30, జులై 2021, శుక్రవారం

సమస్య - 3798

31-7-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శాంతి సతతమ్ము దుర్జన సౌఖ్యదమ్ము”
(లేదా...)
“శాంతి సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్”

61 కామెంట్‌లు:

  1. ధర్మదేవతమౌనిగధరణియందు
    నోరువిప్పకరాజ్యంబునొరులకీయ
    రాజరాజుకుభోగంబురహినిగలిగె
    శాంతసతతమ్ముదుర్జనసౌఖ్యదమ్ము

    రిప్లయితొలగించండి
  2. సమస్య :

    శాంతి సతమ్ము దుష్టజన
    సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్

    ( పండిట్ నెహ్రూ ఇరుదేశాల మేలు కోసం పంచశీల ప్రతిష్ఠిస్తే కావరంతో ఉల్లంఘించాడు చౌ ఎన్ లై . )

    ఉత్పలమాల
    ------------

    అంతము లేని యీర్ష్యలు న
    నంతములైన యపోహలన్నియున్
    జింతలు వంతలున్ దొలగి
    చీనయు భారతి " పంచశీల " నా
    వంతయు మీరకుండ జవ
    హర్ నెలకొల్పగ చీన తల్పడెన్ ;
    శాంతి సతమ్ము దుష్టజన
    సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్ .

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుఖము నీయక నుండుచు సుస్థిరతయె
      చెఱపు జేయుచు పృథ్విని చెలగు నట్టి
      అపకృతు లలజడులతోడి నడరునౌ య
      శాంతి సతతమ్ము దుర్జన సౌఖ్యదమ్ము.

      తొలగించండి
  4. కె.వి.యస్. లక్ష్మి:

    జనుల మేలును కోరక శాంతి లేక
    పాలనము జేయు వారల పరిధి నందు
    ధర్మ మేరీతి పరగును ధాత్రిలో? న
    శాంతి సతతమ్ము దుర్జన సౌఖ్యదమ్ము

    రిప్లయితొలగించండి
  5. తే.గీ.
    అలజడుల మధ్య సుజనుల కభయ మొసగు
    దీనులను గాచు నిలదేవదేవుడొకడె!
    చదువు సంస్కారము గూర్చు సహనశక్తి
    "శాంతి సతతమ్ము దుర్జన సౌఖ్యదమ్ము"

    రిప్లయితొలగించండి
  6. భ్రాంతికి లోనుగాక విడి రాగము ద్వేషము దంభమంత వే
    దాంత విచారణమ్మున స్వతంత్రుడ నంచెరుగంగ లభ్యమౌ
    శాంతి సతమ్ము ; దుష్టజన సౌఖ్యదమౌనని యంద్రు పండితుల్
    దొంతులు దొంతులౌధనము తొయ్యలి నెయ్యము పోరుజోరులున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎంతటి దౌష్ట్యమైనను సహించెడు తత్త్వముపేక్ష
      భావమున్
      సంతత జీవకారుణిక ఛాందసనైజము మౌనివృత్తులన్
      వంతల బెట్టెడిన్ దనుజ వర్గము సైచెడి సజ్జనాళిదౌ
      శాంతి, సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యంద్రు పండితుల్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములాచార్యా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
  7. పొరుగు దేశాలు కవ్వింప పోరు కొఱకు
    యుద్ధ మును వలదని కోరుటుచి త మగునె
    శాంతి సతతమ్ము దుర్జన సౌఖ్య దమ్ము
    దాని గ్రహియించి మసలుట ధర్మ మగును

    రిప్లయితొలగించండి

  8. విరించి.

    (భీముడు కృష్ణునితో పలికిన మాటలు)

    ఇంతిదుకూలముల్ కపిలుడీడ్చిన వేళను తామసమ్ముతో
    పంతము బూని భీకరపు బాసను జేసితి మాధవా! యభి
    క్రాంతియె లేనినాడికను రట్టడులన్ బరిమార్చుటెట్లయో
    శాంతి సతమ్ము దుష్టజన సౌఖ్యద మౌనని యండ్రు పండితుల్.

    రిప్లయితొలగించండి
  9. దౌష్ట్యమును వీడి సద్బుద్ధి దనర మెలగి
    గతమునంతయునొక పీడకలగ నెంచి
    సత్ప్రవర్తన పథమున సాగఁ, గల్గు
    శాంతి సతతమ్ము దుర్జన సౌఖ్యదమ్ము

    రిప్లయితొలగించండి

  10. విరించి.

