క్లిష్టప్రాసతో బాగుగా, ప్రశస్తంగా, అద్భుతంగా పూరణలు చేస్తున్న కవిమిత్రులందరికీ అభినందనలు. బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వర్ధన్నపేట వెళ్తున్నాను. ఈరోజు మీ పూరణ పద్యాలను సమీక్షించలేను. దయచేసి సుహృద్భావ వ్యాఖ్యలతో పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
విరించి.
రిప్లయితొలగించండివిస్మృతి నొంది పలికెనో
యస్మత్ గురుతుల్యులైన యనఘులు వారే
విస్మయమందితి నెచ్చట
భీష్మద్రోణుల సమరము భీముండు గనెన్.
గురువర్యులకు నమస్సులు, నిన్నటి నా పద్యాన్ని పరిశీలించ ప్రార్థన.
రిప్లయితొలగించండిరేయి బవళ్ళలో ను పలు రీతుల కాచెద నంచు వోటుకై
తీయని మాటలన్ బలికి దీటుగ నెగ్గి యదృశ్యమైన యా
నాయకు నెందు గానని జనమ్ముల కళ్ళను గాచినట్టి వౌ
కాయలు కాయలై మిగులు గావు ఫలమ్ము లటన్న సత్యమే !
రేష్మ కు వచ్చి న కలలో
రిప్లయితొలగించండిభీష్మ ద్రోణులు కనబడి భీకరులగుచున్
గ్రీష్మమున నాగ్రహింపగ
భీష్మ ద్రోణుల సమరము భీముo డు గనెన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిభీష్మమునై వెలుగొందెను
భీష్మద్రోణుల సమరమ్ము; భీముండు గనెన్
శుష్మయె గల్గిన వారల
భీష్మ ప్రతినల నన్ని పెనకువనందున్.
భీష్మసువుపుత్రుడంతట
రిప్లయితొలగించండిభీష్మించెన్యుద్ధమందుభీరువువలనన్
భీష్ముడుద్రోణుఁడుకాగా
భీష్మద్రోణులసమరముభీముండుగనెన్
1పా-భీష్మసువు-గంగానది
2వపాదంభీరువు-ఆడది
భీష్మ-భయంకరమైన
భీష్మముగసాగెశిక్షణ
రిప్లయితొలగించండిగ్రీష్మఋతువునందుగూడ.కిటుకులు నేర్పన్
భీష్మద్రోణులుతలపడె:
భీష్మద్రోణుల సమరము భీముండు గనెన్
రిప్లయితొలగించండివిరించి.
సుష్మా చాలిక పిచ్చి మాటలవియే చోద్యంబుగా నున్నవే
కూష్మాండమ్మును జూపి చూతమనకే కొమ్మా నికృష్టమ్మదే
భీష్ముండే గద ద్రోణునిన్ గురువుగా బ్రేమించెగా నెప్పుడా
భీష్మద్రోణులకాహవంబు జరిగెన్ భీమార్జునుల్ గాంచగన్?
సమస్య :
రిప్లయితొలగించండిభీష్మద్రోణుల కాహవంబు జరిగెన్
భీమార్జునుల్ గాంచగన్
( మహారథులైన భీష్మద్రోణుల నేవిధంగా
జయించాలోతెలియక మానసికంగా
తత్తరపడుతున్న ధర్మరాజుకు ఓదార్పుగా తనకు
వచ్చిన స్వప్నాన్ని తెలుపుతున్న సహదేవుడు )
శార్దూలవిక్రీడితము
----------------
యుష్మద్వేగము నాపుడయ్య ! కలలో
హుంకారహంకారులై
గ్రీష్మంబౌ సమయాన నాజి గజముల్
ఘీంకారముల్ సల్ప న
ర్చిష్మంతంబులు బాణపంక్తులవిగో !
రింఛోళులై క్రమ్మగా
భీష్మద్రోణుల కాహవంబు జరిగెన్
భీమార్జునుల్ గాంచగన్ .
