5, నవంబర్ 2026, గురువారం

సమస్య - 5642

6-11-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పులికి నచ్చెరువుగఁ బుట్టెఁ బిల్లి”

(లేదా...)

“పులికిం బిల్లి యొకండు మ్యావుమనుచుం బుట్టెం గదా వింతగన్”

18 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఆటవెలది
      ఆట లాడు వేళ ననపోతు హేళనన్
      జేసె బాలచంద్రుఁ జెలగి యిటుల
      "పోరునుండ తండ్రి బొంగరాలేలరా?
      పులికి నచ్చెరువుగఁ బుట్టెఁ బిల్లి!"

      మత్తేభవిక్రీడితము
      కలఁచంగా ననపోతు నాడుచును నిక్కంగన్ విరోధమ్మున్
      కలహంబెంచుచు బాలచంద్రు మిగులన్ గర్హించి కొండాడెనే,
      "చెలగన్ జూతువె బొంగరాల! పితయే జృంభించ యుద్ధమ్మునన్
      పులికిం బిల్లి యొకండు మ్యావుమనుచుం బుట్టెం గదా వింతగన్!"

      తొలగించండి
  2. విమతులు భయపడెడు విరటుని కొడుకుగ
    భీమరమున నరికి బీతుగొనెడి
    యుత్తరుడు సుతునిగ నుద్భవించుటగస
    పులికి నచ్చెరువుగఁ బుట్టెఁ బిల్లి

    రిప్లయితొలగించండి
  3. పులికి న చ్చె రు వుగ బుట్టె బిల్లి
    యనెడు రీ తి జరిగె నవని వింత
    విద్య యందు మేటి విద్వాo సునకు శుంఠ
    బుట్టె ననుచు న వ్వె పుడమి యపుడు

    రిప్లయితొలగించండి
  4. కండ బలము చేత దండి బర్వుల్మోసి
    పేరు పొందె తండ్రి యూరిలోన
    పాప మతని కొడుకు బలహీనుడుగనుండె
    పులికి నచ్చెరువుగ బుట్టె బిల్లి.

    రిప్లయితొలగించండి

  5. హాస్యము కొర కంచు నాండ్రైడు ఫోనును
    చూచు చున్న వేళ చుంచుకుఱ్ఱ
    వింత దృశ్య మొకటి వీక్షించె నివ్విధి
    పులికి నచ్చెరువుగఁ బుట్టెఁ బిల్లి.


    చెలికాడొక్కడు చెంత జేరి కథనే చెప్పంగ నాలించి యా
    పలుచిత్రమ్ముల మేటి దర్శకుడు సంపాదింపగా కీర్తినే
    మలిచెన్ జిత్రము గాను నందు గనగన్ మంత్రజ్ఞునిన్ బాకలో
    పులికిం బిల్లి యొకండు మ్యావుమనుచుం బుట్టెం గదా వింతగన్.

    రిప్లయితొలగించండి
  6. (ఎంతకూ నిద్రపోని కొడుకును నిద్రపుచ్చడానికి తండ్రి భయంకరమైన కథలు చెబుతున్నాడని భావము)

    తలలేనట్టిగజంబులీదెచెరువుల్ దయ్యాలుభూతాలగో
    *పులికింబిల్లియొకండు మ్యావుమనుచుంబుట్టెంగదావింతగన్*
    తలువంజాలని భీతిగొల్పుకథలన్ తథ్యంబుగాపిల్లవా
    నిలనిద్రింపగజేయతండ్రిబలికెన్ నిశ్చేష్టుడైదీనుడై

    రిప్లయితొలగించండి
  7. ఆ.వె: పిల్లి నొకటి నేను పెంచితి ముద్దుగా
    పెద్ద దయ్యు నదియె పిల్లను గనె
    పులికి పిల్లి జాతి మూలమౌ, పోలుచున్
    పులికి నచ్చెరువుగఁ బుట్టెఁ బిల్లి”
    (పులి పోలిక తో పిల్లి పుట్టింది. )




    రిప్లయితొలగించండి
  8. సంగరమున నాకు సరియెవ్వరును లేరు
    నాకు నేనె సాటి లోకమందు
    పులిని నేను బాహుబలిని నేనని బల్కు
    పులికి నచ్చెరువుగఁ బుట్టెఁ బిల్లి

