12-9-2021 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్"(లేదా...)"గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే"
కం//నరమేధము జేయుచు తాకరముల జిక్కంగ వైరి కరుణన్జూ పన్ !మరణమె శరణంబనుకొనగరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: బిరుసగు పాలన తోడను నిరతము జనులను నొగుల్చు నీచ నృపతిపై తిరుగాడి మట్టుబెట్టగ గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.
కరమందుకోనగకన్యయెపురమునగానకయువకుడుభోరుననేడ్చెన్పురహరువారసుడాతఁడుగరళముకఱవయ్యెలేదుఖడ్గంబైనన్
దొరలందరు దోచ, బ్రతుకుదెరువే కరువైన వేళ, తెలగా ణమునన్బరువైన జీవితములకుగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్
మరిమయె శరణంబయ్యె కొమరులకు పట్టని బ్రతుకిది మరణించుటకై మరిమరి యత్నించితినే గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కారుణ్య మరణానికంగీకరింపమని ప్రభుత్వానికి రోగి వేడుకోలు:కందందురితమ్మేమొనరించితొచెర మంచమె! నిశ్చలగతిఁ జిక్కితి రుజతోమరణపు భిక్ష దయ నిడుమ!గరళము గఱవయ్యె! లేదు ఖడ్గంబైనన్! !మత్తేభవిక్రీడితముదురితమ్మేమొనరించితో నెఱుగ నే దుర్మార్గమున్ దొక్కనేచెరమంచమ్ముగ నిశ్చలంపు గతిలో జిక్కంగ రోగిష్టినైచరియింపన్ గన లేననన్ మరణ భిక్షన్ జాలినందింపుమా!గరళమ్మే కఱవయ్యెనే యకట! ఖడ్గంబైన లేదయ్యెనే!!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
కం//శరములధాటికి వెఱచుచుకరముల జిక్కంగ వైరి కరుణన్జూపన్ !మరణమె శరణంబనుకొనగరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
నిరతము శ్రమియించు నరుడు ధరలో నిడుములకు క్రుంగి తాను గుములుచున్ మరణమును గోరు వేళన్ గరళము గురవయ్యె లేదు ఖడ్గంబైనన్
సరిజూడంగనుకానడేహరియునేసాంగంబుసాగిల్లినన్అరిమాయావియనిశ్చయంబుగనునాయాసంబుగల్గించుగాకరిదావిష్ణునిదీనయైపిలచెదాకావంగరమ్మంచునున్గరళమ్మేకరవయ్యెనేయకటఖడ్గంబైనలేదయ్యెనే
బెరకుల్ నిండుసభాంతరమ్మున సతిన్ భీష్మాదులే గాంచగన్ వరవంచున్ దడు పూడదీయ దలపన్ బ్రాణేశులీ యేవురున్ పరకల్ వోలెను నిల్చిరచ్చటకదా వంశీధరా చావగన్ గరళమ్మే కరువయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే.
క్రొవ్విడి వెంకట రాజారావు: స్థిరముగ పాండవులు వనిని మెరయుట రారాజు జూచి మిక్కిలి నీర్ష్యన్ తెరలుచు చావగ ననుకొనె గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."మిక్కిలి యీర్ష్యన్" అనండి.
తరమే యెవ్వరికైన దేశమునసంతాపంబు నీడేర్చగాబరువాయెన్ బ్రతు కీడ్వగా దినదినంబయ్యో ! సదా హెచ్చె డీధరలన్ గాంచి తలంచుచుండిరిటులన్ ధైర్యంబు క్షీణించియున్గరళమ్మే కరువయ్యనే యకటఖడ్గంబైన లేదయ్యనే
అరుదౌ కాంచన కృష్ణసారమును మాయామోహమున్గోరి నాపరుషంబౌ నుడులన్ మరందిని గడున్ బాధించితే దైవమా!కరకౌ రాక్షసరాజు పాలబడి దుఃఖాబ్ధిన్నణంగారితేపరలోకమ్మున కేగజూతుమన సంప్రాప్తించదే మేవడిన్ గరళమ్మే కరవయ్యెనే యకట!ఖడ్గంబైన లేదయ్యనే!
