13-10-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరులనుఁ గని పాండుసుతుఁడు భయపడె ననిలో”
(లేదా...)
“పరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్”
(న.చ. సాహిత్ శతావధానంలో అయ్యల సోమయాజుల అహల సమస్య)
కందంమురిపెము పంచిన తాతను గురువర్యుని, బంధుమిత్ర కూటమి., యెదుటన్విరసపు దృక్కుల నేడగు పరులనుఁ గని పాండుసుతుఁడు భయపడె ననిలోమత్తేభవిక్రీడితము మురిపెమ్మున్ గనులారఁ జూపి మిగులన్ ముద్దాడు తాతయ్యయేగురువై విలువిద్యనేర్పి పటిమన్ గూర్చంగ నా యొజ్జయే వరుసన్ బంధులు మిత్రులున్ విరసపున్ వాదాల నేడైరనన్బరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్
అరుదగు కలన నరక కాపరులనుఁ గని పాండుసుతుఁడు భయపడె ; ననిలోపరిణామ మేమగు ననుచుపరిపరి విధములుగ నతడు పరితాపించెన్
పిరిమిని చూపిన వారలె యరి వర్గము నందు నుండ నంకము నందున్ బరిమార్చ లేననుచు పా ర్పరులనుఁ గని పాండుసుతుఁడు భయపడె ననిలో.హరి సారథ్యము నందు క్రీడి రథిగా నంకమ్ము కై సాగి తా నరివర్గమ్మును గాంచగా నచట పూజార్హుండ్రె యవ్ పెద్దలె పరివారమ్మున నుండిరంచు కనుచున్ బంతంబు నేవీడి పా ర్పరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్.
శరముల వేగము పెంచెనుపరులనుఁ గని పాండుసుతుఁడు; భయపడె ననిలోకురు పృథ్వీపతి తనకికపరాభవము తప్పదనెడు భావము తోడన్పొరిమార్చన్ గనవచ్చినారు స్వజనుల్ పోరాడు పక్షంబుగన్గురువృద్ధుల్ మరి బంధువర్గమకటా కొట్లాటకే సిద్ధమైపరివేష్టింపగ యుద్ధమన్నఁ దనలో వైరాగ్యమే నెక్కొనన్బరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్
కం:"అరులే వీరలు? నా కున్గురువులు,భ్రాతలును,తాత, కురువృద్ధుల్, నేనరకుట ధర్మమ్మే?" యనిపరులనుఁ గని పాండుసుతుఁడు భయపడె ననిలో
కం॥ గురువులు బంధువులుండగ విరక్తిఁ గనె శత్రుసైన్య విస్తరణమునన్బరులెవరని, తలఁచిరెవరొ ”పరులనుఁ గని పాండు సుతుఁడు భయపడె ననిలో”మ॥ పరులం గాంచక శత్రు సైన్యమున నుత్థానమ్ము నిశ్చేష్టుఁడైపరివారమ్మని చేయఁ జాలనని సంభావించఁ గర్తవ్యమున్గరపెన్ గృష్ణుఁడటుల్ గదా యెవరొ వక్రమ్మెంచి ఘోషించిరే”పరులం గాంచిన పాండునందనుఁడనిన్ భ్రాంతుండునై భీతిలెన్(పరులు ఇతరులు శత్రువులు రెండు అర్థాలలోను వాడినానండి.)ఆఅమ్మాయి చి॥ అహల కందము ఇచ్చినట్టు గుర్తండి.