( అర్చిష్మంతములు - మంటలతో నిండినవి ;
హంకారులు - ఆత్మాభిమానులు ; గ్రీష్మంబౌ - ఎండగానున్న ; రింఛోళులు - సమూహములు ;
ఆజి- యుద్ధము )
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిభీష్మ ప్రతిజ్ఞల తోడన్
భీష్మముగా కురుదళమున భీకరులౌచున్
శుష్ముని వాడిమి గల్గిన
భీష్మద్రోణుల సమరమ్ము భీముండు గనెన్
ఊష్మము జేసెనొ త్రాగెనొ
రిప్లయితొలగించండిశ్లేష్మము గ్రమ్మెనొకొ బుద్ధిచెడెనో ప్రేతల్
కాష్మోరాల్ బట్టెనొ యే
భీష్మద్రోణుల సమరము భీముండు గనెన్
గ్రీష్మాంతర్గతతాపమైగనలెనగ్రేవాసుడాద్రోణుడున్
రిప్లయితొలగించండిభీష్ముండయ్యెనుధర్మరాజుగనలన్మీరంగయుద్ధంబులో
భస్మంబాయెనుధర్మభీష్మమటనాభాస్వంతుధర్మంబులో
భీష్మద్రోణులకాహవంబుజరిగెన్భీమార్జునుల్గాంచగన్
భీష్మడు, ద్రోణుడును కలిసి
రిప్లయితొలగించండిభీష్ముపు శరములు విసరగ వీరుడు నరడున్
గ్రీష్మంబైపోరె, విజయు,
భీష్మ,ద్రోణుల సమరము భీముండు గనెన్”
గ్రీష్మఋతువు నడిరేతిరి
రిప్లయితొలగించండినూష్మము మిక్కుటముగాగ నొఱకమునొందన్
రష్మి కలత నిదుర ననెను
భీష్మద్రోణుల సమరము భీముండు గనెన్
🙏🏽
రిప్లయితొలగించండిభీష్మీకరించి యిడిరా !
‘భీష్మద్రోణుల సమరము భీముండు గనెన్”
భీష్మపు కైపద ప్రాసలు
గ్రీష్మము వెడలినను దాని క్రియ పోలేదో !
గ్రీష్మాతపమున భీముడు
రిప్లయితొలగించండికూష్మాండకముదరిజేరి కునికెడి ధీర్ఘా
యుష్మంతుడు తనకలలో
భీష్మద్రోణుల సమరము భీముండు గనెన్
శుష్మమ్ముబ్బరమై సగోత్రులచటన్ చూపింప నైపుణ్యమున్
రిప్లయితొలగించండిభీష్మమ్మైన విదారణమ్మున కడున్ భీతిల్ల రారాజు తా
నూష్మమ్ముద్భవమై కనంబడగనా యూర్ధ్వంపు లోకమ్ములే
భీష్మద్రోణుల కాహవంబు జరిగెన్ భీమార్జునుల్ గాంచఁగన్
క్లిష్టప్రాసతో బాగుగా, ప్రశస్తంగా, అద్భుతంగా పూరణలు చేస్తున్న కవిమిత్రులందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండిబంధువుల ఇంట్లో కార్యక్రమానికి వర్ధన్నపేట వెళ్తున్నాను. ఈరోజు మీ పూరణ పద్యాలను సమీక్షించలేను. దయచేసి సుహృద్భావ వ్యాఖ్యలతో పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
బిష్మని మనుమల బలమా
రిప్లయితొలగించండియుష్మంతములోకవంద్య యోదుల జేయన్
విష్మయమందిపరీక్షించగ
భీష్మద్రోణులసమరము భీముండు గనెన్
....తోకల....
