1-8-2021 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“గరికపోచతో నేన్గును గట్టవచ్చు”(లేదా...)“పొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్”
తిమ్మి నొనరించు బమ్మిగ తెలివి పరుడు తీయు నిసుకను నూనెను తేఁకువగను గరిక పోచను నేన్గును గట్ట వచ్చుఁ మార్చ లేరయ్య మూర్ఖుని మనము నెవరు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విరించి.తెలివిగలిగిన కుందేలు తెగువచూపిగజరిపువును గెలిచెనను కథను వినినయుక్తి గలిగిన చాలునీ యుర్వి యందు గరక పోచతో నేన్గును గట్టవచ్చు.
ధన్యోస్మి గురువుగారు.
శాస్త్రవిహితంబుగానిదిశబరిసేవభక్తిభావనచాలనెభాసురముగరామువీక్షణతనదయ్యెరమ్యముగనుగరికపోచతోనేన్గునుగట్టవచ్చు
తెలివి గలవాడు తానాజి తెచ్చి యుడుముదాని నెక్కించి కోటను తాను నెక్కికొదమ సింగమై కొండాన కోట గెలిచె,గరికపోచతో నేన్గును గట్టవచ్చు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సింహగఢ్ కోట గోడలెక్కడానికి తానాజీ ఒక ఉడుమును వినియోగించుకొంటాడు. దానికి ఏదో పేరు కూడా పెట్టుకుంటాడు. ఆమధ్య అజయ్ దేవగణ్ చిత్రం 'తానాజీ' చూసాను. అందులో ఈ ఉడుమును చూపించలేదు.
విరించితెలిమెకమౌ మృగాశనము దీప్తమునొక్కశశమ్మదే గదాతలమున దేహగుహ్యమది తప్పదటంచు నెఱంగ నేమిరా తెలివిని చూపి గెల్చెనట ధీమతి, యవ్విధి యుక్తి గల్గినన్ బొలతి నిజంబిదే గరిక పోచయె చాలును గట్ట నేఁనుగున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నెరుంగ నేమిరా
సలలితరాగయుక్తముగ సస్వరగగీతము లాలపించి కానల సువశమ్ముఁ జేసి హరిణమ్మును బట్టిన యట్టు లెంతయోబలయుతుడైన వాని మృదువాక్కుల లొంగగ జేయు నట్టులన్ పొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్.కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సమస్య :పొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుగున్ ( పారిజాతపుష్పాన్ని రుక్మిణి కిచ్చిన శ్రీకృష్ణుని పొల యలుకతో గెలువవచ్చని సత్యకు చెలి చేసే ఉపదేశం )అలికులనీలవేణి ! తని వారగ నాథుని జెప్పుచేతలన్ నిలుపుకొనంగ నెంచితివ !నిండుగ నమ్ముము నాదుయోచనన్ ;అలుకగృహంబు జేరి నగ లన్నియు దీయుము ; మాటలాడకే !పొలతి నిజంబిదే ! గరికపోచయె చాలును ; గట్ట నేనుగున్ .
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కలయగగాలివానయదిగప్పెనుజోరుగపల్లెయందటన్గలగలపారెగంగయునుగావగలేకనుతల్లడిల్లిరేతలముసలమ్మయిచ్చెనుగతానుగగాచెగతోటివారలన్పోలచినిజంబిదేగరికపోచయెచాలునుగట్టనేనుగున్కట్టమంచివారిముసలమ్మమరణముప్రేరణతో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.నా చిన్నప్పుడు కట్టమంచి 'ముసలమ్మ', దువ్వూరి రామిరెడ్డి 'నలజారమ్మ'ల తులనాత్మక పరిశీలన అని ఒక వ్యాసం వ్రాశాను.
ముసలమ్మమరణముయదార్ధగాధగప్రచారములోనున్నది. దువ్వూరివారినవ్యభావములలమేళనముప్రశంసనీయము
ప్రాణికోట్లకుమనసిడుపాటవంబుతనువునదుపునబెట్టునుమనసుయెపుడుకట్టబడినతలపు మదిగలిగెనేనిగరికపోచతో నేన్గును గట్టవచ్చు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మనసు+ఎపుడు' అన్నపుడు యడాగమం రాదు. "మనసు సతము" అనండి.
