10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

సమస్య - 3838

11-9-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పరమతమ్మును దూషించువాఁడె బుధుఁడు"
(లేదా...)
"పరమత దూషణోత్సుకుఁడె వాసి గడించు బుధుండుగన్ సదా"

31 కామెంట్‌లు:

  1. పరమ మూర్ఖుండనబరగు ధరణిలోన
    పరమతమ్మును దూషించువాఁడె; బుధుఁడు
    సర్వ మతములు బోధించు సారమెల్ల
    దెలిసి విజ్ఞాన జలధిలో దేలువాడు

    రిప్లయితొలగించండి
  2. జనులకపమార్గభావంబుజాడఁజెప్పి
    సంఘవిద్రోహశక్తులసానఁబెట్టు
    కుటిలహ్రుదయంబుతోడనుకుందునట్టి
    పరమతమ్మునుదూషించువాడెబుధుడు

    రిప్లయితొలగించండి

  3. కరుడు గట్టిన మతవాది ఖలుడొకండు
    సభను నిర్వహించి పట త్రసనము తోడ
    వచ్చినసభికులనుగాంచి వదిరె నిట్లు
    పరమతమ్మును దూషించువాఁడె బుధుడు.

    రిప్లయితొలగించండి
  4. సమస్య :

    పరమతదూషణోత్సుకుడె
    వాసి గడించు బుధుండుగన్ సదా

    ( దురహంకారంతో కవిపండితులను
    తృణీకరించే డిండిమభట్టును గురించి
    చక్రవర్తి ప్రౌఢదేవరాయలవారికి శ్రీనాథుడు
    విన్నవిస్తున్న సన్నివేశం )

    నరవర ! ఆలకింపగదె
    నాదగు భావము నిర్మలాత్మతన్ ;
    గురుతరబాధ్యతల్ మరచి
    గొప్పల జెప్పుచు డిండిముండదే !
    కరకర పళ్లునూరుచును
    కైతల సూరుల మెచ్చకుండెడిన్ ;
    పరమతదూషణోత్సుకుడె
    వాసి గడించు బుధుండుగన్ సదా .

    ( కైతలు - కవితలు ; సూరులు - విద్వాంసులు పరమతదూషకుడు - ఇతరుల
    అభిప్రాయాలను లెక్కచేయక నిందించేవాడు )

    రిప్లయితొలగించండి

  5. విరివి బ్రచారమున్ సలుపు వేళయె వచ్చెను పల్లెపల్లెలన్
    దిరిగి జనాళినింక మనదిక్కును త్రిప్పుట కోసమై యికన్
    ధరణిని మామతమ్మునకు ధాటియె లేదని కల్లలాడుచున్
    పరమత దూషణోత్సకుఁడె వాసిగడించు బుధుండుగ సదా.

    రిప్లయితొలగించండి
  6. సంకుచితముగ యోచించు ఛాo దసుండు
    పరమఠమ్మును దూషించు వాడె : బుధుడు
    సర్వ మతముల సారంపు సత్య మెరిగి
    సకల జనులను ప్రేమించు సజ్జనుండు

    రిప్లయితొలగించండి
  7. అరసినపారమార్ధికమునాచరణంబునచూపకేమదిన్
    కరమునుకామితార్ధములగావగతాపమునందుబోధకుం
    డరకోఱవిద్యలన్తనదుడాంబికభావముఁజూపగానటన్
    పరమతదూషణోత్సుకుడెవాసిగడించుబుధుండుగన్సదా

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. నేటి పరిస్థితి

      తిరిపెములిచ్చి దీనులను దేవుని బిడ్డలుగాను
      దీర్చుచున్
      విరివిగ మార్పుజేయుచును వేదన దీర్చెడి ప్రార్ధనాదులన్
      కరుణకు మారురూపమని క్రైస్తవ ధర్మము
      బ్రోత్సహించుచున్
      పరమత దూషణోత్సకుడె వాసిగడించు బుధుండుగన్ సదా

      తొలగించండి
  9. తేటగీతి
    నమ్మకమ్మది దైవమై నడచుచుండ
    నన్యు లట్టులె యారీతి ధన్యు లగుట
    చూచి యోర్వక తనతప్పు దాచ నెటుల
    పరమతమ్మును దూషించువాఁడె బుధుఁడు?

    చంపకమాల
    దొరికిన దేదియున్ విడక దూఱుచు నేలెడు పక్షమెంచుచున్
    శిరమున దాల్చెదన్ దమకు చేసిన యట్టి ప్రతిజ్ఞలన్నిటిన్
    వరమొకసారి యిమ్మనగఁ బాలితులెల్లరునమ్మినంత నూ
    పరమత దూషణోత్సుకుఁడె వాసి గడించు బుధుండుగన్ సదా!

