2, అక్టోబర్ 2026, శుక్రవారం

సమస్య - 5608

3-10-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“...కోరిన విద్యలకై గురువుం గొట్టంగవలెను...”

(లేదా...)

“...కోరిన విద్యలఁ బొందఁగోరఁగా గురువునుఁ దిట్టి కొట్టవలె...”

(న.చ. సాహిత్ శతావధానంలో కటకం వేంకటరామ శర్మ గారి సమస్య)

9 కామెంట్‌లు:


  1. అరయగ మల్లు యుద్ధమున నాతని మించిన యోధుడెవ్వడున్
    ధరణిని లేడటంచు విని తానును శిక్షణ పొంద వారినే
    గురువుగ నెంచి చేరితిని కోరిన విద్యలఁ బొందఁగోరఁగా
    గురువునుఁ దిట్టి కొట్టవలె, కూరిమి తో సహియించు నిష్యుడే

    రిప్లయితొలగించండి
  2. కందం
    ఎరుకలిగ నేకలవ్యుడు
    గురు బొమ్మ యెదుట గడించె గురితో విద్యన్
    ధరఁ 'గోరిన విద్యలకై
    గురువుం గొట్టంగవలయు' కూతలు తగునే?


    ఉత్పలమాల
    గురువగు ద్రోణు బొమ్మ మును గూర్చియు ముందర స్వార్జితమ్ముగా
    నెఱుకల యేకలవ్యునకు నింపుగ నా విలువిద్యలబ్బెనే
    గురికల వాడె నేర్వనగు కోరిన విద్యల బొందఁ గోరగా!
    'గురువును దిట్టి కొట్టవలె' కూడని మాటలు కూయఁబోకుమా!

    రిప్లయితొలగించండి


  3. అరయంగ మల్లు యుద్ధము
    బరినిష్ఠను పొందుటకట ప్రశితుండే య
    త్తరి కోరిన విద్యలకై
    గురువుం గొట్టంగవలెను కుశలుండవగన్.


    అరయగ మల్లు యుద్ధమున నాతని మించిన యోధుడెవ్వడున్
    ధరణిని లేడటంచు విని తానును శిక్షణ పొంద వారినే
    గురువుగ నెంచి చేరితిని కోరిన విద్యలఁ బొందఁగోరఁగా
    గురువునుఁ దిట్టి కొట్టవలె, కూరిమి తో సహియించు నిష్యుడే

    రిప్లయితొలగించండి
  4. ఓ రాజకీయ పార్టీ వారి కార్యకర్తల శిక్షణకై
    మంత్రాంగము నెరపు చున్న సందర్భములో.....

    విరివిగ బూతులును మరియు
    సరియగు పిడిగుద్దులాట జతపడగా తెం
    పరి కోరిన విద్యలకై
    గురువుం గొట్టంగవలెను కుందకమగునా!

    విరివిగ బూతులన్ మరియు వేరొక రీతిని మల్లయుద్ధమున్
    సరియగు మార్గమెంచి కడుఁ జక్కగ నేర్పెదనన్నవానిపై
    కొరకొరలాడనేల నువు కోరిన విద్యలఁ బొందఁగోరఁగా
    గురువునుఁ దిట్టి కొట్టవలె గుట్టుగ విద్యను నేర్వగావలెన్

    రిప్లయితొలగించండి
  5. పురమందున నుండిన చెడు
    చరితులను కలిసి మనుగడ నాగుటకై ముం
    దర కోరిన విద్యలకై ,
    గురువుం గొట్టంగవలెను గురుతుకు దేవన్

    రిప్లయితొలగించండి
  6. చం॥ అరయఁగఁ బ్రాఁత కాలమున నందల మెక్కిన వార లొజ్జలే
    తరుణము మారె గౌరవపు ధ్యాసయు నయ్యెను దారు మారుగన్
    గురిఁగని నేర్ప కున్న తఱిఁ ”గోరిన విద్యలఁ బొందఁ గోరఁగా
    గురువునుఁ దిట్టి కొట్టవలెఁ గొందరి వాదమిదే తలంపఁగన్

    తిట్టి కొట్టవలె ను ఫిగరేటివ్ గా తీసుకోవాలండి

    (ఇది రెండురకాల జరుగుతున్నదండి కొందరు గురువులు ట్యూషన్ కు వచ్చిన వారికే పాఠం చెబుతారు. కొన్ని చోట్ల శిష్యులు గురువులను సతాయిస్తారు)

    రిప్లయితొలగించండి
  7. తరుణికి విద్యనేర్పగను తద్దయు ప్రీతిని మాటలాడుచున్
    విరహపు వేదనన్ దెలిపి వీడుకు రమ్మని చెప్పుచుండినన్
    గురువును దిట్టి కొట్టవలె, కోరిన విద్యలఁ బొందఁ గోరగా
    వరగురుడన్న పేరుగల పండితుఁ జేరి పఠించ మేలగున్

    రిప్లయితొలగించండి
  8. నరుల కొసంగఁ బొగడ్తలు
    విరివిగ నుప్పొంగరే భువిని స్తోత్రము లీ
    యర కోరిన విద్యలకై
    గురువుం గొట్టంగ వలెఁ దగు నుతి శరములన్


    కరుణ వహించినన్ గురువు కామిత విద్యలు వొంద వచ్చు నా
    కరుణను జూప కున్న యెడఁ గల్గునె భాగ్యము విద్య నందఁగా
    గురువును గౌరవింపఁ దగుఁ గోరిన విద్యలఁ బొందఁ గోరఁ గా
    గురువునుఁ దిట్టి కొట్ట వలెఁ గుత్సిత బుద్ధి వహింప ద్వేషియై

    [కా గురువు = దుష్ట గురువు]

    రిప్లయితొలగించండి