22, సెప్టెంబర్ 2021, బుధవారం

సమస్య - 3850

23-9-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిల్లి పోరాటమునఁ జంపెఁ బెద్దపులిని”
(లేదా...)
“పిల్లి దురంబునం దునిమె పెద్దపులిం గడు విక్రమించుచున్”

32 కామెంట్‌లు:


  1. తల్లియనుమతి గైకొని తనయు డంత
    నామె యొసగిన వేలనే యాయుధముగ
    దాల్చి సంహరించెనుగాదె తారకుడను
    పిల్లి పోరాటమునఁ జంపెఁ బెద్దపులిని.

    రిప్లయితొలగించండి
  2. ఆత్మసుస్థిరభావంబునాలసించి
    మేధతట్టినమార్గంబుమెప్పుగనుచు
    వల్లకానిదితానుగావాటమరసి
    పిల్లిపోరాటమునఁజంపెఁబెద్దపులిని

    రిప్లయితొలగించండి
  3. ఎలుకలను పట్టు నెవరొకొ, యెటుల జచ్చె

    రావణుండు,వనములోన రాముడేమి

    చేసె వాలిని,అయ్యప్ప చెంగు మనుచు

    నడవి కేమి తెచ్చుటకును వెడలె నాడు,

    పిల్లి,పోరాటమున,జంపె,పెద్దపులిని

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అల్పుడైన శిఖండియె నాహవమున
    కురుపితామహు భీష్ముని కోరి తాను
    కూలజేయుట జూడగ కూడు నూహ
    పిల్లి పోరాటమున జంపె బెద్దపులిని.

    రిప్లయితొలగించండి
  5. అల్లినజన్మబంధములనాసనువీడుచుపారమంటగన్
    పల్లెలపె్టణంబులనుపాడెనుపద్యమువేమనార్యుడున్
    చల్లెగనవ్యభావములుచచ్చెనుమౌఢ్యముజాతియందునన్
    పిల్లిదురంబునన్దునిమెపెద్దపులిన్కడువిక్రమించుచున్

    రిప్లయితొలగించండి
  6. ఎలుక యొక్కటి యింటిలో నెదురు పడగ
    పిల్లి పోరాటమున జంపె : పెద్ద పులిని
    వలను పన్ని కిరాతుడు వనము నందు
    పట్టి చంపెను ధైర్యాన పట్టు బట్టి

    రిప్లయితొలగించండి

  7. తల్లికి వందనమ్మిడుచు ధర్మము నిల్పగ కార్తికేయుడే
    యెల్లరి శత్రువై చెలగు హీనుని బాధను ద్రుంచనెంచుచున్
    గల్లరి తారకాసురుని కయ్యమునందు వధించె, గాంచగా
    పిల్లి దురంబునందునిమె పెద్దపులిం గడు విక్రమించుచున్.

    రిప్లయితొలగించండి
  8. ఎల్లరు నొక్కటై పెనఁగి యింపగు రాష్ట్రము దెచ్చినంతనే!
    మెల్లఁగ జేరి దుండగులు మెండుగ మోసము సేసిదోచగా
    కళ్ళను గార రక్తము లమాయకు లంతయు బోరిరివ్విధిన్
    పిల్లి దురంబునం దునిమె పెద్దపులిం గడు విక్రమించుచున్.

    రిప్లయితొలగించండి
  9. అల్లరి మూషికంబు పరియాచక మాడగ గోపగించుచున్
    పిల్లి దురంబునన్ దునిమె; పెద్దపులిన్ గడు విక్రమించుచున్
    బల్లిదుడైన నయ్యపయె పట్టెను పాలను సేకరించగా
    తల్లికి గల్గినట్టి తల తాపము దీరగ నుద్యమించుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అల్లదె చూడుమా! భరతు డాడుచుపాడుచు దిర్గెడీడునన్
      చల్లని మౌనివాటికను సాహసమొప్పగ క్షాత్రతేజమున్
      బల్లిదుడై శరంబులను బాల్యపు చేష్టగ నుత్సహించి దం
      పిల్లి దురంబునన్ దునిమె పెద్దపులిన్ గడు విక్రమించుచున్

      తొలగించండి
  10. అందరికీ నమస్సులు🙏

    తల్లికి దూరమై బ్రతుకు దారుల గెల్వగ సాగనెంచగన్
    గల్లలు బల్కువానొకని కాంక్షల నడ్డ బలాత్కరించగన్
    బళ్ళెము తోడ నా మృగము ప్రాణము తీసెను భీరువయ్యహో!
    *“పిల్లి దురంబునం దునిమె పెద్దపులిం గడు విక్రమించుచున్”*

    *వాణిశ్రీ నైనాల*

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఎల్లిదుడౌ శిఖండి తను నేవిధ మొందుచు భీష్ము నాజిలో
    విల్లును వీడి గూలునటు వీకును జూపుట గాంచినంతటన్
    తెల్లమునౌను నందరకు తీరుగ నిట్టి తలంపు డెందమున్
    పిల్లి దురంబునం దునిమె పెద్దపులిం గడు విక్రమించుచున్.

    రిప్లయితొలగించండి
  12. కె.వి.యస్. లక్ష్మి:

    అబల యంచును భావించి యధము డొకడు
    అన్నును బలవంతము జేయు నాస్థ నెంచ
    చావ గొట్టెను నతని నామె సబల యౌచు
    పిల్లి పోరాటమున జంపె బెద్దపులిని.