చం:హరి యత్నించగ సంధి జేయ, పరుష మ్మౌ రీతి వర్తించి నాడరులై నిల్చిన భ్రాతలన్, గురుని, భీష్మాచార్యునిన్ గాంచి "సంహరణోద్యోగము ధర్మ మె ట్లగు?" నటం చా వీరు లౌ యుద్ధతత్పరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్”
గురువుల్ దాతయు సోదరుల్ కొడుకులున్ ఘోరాంకమున్ నిల్వగా కరమౌ క్రోధము, దాల్చి నాయుధములన్, ఖండించ ప్రత్యర్థులన్ దురమున్ జచ్చెడివారిఁ దల్చుచును, నెంతో నెవ్వ, సంగ్రామ తత్పరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్
కురుపతి వీర వరుల కావరమ్ముచే నెట్టి ముప్పు వాటిలె నకటానరులకు నని గోవుల కాపరులనుఁ గని పాండు సుతుఁడు భయపడె ననిలో ధరలో రక్తపుఁ గూటికై తనరు యత్నం బేల నాకంచు సంగర మత్యంతము పాప హేతు వని శంకా తప్త చిత్తుండు పోటరు లుద్యుక్తులు నిల్వఁగా గురుల తోడం దాతలన్ బంధులంబరులం గాంచిన పాండు నందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్
జరిగెన్ కౌరవ పాండవేయులకిలన్సంగ్రామమేపారగానిరు పక్షంబుల బంధుమిత్రులనిలోనింపార నిల్చుండగన్పరగన్ మ్రోలను సవ్యసాచి హితులన్భాత్రాదులన్ గాంచె, చూ"పరులం గాంచిన పాండనందుడనివిభ్రాంతుండునై భీతిలెన్.
గురువుల్ బంధుజనమ్ము మిత్రులను సంకోచమ్ము లేకుండ సంగరసీమన్ దనవారి సంక్షయమునుం గాంక్షింప తానొల్లకన్పరితాపమ్ము దహింప మానసమునన్ వ్యగ్రమ్ముగా ధర్మతత్పరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్
గురువులు బంధుజనమ్ములదురమున నెదరించ మదిని దుఃఖమ్మడరన్కురు పక్షములోగల తెంపరులనుఁ గని పాండుసుతుఁడు భయపడె ననిలో
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.అరయన్ బంధు జనంబులగురువుల భీష్మ ద్రోణుల నిట కూల్చగ వలెనాపరిమార్చ లేననుచు నేర్పరులనుఁ గని పాండుసుతుడు భయపడె ననిలో.
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్. (సవరణతో.......)అరయన్ బంధు జనంబులగురువులు ద్రోణాదుల నిట కూల్చగ వలెనాపరిమార్చ లేననుచు నేర్పరులనుఁ గని పాండుసుతుడు భయపడె ననిలో.
కందం
రిప్లయితొలగించండిమురిపెము పంచిన తాతను
గురువర్యుని, బంధుమిత్ర కూటమి., యెదుటన్
విరసపు దృక్కుల నేడగు
పరులనుఁ గని పాండుసుతుఁడు భయపడె ననిలో
మత్తేభవిక్రీడితము
మురిపెమ్మున్ గనులారఁ జూపి మిగులన్ ముద్దాడు తాతయ్యయే
గురువై విలువిద్యనేర్పి పటిమన్ గూర్చంగ నా యొజ్జయే
వరుసన్ బంధులు మిత్రులున్ విరసపున్ వాదాల నేడైరనన్
బరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్
అరుదగు కలన నరక కా
రిప్లయితొలగించండిపరులనుఁ గని పాండుసుతుఁడు భయపడె ;
ననిలో
పరిణామ మేమగు ననుచు
పరిపరి విధములుగ నతడు పరితాపించెన్
రిప్లయితొలగించండిపిరిమిని చూపిన వారలె
యరి వర్గము నందు నుండ నంకము నందున్
బరిమార్చ లేననుచు పా
ర్పరులనుఁ గని పాండుసుతుఁడు భయపడె ననిలో.
హరి సారథ్యము నందు క్రీడి రథిగా నంకమ్ము కై సాగి తా
నరివర్గమ్మును గాంచగా నచట పూజార్హుండ్రె యవ్ పెద్దలె
పరివారమ్మున నుండిరంచు కనుచున్ బంతంబు నేవీడి పా
ర్పరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్.