సూచించిన సవరణతో...ప్రాణికోట్లకుమనసిడుపాటవంబుతనువునదుపునబెట్టునుమనసు సతముకట్టబడినతలపు మదిగలిగెనేనిగరికపోచతో నేన్గును గట్టవచ్చు
క్రొవ్విడి వెంకట రాజారావు;మేకపోతు గాంభీర్యపు వాక్కులె యవి సింహమును భయపెట్టుట చిత్తగించమెలపు కలిగెనేని మనము మెల్లిగానుగరిక పోచతో నేన్గును గట్ట వచ్చు.
తలపుల నిగ్రహించి మది తామరసాక్షుని కర్పితమ్ముగాసలుపుచు నిత్యపూజలను సజ్జనసంగతినుండు విప్రుడేకులుకుల దేవదాసిగని గూలెను మోహపు కూపమందు నోపొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్టనేన్గునున్
ధన్యాస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
కలిగిన రాజ్యసంపదను ఖర్పరు లంతయు దోచివేయగన్వలవల యేడ్వ మాని తెగ పాలసు లందఱి నిగ్గుదేల్చగన్ దలపుచు నోటు వేయదగు ధర్మము నెంచెడి వాని జూచుచున్పొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."వలవల నేడ్వ..." అనండి.
చం:అలకన తిండి మానుకొని నార్యుని రాక నిరీక్ష నేలనోవలపుల రేడు నీవనుచు వన్నెలు చిన్నెల నొల్క బోయుచున్చిలుకను బోలు పల్కులును చిన్నగ నవ్వగ నోర చూపుతో పొలతి ! నిజంబిదే గరిక పోచయె చాలును గట్ట నేనుగున్వై. చంద్రశేఖర్
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. "అలకను" అనండి.
ధన్యవాదములు, సరి చేస్తాను
తలప పిపీలికంబునొక దానినదల్చగ యోచనేలనోపొలతి నిజంబిదే గరికపోచయె చాలును; గట్ట నేనుఁగున్సులభము గాదుగా తరుణి జూడుము గావలె శృంఖలంబులున్బలము గలట్టి మావటియు వానికి తోడుగ నిల్చువారలున్
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పెత్తనము కలదని విర్రవీగ కుండుగమకముగ తన వారిని కలుపుకొనినగరికపోచతో నేన్గును గట్టవచ్చు ,నావిధముగ జనులు జేరి యణచవచ్చు
చంపకమాల:కులసతి తాళిబంధమునఁ గోరి వసించదె నొక్క భర్త తో? చెలిమియె లేకయున్న గృహ సీమను నిల్చునె కోడి కుక్కలున్? సులువుగఁ గట్ట మచ్చికన సూత్రము చాలును సన్నదైన! వో “పొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్”--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఒక'ను వో అనరాదు.
అది సంబోధన...ఓ పొలతి! ధన్యవాదములార్యా 🙏
విలువలులేనిమానసులవేషములెన్ననిచెప్పవచ్చునేసులువుగపట్టితెచ్చిరట యసూయులు దుష్టచతుష్టయాదులేవలువలువిప్పద్రౌపదివి, వాక్కునబిల్చెను శ్రీ హరీహరీవిలువలుమాసిపోయెనని వేదనచెందుతుచేతులెత్తగాపొలతినిజంబిదేగరికపోచయెచాలునుగట్ట నేనుగున్ ....తోకల...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెండవ పాదంలో గణభంగం. సవరించండి. "వేదన చెందుచు" అనండి.