వరిపైరుకు సోకెంగదసరికొత్త పురుంగు దాని జంపెదమన్నన్తిరిగిన బలు నంగళ్ళనుగరళము కరువయ్యె లేదు ఖడ్గంబైనన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పరికించిచూడ నెరిగితిగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్పరకలు కోయుటకైనన్కరివరదా మరి పశువుల గాసంబెటులో[గరళము=గడ్డిమోపు;పరకలు=గడ్డిపోచలు]
కరువాయె నిదుర కనులకుచెరువాయెనుగుండె వలపు ఛిద్రంబాయెన్బరువాయె బ్రతుకు నాకికగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్
క్రొవ్విడి వెంకట రాజారావు: స్థిరమౌ జీవితమొందుచున్ వనమునన్ క్షేమంబుగా దిర్గుచున్ గరిమన్ వెల్గెడి పాండురాజు సుతులన్ గాంచంగ రారాజు తా నెరుసున్ గల్గి శరీరమున్ విడువగా నెడ్దన్ విచారించి నా గరళమ్మే కరువయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే!
అరులకు తాజి క్కి ప్రతాపరుద్రు డకటా!మనసున పరిపరి తలచెన్,మరణమె మేలని, వెదకగగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు! ��
భరతుండేలగ ధారుణీ వలయమున్ భవ్యంబు నూహించుచున్గరుణా మూర్తిగ నిన్ దలంచి మది, యాకణ్వర్షి నన్బంపెనే?కురు రాజ్యంబున ధర్మమీ గతిని సంక్షోభంబునన్ జిక్కగామరణంబే శరణంబుగా దలప సీమంతమ్ముగా నేడిటుల్,గరళమ్మే కఱవయ్యెనే, యకట ఖడ్గంబైన లేదయ్యెనే?
కం//త్వరపడి చంపుట కొరకున్నరహింసను ప్రోత్సహించు నటనోన్మాదుల్ !విరివిగ మందుల నడుగగగరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
5. కం//విరహమును తాళలేకనుసరసము జేయంగ రమణి సఖ్యత లేకన్ !పురుగుల మందును త్రాగెనుగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!
పెరుగుచు నున్న కుటుంబపుబరువునిక వహించలేక ప్రాణమువిడువన్పరిసరమందున సుంతయుగరళము గఱవయ్యె , లేదు ఖడ్గంబైనన్
6. కం//సిరిసంపద గోల్పోవగదరిచేర్చెడివారు లేక ధైర్యమువీడన్ !మరణించుటె మేలనుకొనెగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!
7. కం//పరువే బోయిన పిదపన్బరువగు దేహము వలదని ప్రాయము నందున్ !కరివనమున జొచ్చి వెఱచెగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!
కరుణేజూపవుమాటలాడవెటులోకారుణ్యమేతగ్గెనా!వరమై,రావిటునాదుభక్తిగనుమా!వాంచించి నీరూపమేస్థిరమై నాయెదనిల్పలేనిబతుకేచేధించ శ్రీ రాముడాగరళమ్మేకరవయ్యెనే యకటఖడ్గంబైనలేదయ్యెనే ...తోకల...
