13-11-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూతవాక్సౌరభపు తోట బూతుపాట”
(లేదా...)
“సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్”
తేటగీతిమాతృభాషలో పాడిన మధురమనవె? భావమెరుగ కున్నను బూతు పాటయగునె? ప్రతి పదార్థ వివరముల గతులవినుముపూతవాక్సౌరభపు తోట బూతుపాట! చంపకమాలనిరతము నాంగ్లమాధ్యమము నేర్పిన పశ్చిమ గీత మ్రోతలన్గురిసిన వాగుడున్ వినుటె కూరిమి నీకన, మాతృభాషలోమెరిసిన పాట బూతుయని మెచ్చవె? యర్థములెంచి గ్రోలుచోసరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్!
తేటగీతి
రిప్లయితొలగించండిమాతృభాషలో పాడిన మధురమనవె?
భావమెరుగ కున్నను బూతు పాటయగునె?
ప్రతి పదార్థ వివరముల గతులవినుము
పూతవాక్సౌరభపు తోట బూతుపాట!
చంపకమాల
నిరతము నాంగ్లమాధ్యమము నేర్పిన పశ్చిమ గీత మ్రోతలన్
గురిసిన వాగుడున్ వినుటె కూరిమి నీకన, మాతృభాషలో
మెరిసిన పాట బూతుయని మెచ్చవె? యర్థములెంచి గ్రోలుచో
సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్!