3-10-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“...కోరిన విద్యలకై గురువుం గొట్టంగవలెను...”
(లేదా...)
“...కోరిన విద్యలఁ బొందఁగోరఁగా గురువునుఁ దిట్టి కొట్టవలె...”
(న.చ. సాహిత్ శతావధానంలో కటకం వేంకటరామ శర్మ గారి సమస్య)
అరయగ మల్లు యుద్ధమున నాతని మించిన యోధుడెవ్వడున్ ధరణిని లేడటంచు విని తానును శిక్షణ పొంద వారినే గురువుగ నెంచి చేరితిని కోరిన విద్యలఁ బొందఁగోరఁగా గురువునుఁ దిట్టి కొట్టవలె, కూరిమి తో సహియించు నిష్యుడే
కందంఎరుకలిగ నేకలవ్యుడుగురు బొమ్మ యెదుట గడించె గురితో విద్యన్ధరఁ 'గోరిన విద్యలకైగురువుం గొట్టంగవలయు' కూతలు తగునే? ఉత్పలమాలగురువగు ద్రోణు బొమ్మ మును గూర్చియు ముందర స్వార్జితమ్ముగానెఱుకల యేకలవ్యునకు నింపుగ నా విలువిద్యలబ్బెనేగురికల వాడె నేర్వనగు కోరిన విద్యల బొందఁ గోరగా! 'గురువును దిట్టి కొట్టవలె' కూడని మాటలు కూయఁబోకుమా!
రెండవ పద్యము 'చంపకమాల' గా గమనింప మనవి.
అరయంగ మల్లు యుద్ధము బరినిష్ఠను పొందుటకట ప్రశితుండే య త్తరి కోరిన విద్యలకై గురువుం గొట్టంగవలెను కుశలుండవగన్.అరయగ మల్లు యుద్ధమున నాతని మించిన యోధుడెవ్వడున్ ధరణిని లేడటంచు విని తానును శిక్షణ పొంద వారినే గురువుగ నెంచి చేరితిని కోరిన విద్యలఁ బొందఁగోరఁగా గురువునుఁ దిట్టి కొట్టవలె, కూరిమి తో సహియించు నిష్యుడే
ఓ రాజకీయ పార్టీ వారి కార్యకర్తల శిక్షణకై మంత్రాంగము నెరపు చున్న సందర్భములో.....విరివిగ బూతులును మరియుసరియగు పిడిగుద్దులాట జతపడగా తెంపరి కోరిన విద్యలకై గురువుం గొట్టంగవలెను కుందకమగునా!విరివిగ బూతులన్ మరియు వేరొక రీతిని మల్లయుద్ధమున్సరియగు మార్గమెంచి కడుఁ జక్కగ నేర్పెదనన్నవానిపైకొరకొరలాడనేల నువు కోరిన విద్యలఁ బొందఁగోరఁగా గురువునుఁ దిట్టి కొట్టవలె గుట్టుగ విద్యను నేర్వగావలెన్
పురమందున నుండిన చెడుచరితులను కలిసి మనుగడ నాగుటకై ముందర కోరిన విద్యలకై , గురువుం గొట్టంగవలెను గురుతుకు దేవన్
చం॥ అరయఁగఁ బ్రాఁత కాలమున నందల మెక్కిన వార లొజ్జలే తరుణము మారె గౌరవపు ధ్యాసయు నయ్యెను దారు మారుగన్గురిఁగని నేర్ప కున్న తఱిఁ ”గోరిన విద్యలఁ బొందఁ గోరఁగాగురువునుఁ దిట్టి కొట్టవలెఁ గొందరి వాదమిదే తలంపఁగన్తిట్టి కొట్టవలె ను ఫిగరేటివ్ గా తీసుకోవాలండి(ఇది రెండురకాల జరుగుతున్నదండి కొందరు గురువులు ట్యూషన్ కు వచ్చిన వారికే పాఠం చెబుతారు. కొన్ని చోట్ల శిష్యులు గురువులను సతాయిస్తారు)
తరుణికి విద్యనేర్పగను తద్దయు ప్రీతిని మాటలాడుచున్విరహపు వేదనన్ దెలిపి వీడుకు రమ్మని చెప్పుచుండినన్గురువును దిట్టి కొట్టవలె, కోరిన విద్యలఁ బొందఁ గోరగావరగురుడన్న పేరుగల పండితుఁ జేరి పఠించ మేలగున్
నరుల కొసంగఁ బొగడ్తలు విరివిగ నుప్పొంగరే భువిని స్తోత్రము లీ యర కోరిన విద్యలకై గురువుం గొట్టంగ వలెఁ దగు నుతి శరములన్ కరుణ వహించినన్ గురువు కామిత విద్యలు వొంద వచ్చు నాకరుణను జూప కున్న యెడఁ గల్గునె భాగ్యము విద్య నందఁగా గురువును గౌరవింపఁ దగుఁ గోరిన విద్యలఁ బొందఁ గోరఁ గా గురువునుఁ దిట్టి కొట్ట వలెఁ గుత్సిత బుద్ధి వహింప ద్వేషియై [కా గురువు = దుష్ట గురువు]
రిప్లయితొలగించండిఅరయగ మల్లు యుద్ధమున నాతని మించిన యోధుడెవ్వడున్
ధరణిని లేడటంచు విని తానును శిక్షణ పొంద వారినే
గురువుగ నెంచి చేరితిని కోరిన విద్యలఁ బొందఁగోరఁగా
గురువునుఁ దిట్టి కొట్టవలె, కూరిమి తో సహియించు నిష్యుడే
కందం
రిప్లయితొలగించండిఎరుకలిగ నేకలవ్యుడు
గురు బొమ్మ యెదుట గడించె గురితో విద్యన్
ధరఁ 'గోరిన విద్యలకై
గురువుం గొట్టంగవలయు' కూతలు తగునే?