సమస్య :గరళమ్మే కరవయ్యెనే యకట ఖ డ్గంబైన లేదయ్యెనే ( భీముని గదాఘాతం వల్ల తొడలు విరిగి ఒక్కడుగా మిగిలి కుమిలిపోతున్న రారాజు దుర్యోధనుడు )మత్తేభవిక్రీడితము ............................అరవన్ వందులు లేరు ! మేల్కొలుపగన్ హా ! లేరు వైతాళికుల్ !కురువృద్ధుల్ గురువృద్ధులున్ వెడలిరే !కొడ్కుల్ సఖుల్ లేరుగా !ధరపై కూలిన నాకు ప్రాణములవే తారాడు పోరాడెడిన్ !గరళమ్మే కరవయ్యెనే ! యకట ! ఖ డ్గంబైన లేదయ్యెనే !!( వందులు - స్తోత్రపాఠకులు ; వైతాళికులు - నిద్ర మేల్కొలిపేవారు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
10. కం//నరమానవు డెదురుబడకపరికించితి నలుదిశలను పర్వపు దినమున్ !వరిగడ్డిని కోసెదమనగరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
11. కం//పరిహాసము జేయవలదుకరివదనుని బ్రోవమనర గంగాధర,శ్రీ !పురమందున కరువు వెలసెగరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
ధన్యుడను గురువర్యా !🙏4. కం//వరకట్నము దేలేదనిమరణించుటె దిక్కనంగ మార్గములేకన్ !నురిబోసుకొనెను, పడతికిగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!
కఱవాయెన్ కనుదోయిలో నిదుర నా కాంతామణిన్ గానకన్చెఱువాయెన్ హృదయాంగణమ్ము చెలియన్ చేరంగ లేనైతినేమరణమ్మే శరణమ్ము నాకిక భువిన్ మందుండ నాకియ్యెడన్గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే
ధన్యుడను గురువర్యా !🙏8. కం//పరకాయవిద్య నేర్చియుపరదేశము కేగునపుడు పర్వత శ్రేణిన్ !మురిపెముతో దేహము విడెగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!
ధన్యుడను గురువర్యా ! 🙏9. కం//వరుసగ గణపతి దెలుపుచుకరుణా ప్రభువై రచించు కలమున జేరన్ !పరవశమొందితి ననుగొనుగరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
తటాకములో దాగిన రారాజు పరిహాసమ్మునుఁ జేయుచున్ బలుక యాపార్థుల్, విచారమ్ముతోతిరుగన్ జాలను భంగపాటుగొని నే తేజమ్ముతోఁ బృథ్విపైమరణమ్మేయిక దిక్కునాకని, మదిం భావించె రారాజుతాన్ గరళమ్మే కఱవయ్యెనే యకట! ఖడ్గంబైన లేదయ్యెనే
(దుర్యోధనుని స్వగతము)అరరే యేలొకొ మామ మాట విని నే యాగంబుకేతెంచితిన్మరపేలొందితినా సభాంగణమునన్ మ్రాలెన్ గదా పాదమేపరువే పోయెనికేల జీవితమయో ప్రాణంబు చాలింపగాగరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే
అరకొర బ్రదుకుల కంటెనువిరమణ నీయంగదలచి వివిధములుంగాన్ మరణపు యత్నము జేయగగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్
గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనేమరణంబెందుల కోరుచుంటివిల నామార్తాండు సేవించుచోనిరతంబీయును నాయువున్ సిరులు పానీయంబులింపారగాగరమున్ మానుమ దుష్టచింతనను నోకామాక్షి!నీవిప్పుడున్
తరుణం బిట నేతెంచెను బురుషర్షభు లార సిద్ధముగ నుందు మనన్ మరణింప వధింప నకట గరళము గఱవయ్యె లేదు ఖడ్గం బైనన్కరి గంధర్వ శతాంగ సద్భట గణోగ్రవ్యూఢ మొక్కమ్మడిం బరివా రార్భక సంచ యోక్ష గణ గో వ్రాతమ్ము భీతిల్లఁగా నరి సందోహము మార్కొనంగ నిట మూయం గొట్టఁగా ధిక్సుభా గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే [ధిక్ +సుభాక్ + అరళము = ధిక్సుభా గరళము ; అరళము = తలుపు]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
12. కం//చిరుబురులాడెడి బావను,"కర పాణ"ను వ్యాధిసోకె కలవొద్దనగన్ !తరుణోపాయము దెలవకగరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
ప్రస్తుత ఆఫ్గనిస్తాన్ పరిస్థితి పై నా ప్రయత్నము: మ:హొరవే మూలమటంచు తాలిబనులున్ హోరెత్త కాబూలుగన్నరమేధమ్ము సహించుచున్ బ్రజలు నానాహింస సైరింపనైబరువై పోయెను జీవితమ్మనుచు భావంబెంచి రీరీతిగన్గరళమ్మే గఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే వై. చంద్రశేఖర్
ధన్యవాదములు
13. కం//జ్వర భారముతో నుండియుకరములు జోడించి మ్రొక్కె గౌరీపతికిన్ !మొరపెట్టుకున్న వినడేగరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!