శరముల వేగము పెంచెను
రిప్లయితొలగించండిపరులనుఁ గని పాండుసుతుఁడు; భయపడె ననిలో
కురు పృథ్వీపతి తనకిక
పరాభవము తప్పదనెడు భావము తోడన్
పొరిమార్చన్ గనవచ్చినారు స్వజనుల్ పోరాడు పక్షంబుగన్
గురువృద్ధుల్ మరి బంధువర్గమకటా కొట్లాటకే సిద్ధమై
పరివేష్టింపగ యుద్ధమన్నఁ దనలో వైరాగ్యమే నెక్కొనన్
బరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్
కం:"అరులే వీరలు? నా కున్
రిప్లయితొలగించండిగురువులు,భ్రాతలును,తాత, కురువృద్ధుల్, నే
నరకుట ధర్మమ్మే?" యని
పరులనుఁ గని పాండుసుతుఁడు భయపడె ననిలో
కం॥ గురువులు బంధువులుండగ
రిప్లయితొలగించండివిరక్తిఁ గనె శత్రుసైన్య విస్తరణమునన్
బరులెవరని, తలఁచిరెవరొ
”పరులనుఁ గని పాండు సుతుఁడు భయపడె ననిలో”
మ॥ పరులం గాంచక శత్రు సైన్యమున నుత్థానమ్ము నిశ్చేష్టుఁడై
పరివారమ్మని చేయఁ జాలనని సంభావించఁ గర్తవ్యమున్
గరపెన్ గృష్ణుఁడటుల్ గదా యెవరొ వక్రమ్మెంచి ఘోషించిరే
”పరులం గాంచిన పాండునందనుఁడనిన్ భ్రాంతుండునై భీతిలెన్
(పరులు ఇతరులు శత్రువులు రెండు అర్థాలలోను వాడినానండి.)
ఆఅమ్మాయి చి॥ అహల కందము ఇచ్చినట్టు గుర్తండి.
చం:హరి యత్నించగ సంధి జేయ, పరుష మ్మౌ రీతి వర్తించి నా
రిప్లయితొలగించండిడరులై నిల్చిన భ్రాతలన్, గురుని, భీష్మాచార్యునిన్ గాంచి "సం
హరణోద్యోగము ధర్మ మె ట్లగు?" నటం చా వీరు లౌ యుద్ధత
త్పరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్”
గురువుల్ దాతయు సోదరుల్ కొడుకులున్ ఘోరాంకమున్ నిల్వగా
రిప్లయితొలగించండికరమౌ క్రోధము, దాల్చి నాయుధములన్, ఖండించ ప్రత్యర్థులన్
దురమున్ జచ్చెడివారిఁ దల్చుచును, నెంతో నెవ్వ, సంగ్రామ త
త్పరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్
కురుపతి వీర వరుల కా
రిప్లయితొలగించండివరమ్ముచే నెట్టి ముప్పు వాటిలె నకటా
నరులకు నని గోవుల కా
పరులనుఁ గని పాండు సుతుఁడు భయపడె ననిలో
ధరలో రక్తపుఁ గూటికై తనరు యత్నం బేల నాకంచు సం
గర మత్యంతము పాప హేతు వని శంకా తప్త చిత్తుండు పో
టరు లుద్యుక్తులు నిల్వఁగా గురుల తోడం దాతలన్ బంధులం
బరులం గాంచిన పాండు నందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్
జరిగెన్ కౌరవ పాండవేయులకిలన్
రిప్లయితొలగించండిసంగ్రామమేపారగా
నిరు పక్షంబుల బంధుమిత్రులనిలో
నింపార నిల్చుండగన్
పరగన్ మ్రోలను సవ్యసాచి హితులన్
భాత్రాదులన్ గాంచె, చూ
"పరులం గాంచిన పాండనందుడని
విభ్రాంతుండునై భీతిలెన్.
గురువుల్ బంధుజనమ్ము మిత్రులను సంకోచమ్ము లేకుండ సం
రిప్లయితొలగించండిగరసీమన్ దనవారి సంక్షయమునుం గాంక్షింప తానొల్లకన్
పరితాపమ్ము దహింప మానసమునన్ వ్యగ్రమ్ముగా ధర్మత
త్పరులం గాంచిన పాండునందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్
గురువులు బంధుజనమ్ముల
రిప్లయితొలగించండిదురమున నెదరించ మదిని దుఃఖమ్మడరన్
కురు పక్షములోగల తెం
పరులనుఁ గని పాండుసుతుఁడు భయపడె ననిలో
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అరయన్ బంధు జనంబుల
గురువుల భీష్మ ద్రోణుల నిట కూల్చగ వలెనా
పరిమార్చ లేననుచు నే
ర్పరులనుఁ గని పాండుసుతుడు భయపడె
ననిలో.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
(సవరణతో.......)
అరయన్ బంధు జనంబుల
గురువులు ద్రోణాదుల నిట కూల్చగ వలెనా
పరిమార్చ లేననుచు నే
ర్పరులనుఁ గని పాండుసుతుడు భయపడె
ననిలో.