26, అక్టోబర్ 2026, సోమవారం

సమస్య - 5632

27-10-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మంటలోనఁ బుట్టె మంచు గనుము”

(లేదా...)

“మంటల్ రేగెడు నగ్నిహోత్రమున నమ్మా మంచు పుట్టెన్ గదా”

21 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    అగ్నిహోత్ర ఫలము నందించు వర్షమ్ము
    హర్షమున జలాశయములు నిండి
    యిలను గురియు మిగుల హేమంతమున మంచు
    మంటలోనఁ బుట్టె మంచు గనుము!


    శార్దూలవిక్రీడితము
    ఇంటింటన్ జరుగంగ హోమములు వర్షించున్ గదా నింగియే
    కుంటల్, పెద్ద జలాశయమ్ములకుఁ జేకూర్చున్ గదా నీరు తో
    డుంటన్ జుట్టును నిండియున్ జలనిధుల్ హోరెత్తు హేమంతమే
    మంటల్ రేగెడు నగ్నిహోత్రమున నమ్మా మంచు పుట్టెన్ గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆటవెలది
      విసరె వేడి మిగుల వేసవి దాటినన్
      దుష్ట యెల్నినో యరిష్టమనఁగ
      నంతలోనఁ బుట్ట నార్నబను తుఫాను
      మంటలోనఁ బుట్టె మంచు గనుము!

      శార్దూలవిక్రీడితము
      మింటన్ వేసవి దాటినన్ దరణి మిర్మిట్లన్ బ్రకాశించెడున్
      దంటన్ దెచ్చెను యెల్నినో ముసరె నుద్ధండంబుగా నెండలున్
      గంటన్ నీరిడె! సాగరంబెగసి యార్నాబన్ విజృంభాణ నా
      మంటల్ రేగెడు నగ్నిహోత్రమున నమ్మా మంచు పుట్టెన్ గదా!

      తొలగించండి
  2. మింటిన్ నిప్పులు గక్కుచున్ తపనుఁడున్మీలించఁగా దీధితుల్
    కంటన్ కాలువగట్టె కర్షకునకున్ కన్నీరుమున్నీరుగా
    నంటెన్ సంతస మంబరమ్ము కనఁగా నంభోదముల్ నింగిలో
    మంటల్ రేగెడు నగ్నిహోత్రమున నమ్మా మంచు పుట్టెన్ గదా

    రిప్లయితొలగించండి
  3. ఉపనిషత్తుదేల్చెనుత్పత్తినివ్విధి
    న్నాత్మనుండిబుట్టెనాకసంబు
    నాకసమునవాయువాపైనననలమున్
    మంటలోనెబుట్టెమంచుగనుము

    ( అగ్నేరాపః)
    (ఆట వెలది సమస్యా పాదము తేటగీతిలో)

    తే.గీ.
    మానవత్వముగలిసెను *మంటలోన* ;
    *బుట్టెమంచుగనుము* శబ్దములనువినగ
    మాయమాటలు మోసముమానరాయె
    కపటకుటిలనటనలేర కలియుగాన.

    రిప్లయితొలగించండి

  4. ఆ.వె.
    ఇంద్రజాలమందునెన్నెన్నివింతలో
    వానరంబు *మంటలోనబుట్టె* ;
    *మంచుగనుము* పక్షిమాయమైబోనులో
    కర్రవిరిచిజూప కత్తివచ్చె

    రిప్లయితొలగించండి
  5. కుడుపు లేక వాని కుక్షిలో కలిగిన
    మంటలోనఁ బుట్టె ; మంచు గనుము
    వాని మానవతకు వందనమిడనొప్పు
    అనుభవించి నపుడె అరటమరయు

    రిప్లయితొలగించండి

  6. వనము నందు సీత వాయు సఖిని వేడ
    కరుణ జూప, నచట గాలి చూలి
    వాలమున కసురులు వహ్ని బెట్టిన వేళ
    మంటలోనఁ బుట్టె మంచు గనుము.


    కంటిన్ మాతరొ నీ మహత్మ్యము నటన్, గాంతాళ మున్ జ్వాలి నే
    యంటింపన్ దనుజాధముల్ తిథమదే నవ్వేళలో నీవిటన్
    బంటున్ బ్రోవుమటంచు వేడగనె యా బర్హిస్సు శాంతించెనే
    మంటల్ రేగెడు నగ్నిహోత్రమున నమ్మా మంచు పుట్టెన్ గదా.

    రిప్లయితొలగించండి
  7. పోరు సంభవించె పొరుగు దేశమ్ము తో
    భగ్గు మనుచు మండె బాంబులచట
    మంట లోన బుట్టె మంచు గనుము నాడు
    పెద్ద వాన గురిసి వేడి తగ్గ

    రిప్లయితొలగించండి
  8. ద్రోణుని గెలుపొంది తునుమాడు సుతునికై
    ద్రుపదుడాచరించె శ్రువము కడకు
    వడువు సంభవించి యెడద చల్లబడగ
    మంటలోనఁ బుట్టె మంచు గనుము

    మంటల్ రేగిన గుండెతో ద్రుపదుడే మండించె హోమాగ్ని వె
    న్వెంటన్ బుట్టెను పుత్రుడా హవమునన్ వీరాధి వీరుండుగా
    మంటల్ రేగిన గుండె చల్లబడ సంప్రాప్తించె పాంచాలియే
    మంటల్ రేగెడు నగ్నిహోత్రమున నమ్మా! మంచు పుట్టెన్ గదా!