కృతజ్ఞతలు పూజ్యశ్రీ
కలిమికి లొంగలేదనుచు క్రందన మానుము సత్యభామ! దేవలు డిటు దెల్పగోరెనిక వారిజనేత్రుని చేరగోరినన్,బలిమిన బట్టలేమితని పంకజనాభుడు విష్ణువీతడౌపొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్టివేయగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."బలిమిని"
గజము మంచి మావటి యొక్క గరిమకలుసుమచ్చికకువచ్చినయెడల, మైత్రినిలిపిసైగలకులొంగుపసరమౌ , సరిసమమికగరికపోచతో, నేన్గును గట్టవచ్చు
1.నేల గూలిన లక్ష్మణునితో రావణుడు:తేటగీతిఅన్నదమ్ములు మీరలు నైక్యముగనుగూడఁ గూలితి లక్ష్మణా! గుట్టు దెలిసెపూని పేనఁగ బలమైన మోకుయగునుగరికపోచతో, నేన్గును గట్టవచ్చు!2. సీతా, రామరాజుల సంవాదము: చంపకమాలతలపడ లేరు యొక్కరిగ దారుణమెంచెడు తెల్లవారితోఁగలవర మయ్యె మావ! యన కాంతను గాంచుచు రామరాజనెన్గలుగకు మన్యమైక్యముగ క్రమ్మెదఁ! బోచలుఁ పేన మోకగున్బొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్!!🖌️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'మోకు+అగును, లేరు+ఒక్కరిగ' అన్నపుడు యడాగమం రాదు.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలింప మనవి:1.నేల గూలిన లక్ష్మణునితో రావణుడు:తేటగీతిఅన్నదమ్ములు మీరలు నైక్యముగనుగూడఁ గూలితి లక్ష్మణా! గుట్టు దెలిసెపూని పేనఁగ బలమైన మోకగుననగరికపోచతో, నేన్గును గట్టవచ్చు!2. సీతా, రామరాజుల సంవాదము: చంపకమాలతలపడ లేరు నొక్కరిగ దారుణమెంచెడు తెల్లవారితోఁగలవర మయ్యె మావ! యన కాంతను గాంచుచు రామరాజనెన్గలుగకు మన్యమైక్యముగ క్రమ్మెదఁ! బోచలుఁ సేన మోకగున్బొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్!!🖌️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
కలిసియుండిన జనులకు గలుగు సుఖముఐకమత్యమె బలమని యండ్రు బుధులుపట్టియొక త్రాటగట్టగా గట్టిగానుగరికపోచతో నేన్గును గట్టవచ్చు
సులభముయోగమార్గమనసుందరదృశ్యముకన్నులన్బడన్,బలమనియెంచిరావణుడుపావనిసీతనుబాధబెట్టగాస్థలమునచేతబట్టనొకసన్ననిపొచయెమంత్రదండమైపొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్కొరుప్రోలు రాధాకృష్ణ రావు
గరిక పోచతో నేన్గును గట్ట వచ్చుదెలివి తేటలు గల్గుచో దేనినైనజేయ వచ్చును ,మృగరాజు సింహమరయచంపబడెనుగా గుందేలు చర్య వలన
మాలినితో వలలుఁడు:తేటగీతివెంటపడె కీచకుండని కంటనీరె?చెలియ! నర్తనశాలకు 'చిరునగవు' నఁబిలువరమ్మనఁ దావచ్చు పిండిఁజేతు' గరికపోచ' తో నేన్గును గట్టవచ్చు!చంపకమాలకలఁగక కీచకుండు నిను కాముక దృష్టిని జూచెనందువే!చెలియ! సరోరుహాక్షి 'నును సిగ్గు' ను నర్తన శాలఁ జేర్చుమా!వలలుఁడ పిండిఁజేతు నొకవాటున నీచునిఁ, జింతనమ్మునన్బొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్!!
గెలువగ సత్య ప్రేమమును కృష్ణుని మౌనికి దానమిచ్చియున్ సులువుగ బొంద నాతనిని సొమ్ములు, బంగరు చాలనంతటన్ వెలనిడె గాదె రుక్మిణియె వేడుకగా తులసీ దళమ్ముతో!పొలతి! నిజంబిదే గరిక పోచయె చాలును గట్ట నేనుగున్!
