25, అక్టోబర్ 2026, ఆదివారం

సమస్య - 5631

26-10-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తనయుఁడు జనించక మునుపె తాత యయ్యె”

(లేదా...)

“ఇంకన్ బుత్రుఁడె పుట్టలేదు మనుమం డేతెంచెఁ దాతన్ గనన్”

15 కామెంట్‌లు:

  1. తేటగీతి
    నాకు తమ్ములు పదిమంది చేకురంగ,
    పెద్దకూతురికిన్ నేనుఁ బెళ్ళిఁ జేయఁ
    దనయ పుట్టెను,చిన్న సోదరునికింక
    తనయుఁడు జనించక మునుపె తాత యయ్యె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      సంకోచించక పూరణన్ సలుపుదున్ సాధింతు నుత్తీర్ణతన్
      శంకన్ వీడుము నాకుతమ్ములన నెంచన్ వారు రెండైదులున్
      శ్రీంకారీ సుత నాకిడన్ మనుమనిన్, చిన్నోడు తమ్మయ్యకే
      యింకన్ బుత్రుఁడె పుట్టలేదు! మనుమం డేతెంచెఁ దాతన్ గనన్!!

      తొలగించండి
  2. పుత్రునికై చూస్తున్న దంపతులకు

    వెంకమ్మా చినరాజు దంపతులకున్ వెన్వెంటనే పుట్టె నీ
    ఆంకాళ్ళమ్మ, మునెమ్మ, లచ్చి చినవెంకాయమ్మ, సూరమ్మలున్
    కుంకుళ్ళమ్మయు, రాములమ్మ, సిరియున్ కొండమ్మ పిచ్చమ్మయున్
    ఇంకన్ బుత్రుఁడె పుట్టలేదు మనుమం డేతెంచెఁ దాతన్ గనన్

    రిప్లయితొలగించండి
  3. ఏళ్ళు గడిచె పురుష బిడ్డ యెసగ కుండె
    ఆడు బిడ్డ యెదిగినంత యత్త వారి
    సదనముకుపంప నరుదెంచె సంతు తోడ
    తనయుఁడు జనించక మునుపె తాత యయ్యె”

    రిప్లయితొలగించండి

  4. బ్రహ్మచారి భ్రాత సుతుని భార్య కచట
    స్వజుడొకడు బుట్ట మిత్రులు పలికి రిట్లు
    వయసు మీర కుండనె నందివర్ధను డిట
    తనయుఁడు జనించక మునుపె తాత యయ్యె.


    శంకింపన్ పని లేదు శాంతనవుడే సంగ్రామమందున్ గనన్
    ఖాంకుండై చెలగంగ పాండవులు పోకాడంగ సంపత్తి కై
    సంకోచమ్మది యుండబోదన కృపాచార్యుం డిటుల్ పాల్కె నే
    యింకన్ బుత్రుఁడె పుట్టలేదు మనుమం డేతెంచెఁ దాతన్ గనన్.

    రిప్లయితొలగించండి
  5. తనయుఁడు జనించక మునుపె తాత యయ్యె
    ననుచు పల్కెడి వివరమే జనులడుగగ
    తనదు పుత్రికే ప్రసవించె ననుచు తనకు
    తనయు డింకను పుట్ట లేదనుచుఁ దెల్పె

    ఇంకన్ బుత్రుఁడె పుట్టలేదు మనుమం డేతెంచెఁ దాతన్ గనన్
    వెంకన్నా వివరింపమన్న తెలిపెన్ బెండ్లైన నందంతి యా
    పంకేజాక్షికి సంజనించె సుతుఁడే పాల్గారు చెక్కిళ్ళతో
    శంకన్ వీడుము పుట్టలేదు సుతుఁడే సాధ్యంబయెన్ మన్మఁడే

    రిప్లయితొలగించండి
  6. తే.గీ: పుత్రుడే లే డతని కింక బౌత్రు డెచట?
    నతడు దౌహిత్రునిన్ బొంది యయ్యె తాత
    తర్క వైరుధ్య మేముండె దలచ నిచట?
    తనయుఁడు జనించక మునుపె తాత యయ్యె”

    రిప్లయితొలగించండి
  7. శా॥ లంకెన్ జూడఁగ నాదు తండ్రికిలలో రాజిల్లగా నన్నలై
    పొంకమ్మొప్పఁగ వారు సంతుఁ గనుచున్ బోషించఁగా, వారులున్
    చంకన్ బిడ్డలఁ గాంచఁ, దమ్మునకటుల్ సంతానమే లేకయే
    ఇంకన్ బుత్రుఁడె పుట్టలేదు మనుమం డేతెంచెఁ దాతన్ గనన్

