14, సెప్టెంబర్ 2021, మంగళవారం

సమస్య - 3842

15-9-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్”
(లేదా...)
"ధవునిఁ బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్"

37 కామెంట్‌లు:


  1. దవమున గనినంతనె వా
    వి వరుసలనువిడి పరాభవించిన యా పా
    టవికుండగు నీచుడు సైం
    ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్.

    రిప్లయితొలగించండి
  2. శివునికివస్త్తముతోలున
    తివనాగౌరితగపట్టుచీరయెదాల్చున్
    వివరంబేదీజంటకు
    ధవునవమానించుటకదధర్మముసతికిన్

    రిప్లయితొలగించండి

  3. అవమపు మాటలేల సతి యల్లుడతండను గౌరవింపకా
    యవధులు మీరుచుంటివని యన్నయె పల్కగ ఫల్గుణుండనెన్
    దవమున కాముకుండగుచు ద్రౌపది పొందును కోరినట్టి సైం
    ధవుని పరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్.

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వె6కట రాజారావు:

    అవహేలితమును జేయుచు
    ప్రవీణుడగు పతిని గూర్చి పాపపు మాటల్
    ప్రవచించుచు సాగెడి బాం
    ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్.

    రిప్లయితొలగించండి
  5. సమస్య :

    ధవుని బరాభవించుటయె
    ధర్మము సాధ్వికి దప్పు లేదిలన్

    ( తన మీద దురాగతానికి తలబడ్డ సైంధవుని
    చెంపలు వాయించిన ద్రౌపది తనలో ...)

    అవమతి జేసె మోహమున ;
    నాతడు దుస్సల భర్త ; ధీరులౌ
    ధవు లెవరున్ సమీపమున
    దారని యప్పుడు వచ్చి పైటనే
    కవయగ బట్టినాడు ; ఖలు
    ఖస్సున చెంపల వాయగొట్టి సైం
    ధవుని బరాభవించుటయె
    ధర్మము సాధ్వికి దప్పు లేదిలన్ .

    రిప్లయితొలగించండి
  6. సవనములెన్నిఁజేసిననుసాధనకందనిగోపబాలునా
    యువిదయుసత్యభామయునుయౌవ్వనగర్వమువిిఱ్ఱవీగుచున్
    నవనవలాడుపుష్పమునుమాసతికిచ్చెనటంచుతన్నెమా
    ధవునిఁబరాభవించుటయెధర్మముసాధ్వికిఁదప్పులేదిలన్

    రిప్లయితొలగించండి
  7. కవయగ యత్నము జేయుచు
    నవమానింప o గ దలచు నను చిత చేష్టు న్
    దవిలియు నెదిరించుచు సైo
    ధవుఁ నవమానించుటె కద ధర్మము సతికిన్

    రిప్లయితొలగించండి
  8. సవినయ పాండవేయులకు
    సద్గణ సజ్జన ద్రౌపదీ సతిన్
    ధవులట లేన వేళగని దర్ఫము
    తో కడు శక్తివంతుడు
    న్నవినయ ధూర్త చిత్తమున నా
    మెను జేకొని పోవునట్టి సైం
    ధవుని పరాభవించుటయె ధర్మము
    సాధ్వికి దప్పులేదిలన్

    రిప్లయితొలగించండి
  9. అవనిజ దొంగలించి తనయంకము జేర బలాత్కరించుచున్
    దవమున బందిసేసి ధవు తారక రామునవజ్ఞ జేయగా
    యవసము నడ్డుబెట్టుకొని నార్యుని మెచ్చుచు స్వర్ణలంకకున్
    ధవుని బరాభవించుటయె ధర్మము సాధ్వికి తప్పులేదిలన్

    యవసము = గడ్డి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నవ చేలము దెమ్మన్నను
      చవకౌ పుట్టమును దెచ్చి చనవున రాత్రిన్
      కవుగిలిని గోర వలదని
      ధవు నవమానించుటె గద ధర్మము సతికిన్

      తొలగించండి
  10. రిప్లయిలు


    1. అలిగిన సత్యభామతో శ్రీకృష్ణ పరమాత్మ :

      కందం
      నవలామణిన్ మనోహరి
      నవమతినై నొప్పిపెట్ట నలుకల సత్యా!
      నవకోమల చరణంబున
      ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్!