    సంపరాయమె లేకున్న శపథమెట్లు
    తీరునింకను తెలుపుమో శౌరి నీవు
    దీక్షగా గొని నీవుసాధించినట్టి
    శాంతి సతతమ్ము దుర్జన సౌఖ్యదమ్ము.

    రిప్లయితొలగించండి
  11. సుజనులకు సుఖమిడు మనసున గలిగెడి
    శాంతి , సతతమ్ము దుర్జన సౌఖ్యదమ్ము
    కలుగజేయ పరులపయి కామ క్రోధ
    లోభ మద మాత్స ర్యములు బను గొనగ

    రిప్లయితొలగించండి
  12. అంతములేనిఘోరపశు
    సంతతిరంపపుకోతకోయుచున్
    వింతగుమాంసభక్షణకు
    విస్తరమౌపశుసంతలందునన్
    ఎంతనొబేరమాడుచును
    అంతకునంతనుదుర్జలైరి, గో
    శాంతి సతమ్ముదుష్టజన
    సౌఖ్యదమౌనని యండ్రుపండితుల్
    ....తోకల....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, మూడవ పాదాలలో యతి తప్పింది. 'దుర్జలు' అనడం సాధువు కాదు. సవరించండి.

      తొలగించండి
  13. భ్రాంతిని నించు ద్రోహులగు రాజ్యములున్నవి చీన మయ్యదే!
    శాంతియె ముఖ్యమంచు నిల స్వాగతమిత్తురు పంచశీల సం
    క్రాంతికి, వెన్నుపోటు నిడి క్రాంతిని తెత్తు, రపాత్రదానమౌ
    శాంతి సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్౹౹

    రిప్లయితొలగించండి
  14. రణము జరిగినచో రక్తపు టేరులు
    పారు చుండును గాదె భరణి పైన,

    రణము జరిగినచో రాజ్యము
    లో నార్ధి
    క‌ వ్యవస్థ యంతయు గాడి‌ తప్పు,

    రణము జరిగినచో‌ ప్రజలెల్ల
    భీతితో
    జీవనము గడుపు చిత్ర గతిని,

    రణము జరిగినచో రాజ్యము
    లో స్తీల
    నాధలయ్యి సతము బాధ నొందు,



    రణము వలదని‌ చెప్పిన రాజ రాజు

    వినక కోరె సమరమును, మనము‌లో న

    శాంతి సతతమ్ము‌ దుర్జన‌ సౌఖ్య‌ దమ్ము

    ధర్మజా యని‌ పలికె నంద‌ తనయండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సీసం రెండవ పాదం ఉత్తరార్ధంలో గణభంగం. "...కవ్యవస్థయె యెల్ల గాడి దప్పు.." అనండి. అలాగే "స్త్రీ లనాథలై పొందరె బాధ సతము" అనండి.

      తొలగించండి
  15. శాంతములేక చేకురదుసౌఖ్యమనెన్గద త్యాగరాజు యా
    వంతయు చెంతజేరవిక వంతలు మానవ జీవనమ్మునన్
    క్షాంతివహించి దౌష్ట్యమునుసాంతము వీడి చరించినంతనా
    శాంతిసతమ్ము దుష్టజనసౌఖ్యదమౌనని యండ్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  16. క్రాంతి యొసగును చివరకు శాంతి యెపుడు
    శాంతి సతతమ్ము దుర్జన సౌఖ్యదమ్ము
    దేశ చరితను గాంచిన తెలియవచ్చు
    శాంతి వెనువెంట పెరుగునశాంతి యిలను

    రిప్లయితొలగించండి
  17. సవరణతో

    సుజనులకు సుఖమిడు మనసున గలిగెడి
    శాంతి , సతతమ్ము దుర్జన సౌఖ్యదమ్ము
    కలుగజేయ పరులపయి కామ క్రోధ
    లోభ మద మాత్స ర్యములు కలుగ మనసున

    రిప్లయితొలగించండి
  18. సుంతయు మంచి కార్యములఁ జూచి సహింపగ లేరు పృథ్విపై
    స్వాంతము దుష్టచింతనను సాగుచు నుండగ నెల్లవేళలన్
    పంతముతో శపించుచును ప్రాజ్ఞుల నెంచి, హరించినన్ మన
    స్శాంతి, సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'మనశ్శాంతి' టైపాటు.