    రిప్లయితొలగించండి
  9. అగ్నిగుండమాయె నవని యంతయు భాను
    తేజ ముప్పతిల్ల తీక్షణముగ
    గగనమందు మొయిలు కమ్మి వాన గురియ
    మంటలోనఁ బుట్టె మంచు గనుము

    రిప్లయితొలగించండి
  10. శా॥ మింటన్ జేరుచు ధూమమా విధిని నున్మీలించుచున్ వ్యాప్తియై
    పంటల్ వోలెనె తేమనంతటిని నాస్వాదించి చేకూర్చఁగన్
    మింటన్ మేఘము లట్లు మంచుఁగనుఁ బెమ్మిన్ దెల్ప నీరీతిగా
    మంటల్ రేగెడు నగ్నిహోత్రమున నమ్మా మంచు పుట్టెన్ గదా

    ఉన్మీలించు విప్పారు పెమ్మి ప్రసిద్ధి

    (ఇది కొందరి యజ్ఞము వలన వర్షాలు వస్తాయని శాస్త్ర బద్ధమైన వాదన అండి. కానీ దీనికి absolute proof లేదండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూలము మనుస్మృతి. నా మను ధర్మ శాస్త్రము నుండి.

      అనలము నందు వేల్చినది హవ్యము సూర్యునిఁ జేరుఁ జక్కఁగా,
      దినకరుఁ డిచ్చు వర్షమును, దిండికిఁ గారణ మౌను వృష్టి, భో
      జన మిడు పోషణమ్మును బ్రజా నిచయమ్మున కెల్ల నింపుగా
      ననయము నవ్విధమ్మున గృహస్థుఁడు నిత్యము పూజనీయుఁడే మను. 2. 63.

      తొలగించండి
  11. ఇంటన్నుండెడి యత్తమామల సదాయిక్కట్ల పాల్జేయుచున్
    అంటన్ గట్టి యసత్యముల్ బ్రతుకులో నాటంకముల్ గూర్చుచున్
    తంటాలన్ గొనితెచ్చు గేహినికి చైతన్యమ్ము గల్గించగా
    మంటల్ రేగెడు నగ్నిహోత్రమున నమ్మా! మంచు పుట్టెన్ గదా

    రిప్లయితొలగించండి
  12. ఆ.వె:మంచుగడ్డలకును మంచి రుచుల జేర్చి
    యమ్ము నతడు ప్రకట నమ్ము జేసె
    నిటుల " నెండ మంట లేమి చేయ గలవు
    మంటలోనఁ బుట్టె మంచు గనుము!
    (ఐస్ క్రీం అమ్ముకొనే వాడు ఇలా చెప్పి ఐస్ క్రీం అమ్ముతున్నాడు. )

    రిప్లయితొలగించండి
  13. శా:పంటై బిడ్డ జనించె, "హైమవతి" యన్ భక్త్యుక్త నామమ్ము నా
    యింటన్ బెట్టిరి, విప్రు డిట్లనె "వరమ్మే గాని త్రేతాగ్నులే
    యింటిన్ బూనెను పేరు గా నిచట జన్మించెన్ హిమం బెట్టులో
    మంటల్ రేగెడు నగ్నిహోత్రమున నమ్మా మంచు పుట్టెన్ గదా”

    (ఆ ఇంటి పేరు త్రేతాగ్నుల వారు. ఆ ఇంట్లో పుట్టిన బిడ్డకి హైమవతి అనే పేరు పెడితే"అగ్నిలో మంచు పుట్టిందే అని నామకరణం వ్రాసిన బ్రాహ్మణుడు హాస్య మాడాడు. బ్రాహ్మణులలో త్రేతాగ్నుల అనే ఇంటి పేరు ఉన్నది.)







    రిప్లయితొలగించండి
  14. మింటన్ మేఘములంతరించ భువిపై మేలైన వానేదగా
    పంటల్ పండక పాదపమ్ము లురలన్ బాధల్ కడున్ హెచ్చగా
    కంటన్ నీరము కార్చుచున్ మనగ సత్కార్షుండు, పెన్ వృష్టి తో
    మంటల్ రేగెడు నగ్నిహోత్రమున నమ్మా! మంచు పుట్టెన్ గదా

    రిప్లయితొలగించండి
  15. వేసవి సమయమ్ము విస్తరించిన నేమి
    చింత నంద వలదు సుంత యేని
    సౌధ మందు నుండఁ జలియంత్రము సుఖమె
    మంట, లోనఁ బుట్టె మంచు గనుము

    [మంట = మనుట]


    మింటన్ సూర్యుఁడు సంచరించుచును భస్మీభూత గోళమ్ము కాఁ
    బంటల్ వెల్గెడు భూమిఁ జేయు తఱినిన్ వర్షమ్ము కుర్యంగ వె
    న్వెంటం జల్లఁ దనమ్ము క్రమ్ముకొనియెం బృథ్వీ తలంబం దహో
    మంటల్ రేఁగెడు నగ్ని హోత్రమున నమ్మా మంచు పుట్టెం గదా

    రిప్లయితొలగించండి

  16. అధిక వేడి చేత నల్లుడు ప్రజలకు
    మేలు సేయవచ్చి మేదిపైకి
    మేటి సైకలోను ఢీకొట్టె మంటను
    మంటలోనఁ బుట్టె మంచు గనుము

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఎండిపోయె పంట లెక్కువై యెండలు
    కారు మబ్బు లంత క్రమ్ముకొనగ
    ౘల్లగాలి వీచి జల్లులు కురియగ
    మంటలోనఁ బుట్టె మంచు గనుము!

    రిప్లయితొలగించండి