      చంపకమాల
      అవమతినై మనోహరిని నల్కల ముంచెడు తప్పుజేసితో?
      ధవళ దళాయతాక్షి! పద దాసుని కృష్ణుని సత్య! చొక్కుచున్
      నవసుమ కోమలీ! యడుగు నర్మిలి మచ్ఛిరమంటునట్టులన్
      ధవునిఁ బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్!

      తొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పవిదగు సత్ప్రవర్తనను పద్ధతిగా కదలాడు గేస్తునిన్
    అవమతిజేయు భాషణమునన్ సతతమ్ము సతిన్ బడల్చుచున్
    పొవరగు పోకుతోడ గృహమున్ తిరుగాడెడి యజ్ఞుడైన బాం
    ధవుని పరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్.

    రిప్లయితొలగించండి
  12. ధవులింట లేక నొంటిగ
    ధ్రువ ద్రౌపదియుంటజూచి తులువతనమునన్
    కవగొనబూనిన యా సైం
    ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్

    రిప్లయితొలగించండి
  13. చం:

    కవకవ నవ్వు మాటలకు కట్టడి లేదట నెట్లు ప్రేలినన్
    చెవులకు సోకినంత విని చేష్టలుడుంగిడె దారిలేకనై
    రవము ప్రతిధ్వనించె శ్రుతి రయ్యన వారల బల్కులివ్విధిన్
    ధవుని పరాభవించుటయె ధర్మము సాధ్వికి తప్పులేదిలన్

    కవకవ నవ్వు=హేళన చేయు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. "శివ" యనని క్రతువన నుమా
    ధవు నవమానించుటె కద; ధర్మము సతికిన్
    ధవుని పరువు కాపాడుట;
    చివర కది కుదరక సమసె శివసతి మసిగా!

    రిప్లయితొలగించండి
  15. వివశత్వంబున నహుషుడు
    దివిజులరాణికి మనసును తెలిపినవాడై
    కవుగిలినాశించ నమర
    ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్

    రిప్లయితొలగించండి
  16. యువతి నొకతెను గృహమునకు
    సవతిగ నేర్పరచియుండ సంకటబడగన్
    నవగత ముజేయు కొరకై
    ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు

    1. అలుక వహించిన వేళ సత్యభామాశ్రీకృష్ణుల సంభాషణ, పార్వతీశంకరుల వ్యంగ్యాత్మకసరససంభాణశ్లోకాలు చమత్కృతపద్యాల స్ఫురణతో...

      తొలగించండి

    2. ప్రవచనపాటవమ్మనగ, వాదవిహీనవిలాసమాత్రమై
      యవధిని మీర నట్టి మధురాప్తవచోవిజిగీషతోడ, సు
      వ్యవహృతసమ్మతిన్, సరసహాస్యచమత్కృతభాషణమ్ములో
      ధవునిఁ బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
  18. భవితనుజూపగప్రభుత
    భారిగ ఆసరపించినీ లిడెన్
    జవమనిరైతుభందుకడు
    జాగృతిజేసెనురైతుజాతి భాం
    ధవుని, పరాభవించుటయె
    ధర్మము సాద్వికి దప్పులేదిలన్
    భువిన నకారణమున
    పుర్షులు కాంతల తిట్టువేళలన్
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  19. చెవులకు నింపు నిచ్చు నటు చెప్పుచు మాటల, పొంది క్షేత్రమున్
    కవులుకు, మంచి పంటలను గాంచుచు నిత్యము దుష్ట బుద్ధియై
    తెవులు ఘటిల్లెనంచుమరి తీర్చక కౌలును కష్టపెట్టు బం
    ధవునిఁ బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య