    ( ఊపర = వ్యర్థప్రసంగము)

    రిప్లయితొలగించండి
  10. చం:

    అరకొర జ్ఞానమున్ గలిగి యచ్చెఱువొందగ మాటకారిగన్
    తరుణము పాఱజూచు పలు తప్పులనెంచగ నన్య ధర్మమున్
    కిరికిరి బెట్టు చుండగని గేలిడ జ్ఞానము మీరు వాఁనిగన్
    పరమత దూషణోత్సుకుడె వాసి గడించు బుధుండుగన్ సదా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  11. మతము మత్తున పెఱవారి మతము నెపుడు
    దూరు వ్రతమును బూనిన దొడవయొకడు
    పరమ మూర్ఖమ్ముగా దాను పలుకు నిటుల
    పరమతమ్మును దూషించువాఁడె బుధుఁడు

    రిప్లయితొలగించండి
  12. తే.గీ//
    పరమతమ్మును దూషించువాఁడె బుధుఁడు
    కాడు,భువిలోన దుష్టుడై గర్వియౌచు !
    హితుల నేడ్పించి మూర్ఖుడై సతినిబాపి
    నీలకంఠుని ఫణిచేత నీల్గిజచ్చు !!

    రిప్లయితొలగించండి
  13. పరుల మతముల నందలి భావములకు
    మాన్యత నొసగలేని సామాన్యుడెపుడు
    పరమతమ్మును దూషించువాఁడె ; బుధుఁడు
    గాంచు నన్నిటిన నొకటె గమ్యమనుచు

    రిప్లయితొలగించండి
  14. పద్యం బాగుంది. కాని భావం అస్పష్టంగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  15. నిరతము కల్లమాటలను నిర్భయమౌగతిఁ బల్కుమొప్పె తా
    నరయుచునున్నతస్థితిని నన్యుల నిత్యము మోసగించుచున్
    సరగున నమ్మకమ్ముగొని సాధువుగా నవతారమెత్తు నా
    పరమతదూషణోత్సుకుడె వాసి గడించు బుధుండుగన్ సదా

    రిప్లయితొలగించండి
  16. పరిగ ణించబడునిలను బామరుడుగ
    పరమతమ్మును దూషించువాడె,బుధుడు
    నన్నిమతముల యెడలను నాదరంబు
    గలిగి సమభావ మునజూచు కర్మయోగి

    రిప్లయితొలగించండి
  17. నిరతము మూర్ఖువానిగను నీచుడుగా బరికించగానగున్
    పరమతదూషణోత్సకుడె,వాసిగడించు బుధుండుగన్ సదా
    పరులకునెల్లవేళలను బాయని సాయము జేయువాడెసూ
    సరగున బొందు ధాత్రినిక శాంతిని సౌఖ్యమునాయువున్ దగన్

    రిప్లయితొలగించండి
  18. మతము నిత్య మొసఁగ వలె మంచి బుద్ధి
    మానవత్వమ్ముఁ జూపించు మతము మతము
    తన మతమ్మును నమ్మక దర్ప మూని
    పర మతమ్మును దూషించు వాఁడె బుధుఁడు?


    పరమ పదంపుఁ బ్రాప్తికి శుభప్రద మార్గ నిదేశ పాట వా
    క్షర విలసన్మతం బగును సన్నుత యోగ్యము సంతతమ్ము భీ
    కర నృబలి క్రియా నిచయ కల్మష కారక నిష్ప్రభా ప రా
    పర మత దూషణోత్సుకుఁడె వాసి గడించు బుధుండుగన్ సదా

    రిప్లయితొలగించండి
  19. కరమిది సత్య వాక్కుకద కాంచుచు
    నుంటిమి దేశమంతటన్
    దొరకొనుచుండె నిత్యమును
    దూరుచునుండ్రి పరస్పరంబుగా
    పరగ మనంబునందు గడు
    వక్రపు భావనతోడ నిప్పుడున్
    పరమత దూషకోన్నతుడె వాసి
    గడించి బుధుండగున్ సదా

    రిప్లయితొలగించండి
  20. అరయ వితండవాదియతడన్యుల భావము నాకళింపడా
    పరమత దూషణోత్సుకుఁడె; వాసి గడించు బుధుండుగన్ సదా
    పరహితమెంచు ప్రాజ్ఞుఁడవివాదముగా జను సామరస్యమున్
    చిరయశమందునా సహనశీలుని విశ్వజనీన మార్గమే

    రిప్లయితొలగించండి
  21. కొరవడి మానవత్వమిల కొందరిలో మతమౌఢ్య బీజముల్
    తరువులుగా చెలంగి దురితంపు ఫలంబుల గుప్పళింపగా
    నిరతము వారి వర్తనము నీచముగా దిగజారి తల్చెదర్
    పరమత దూషణోత్సుకుఁడె వాసి గడించు బుధుండుగన్ సదా

    రిప్లయితొలగించండి