14. కం//సురనాయక ననుగొనిపోవెఱవుట దెలియదు నిజముగ వేడెద స్వామీ !పురహరుడిని నేజేరెదగరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!
15. కం//వరవర రావను నొక కవిపరితాపము జెందె నాడు పలువురి నడుమన్ !దొరలెల్లరు వేధించగగరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!
16. కం//నరసింహుని జాతరలోకరుకగు కత్తుల కసాయి గర్వము జూపన్ !వరమడిగిన మేకను గనగరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!
పిలువన్ బోవవు నన్ను నీ గృహముకున్ పేర్మిన్ మదిన్ పూడ్చుకున్మరినా వైపుకు రాకపోతివి కదా మాయూరు ఓ! దూరమా?మరువన్ జాలక పోతినే నిను మరిన్మాయమ్మ మీ దొట్టుగాగరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే
విరి తామర బోలు సతినిసరసముగా చేరబోవ సమయమదేమోచిరుచాపను జూపె నతివగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్
కం//
రిప్లయితొలగించండినరమేధము జేయుచు తా
కరముల జిక్కంగ వైరి కరుణన్జూ పన్ !
మరణమె శరణంబనుకొన
గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిబిరుసగు పాలన తోడను
నిరతము జనులను నొగుల్చు నీచ నృపతిపై
తిరుగాడి మట్టుబెట్టగ
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికరమందుకోనగకన్యయె
రిప్లయితొలగించండిపురమునగానకయువకుడుభోరుననేడ్చెన్
పురహరువారసుడాతఁడు
గరళముకఱవయ్యెలేదుఖడ్గంబైనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదొరలందరు దోచ, బ్రతుకు
రిప్లయితొలగించండిదెరువే కరువైన వేళ, తెలగా ణమునన్
బరువైన జీవితములకు
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమరిమయె శరణంబయ్యె కొ
మరులకు పట్టని బ్రతుకిది మరణించుటకై
మరిమరి యత్నించితినే
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికారుణ్య మరణానికంగీకరింపమని ప్రభుత్వానికి రోగి వేడుకోలు:
తొలగించండికందం
దురితమ్మేమొనరించితొ
చెర మంచమె! నిశ్చలగతిఁ జిక్కితి రుజతో
మరణపు భిక్ష దయ నిడుమ!
గరళము గఱవయ్యె! లేదు ఖడ్గంబైనన్! !
మత్తేభవిక్రీడితము
దురితమ్మేమొనరించితో నెఱుగ నే దుర్మార్గమున్ దొక్కనే
చెరమంచమ్ముగ నిశ్చలంపు గతిలో జిక్కంగ రోగిష్టినై
చరియింపన్ గన లేననన్ మరణ భిక్షన్ జాలినందింపుమా!
గరళమ్మే కఱవయ్యెనే యకట! ఖడ్గంబైన లేదయ్యెనే!!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికం//
రిప్లయితొలగించండిశరములధాటికి వెఱచుచు
కరముల జిక్కంగ వైరి కరుణన్జూపన్ !