గ్రీష్మంబందున నబ్జబాంధవుఁడుతా గేరించి దీక్ష్ణంబుగా
రిప్లయితొలగించండినూష్మంబున్ నలుదిక్కులన్బరచితా నుత్సాహమున్ జూపుచున్
భీష్మించన్ మతిదప్పి బాధితుడనెన్ పెంపారు తాపంబుతో
భీష్మద్రోణుల కాహవంబు జరిగెన్ భీమార్జునుల్ గాంచఁగన్
భీష్ముని మనుమల బలమా
రిప్లయితొలగించండియుష్మంతములోకవంద్య యోదుల జేయన్
విష్మయమందిపరీక్షగ
భీష్మద్రోణులసమరము భీముండు గనెన్
....తోకల....
భీష్మాచార్యుని పాత్ర గొప్పదనుచున్ భీష్మింపనొక్కండటన్
రిప్లయితొలగించండిభీష్ముండేటికి గొప్ప ద్రోణుడె గదా విద్యాకరుండంచునా
భీష్మద్రోణుల పాత్రధారులటులావేశంబునన్ రేగగా
భీష్మద్రోణుల కాహవంబు జరిగెన్ భీమార్జునుల్ గాంచఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభీష్మ ద్రోణులు రణమున
తొలగించండిశుష్మంబగుచు కురుభూమి సోషించిరయా
గ్రీష్మపు ధాటిని గలిగిన
భీష్మ,ద్రోణుల సమరము భీముండు గనెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభీష్మ ద్రోణ దయిత యు
రిప్లయితొలగించండిద్ధేష్ముండు ధనంజయుం డహీ నేష్వాసుం
డూష్మానల నిభ నరుతో
భీష్మ ద్రోణుల సమరము భీముండు గనెన్
శుష్మప్రాభవ సచ్చతుష్టయ మహో శోధింప నిండెం బ్రగా
ఢోష్మం బెల్లెడ విస్ఫులింగములతో యుద్ధావనీ వాటికన్
గ్రీష్మాదిత్య ని భార్జు నాగ్రజుల కాగెం గొంత నిశ్చేష్టులై,
భీష్మద్రోణుల కాహవంబు జరిగెన్, భీమార్జునుల్ గాంచఁగన్
[పద విభజన: గ్రీష్మాదిత్య ని భార్జు నాగ్రజలకు భీష్మ ద్రోణుల కాహవంబు జరిగెన్ , ఆగెం గొంత , నిశ్చేష్టులై భీమార్జునుల్ గాంచఁగన్]
చష్మాలేకయె యిట్లనె
రిప్లయితొలగించండిభీష్మద్రోణుల సమరము భీముండు గనెన్
భీష్మద్రోణుల నెయ్యము
కూష్మాండపు విత్తువోలె గురుతర మగునౌ
భీష్మద్రోణుల కావహంబు జరిగెన్ భీమార్జునుల్ గాంచగన్
రిప్లయితొలగించండిభీష్మద్రోణు లనంగ గౌరవులకున్ బేరాశ యుద్ధంబునన్
చష్మాయుండెడు వీరవర్యులనుచున్,సంతోషమందుండగా
భీష్మద్రోణుల సంగరంబునగునేభీమార్జునుల్ జూడగా
కందం
రిప్లయితొలగించండిశుష్మముగల పాండవులకు
నిష్మము సమకూర కృష్ణుఁడేర్పరచంగన్
భీష్మమునఁ దమ మొన నడుచు
భీష్మద్రోణుల సమరము భీముండు గనెన్
శార్దూలవిక్రీడితము
శుష్మమ్మున్గలుగంగనా శిశిరమన్ శోకాననజ్ఞాతులై
యిష్మమ్మున్ గన పాండవేయులటతా మెంచంగశాంతమ్మునే
భీష్మమ్మంచనగౌరవుల్ సెలఁగ నిర్భీతిన్ దిగన్ సేనతో
భీష్మద్రోణుల కాహవంబు జరిగెన్ భీమార్జునుల్ గాంచఁగన్