13, అక్టోబర్ 2026, మంగళవారం

సమస్య - 5619

14-10-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును”

(లేదా...)

“క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా”

(న.చ. సాహిత్ శతావధానంలో ఆరవల్లి శ్రీదేవి గారి సమస్య)

15 కామెంట్‌లు:

  1. నేటి మనుగడ కొరకయి నియమమైన
    పరుల దేశమందలిభాష పైననున్న
    క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును
    సొంత మాట పలుకుటందు , సొబగు గాను

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    సాదిగా నెంచి విలువీడ సవ్యసాచి
    ధర్మబద్ధంపు కోపాన దానవారి
    యున్నతినిడ గీతాసుధ నొలికె! నట్టి
    క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును

    శార్దూలవిక్రీడితము
    సాధుత్వంబున సంధిలో విఫలమై సంగ్రామమున్ జేరియున్
    యోధుండై విలువీడ నర్జునుడు ధర్మోద్ధారణావేశమై
    బోధింపన్ శ్రుతి సూక్త గీత నరుడున్ బోరెంచి గెల్చెన్ విధిన్
    క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా!

    రిప్లయితొలగించండి
  3. నాటి భారత స్వాతంత్ర నదను కైన
    వీర తెలగాణ వాసుల‌ పోరుకైన
    కవులు కదనపు కవనంపు భావు కతకు
    క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును

    రిప్లయితొలగించండి
  4. క్రోధమే కారణమగును రోదనముకు
    వేదనఁ గలిగించదనుచు వాదమేల
    హితము గూర్చునెపుడును జయింపబడినఁ
    గ్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును

    క్రోధాగారము నందు కైక పలుకుల్ కోదండ రాముండకున్
    గ్రోధంబున్ గలిగించకున్నఁ సుతుడే రోసెంగదా తల్లినే
    మేధావుల్ వచియింత్రు గాదె కినుకన్ మేండ్రించి వర్తిల్ల న
    క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా

    రిప్లయితొలగించండి

  5. ఆది మధ్యాంత రహితుని యనవ రతము
    కొలుచు మితభాషి సద్గుణ కోవిదునకు
    వాని సత్య శీలతయేను వదల గొట్టు
    క్రోధమే, మంగళకర వాక్శుద్ధి నిడును.


    క్రోధం బయ్యది కూడ దున్ననిక సంకోచించు వ్యక్తిత్వమే
    బాధల్ పెంచును నేస్తముల్ పెఱులుగా భావించి నిందింపరే
    క్రోధంబున్ విడి సత్య భాషణపు సద్గోష్టుల్ వరిష్టమ్ము ల
    క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా

    రిప్లయితొలగించండి
  6. తే.గీ:" నేనె యౌపాసకుడ" నంచు నీ యహమ్ము
    జూపి చీటికి మాటికి శాప మిడిన
    నీ తపమ్ము ఫలించునే? నిగ్రహింప
    క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును”
    (కొంత మంది కాస్తో కూస్తో ఉపాసన చేసి అక్కణ్నుంచి మేము పెద్ద ఋషులం అనుకొని తమని గౌరవించని వారి పై ఈర్ష్య తో శాపా లిస్తూ ఉంటారు.వాళ్ల శాపాలు, వరాలు రెండూ పని చెయ్యవు. )

    రిప్లయితొలగించండి
  7. ఉ:ఓ ధీమంతుడ!నీ తపమ్ము ఘనమౌ! యోగీశువున్ కాని ,వి
    ద్యాధిక్య మ్మతి గర్వమున్ నిలిపె, నీర్ష్యన్ జేర్చె నీయందు మే
    లౌ ధర్మమ్మొకొ నీదు శాపతతి? యార్యా! జ్ఞానమున్, దగ్గ నీ
    క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా”
    (తగ్గ నీ క్రోధమ్ము, జ్ఞానమున్ మంగళప్రదము అనేది అన్వయం. )


    రిప్లయితొలగించండి
  8. శా॥ క్రోధంబెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాందించుగా
    బోధించంగను దప్పుగా నిటుల సంబోధించుచున్ బిల్లలున్
    బాధల్ వెట్టరె తల్లిదండ్రులను దుర్భాషోక్తులన్ నేర్చి యే
    మేధావుల్ గడు దుష్టలై యిలను గూర్మిన్ ద్రుంచఁగన్ గూర్చిరో

    రిప్లయితొలగించండి
  9. బాధ లొసఁగును బరికింప వ్యర్థ మైనఁ
    గ్రోధము నిరంతరమ్ము నరులకు భృశము
    పన్నుగ సతమ్ము నంచిత ఫల మొసంగు
    క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును


    ఆధారమ్ములు పుష్కలమ్ము లిల సత్యం బెన్న మూలమ్మ యి
    స్సీ ధర్మచ్యుతి కెన్న నాగ్రహము వీక్షింపంగఁ గోపాలకున్
    బాధావ్రాతము కారణం బగును దాపం బిచ్చు నిత్యమ్ము న
    క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిం బ్రసాదించుఁగా

    రిప్లయితొలగించండి
  10. చెరచు చింతన శక్తిని చెరచు బుద్ధి
    కలహములపెర్గుటకు కడు కారణమ్ము
    క్రోధమే, మంగళకర వాక్శుద్ధి నిడును
    శాంతము సర్వదా జనులకు సంతసంబు

    రిప్లయితొలగించండి
  11. “క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా” ఇందులో మంగళ ప్రదము దగ్గర 'ళ ' గురువు అవ్వదని తద్వారా అక్కడ 'జ' రాదేమో అని నా ఆలోచన . మరి పెద్దలు మీరే వెల్లడించాలి

    రిప్లయితొలగించండి
  12. క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా” ఇందులో మంగళ ప్రదము దగ్గర 'ళ ' గురువు అవ్వదని తద్వారా అక్కడ 'జ' గణం రాదేమో అని నా ఆలోచన . మరి పెద్దలు మీరే వెల్లడించాలి

    రిప్లయితొలగించండి
  13. శా . ఆధారం గురుమూర్తి సన్నిధినశిష్యాద్యంతమున్,జ్ఞానమున్,
    సాధింపంగనుపోయినంత,ఘనుడౌ,సాఫల్యతన్,బొందగన్,
    వేధింపెంతయునున్న గాని,గురుడే,వేల్పౌను,జ్ఞానాశ్రతన్
    క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిం బ్రసాదించుఁగా

    రిప్లయితొలగించండి
  14. సాధించన్ భువి విద్యలన్ యువకు లశ్రాతమ్ము సద్భక్తితో
    నౌదార్యమ్ము పఠించుచున్న వర కావ్యమ్ముల్ విధేయాత్ములై
    బోధన్ జేయు గురుండు శిష్యకుడు సద్బుద్ధిన్ మనన్ జూపు నా
    క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    క్రోధమందు విచక్షణ కోలుపోవు
    క్రోధమే పాడుచేయును కూర్మినెపుడు
    నదుపులో నుంచు కొన నరుడట్టి దైన
    క్రోధమే, మంగళకర వాక్శుద్ధి నిడును.

    రిప్లయితొలగించండి