29, సెప్టెంబర్ 2026, మంగళవారం

సమస్య - 5605

30-9-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఇంకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్”

(లేదా...)

“ఇంకిన చెర్వునందుననె యెన్నియొ పద్మములుద్భవించెడిన్”

(నారుమంచి అనంతకృష్ణ గారికి ధన్యవాదాలతో...)

10 కామెంట్‌లు:

  1. సంకటమయ్యె రైతులకు సస్యము లెండగ వర్ష లుప్తమై
    బాంకులు సొమ్ములియ్యరని బాధల నొందుచు నుండి పల్లెలన్
    శంకరు పత్నినిన్ గొలువ సత్వర వర్షము నీరు చేరగా
    నింకిన చెర్వునందుననె యెన్నియొ పద్మము లుద్భవించెడిన్
    అననారె

    రిప్లయితొలగించండి
  2. పంకజనేత్రి నీవిటుల పంతము బూనగ పాడియౌనె నా
    వంకకు రావదేల పరిపంథిగ నన్ను దలంతువేల నీ
    శంకలువీడి నా దరికి చయ్యన జేరిన నీదు రాకతో
    నింకిన చెర్వునందుననె యెన్నియొ పద్మము లుద్భవించెడిన్

    రిప్లయితొలగించండి
  3. పంకజముల గూర్చి యడుగ
    "నింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్”
    జంకక తెలిపితి వట్టుల
    బొంకుటలో మేటివగుట బూజ్యుడ వయ్యా

    రిప్లయితొలగించండి
  4. పంకజముఖి బిగువేలనె
    శంకించగ వలదు నాదు సౌహార్దమ్మున్
    పొంకమ్మగు నీ తలఁపున
    నింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్

    రిప్లయితొలగించండి

  5. సంకుచితము విడి నేతయె
    సంకట ముల దీర్చ నెంచి సద్మము పంపన్
    వంకలు నిండగ నెపుడో
    యింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్.


    వంకలె యెండి పోయినవి వర్షము లేక జనాళి సీమలో
    నంకిలి పొందు చుండుతరి యాపద గాయగ నాన కట్టతో
    సంకటముల్ హరింపగను సద్మము పంప నచోట నెప్పుడో
    యింకిన చెర్వునందుననె యెన్నియొ పద్మములుద్భవించెడిన్.

    రిప్లయితొలగించండి
  6. జిలేబి సెబాసో :

    ఇంక సమస్యాపూరణ
    లింక హరిమ చెల్లెననెడు వేళ యతనమై
    శంకరుని వేదికయె రా
    నింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్


    ఈ పద్యానికైనా శంకర వరుల్ బ్లాగు వంక చూపు గలుపుతారనియున్ను ఈ కొలువు మళ్లీ ఉధృతి యై వాత్సాపు లో దాగుడుమూతలాడుకుంటున్న వారంతా మళ్లీ బ్లాగింటికి వస్తారని


    చీర్సుల సహిత

    జిలేబి




    రిప్లయితొలగించండి
  7. బింకముతో వీడిన సఖి
    జంకక ముద్దొసగ మరల జన్మించెనహో
    యింకిన హృదయాన వలపు!
    ఇంకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్

    బింకము తోడఁ గాదనిన ప్రేయసి నాడట తారసిల్లి తాఁ
    జంకక ముద్దొసంగ మరి జన్మము ధన్యము గాకపోవునే
    యింకిన యాశలే మరల నీరికలెత్తెను మానసంబులో!
    ఇంకిన చెర్వునందుననె యెన్నియొ పద్మములుద్భవించెడిన్

    రిప్లయితొలగించండి
  8. కం:పంకమ్ము గూడ లేదిట
    నింక విజృంభించె నిచట నిండ్లెన్నో నా
    కింక గురుతు కలదయ యీ
    ఇంకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్.
    (ఈ ఇంకిన చెరువు లో ఒకప్పుడు కమల లుండేవి. )


    రిప్లయితొలగించండి
  9. ఉ:"ఇంకెను చె" ర్వటంచు వదలించుక పూడిక తీత గూడ, యా
    వంకన నాక్రమించుచు భవంతుల గట్టకు డయ్య!సేమమే
    యింకగ చెర్వు? లెట్లు లభియించును పంటయు? రక్ష జేయ నీ
    ఇంకిన చెర్వునందుననె యెన్నియొ పద్మములుద్భవించెడిన్.

    రిప్లయితొలగించండి
  10. ఉ॥ లంకల గ్రామముల్ గనఁగ లక్షల లక్షలు చేయి పంటలన్
    బొంకము మీర నిచ్చి చనుఁ బూర్తిగ నీటిని నాఁపి వేయఁగన్
    బంకమె యుండు వేసవిని పారెడు నీరటు తగ్గిపోవఁగా
    నింకిన చెర్వునందుననె యెన్నియొ పద్మములుద్భవించెడిన్

    (గోదావరి లంకల గ్రామాలలో రెండవ పంట తరువాత లాకులు మూసేసి కాలువలు ఎండగట్టేస్తారండి, అప్పుడు నిలచిన నీరు ఆవిరై చాలా వరకు బురద ఉంటుంది. అప్పటి స్థితి ఊహ నేనైతే చూడలేదండి లెక్కలేనన్ని సార్లు చుట్టినా!)

    రిప్లయితొలగించండి