      ధవు నవమానించుట గద ధర్మము సతికిన్

      ఇచ్చిన పాదము కందము

      నా పూరణము సీసములో





      చంద్రుడు నవ్వ గజాననుని కడుపు
      పగిలి కోల్పోయెను ప్రాణమతడు,

      కోపముతో నిడె శాపము నా సతి
      కలువల దొరకు, వికలిత మనము

      గలిగి రోదించెడు గట్టురాచూలికి
      భావ్యమౌనె కుముద బాం(ధవునవ

      మానించుట గద, ధర్మము, ,సతికిన్) ముద
      మును కలిగించిన తనదు శాప


      ము నుపసంహరించును. రయమున నొసగుము
      ప్రాణములు, నెల్ల దేవతల్ వరములిడగ
      మరల జీవించు గణపతి త్వరిత గతిని,
      ననుచు వేల్పులతో పల్కె నస్తి మాలి



      తొలగించండి
  21. ధ్రువముగ ధర్మపత్నికిల దుస్సహమౌ గననెన్నడేనియున్
    ధవునిఁ బరాభవించుటయె; ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్
    దివిజ వరేణ్యునైన నిలదీయగ భర్తను దూలనాడినన్,
    శివుని పరాభవింప సతి చింతిలి దండ్రినెదిర్చెగాదొకో

    రిప్లయితొలగించండి
  22. అవకతవక లీమాటలు
    ధవుననుమానించుటె కద ధర్మముసతికిన్
    ధవుడన దైవమ యాలికి
    ధవునుని సేవించునెడల దక్కును ఫలముల్

    రిప్లయితొలగించండి
  23. కవనమ్ము లందుఁ గాంచమె
    కవి సంచయ వర్ణనములు కాంతల యెడ రే
    పవ లెడయికం గుముద బాం
    ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్


    ఉవిదకు స్వీయ భర్త పయి నున్నత భావము నిత్య ముంట యీ
    భువి సహజమ్ము సుమ్ము పతి పూజ్యుఁడు ధర్మము నెంచి చూడఁగా
    నెవరిని నైన గౌరవము నీయక మిక్కిలి కించ పర్చినన్
    ధవునిఁ, బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్

    రిప్లయితొలగించండి
  24. ధవుని పరాభవించుటయె ధర్మము సాధ్వికి దప్పులేదిలన్
    ధవుని పరాభవించుటను దప్పుగ నెంతును నోమహాశయా!
    ధవునికి సేవజేయుట సదాశివు సేవయెయౌను ధారుణిన్
    వివరముగానుటంకితిని బ్రేమను బంచుచు నుండమేలగున్

    రిప్లయితొలగించండి
  25. అవగుణుడైన దుర్మతి వనాంతరమందుననున్న ద్రౌపదిన్
    ధవులటలేనియొంటరిని తార్క్ష్యముపై గొనిపోవుచుండ పాం
    డవులట కేగుదెంచి పరదారను గోరిన యద్దురాత్ము సైం
    ధవునిఁ బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్

    రిప్లయితొలగించండి
  26. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె నేయి వోయ భ
    గ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి హె
    చ్చిన కనుదోయి కెంపు ------------------------------------

    పరాభవింపబడిన సత్యభామకు :
    B-1)
    ____________________________

    ప్రవిమల పుష్పరాజము,సు - రర్షియె భక్తిని దెచ్చి యిచ్చినన్
    ధవుడదె పెద్దభార్యకిడ, - దబ్బర లాయెను భర్తృ బాళి యం
    చవమతి హెచ్చ , సవతుల - హాస్యము దల్చుచు రక్తరేణువై
    ధవునిఁ బరాభవించుటయె - ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్ !
    ____________________________
    సురర్షి = నారదుడు
    అవమతి = అవమానము
    రక్తరేణువు = కోపి


    కవులూరు రమేష్(వసంత కిశోర్)

    రిప్లయితొలగించండి
  27. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    నవ వధువును కూడ పట్టించుకోని :

    A-1)
    ____________________________

    ననవలాడుచు భార్యదె
    కువకువ మనుచు తన చెంత - గూడన్రాగా
    కవయక చిరచిరలాడెడు
    ధవు నవమానించుటె కద - ధర్మము సతికిన్ !
    ____________________________

    కవులూరు రమేష్(వసంత కిశోర్)

    రిప్లయితొలగించండి
  28. రవమిడినవినబడదనియ
    తివనుచెరచబోయెగదయతియధమ ముగనన్
    అవునాపశరమ్మును సైం
    ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్

    రిప్లయితొలగించండి