    (ఇది మానాన్న గారికి నాకూ వర్తిస్తుందండి. ఇక్కడ మానాన్న గారి విషయం తీసుకున్నాను. మానాన్న పెద్దన్న కుమారుడు మానాన్న కంటె కొన్ని నెలలు పెద్దవారు)

    రిప్లయితొలగించండి
  8. అన్న కూతుకు పుట్టెను చిన్ని బుడుత
    పెరిగి తాత యటంచు ను పిలిచె వాడు
    విన్న వారలు పలికిరి విస్తు పోయి
    తన యుడు జనింపక మును పె తాత య య్యె

    రిప్లయితొలగించండి
  9. శా:వెంకట్రాయని పౌత్రు డెన్నొ గుడులన్ వీక్షించె బుత్రార్థియై
    వెంకన్నన్ గని మ్రొక్కె, దుర్గ గొలిచెన్, వీక్షించె విశ్వేశునే
    యింకన్ బుత్రుఁడె పుట్టలేదు మనుమం డేతెంచెఁ దాతన్ గనన్
    జంకున్ బొందుచు జాతకమ్ము నెరుగన్, సంతాన ప్రాప్త్యర్థి యై.
    (వెంకట్రాయుడి మనుమడికి ఎన్ని దేవుళ్లకి మ్రొక్కినా సంతాన కలగ లేదు.చివరికి జాతకం చూపించుకోటానికి తాత వద్దకి వచ్చాడు. )






    రిప్లయితొలగించండి
  10. అంకమ్మందుచరించి పుత్రకుడు కల్యాణమ్మునై తండ్రి కాన్
    సంకాసమ్మగు ప్రేమజూపు సఖి పంచత్వమ్మునున్ పొంద నా
    శంకన్ తండ్రి ద్వితీయ పత్ని గొన నా సౌందర్య లోలాక్షికి
    న్నిం కన్ బుత్రుఁడె పుట్టలేదు మనుమం డేతెంచెఁ దాతన్ గనన్

    రిప్లయితొలగించండి
  11. అకట యాశ్చర్య మే మున్న దరయ నిందు
    సంభవించుచు నుండు నీ సరణి నవనిఁ
    దా నహో తన కడపటి తమ్మునికినిఁ
    దనయుఁడు జనింపక మునుపె తాత యయ్యె


    జంకే మాత్రము లేని వార లను వాచ్యవ్రాత మిట్లుండునా
    యింకన్ దారయుఁ జూలు లే దనినఁ గొడ్కే సోమలింగంబ యీ
    వంకం గన్పడు చున్నవీ నుడు లహో పైత్యంబు వర్ధిల్లెనే
    యింకం బుత్రుఁడె పుట్ట లేదు మనుమం డేతెంచెఁ దాతం గనన్

    రిప్లయితొలగించండి
  12. ఓంకారేశ్వర నామదేయునకు సమ్మో
    దంబు కర్వాయెడిన్
    లంకంతింటికివారసున్ గనక శ్రీ
    లక్ష్మాంబకున్ వర్సగా
    పొంకమ్మొప్పగ నేడుగురునూ
    బుట్టిండ్రు బిడ్డల్ సుమీ!
    "ఇంకన్ పుత్రుడె పుట్టలేదు , మనమండే
    తెంచె తాతన్ గనన్"

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అన్న కూతుకు పుట్టెను చిన్నవాడు
    తాను పిలువ నన్నయ్యను తాత యనుచు
    పెండ్లి కాని నన్నును పిల్వ పిన్న తాత
    యనుచు నచ్చెరువొందెను వినిన వారు
    తనయుడు జనించక మునుపె తాతయయ్యె.

    రిప్లయితొలగించండి
  14. తేటగీతి:
    బరువు బాధ్యతల్ తలపైన పాదుకొనఁగ
    మిసిమి యవ్వనమందునే ముసలి రూపు
    బడసినంతట లోకులు పలికిరిటులు
    "తనయుఁడు జనించక మునుపె తాత యయ్యె”

    శార్దూలవిక్రీడితము:
    వంకల్బెట్టగనేమి లేవతనిదౌ స్వాస్థ్యమ్ము సంక్షేమమే
    యింకన్ బుత్రుఁడె పుట్టలేదు మనుమం డేతెంచెఁ దాతన్ గనన్
    శంకన్ దీర్చుకొనంగ కారణమెదో సంతాన నైస్వ్యమ్ముకున్
    సంకోచించకు సంతునొందెదవు వత్సాయంచనెన్ దాతయే

    రిప్లయితొలగించండి