గురువర్యులకు నమస్సులు, రెండవ పాదమును "సులువుగ వెన్కకున్ గొనగ సొమ్ములు, బంగరు చాలనంతటన్" గా సవరించడమైనది. -మాచవోలు శ్రీధరరావు
నిలకడ లేని చిత్తమున నిక్కముగా బలు తీర్థ యాత్రలున్బలుమరు తిర్గి వచ్చినను బాపము దూరముగాదు నమ్ముమీసలలిత రామనామమునుసన్మతితో భజియించు మేలగున్పొలతి నిజంబిదే గరిక పోచయె చాలును గట్ట నేనుగున్
మూర్ఖు నొప్పింప శక్యంబె పుడమి లోన వేగ వార్నిధి జలమెల్లఁ ద్రాగ వచ్చుఁ గేళిఁ దారల నెల్ల లెక్కింప వచ్చుగరికపోచతో నేన్గును గట్టవచ్చు జలనిధి సప్త వేష్టిత విశాల ధరాతల సాద్రి వృక్షముల్ వెలసిన నైనఁ దూఁపఁగను విష్ణుని సాధ్యము కాక యున్ననుం దులసి దళమ్ముతో హరినిఁ దూచెనె రుక్మిణి భక్తి మీఱినం బొలఁతి! నిజం బిదే గరిక పోచయె చాలును గట్ట నేనుఁగున్
అలతిగనెంచి యెవ్వరి ననాదరణంబున జూడబోకు వ్యాకులత మిగుల్చు సత్యమిది గూడి పిపీలికముల్ భుజంగమున్కలవరబెట్టునొక్కటయి గాంచగ నొద్దికయున్న చాలునోపొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్
కలుషితమైన దేహమును గావగ మంత్రమువేయ యత్తఱిన్ పొలతి!నిజంబిదేగరికపోచయె చాలును,గట్టనేనుగున్ బలమగు గొల్సుచేత ,నికవంతలు బెట్టక లొంగియుండుగాగలనున సైతమున్ బసిరిగడ్డిని జుల్కనజేయ యొప్పునే
చిలుకను బోలు వాక్కులను చెన్నగు రూపముతోడ మించు నీచెలువము చూడ గానె మదిఁ జేరును మన్మథ బాణముల్ వెసన్నిలువగలేరు నిన్నువిడి నీవగు చూపులు సోక శూరులున్పొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్
తిమ్మి నొనరించు బమ్మిగ తెలివి పరుడు
రిప్లయితొలగించండితీయు నిసుకను నూనెను తేఁకువగను
గరిక పోచను నేన్గును గట్ట వచ్చుఁ
మార్చ లేరయ్య మూర్ఖుని మనము నెవరు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివిరించి.
తెలివిగలిగిన కుందేలు తెగువచూపి
గజరిపువును గెలిచెనను కథను వినిన
యుక్తి గలిగిన చాలునీ యుర్వి యందు
గరక పోచతో నేన్గును గట్టవచ్చు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి గురువుగారు.
తొలగించండిశాస్త్రవిహితంబుగానిదిశబరిసేవ
రిప్లయితొలగించండిభక్తిభావనచాలనెభాసురముగ
రామువీక్షణతనదయ్యెరమ్యముగను
గరికపోచతోనేన్గునుగట్టవచ్చు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితెలివి గలవాడు తానాజి తెచ్చి యుడుము
రిప్లయితొలగించండిదాని నెక్కించి కోటను తాను నెక్కి
కొదమ సింగమై కొండాన కోట గెలిచె,
గరికపోచతో నేన్గును గట్టవచ్చు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసింహగఢ్ కోట గోడలెక్కడానికి తానాజీ ఒక ఉడుమును వినియోగించుకొంటాడు. దానికి ఏదో పేరు కూడా పెట్టుకుంటాడు. ఆమధ్య అజయ్ దేవగణ్ చిత్రం 'తానాజీ' చూసాను. అందులో ఈ ఉడుమును చూపించలేదు.
రిప్లయితొలగించండివిరించి
తెలిమెకమౌ మృగాశనము దీప్తమునొక్కశశమ్మదే గదా
తలమున దేహగుహ్యమది తప్పదటంచు నెఱంగ నేమిరా
తెలివిని చూపి గెల్చెనట ధీమతి, యవ్విధి యుక్తి గల్గినన్
బొలతి నిజంబిదే గరిక పోచయె చాలును గట్ట నేఁనుగున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి గురువుగారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినెరుంగ నేమిరా
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిసలలితరాగయుక్తముగ సస్వరగగీతము లాలపించి కా
నల సువశమ్ముఁ జేసి హరిణమ్మును బట్టిన యట్టు లెంతయో
బలయుతుడైన వాని మృదువాక్కుల లొంగగ జేయు నట్టులన్
పొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిపొలతి నిజంబిదే గరిక
పోచయె చాలును గట్ట నేనుగున్
( పారిజాతపుష్పాన్ని రుక్మిణి కిచ్చిన శ్రీకృష్ణుని పొల యలుకతో గెలువవచ్చని సత్యకు చెలి చేసే ఉపదేశం )
అలికులనీలవేణి ! తని
వారగ నాథుని జెప్పుచేతలన్
నిలుపుకొనంగ నెంచితివ !