      తొలగించండి
  19. శాంతనవుండు బల్కెనిటు శాంతిని గోరెడి ధర్మరాజుతో
    శాంతికి సాటిరావు సరి శాస్త్రము లందలి ధర్మమేగతిన్
    శాంతి వహించు వారల నశక్తులటంచు దలంతు రిమ్మహిన్,
    శాంతి సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్.

    రిప్లయితొలగించండి
  20. వంతల పాలు జేసి గుణవంతుల సంపదనాహరింపగా,
    కాంతల కంట నీరొలుక కానితనంబును జూప దూరమౌ
    శాంతి సతమ్ము; దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్
    శాంతి విహీనమై జగతి సంగర రంగము గాను మారుటే

    రిప్లయితొలగించండి
  21. తేటగీతి
    ఎన్ని ఘోరముల్ జేసిన నెంచకుండ
    వారిపాపమ్ము వారినే వంచునంచు
    వీడ ప్రాజ్ఞుల మౌనమ్ము! గూడు భువి న
    శాంతి, సతతమ్ము దుర్జన సౌఖ్యదమ్ము

    ఉత్పలమాల
    ఎంతటి దుష్కృతంబులకు నెంచినఁ జూచియుఁ జూడనట్టులున్
    జింతను జేయకే ఖలులఁ జిక్కగఁ బట్టుచుఁ గట్టడించరే
    వంతలు దప్పునెట్లు భువిఁ? బ్రాజ్ఞుల మౌనము గూల్చి వేయుచున్
    శాంతి, సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  22. సౌఖ్యమిచ్చును దప్పక సర్వులకును
    శాంతి సతతమ్ము, దుర్జన సౌఖ్యదమ్ము
    పరులు దుఃఖము తోడను బాధపడుట
    దుర్జనసహవాసమ్మున దురిత మబ్బు

    రిప్లయితొలగించండి
  23. శాంతి సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్
    భ్రాంతిని నొంది యట్లుగను బల్కిరి వారలు నమ్మబోకుడీ
    శాంతిని గాకవా రిడు నశాంతిని నట్లుగ బోధజేయుచున్
    శాంతిసతమ్ము శిష్టజన సౌఖ్యమె యిచ్చునుదప్పకుండగన్

    రిప్లయితొలగించండి
  24. కోప మూనకు నిత్యమ్ము క్రూరముగను
    శత్రువై యది పీడించు సంతతమ్ము
    ద్వేష మూనకు నీదు మదిని దహించు
    శాంతి సతతమ్ము దుర్జన! సౌఖ్యదమ్ము


    దాంత యుధిష్ఠి రాజ్ఞ విని తమ్ముఁడు నిల్వక యున్న భీమ దు
    ర్దాంత రుషానలం బపుడు దాయలఁ గాల్పక యున్నె వీర్యవ
    త్స్వాంత సరోరు హాలయ విభాసిత దాంత కృపా సుధా లస
    చ్ఛాంతి సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  25. ఉ:

    శాంతిని గోరి భారతము సంగతమెంచి చరించ చీనితో
    చెంతన చేరి భాయి యని చిత్తమదల్చగ వంచనమ్మునన్
    సుంతయు తాళ లేక మది చోద్య మెఱుంగ గ్రహించి రివ్విధిన్
    శాంతి సతమ్ము దుష్ట జన సౌఖ్యద మౌనని యండ్రు పండితుల్

    భారతము=భారతఖండము
    చీని =చైనా దేశము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  26. ఉత్పలమాల:
    ఇంతుల నాటబొమ్మలుగ యెంచి బజారున తార్చువారినిన్
    జంతుప్రవృత్తి పెంచు మతజాడ్యము నింపు ప్రబుద్ధులందరిన్
    సుంతయు దేశభక్తి పొడసూపని ద్రోహుల మీద జాలితో
    “శాంతి- సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్”
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  27. చింతల పాలు చేయుచును జేటొ
    నరించు కసాయి వానిపై
    పంతముతోడ యెల్లపుడు
    బాధల బెట్టెడు వానిపైన న
    శ్రాంతము ప్రేమ జూపడము
    సజ్జన యేగ్యము కాదు నీకు నీ
    శాంతి సతమ్ము దుష్ట జన సౌ
    ఖ్యదమౌనని యండ్రు పండితుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "తోడ నెల్లపుడు... యోగ్యము.."

      తొలగించండి