కం:పంకమ్ము గూడ లేదిట నింక విజృంభించె నిచట నిండ్లెన్నో నా కింక గురుతు కలదయ యీ ఇంకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్. (ఈ ఇంకిన చెరువు లో ఒకప్పుడు కమల లుండేవి. )
ఉ॥ లంకల గ్రామముల్ గనఁగ లక్షల లక్షలు చేయి పంటలన్ బొంకము మీర నిచ్చి చనుఁ బూర్తిగ నీటిని నాఁపి వేయఁగన్ బంకమె యుండు వేసవిని పారెడు నీరటు తగ్గిపోవఁగా నింకిన చెర్వునందుననె యెన్నియొ పద్మములుద్భవించెడిన్
(గోదావరి లంకల గ్రామాలలో రెండవ పంట తరువాత లాకులు మూసేసి కాలువలు ఎండగట్టేస్తారండి, అప్పుడు నిలచిన నీరు ఆవిరై చాలా వరకు బురద ఉంటుంది. అప్పటి స్థితి ఊహ నేనైతే చూడలేదండి లెక్కలేనన్ని సార్లు చుట్టినా!)
(కందములో ఇవ్వబడిన ఈ సమస్య; సమస్యా పాదం మార్చకుండా ఆట వెలది లోనూ తేటగీతిలోనూ అమర్చవచ్చు అని తెలుగు భాష యొక్క వైశిష్ట్యాన్ని వర్ణిస్తూ:--) (1) ఆ.వె.గీ. కందమందు కలదు కఠినమైనసమస్య ఆటవెలది నైన నడుగవచ్చు *నింకిన చెఱువున జనించె నెన్నొ కమల* *ములనునదియె తేటముననునొదుగు చిత్రమైన తెలుగు చింతించినకొలది గణములన్ని కూడ గణితమౌను. (2) (ఆలిగి చెరువు కట్ట పైనుంచి వెళుతున్న తన భార్యను ఒక భర్త ఈ విధంగా నవ్వించే ప్రయత్నం చేస్తూ బతిమిలాడుతున్నాడు) కం. వెంకీ నామొర వినవే పంకజముఖి !ముద్దరాల! భామామణి !యీ వంకనొకమారుగనవే *ఇంకిన చెరువున జనించె నెన్నొకమలముల్* (3) తే.గీ. భక్తితోయజ్ఞయాగముల్ ప్రజలు జేయ వరుణదేవుడుకరుణించివర్షమిడగ *నింకిన చెఱువున జనించె నెన్నొ కమల* *ముల్* ”*పరవశించిరిసకల పురజనులిక (4) ఆ.వె. భక్తితోడ ప్రజలు పలుయజ్ఞముల్ జేయ వరుణదేవుడొచ్చివర్షమిడగ *నింకిన చెఱువున జనించె నెన్నొ కమల* *ముల్**పరవశమొందె పుడమిజనులు
సంకటమయ్యె రైతులకు సస్యము లెండగ వర్ష లుప్తమై
రిప్లయితొలగించండిబాంకులు సొమ్ములియ్యరని బాధల నొందుచు నుండి పల్లెలన్
శంకరు పత్నినిన్ గొలువ సత్వర వర్షము నీరు చేరగా
నింకిన చెర్వునందుననె యెన్నియొ పద్మము లుద్భవించెడిన్
అననారె
పంకజనేత్రి నీవిటుల పంతము బూనగ పాడియౌనె నా
రిప్లయితొలగించండివంకకు రావదేల పరిపంథిగ నన్ను దలంతువేల నీ
శంకలువీడి నా దరికి చయ్యన జేరిన నీదు రాకతో
నింకిన చెర్వునందుననె యెన్నియొ పద్మము లుద్భవించెడిన్
పంకజముల గూర్చి యడుగ
రిప్లయితొలగించండి"నింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్”
జంకక తెలిపితి వట్టుల
బొంకుటలో మేటివగుట బూజ్యుడ వయ్యా
పంకజముఖి బిగువేలనె
రిప్లయితొలగించండిశంకించగ వలదు నాదు సౌహార్దమ్మున్
పొంకమ్మగు నీ తలఁపున
నింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్
రిప్లయితొలగించండిసంకుచితము విడి నేతయె
సంకట ముల దీర్చ నెంచి సద్మము పంపన్
వంకలు నిండగ నెపుడో
యింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్.
వంకలె యెండి పోయినవి వర్షము లేక జనాళి సీమలో
నంకిలి పొందు చుండుతరి యాపద గాయగ నాన కట్టతో
సంకటముల్ హరింపగను సద్మము పంప నచోట నెప్పుడో
యింకిన చెర్వునందుననె యెన్నియొ పద్మములుద్భవించెడిన్.
జిలేబి సెబాసో :
రిప్లయితొలగించండిఇంక సమస్యాపూరణ
లింక హరిమ చెల్లెననెడు వేళ యతనమై
శంకరుని వేదికయె రా
నింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్
ఈ పద్యానికైనా శంకర వరుల్ బ్లాగు వంక చూపు గలుపుతారనియున్ను ఈ కొలువు మళ్లీ ఉధృతి యై వాత్సాపు లో దాగుడుమూతలాడుకుంటున్న వారంతా మళ్లీ బ్లాగింటికి వస్తారని
చీర్సుల సహిత
జిలేబి
బింకముతో వీడిన సఖి
రిప్లయితొలగించండిజంకక ముద్దొసగ మరల జన్మించెనహో
యింకిన హృదయాన వలపు!
ఇంకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్
బింకము తోడఁ గాదనిన ప్రేయసి నాడట తారసిల్లి తాఁ
జంకక ముద్దొసంగ మరి జన్మము ధన్యము గాకపోవునే
యింకిన యాశలే మరల నీరికలెత్తెను మానసంబులో!
ఇంకిన చెర్వునందుననె యెన్నియొ పద్మములుద్భవించెడిన్
కం:పంకమ్ము గూడ లేదిట
రిప్లయితొలగించండినింక విజృంభించె నిచట నిండ్లెన్నో నా
కింక గురుతు కలదయ యీ
ఇంకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్.
(ఈ ఇంకిన చెరువు లో ఒకప్పుడు కమల లుండేవి. )
ఉ:"ఇంకెను చె" ర్వటంచు వదలించుక పూడిక తీత గూడ, యా
రిప్లయితొలగించండివంకన నాక్రమించుచు భవంతుల గట్టకు డయ్య!సేమమే
యింకగ చెర్వు? లెట్లు లభియించును పంటయు? రక్ష జేయ నీ
ఇంకిన చెర్వునందుననె యెన్నియొ పద్మములుద్భవించెడిన్.
ఉ॥ లంకల గ్రామముల్ గనఁగ లక్షల లక్షలు చేయి పంటలన్
రిప్లయితొలగించండిబొంకము మీర నిచ్చి చనుఁ బూర్తిగ నీటిని నాఁపి వేయఁగన్
బంకమె యుండు వేసవిని పారెడు నీరటు తగ్గిపోవఁగా
నింకిన చెర్వునందుననె యెన్నియొ పద్మములుద్భవించెడిన్
(గోదావరి లంకల గ్రామాలలో రెండవ పంట తరువాత లాకులు మూసేసి కాలువలు ఎండగట్టేస్తారండి, అప్పుడు నిలచిన నీరు ఆవిరై చాలా వరకు బురద ఉంటుంది. అప్పటి స్థితి ఊహ నేనైతే చూడలేదండి లెక్కలేనన్ని సార్లు చుట్టినా!)
బొంకు నెఱుఁగ నే నెన్నఁడు
రిప్లయితొలగించండిగొంకకు ధైర్యము వహించు గురుతరముగ నా
టంకము లెన్ని యెదురయిన
నింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్
జంకుట మాను మోటమికి సాధన సేయ వరించు గెల్పులే
క్రుంకకు మెప్డు దుఃఖమునఁ గూడవు దుఃఖము లెల్ల కాలముల్
గొంకకు మయ్య నిందలకుఁ గూలు నసత్యము లెట్టకేలకే
యింకిన చెర్వునందుననె యెన్నియొ పద్మము లుద్భవించెడిన్
ధన్యవాదాలు ఆచార్య🙏 సవరణతో
రిప్లయితొలగించండి(కందములో ఇవ్వబడిన ఈ సమస్య; సమస్యా పాదం మార్చకుండా ఆట వెలది లోనూ తేటగీతిలోనూ అమర్చవచ్చు అని తెలుగు భాష యొక్క వైశిష్ట్యాన్ని వర్ణిస్తూ:--)
(1)
ఆ.వె.గీ.
కందమందు కలదు కఠినమైనసమస్య
ఆటవెలది నైన నడుగవచ్చు
*నింకిన చెఱువున జనించె నెన్నొ కమల*
*ములనునదియె తేటముననునొదుగు
చిత్రమైన తెలుగు చింతించినకొలది
గణములన్ని కూడ గణితమౌను.
(2)
(ఆలిగి చెరువు కట్ట పైనుంచి వెళుతున్న తన భార్యను ఒక భర్త ఈ విధంగా నవ్వించే
ప్రయత్నం చేస్తూ బతిమిలాడుతున్నాడు)
కం.
వెంకీ నామొర వినవే
పంకజముఖి !ముద్దరాల! భామామణి !యీ
వంకనొకమారుగనవే
*ఇంకిన చెరువున జనించె నెన్నొకమలముల్*
(3)
తే.గీ.
భక్తితోయజ్ఞయాగముల్ ప్రజలు జేయ
వరుణదేవుడుకరుణించివర్షమిడగ
*నింకిన చెఱువున జనించె నెన్నొ కమల*
*ముల్* ”*పరవశించిరిసకల పురజనులిక
(4)
ఆ.వె.
భక్తితోడ ప్రజలు పలుయజ్ఞముల్ జేయ
వరుణదేవుడొచ్చివర్షమిడగ
*నింకిన చెఱువున జనించె నెన్నొ కమల*
*ముల్**పరవశమొందె పుడమిజనులు
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరావు.
హైదరాబాద్.
సంకటము వర్ష లేమికి
పంకజములు మాయమయ్యె వారియు కఱవై
పొంకముగ వర్షము కురియ
నింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్.