నిండుగ నమ్ముము నాదుయోచనన్ ;
అలుకగృహంబు జేరి నగ
లన్నియు దీయుము ; మాటలాడకే !
పొలతి నిజంబిదే ! గరిక
పోచయె చాలును ; గట్ట నేనుగున్ .
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికలయగగాలివానయదిగప్పెనుజోరుగపల్లెయందటన్
రిప్లయితొలగించండిగలగలపారెగంగయునుగావగలేకనుతల్లడిల్లిరే
తలముసలమ్మయిచ్చెనుగతానుగగాచెగతోటివారలన్
పోలచినిజంబిదేగరికపోచయెచాలునుగట్టనేనుగున్
కట్టమంచివారిముసలమ్మమరణముప్రేరణతో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినా చిన్నప్పుడు కట్టమంచి 'ముసలమ్మ', దువ్వూరి రామిరెడ్డి 'నలజారమ్మ'ల తులనాత్మక పరిశీలన అని ఒక వ్యాసం వ్రాశాను.
ముసలమ్మమరణముయదార్ధగాధగప్రచారములోనున్నది. దువ్వూరివారినవ్యభావములలమేళనముప్రశంసనీయము
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రాణికోట్లకుమనసిడుపాటవంబు
తొలగించండితనువునదుపునబెట్టునుమనసుయెపుడు
కట్టబడినతలపు మదిగలిగెనేని
గరికపోచతో నేన్గును గట్టవచ్చు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మనసు+ఎపుడు' అన్నపుడు యడాగమం రాదు. "మనసు సతము" అనండి.
సూచించిన సవరణతో...
తొలగించండిప్రాణికోట్లకుమనసిడుపాటవంబు
తనువునదుపునబెట్టునుమనసు సతము
కట్టబడినతలపు మదిగలిగెనేని
గరికపోచతో నేన్గును గట్టవచ్చు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు;
తొలగించండిమేకపోతు గాంభీర్యపు వాక్కులె యవి
సింహమును భయపెట్టుట చిత్తగించ
మెలపు కలిగెనేని మనము మెల్లిగాను
గరిక పోచతో నేన్గును గట్ట వచ్చు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితలపుల నిగ్రహించి మది తామరసాక్షుని కర్పితమ్ముగా
సలుపుచు నిత్యపూజలను సజ్జనసంగతినుండు విప్రుడే
కులుకుల దేవదాసిగని గూలెను మోహపు కూపమందు నో
పొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్టనేన్గునున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యాస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండికలిగిన రాజ్యసంపదను ఖర్పరు లంతయు దోచివేయగన్
రిప్లయితొలగించండివలవల యేడ్వ మాని తెగ పాలసు లందఱి నిగ్గుదేల్చగన్
దలపుచు నోటు వేయదగు ధర్మము నెంచెడి వాని జూచుచున్
పొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వలవల నేడ్వ..." అనండి.
చం:
రిప్లయితొలగించండిఅలకన తిండి మానుకొని నార్యుని రాక నిరీక్ష నేలనో
వలపుల రేడు నీవనుచు వన్నెలు చిన్నెల నొల్క బోయుచున్
చిలుకను బోలు పల్కులును చిన్నగ నవ్వగ నోర చూపుతో
పొలతి ! నిజంబిదే గరిక పోచయె చాలును గట్ట నేనుగున్
వై. చంద్రశేఖర్
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"అలకను" అనండి.
ధన్యవాదములు, సరి చేస్తాను
తొలగించండితలప పిపీలికంబునొక దానినదల్చగ యోచనేలనో
రిప్లయితొలగించండిపొలతి నిజంబిదే గరికపోచయె చాలును; గట్ట నేనుఁగున్
సులభము గాదుగా తరుణి జూడుము గావలె శృంఖలంబులున్
బలము గలట్టి మావటియు వానికి తోడుగ నిల్చువారలున్
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపెత్తనము కలదని విర్రవీగ కుండు
రిప్లయితొలగించండిగమకముగ తన వారిని కలుపుకొనిన
గరికపోచతో నేన్గును గట్టవచ్చు ,
నావిధముగ జనులు జేరి యణచవచ్చు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల:
రిప్లయితొలగించండికులసతి తాళిబంధమునఁ గోరి వసించదె నొక్క భర్త తో?
