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో
తేటగీతి
రిప్లయితొలగించండికానలకు నంపి రాముడు జానకి నట
జన్నమొనరించు దీక్షకై స్వర్ణసీత
మూర్తి ప్రక్కన కూర్చుండి మును, సజీవ
వధువు లేకుండఁ గట్టెను వరుఁడు దాళి!
ఉత్పలమాల
కానలకంపి జూనకిని కాదన లేకయె రామచంద్రుఁడున్ ధీనిధి యశ్వమేధమును దీక్షఁగ జేయగ నగ్ని సాక్షిగా
జానకి స్వర్ణమూర్తినిటఁ జక్కఁగ బెట్టి, సజీవ కాంతులన్
మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో!
రిప్లయితొలగించండిపెండ్లి యని రమ్మనుచు తాను పిలువ నేమి
పరుల దేశాన యున్నట్టి బంధు వామె
వచ్చుట కుదరదను వార్త పంప నట్టి
వధువు లేకుండఁ గట్టెను వరుఁడు దాళి.
*(వధువు =స్త్రీ, ఆడది)*
సూనను వానికిచ్చుట ప్రసూతికి నచ్చక నాగడించగా
నా ననబోడి చెయి విడ నంచు దలంచిన వాడటన్ సదా
దానుని మందిరమ్ము జని తక్షణమే మనువాడె తల్లి యా
మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో