క్షేమము కాదురా మనకు శ్రీరఘురాముని నిందసేయ నీ కే మొఱకుండు చెప్పెనిది యింతిమనోరథ సిద్ధికై కదా రాముడు రాజ్యమున్ విడి యరణ్యము కేగిన త్యాగమూర్తి, యే రాముడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్?
భరతుని మనోగతము గా ఈ నా ప్రయత్నము : పట్టాభిషేకం చేసే బదులు అడవికి పంపడమేమిటి ? ఇల్లు విడవ వద్దు అని భరతుడు చెప్పిన మాటను శ్రీరాముడు త్రోసి పుచ్చగా, భరతుని మది కోపముతో రామునికి రాజ్యము దక్కక జారిపోయినదే! అని చింతిస్తుంది ..అని చెప్పే ప్రయత్నం చేశాను.
ఉ:
నీమము మేర రామునికి నిక్కము పట్టము గట్టు వారుగన్ క్షేమము గోరుటన్ బదులు కీడు తలంచిరె కాన కేగనై ? ధామము వీడ వద్దనిన తమ్ముని కోరిక త్రోసి పుచ్చ శ్రీ రాముడు; గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్
రాముని కేల రాజ్యమది రంజిలె లోకమనోధిపీఠికన్? రాముడు విశ్వపాలనపరాత్పరుడై వరదాయియయ్యె, నా రాముడు వీర్యవత్పరశురాముడొ? యా బలరాముడౌనొ! యే రాముఁడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవఁగన్?
సామంతులసౌజన్యము
రిప్లయితొలగించండినామపువేషముముదరగనాతురమతియై
మామనుదించెగయల్లుఁడు
రాముఁడుక్రోధమువహించెరాజ్యమువోవన్
రిప్లయితొలగించండిఏమా మాటలు? రఘుకుల
సోముడు రాజ్యమ్ము విడెను సుతిమాటలనే
తా మన్నించుచు కద యే
రాముడు గ్రోధము వహించె రాజ్యము వోవన్?
శ్యాముడు మధురను వీడెను
రిప్లయితొలగించండిభీముడె మగధాధిపతిని బేలగ సేయున్
ఆమర్మము తెలియక బల
రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్
రిప్లయితొలగించండిక్షేమము కాదురా మనకు శ్రీరఘురాముని నిందసేయ నీ
కే మొఱకుండు చెప్పెనిది యింతిమనోరథ సిద్ధికై కదా
రాముడు రాజ్యమున్ విడి యరణ్యము కేగిన త్యాగమూర్తి, యే
రాముడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్?
నీమము గల్గిన వాడై
రిప్లయితొలగించండియే మాత్రము జంకు గొంకు లెరుగని వాడై
ధీమంతు డై న వాడే
రాముడు క్రోధము వహించె రాజ్యము వోవన్?
సమస్య :
రిప్లయితొలగించండిరాముడు గ్రోధమందె మది
రాజ్యము దక్కక జారిపోవగన్
( ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు యౌవరాజ్యాభిషేకం
చేసినప్పుడు దుర్యోధనుని పరిస్థితి )
ఉత్పలమాల
.....................
సోముడు హస్తినాజనుల
సొంపగు కన్నుల కైరవాళికిన్ ;
ధీమతి సర్వకార్యముల
దిన్నగ దీర్చెడి ధర్మపుత్రునే
తా మది నెంచి రాజుగను
దండ్రి యొనర్పగ భానుమానసా
రాముడు ; గ్రోధమందె మది ;
రాజ్యము దక్కక జారిపోవగన్ .
(కైరవాళి - కలువల సమూహం ; సోముడు - చంద్రుడు ;
భానుమానసారాముడు - భానుమతీదేవి మనస్సే
ఉద్యానవనమైనవాడు దుర్యోధనుడు )
కందం
రిప్లయితొలగించండిఆ మంధర బోధింపఁగ
స్వామినడుగఁగ భరతునకు సామ్రాజ్యమ్మున్
తామసి కైకేయి కలన్
రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్!?
ఉత్పలమాల
రాముని కానకున్ బనిపి రాజ్యము నా భరతుండు వొందగన్
స్వామినడుంగు బోధఁగొని సాధ్యమె? మంధర వ్యూహమంచుఁ దా
తామసి కైకకున్ కలను తర్జనభర్జన డోలనమ్మునన్
రాముఁడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవఁగన్! ?
నీమము మరచిన రీతిన
రిప్లయితొలగించండితామందరినీ పణమిడి ధర్మజుడాడన్
భీమునిమదిలోనాత్మా
రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభరతుని మనోగతము గా ఈ నా ప్రయత్నము :
తొలగించండిపట్టాభిషేకం చేసే బదులు అడవికి పంపడమేమిటి ? ఇల్లు విడవ వద్దు అని భరతుడు చెప్పిన మాటను శ్రీరాముడు త్రోసి పుచ్చగా, భరతుని మది కోపముతో రామునికి రాజ్యము దక్కక జారిపోయినదే! అని చింతిస్తుంది ..అని చెప్పే ప్రయత్నం చేశాను.
ఉ:
నీమము మేర రామునికి నిక్కము పట్టము గట్టు వారుగన్
క్షేమము గోరుటన్ బదులు కీడు తలంచిరె కాన కేగనై ?
ధామము వీడ వద్దనిన తమ్ముని కోరిక త్రోసి పుచ్చ శ్రీ
రాముడు; గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్
వై. చంద్రశేఖర్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిధీమంతుడు యార్కి పలుక
రాముడు గ్రోధము వహించె రాజ్యము వోవన్
కాముక వాలి నొనర్చిన
ఏమరిక నొసగిన క్రియల నెల్లన్ వినగా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీమమువిడి దన నెదురుట
రిప్లయితొలగించండిజామాతయె గోపనముగ జరిపెనటంచున్
బూమియలాడ మన తెలుగు
రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్
నేమముతప్పడు, రాజ్యపు
రిప్లయితొలగించండికామమువీడగసరగుణ కానలబోయే
విమలుడు మన్నింపు మెటుల
రాముడుగ్రోధమువహించె రాజ్యమువోవన్
...తోకల...
రాముని కేల రాజ్యమది రంజిలె లోకమనోధిపీఠికన్?
రిప్లయితొలగించండిరాముడు విశ్వపాలనపరాత్పరుడై వరదాయియయ్యె, నా
రాముడు వీర్యవత్పరశురాముడొ? యా బలరాముడౌనొ! యే
రాముఁడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవఁగన్?
కంజర్లరామాచార్య.
తామసుడౌ గుణహీనుఁడు
రిప్లయితొలగించండిరాముని నైజమ్ము తెలియరాక తనమదిన్
నీమమెరుంగక తలచెను
రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీమము గీమము లేదని
రిప్లయితొలగించండిరాముని తమ్ముఁడు ఘనుండు లక్ష్మణుఁడే, ని
ష్కాముఁడు శాంతము నూనఁగ
రాముఁడు, గ్రోధము వహించె రాజ్యము వోవన్
కామిత లబ్ధ కైకయినిఁ గాంచిన భండన రంగ విక్రమో
ద్దాముఁడు భాతృ వత్సలుఁడు దండ ధరాభుఁడు రక్త నేత్రుఁడున్
భీమ బలుండు లక్ష్మణుఁడు విస్తృత సంతత సేవి తోల్లస
ద్రాముఁడు గ్రోధ మందె మది రాజ్యము దక్కక జాఱి పోవఁగన్
భీమ బలోద్ధత నాకముఁ
రిప్లయితొలగించండివేమారు సమాక్రమించ వేలుపుగొంగల్
ధామము గోల్పోయిన సు
త్రాముడు క్రోధము వహించె రాజ్యము వోవన్
నీమములేని వాలి బహునేర్పుగ దమ్ముని వెంబడించగా
ధామము ఋష్యమూకమయి తక్కుచు దారుచుదీనుడై తుదన్
క్షేమమునెంచి రాఘవుని స్నేహము గోరుచు విన్నవించగా
రాముడు గ్రోధమందె మది,రాజ్యము దక్కక జారిపోవగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏమీ? దారుణమీయది
రిప్లయితొలగించండిరాముడు గ్రోధము వహించె రాజ్యమువోవన్ ?
రాముడనంగను దైవమ
యేమాత్రము నుండబోవు నీర్ష్యాదులహో
రాముడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్
రిప్లయితొలగించండినేమని బల్కుచుంటిరిట? యిట్లుగ బల్కుట పాడియే?రమా!
రాముడు శాంతమూర్తియయి రంజిలునట్లుగ మానవాళియున్
నీమము దప్పకుండగను నిశ్చల బుద్ధిని రాజ్యమేలెగా
రాముడు సద్గుణధాముడు
రిప్లయితొలగించండిరాముడు ధర్మాను సారి, రాముడు త్రేతా
రాముడె; మన్నెపు సీతా
రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్
స్తోమ శతమ్ములన్ జలిపి సొంపుగ నా నహుషుండు తోరమౌ
రిప్లయితొలగించండిప్రేమము తోడుతన్ జని త్రివిష్టపమున్ గొని గద్దెనెక్క సు
త్రాముఁడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవఁగన్
తామసుడై చరించుచును తాపసితో నహుషుం డడంగె చూ
నీమము దప్పకన్ జనకు నిర్ణయమౌదల దాల్చి భ్రాతయున్
రిప్లయితొలగించండిగోమలి సీతతోనరిగె ఘోరవనాంతరసీమకాతడే
కాముకు రావణున్ దునిమి గాచె జగంబు; ననంగబోకుమీ
"రాముఁడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవఁగన్"
భామనుగూడియేగెనట భ్రాతయు ముందుగ సాగుచుండగా
రిప్లయితొలగించండితామదిజంకకుండగనుతల్లికి మ్రొక్కుచుదీవెనందుచున్
రాముడుకానకేగెననిరాజ్యమువీడయటంచువింటి యే
రాముడు గ్రోధమందె మదిరాజ్యముదక్కక జారిపోవగన్
మరొక పూరణ
కోమలి తో డను సాగెను
రాముడు,క్రోధము వహించె రాజ్యము వోవన్
సౌమిత్రిఖఢ్గమెత్తెను
తామంథరనచటకూల్చదలచుచుమదిలో