చెలిమియె లేకయున్న గృహ సీమను నిల్చునె కోడి కుక్కలున్?
సులువుగఁ గట్ట మచ్చికన సూత్రము చాలును సన్నదైన! వో
“పొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్”
--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఒక'ను వో అనరాదు.
అది సంబోధన...ఓ పొలతి!
తొలగించండిధన్యవాదములార్యా 🙏
విలువలులేనిమానసుల
రిప్లయితొలగించండివేషములెన్ననిచెప్పవచ్చునే
సులువుగపట్టితెచ్చిరట యసూయులు
దుష్టచతుష్టయాదులే
వలువలువిప్పద్రౌపదివి,
వాక్కునబిల్చెను శ్రీ హరీహరీ
విలువలుమాసిపోయెనని
వేదనచెందుతుచేతులెత్తగా
పొలతినిజంబిదేగరిక
పోచయెచాలునుగట్ట నేనుగున్
....తోకల...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. సవరించండి. "వేదన చెందుచు" అనండి.
కృతజ్ఞతలు పూజ్యశ్రీ
తొలగించండికలిమికి లొంగలేదనుచు క్రందన మానుము సత్యభామ! దే
రిప్లయితొలగించండివలు డిటు దెల్పగోరెనిక వారిజనేత్రుని చేరగోరినన్,
బలిమిన బట్టలేమితని పంకజనాభుడు విష్ణువీతడౌ
పొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్టివేయగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"బలిమిని"
గజము మంచి మావటి యొక్క గరిమకలుసు
రిప్లయితొలగించండిమచ్చికకువచ్చినయెడల, మైత్రినిలిపి
సైగలకులొంగుపసరమౌ , సరిసమమిక
గరికపోచతో, నేన్గును గట్టవచ్చు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి1.నేల గూలిన లక్ష్మణునితో రావణుడు:
తొలగించండితేటగీతి
అన్నదమ్ములు మీరలు నైక్యముగను
గూడఁ గూలితి లక్ష్మణా! గుట్టు దెలిసె
పూని పేనఁగ బలమైన మోకుయగును
గరికపోచతో, నేన్గును గట్టవచ్చు!
2. సీతా, రామరాజుల సంవాదము:
చంపకమాల
తలపడ లేరు యొక్కరిగ దారుణమెంచెడు తెల్లవారితోఁ
గలవర మయ్యె మావ! యన కాంతను గాంచుచు రామరాజనెన్
గలుగకు మన్యమైక్యముగ క్రమ్మెదఁ! బోచలుఁ పేన మోకగున్
బొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్!!
🖌️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'మోకు+అగును, లేరు+ఒక్కరిగ' అన్నపుడు యడాగమం రాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలింప మనవి:
తొలగించండి1.నేల గూలిన లక్ష్మణునితో రావణుడు:
తేటగీతి
అన్నదమ్ములు మీరలు నైక్యముగను
గూడఁ గూలితి లక్ష్మణా! గుట్టు దెలిసె
పూని పేనఁగ బలమైన మోకగునన
గరికపోచతో, నేన్గును గట్టవచ్చు!
2. సీతా, రామరాజుల సంవాదము:
చంపకమాల
తలపడ లేరు నొక్కరిగ దారుణమెంచెడు తెల్లవారితోఁ
గలవర మయ్యె మావ! యన కాంతను గాంచుచు రామరాజనెన్
గలుగకు మన్యమైక్యముగ క్రమ్మెదఁ! బోచలుఁ సేన మోకగున్
బొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్!!