ఉత్పలమాల
గురువగు ద్రోణు బొమ్మ మును గూర్చియు ముందర స్వార్జితమ్ముగా
నెఱుకల యేకలవ్యునకు నింపుగ నా విలువిద్యలబ్బెనే
గురికల వాడె నేర్వనగు కోరిన విద్యల బొందఁ గోరగా!
'గురువును దిట్టి కొట్టవలె' కూడని మాటలు కూయఁబోకుమా!
రెండవ పద్యము 'చంపకమాల' గా గమనింప మనవి.
తొలగించండి
రిప్లయితొలగించండిఅరయంగ మల్లు యుద్ధము
బరినిష్ఠను పొందుటకట ప్రశితుండే య
త్తరి కోరిన విద్యలకై
గురువుం గొట్టంగవలెను కుశలుండవగన్.
అరయగ మల్లు యుద్ధమున నాతని మించిన యోధుడెవ్వడున్
ధరణిని లేడటంచు విని తానును శిక్షణ పొంద వారినే
గురువుగ నెంచి చేరితిని కోరిన విద్యలఁ బొందఁగోరఁగా
గురువునుఁ దిట్టి కొట్టవలె, కూరిమి తో సహియించు నిష్యుడే
ఓ రాజకీయ పార్టీ వారి కార్యకర్తల శిక్షణకై
రిప్లయితొలగించండిమంత్రాంగము నెరపు చున్న సందర్భములో.....
విరివిగ బూతులును మరియు
సరియగు పిడిగుద్దులాట జతపడగా తెం
పరి కోరిన విద్యలకై
గురువుం గొట్టంగవలెను కుందకమగునా!
విరివిగ బూతులన్ మరియు వేరొక రీతిని మల్లయుద్ధమున్
సరియగు మార్గమెంచి కడుఁ జక్కగ నేర్పెదనన్నవానిపై
కొరకొరలాడనేల నువు కోరిన విద్యలఁ బొందఁగోరఁగా
గురువునుఁ దిట్టి కొట్టవలె గుట్టుగ విద్యను నేర్వగావలెన్
పురమందున నుండిన చెడు
రిప్లయితొలగించండిచరితులను కలిసి మనుగడ నాగుటకై ముం
దర కోరిన విద్యలకై ,
గురువుం గొట్టంగవలెను గురుతుకు దేవన్
చం॥ అరయఁగఁ బ్రాఁత కాలమున నందల మెక్కిన వార లొజ్జలే
రిప్లయితొలగించండితరుణము మారె గౌరవపు ధ్యాసయు నయ్యెను దారు మారుగన్
గురిఁగని నేర్ప కున్న తఱిఁ ”గోరిన విద్యలఁ బొందఁ గోరఁగా
గురువునుఁ దిట్టి కొట్టవలెఁ గొందరి వాదమిదే తలంపఁగన్
తిట్టి కొట్టవలె ను ఫిగరేటివ్ గా తీసుకోవాలండి
(ఇది రెండురకాల జరుగుతున్నదండి కొందరు గురువులు ట్యూషన్ కు వచ్చిన వారికే పాఠం చెబుతారు. కొన్ని చోట్ల శిష్యులు గురువులను సతాయిస్తారు)
తరుణికి విద్యనేర్పగను తద్దయు ప్రీతిని మాటలాడుచున్
రిప్లయితొలగించండివిరహపు వేదనన్ దెలిపి వీడుకు రమ్మని చెప్పుచుండినన్
గురువును దిట్టి కొట్టవలె, కోరిన విద్యలఁ బొందఁ గోరగా
వరగురుడన్న పేరుగల పండితుఁ జేరి పఠించ మేలగున్
నరుల కొసంగఁ బొగడ్తలు
రిప్లయితొలగించండివిరివిగ నుప్పొంగరే భువిని స్తోత్రము లీ
యర కోరిన విద్యలకై
గురువుం గొట్టంగ వలెఁ దగు నుతి శరములన్
కరుణ వహించినన్ గురువు కామిత విద్యలు వొంద వచ్చు నా
కరుణను జూప కున్న యెడఁ గల్గునె భాగ్యము విద్య నందఁగా
గురువును గౌరవింపఁ దగుఁ గోరిన విద్యలఁ బొందఁ గోరఁ గా
గురువునుఁ దిట్టి కొట్ట వలెఁ గుత్సిత బుద్ధి వహింప ద్వేషియై
[కా గురువు = దుష్ట గురువు]