మరణమె శరణంబనుకొన
గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిరతము శ్రమియించు నరుడు
రిప్లయితొలగించండిధరలో నిడుములకు క్రుంగి తాను గుములుచున్
మరణమును గోరు వేళన్
గరళము గురవయ్యె లేదు ఖడ్గంబైనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరిజూడంగనుకానడేహరియునేసాంగంబుసాగిల్లినన్
రిప్లయితొలగించండిఅరిమాయావియనిశ్చయంబుగనునాయాసంబుగల్గించుగా
కరిదావిష్ణునిదీనయైపిలచెదాకావంగరమ్మంచునున్
గరళమ్మేకరవయ్యెనేయకటఖడ్గంబైనలేదయ్యెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబెరకుల్ నిండుసభాంతరమ్మున సతిన్ భీష్మాదులే గాంచగన్
వరవంచున్ దడు పూడదీయ దలపన్ బ్రాణేశులీ యేవురున్
పరకల్ వోలెను నిల్చిరచ్చటకదా వంశీధరా చావగన్
గరళమ్మే కరువయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిస్థిరముగ పాండవులు వనిని
మెరయుట రారాజు జూచి మిక్కిలి నీర్ష్యన్
తెరలుచు చావగ ననుకొనె
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మిక్కిలి యీర్ష్యన్" అనండి.
తరమే యెవ్వరికైన దేశమున
రిప్లయితొలగించండిసంతాపంబు నీడేర్చగా
బరువాయెన్ బ్రతు కీడ్వగా దినదినం
బయ్యో ! సదా హెచ్చె డీ
ధరలన్ గాంచి తలంచుచుండి
రిటులన్ ధైర్యంబు క్షీణించియున్
గరళమ్మే కరువయ్యనే యకట
ఖడ్గంబైన లేదయ్యనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅరుదౌ కాంచన కృష్ణసారమును మాయామోహమున్గోరి నా
రిప్లయితొలగించండిపరుషంబౌ నుడులన్ మరందిని గడున్ బాధించితే దైవమా!
కరకౌ రాక్షసరాజు పాలబడి దుఃఖాబ్ధిన్నణంగారితే
పరలోకమ్మున కేగజూతుమన సంప్రాప్తించదే మేవడిన్
గరళమ్మే కరవయ్యెనే యకట!ఖడ్గంబైన లేదయ్యనే!
వరిపైరుకు సోకెంగద
తొలగించండిసరికొత్త పురుంగు దాని జంపెదమన్నన్
తిరిగిన బలు నంగళ్ళను
గరళము కరువయ్యె లేదు ఖడ్గంబైనన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపరికించిచూడ నెరిగితి
రిప్లయితొలగించండిగరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్
పరకలు కోయుటకైనన్
కరివరదా మరి పశువుల గాసంబెటులో
[గరళము=గడ్డిమోపు;పరకలు=గడ్డిపోచలు]
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికరువాయె నిదుర కనులకు
రిప్లయితొలగించండిచెరువాయెనుగుండె వలపు ఛిద్రంబాయెన్
బరువాయె బ్రతుకు నాకిక
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిస్థిరమౌ జీవితమొందుచున్ వనమునన్ క్షేమంబుగా దిర్గుచున్
గరిమన్ వెల్గెడి పాండురాజు సుతులన్ గాంచంగ రారాజు తా
నెరుసున్ గల్గి శరీరమున్ విడువగా నెడ్దన్ విచారించి నా
గరళమ్మే కరువయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅరులకు తాజి క్కి ప్రతా
రిప్లయితొలగించండిపరుద్రు డకటా!మనసున పరిపరి తలచెన్,
మరణమె మేలని, వెదకగ
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురువుగారు! ��
తొలగించండిభరతుండేలగ ధారుణీ వలయమున్ భవ్యంబు నూహించుచున్
రిప్లయితొలగించండిగరుణా మూర్తిగ నిన్ దలంచి మది, యాకణ్వర్షి నన్బంపెనే?
కురు రాజ్యంబున ధర్మమీ గతిని సంక్షోభంబునన్ జిక్కగా
మరణంబే శరణంబుగా దలప సీమంతమ్ముగా నేడిటుల్,
గరళమ్మే కఱవయ్యెనే, యకట ఖడ్గంబైన లేదయ్యెనే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం//
రిప్లయితొలగించండిత్వరపడి చంపుట కొరకున్
నరహింసను ప్రోత్సహించు నటనోన్మాదుల్ !
విరివిగ మందుల నడుగగ
గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి5. కం//
రిప్లయితొలగించండివిరహమును తాళలేకను
సరసము జేయంగ రమణి సఖ్యత లేకన్ !