    రిప్లయితొలగించండి
  9. బలశాలిన్ రణరంగ ధీరుఁడ ననున్ భంజించ లేరెవ్వరున్
    పులితోనైన నిరాయుధుండనయినే పోరాటమున్ సల్పెదన్
    కలరే నన్నెదిరించువారని యహంకారమ్ముగా బల్కునా
    పులికిం బిల్లి యొకండు మ్యావుమనుచుం బుట్టెం గదా వింతగన్

    రిప్లయితొలగించండి
  10. పులివలె చెలరేగు భువనేశ్వరుండైన
    విరట భూభుజునకు విగ్రహమున
    పారిపోవునట్టి వడువును చూడగా
    పులికి నచ్చెరువుగఁ బుట్టెఁ బిల్లి

    పులితానై రణరంగ మందు చెలఁగే భూభుక్కుకే పుట్టినన్
    కలిలో శత్రులఁ గాంచి పర్వు లిడెగా గాంభీర్యమే వీడుచున్
    విలువేమున్నది యుత్తరాకొమరునిన్ వీక్షించుచున్ బోల్చిరే
    పులికిం బిల్లి యొకండు మ్యావుమనుచుం బుట్టెం గదా వింతగన్

    రిప్లయితొలగించండి
  11. (2)మ:పులి పద్మావతి భర్త పిల్లి హరి,యా పుణ్యాత్ముకున్ బుట్టె దు
    ర్బలుడౌ పుత్రుడు, మేన మామ కని యా బాలున్ జమత్కారి యై
    పలికెన్ నవ్వుచు నిట్లు చింత నెడబాపన్ బావనే చూచుచున్
    "పులికిం బిల్లి యొకండు మ్యావుమనుచుం బుట్టెం గదా వింతగన్”

    (భార్య పేరు పులి పద్మావతి.భర్త పేరు పిల్లి హరి.పిల్లవాడి ఇంటి పేరు పిల్లే అవుతుంది కదా! ఆ పిల్ల వాడు కాస్త బలహీనం గా ఉంటే ఆ చింతని పోగొట్టటానికి మేన మామ సరస మాడాడు. )

    రిప్లయితొలగించండి
  12. ఆ॥ శాస్త్ర విద్య యందు సాగరమంత ప్రతిభఁ
    గాంచి కీర్తి వడసి కదలు కతన
    సుతుఁడు చక్కఁ బడని సులువునఁ బలుకరో
    పులికి నచ్చెరువుగఁ బుట్టెఁ బిల్లి

    (ఆటవెలది మత్తేభము భావముతో)

    రిప్లయితొలగించండి
  13. మ॥ వెలిఁగెన్ రాజుగ శాస్త్ర శోధనలలో విశ్వంబుఁ గీర్తించఁగన్
    దలఁచెన్ బుత్రుఁడు శాస్త్ర శోధనల నుద్భాసిల్లఁగన్ మేటియై
    తలఁపుల్ పండక క్రుంగి పోయెనయ ప్రస్తావించగా నెల్లరున్
    బులికిం బిల్లి యొకండు మ్యావుమనుచుం బుట్టెం గదా వింతగన్

    (ఇది కూడ యదార్థమేనండి. వివరించడం భావ్యం కాదండి. అదృష్టం కొందరికే పరిమితం Neils Bohr అతని కుమారుడు Aage Bohr, Marie Curie family (వీరు భయంకరమైన ముల్యం కూడ చెల్లించారు) ఇలాగ కొందరే ఉన్నారండి)

    రిప్లయితొలగించండి
  14. ఏ నిమిషము నందు నేమి జరుగు నేరి
    కెఱుక పుడమి నెన్నఁ డేని చూఁడి
    పిల్లి నన్ను జూచి వేగ లంఘింప మా
    పులికి నచ్చెరువుగఁ బుట్టెఁ బిల్లి

    [మాపు + ఉలికి = మా పులికి]


    పులికిన్ బెబ్బులి యుద్భవించు టిల నామోదమ్ము వీక్షింపఁగా
    బలవంతుం డగు మత్స్య దేశ పతికిన్ బాలుండు భీరుండు నౌ
    బల దర్పుం డగు నుత్తరుండు కలిగెన్ వాక్శూరుఁ డత్యుద్ధతిం
    బులికిం బిల్లి యొకండు మ్యావు మనుచుం బుట్టెం గదా వింతగన్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    బాలుడాడు వేళ బాలచంద్రుని గాంచి
    హేళనగను స్త్రీలు యేల యాట
    లనిరి,నీదు తండ్రి యనిలోన నుండగ
    పులికి నచ్చెరువుగఁ బుట్టెఁ బిల్లి.

    రిప్లయితొలగించండి