🖌️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
కలిసియుండిన జనులకు గలుగు సుఖము
రిప్లయితొలగించండిఐకమత్యమె బలమని యండ్రు బుధులు
పట్టియొక త్రాటగట్టగా గట్టిగాను
గరికపోచతో నేన్గును గట్టవచ్చు
సులభముయోగమార్గమనసుందరదృశ్యముకన్నులన్బడన్,
రిప్లయితొలగించండిబలమనియెంచిరావణుడుపావనిసీతనుబాధబెట్టగా
స్థలమునచేతబట్టనొకసన్ననిపొచయెమంత్రదండమై
పొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
గరిక పోచతో నేన్గును గట్ట వచ్చు
రిప్లయితొలగించండిదెలివి తేటలు గల్గుచో దేనినైన
జేయ వచ్చును ,మృగరాజు సింహమరయ
చంపబడెనుగా గుందేలు చర్య వలన
మాలినితో వలలుఁడు:
రిప్లయితొలగించండితేటగీతి
వెంటపడె కీచకుండని కంటనీరె?
చెలియ! నర్తనశాలకు 'చిరునగవు' నఁ
బిలువరమ్మనఁ దావచ్చు పిండిఁజేతు
' గరికపోచ' తో నేన్గును గట్టవచ్చు!
చంపకమాల
కలఁగక కీచకుండు నిను కాముక దృష్టిని జూచెనందువే!
చెలియ! సరోరుహాక్షి 'నును సిగ్గు' ను నర్తన శాలఁ జేర్చుమా!
వలలుఁడ పిండిఁజేతు నొకవాటున నీచునిఁ, జింతనమ్మునన్
బొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్!!
గెలువగ సత్య ప్రేమమును కృష్ణుని మౌనికి దానమిచ్చియున్
రిప్లయితొలగించండిసులువుగ బొంద నాతనిని సొమ్ములు, బంగరు చాలనంతటన్
వెలనిడె గాదె రుక్మిణియె వేడుకగా తులసీ దళమ్ముతో!
పొలతి! నిజంబిదే గరిక పోచయె చాలును గట్ట నేనుగున్!
గురువర్యులకు నమస్సులు, రెండవ పాదమును "సులువుగ వెన్కకున్ గొనగ సొమ్ములు, బంగరు చాలనంతటన్" గా సవరించడమైనది.
తొలగించండి-మాచవోలు శ్రీధరరావు
నిలకడ లేని చిత్తమున నిక్కము
రిప్లయితొలగించండిగా బలు తీర్థ యాత్రలున్
బలుమరు తిర్గి వచ్చినను బాప
ము దూరముగాదు నమ్ముమీ
సలలిత రామనామమును
సన్మతితో భజియించు మేలగున్
పొలతి నిజంబిదే గరిక పోచయె
చాలును గట్ట నేనుగున్
మూర్ఖు నొప్పింప శక్యంబె పుడమి లోన
రిప్లయితొలగించండివేగ వార్నిధి జలమెల్లఁ ద్రాగ వచ్చుఁ
గేళిఁ దారల నెల్ల లెక్కింప వచ్చు
గరికపోచతో నేన్గును గట్టవచ్చు
జలనిధి సప్త వేష్టిత విశాల ధరాతల సాద్రి వృక్షముల్
వెలసిన నైనఁ దూఁపఁగను విష్ణుని సాధ్యము కాక యున్ననుం
దులసి దళమ్ముతో హరినిఁ దూచెనె రుక్మిణి భక్తి మీఱినం
బొలఁతి! నిజం బిదే గరిక పోచయె చాలును గట్ట నేనుఁగున్
అలతిగనెంచి యెవ్వరి ననాదరణంబున జూడబోకు వ్యా
రిప్లయితొలగించండికులత మిగుల్చు సత్యమిది గూడి పిపీలికముల్ భుజంగమున్
కలవరబెట్టునొక్కటయి గాంచగ నొద్దికయున్న చాలునో
పొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్
కలుషితమైన దేహమును గావగ మంత్రమువేయ యత్తఱిన్
రిప్లయితొలగించండిపొలతి!నిజంబిదేగరికపోచయె చాలును,గట్టనేనుగున్
బలమగు గొల్సుచేత ,నికవంతలు బెట్టక లొంగియుండుగా
గలనున సైతమున్ బసిరిగడ్డిని జుల్కనజేయ యొప్పునే
చిలుకను బోలు వాక్కులను చెన్నగు రూపముతోడ మించు నీ
రిప్లయితొలగించండిచెలువము చూడ గానె మదిఁ జేరును మన్మథ బాణముల్ వెసన్
నిలువగలేరు నిన్నువిడి నీవగు చూపులు సోక శూరులున్
పొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్