పురుగుల మందును త్రాగెను
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపెరుగుచు నున్న కుటుంబపు
రిప్లయితొలగించండిబరువునిక వహించలేక ప్రాణమువిడువన్
పరిసరమందున సుంతయు
గరళము గఱవయ్యె , లేదు ఖడ్గంబైనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి6. కం//
రిప్లయితొలగించండిసిరిసంపద గోల్పోవగ
దరిచేర్చెడివారు లేక ధైర్యమువీడన్ !
మరణించుటె మేలనుకొనె
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి7. కం//
రిప్లయితొలగించండిపరువే బోయిన పిదపన్
బరువగు దేహము వలదని ప్రాయము నందున్ !
కరివనమున జొచ్చి వెఱచె
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికరుణేజూపవుమాటలాడవెటులో
రిప్లయితొలగించండికారుణ్యమేతగ్గెనా!
వరమై,రావిటునాదుభక్తిగనుమా!
వాంచించి నీరూపమే
స్థిరమై నాయెదనిల్పలేనిబతుకే
చేధించ శ్రీ రాముడా
గరళమ్మేకరవయ్యెనే యకట
ఖడ్గంబైనలేదయ్యెనే
...తోకల...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిగరళమ్మే కరవయ్యెనే యకట ఖ
డ్గంబైన లేదయ్యెనే
( భీముని గదాఘాతం వల్ల తొడలు విరిగి ఒక్కడుగా మిగిలి కుమిలిపోతున్న రారాజు దుర్యోధనుడు )
మత్తేభవిక్రీడితము
............................
అరవన్ వందులు లేరు ! మేల్కొలుపగన్
హా ! లేరు వైతాళికుల్ !
కురువృద్ధుల్ గురువృద్ధులున్ వెడలిరే !
కొడ్కుల్ సఖుల్ లేరుగా !
ధరపై కూలిన నాకు ప్రాణములవే
తారాడు పోరాడెడిన్ !
గరళమ్మే కరవయ్యెనే ! యకట ! ఖ
డ్గంబైన లేదయ్యెనే !!
( వందులు - స్తోత్రపాఠకులు ; వైతాళికులు - నిద్ర మేల్కొలిపేవారు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి10. కం//
రిప్లయితొలగించండినరమానవు డెదురుబడక
పరికించితి నలుదిశలను పర్వపు దినమున్ !
వరిగడ్డిని కోసెదమన
గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి11. కం//
రిప్లయితొలగించండిపరిహాసము జేయవలదు
కరివదనుని బ్రోవమనర గంగాధర,శ్రీ !
పురమందున కరువు వెలసె
గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
ధన్యుడను గురువర్యా !🙏
రిప్లయితొలగించండి4. కం//
వరకట్నము దేలేదని
మరణించుటె దిక్కనంగ మార్గములేకన్ !
నురిబోసుకొనెను, పడతికి
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!
కఱవాయెన్ కనుదోయిలో నిదుర నా కాంతామణిన్ గానకన్
రిప్లయితొలగించండిచెఱువాయెన్ హృదయాంగణమ్ము చెలియన్ చేరంగ లేనైతినే
మరణమ్మే శరణమ్ము నాకిక భువిన్ మందుండ నాకియ్యెడన్
గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యుడను గురువర్యా !🙏
రిప్లయితొలగించండి8. కం//
పరకాయవిద్య నేర్చియు
పరదేశము కేగునపుడు పర్వత శ్రేణిన్ !
మురిపెముతో దేహము విడె
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యుడను గురువర్యా ! 🙏
రిప్లయితొలగించండి9. కం//
వరుసగ గణపతి దెలుపుచు
కరుణా ప్రభువై రచించు కలమున జేరన్ !
పరవశమొందితి ననుగొను
గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితటాకములో దాగిన రారాజు
రిప్లయితొలగించండిపరిహాసమ్మునుఁ జేయుచున్ బలుక యాపార్థుల్, విచారమ్ముతో
తిరుగన్ జాలను భంగపాటుగొని నే తేజమ్ముతోఁ బృథ్విపై
మరణమ్మేయిక దిక్కునాకని, మదిం భావించె రారాజుతాన్
గరళమ్మే కఱవయ్యెనే యకట! ఖడ్గంబైన లేదయ్యెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(దుర్యోధనుని స్వగతము)
రిప్లయితొలగించండిఅరరే యేలొకొ మామ మాట విని నే యాగంబుకేతెంచితిన్
మరపేలొందితినా సభాంగణమునన్ మ్రాలెన్ గదా పాదమే
పరువే పోయెనికేల జీవితమయో ప్రాణంబు చాలింపగా
గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅరకొర బ్రదుకుల కంటెను
రిప్లయితొలగించండివిరమణ నీయంగదలచి వివిధములుంగాన్
మరణపు యత్నము జేయగ
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే
రిప్లయితొలగించండిమరణంబెందుల కోరుచుంటివిల నామార్తాండు సేవించుచో
నిరతంబీయును నాయువున్ సిరులు పానీయంబులింపారగా
గరమున్ మానుమ దుష్టచింతనను నోకామాక్షి!నీవిప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితరుణం బిట నేతెంచెను
రిప్లయితొలగించండిబురుషర్షభు లార సిద్ధముగ నుందు మనన్
మరణింప వధింప నకట
గరళము గఱవయ్యె లేదు ఖడ్గం బైనన్
కరి గంధర్వ శతాంగ సద్భట గణోగ్రవ్యూఢ మొక్కమ్మడిం
బరివా రార్భక సంచ యోక్ష గణ గో వ్రాతమ్ము భీతిల్లఁగా
నరి సందోహము మార్కొనంగ నిట మూయం గొట్టఁగా ధిక్సుభా
గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే
[ధిక్ +సుభాక్ + అరళము = ధిక్సుభా గరళము ; అరళము = తలుపు]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి12. కం//
రిప్లయితొలగించండిచిరుబురులాడెడి బావను,
"కర పాణ"ను వ్యాధిసోకె కలవొద్దనగన్ !
తరుణోపాయము దెలవక
గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రస్తుత ఆఫ్గనిస్తాన్ పరిస్థితి పై నా ప్రయత్నము:
రిప్లయితొలగించండిమ:
హొరవే మూలమటంచు తాలిబనులున్ హోరెత్త కాబూలుగన్
నరమేధమ్ము సహించుచున్ బ్రజలు నానాహింస సైరింపనై
బరువై పోయెను జీవితమ్మనుచు భావంబెంచి రీరీతిగన్
గరళమ్మే గఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండి13. కం//
రిప్లయితొలగించండిజ్వర భారముతో నుండియు
కరములు జోడించి మ్రొక్కె గౌరీపతికిన్ !
మొరపెట్టుకున్న వినడే
గరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి14. కం//
రిప్లయితొలగించండిసురనాయక ననుగొనిపో
వెఱవుట దెలియదు నిజముగ వేడెద స్వామీ !
పురహరుడిని నేజేరెద
గరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి15. కం//
రిప్లయితొలగించండివరవర రావను నొక కవి
పరితాపము జెందె నాడు పలువురి నడుమన్ !
దొరలెల్లరు వేధించగ
గరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి16. కం//
రిప్లయితొలగించండినరసింహుని జాతరలో
కరుకగు కత్తుల కసాయి గర్వము జూపన్ !
వరమడిగిన మేకను గన
గరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపిలువన్ బోవవు నన్ను నీ గృహముకున్ పేర్మిన్ మదిన్ పూడ్చుకున్
రిప్లయితొలగించండిమరినా వైపుకు రాకపోతివి కదా మాయూరు ఓ! దూరమా?
మరువన్ జాలక పోతినే నిను మరిన్మాయమ్మ మీ దొట్టుగా
గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే
రిప్లయితొలగించండివిరి తామర బోలు సతిని
సరసముగా చేరబోవ సమయమదేమో
చిరుచాపను జూపె నతివ
గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్