    రిప్లయితొలగించండి
  13. సమస్య :

    పిల్లి దురంబునం దునిమె
    పెద్దపులిం గడు విక్రమించుచున్

    ( అంత పెద్ద ఔరంగజేబును ఇంత పిన్న శివాజీ ముప్పతిప్పలు పెట్టి ఓడించాడు )

    ఉత్పలమాల
    ...................

    కొల్లగ సంపదల్ గొనుచు
    గొందల మందగ భారతీయులే ;
    యల్ల మరాటదేశమును
    నాక్రమణం బవురంగుడే మహా
    మల్లుని భంగి జేయ ; ఘన
    మాయ శివాజి యెదిర్చి చెండెనే ;
    పిల్లి దురంబునం దునిమె
    పెద్దపులిం గడు విక్రమించుచున్ .

    రిప్లయితొలగించండి
  14. పిల్లలకు చాలా ఇష్టమైన గోలియత్ డేవిడ్ కథ ఆధారంగా....

    గొల్లియతున్ రణంబునను గుండ్రటి రాతిని వాడి డేవిడున్,
    బుల్లిగ యున్న నేమి కద! పోరును జేయక నే బలాఢ్యునిన్
    మెల్లగ జంపె, బైబిలున, మీరిన, కాలము నాపశక్యమా!
    పిల్లి దురంబునం దునిమె పెద్దపులిం గడు విక్రమించుచున్.

    రిప్లయితొలగించండి
  15. ఎలుక రాజంబు తెగువగ నెదురు నిలువ
    దొరక బట్టి కొరికి దాని దుమ్ము దులిపి
    పిల్లి పోరాటమునఁ జంపెఁ; బెద్దపులిని,
    మాటు వేసి బోనున బట్టె వేటగాడు.

    రిప్లయితొలగించండి
  16. ఆంగ్ల దేశీయులు మనదౌ యాణెముపయి
    నాళుతనము నహింసనె నాయుధముగ
    జేసి గాంధీ యణచినట్టీ చెన్నునుగన
    పిల్లి పోరాటమునఁ జంపెఁ బెద్దపులిని

    రిప్లయితొలగించండి
  17. వినగ విజయనగర రాజ్య విజయగాథ
    ఆనెగొంది పరిసరాల అధ్బుతాలు
    వేట కుక్కను తరిమిన వీర శశము
    పిల్లి పోరాటమునఁ జంపెఁ బెద్దపులిని

    రిప్లయితొలగించండి
  18. తల్లడపెట్టుచుండఁ బ్రజ ద్రావిడ సైన్యము లీళమందు నా
    యల్లరి మూకలన్ దరిమి యాగడముల్ నిలుపన్ బ్రభుత్వమా
    కల్లరియైన నాయకుని కన్గొని, కోపము సేనలోన చి
    ప్పిల్లి దురంబునం దునిమె పెద్దపులిం గడు విక్రమించుచున్

    రిప్లయితొలగించండి
  19. ఉ:

    మెల్లన జేర బోధ చెవి మిక్కిలి పేరిన యజ్ఞ తెల్లనున్
    చల్లన పారనొత్తునట జ్ఞానమ దెంతయు సూక్ష్మమైన చోన్
    దొల్లగ చిన్నదోమ కరి తొండము క్షోభను గూర్చు లాగునన్
    పిల్లి దురంబునం దునిమె పెద్ద పులిన్ గడు విక్రమించుచున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  20. మూడడుగులు చాలంచుఁ బుడమి నడిగి,
    సక్రమమని యొప్ప బలి, త్రివిక్రమునిగ
    త్రొక్కె హరి నేలయడుగుకు, రూపమందు
    పిల్లి పోరాటమునఁ జంపెఁ బెద్దపులిని

    ఉత్పలమాల
    చెల్లని దానమంచుఁ గవి శ్రీహరికీయకుమంచు నడ్డగా
    నుల్లము నొప్పగన్ బలియె యోగ్యుడు దానమిడంగ, శౌరి ఱం
    పిల్లుచు ద్రొక్కెఁ క్రిందకుఁ ద్రివిక్రముఁడౌచును రూపమందునన్
    పిల్లి దురంబునం దునిమె పెద్దపులిం గడు విక్రమించుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో తేటగీతి:
      తేటగీతి
      మూడడుగులు చాలంచును బుడమి నడిగి,
      సక్రమమని యొప్ప బలి, త్రివిక్రమునిగఁ
      ద్రొక్కె హరి నేలయడుగుకు, రూపమందు
      పిల్లి పోరాటమునఁ జంపెఁ బెద్దపులిని

      తొలగించండి
  21. పెల్లుగ మృగ జాలము విలసిల్లు ఘోర
    కాననము నందు నొక్కెడఁ గానఁ బడఁగ
    భీతి గొల్పెడు మృగ రాజు జాతి నరయఁ
    బిల్లి పోరాటమునఁ జంపెఁ బెద్దపులిని


    ఝల్లనఁ జూచు వారలకు జాఱఁగ గుండెలు సంభ్రమించి కం
    పిల్ల ధరాతలం బుఱికి పెన్నిశి తాయుధ మూని చేతిలోఁ
    దల్లడ మంద కింతయును ధైర్యము నూని యెడంద నంత ఱం
    పిల్లి దురంబునం దునిమె పెద్దపులిం గడు విక్రమించుచున్

    [ఱంపిల్లు = విజృంభించు]

    రిప్లయితొలగించండి
  22. పిల్లికి గంట గట్టగను బెక్కగు
    మూషక సైన్యమచ్చటన్
    మెల్లగ జేరగాంచి తన మీసము
    దిద్దుచు వాటి నెల్ల నా
    పిల్లి దురంబునందునిమె, పెద్దపులిన్
    గడు విక్రమంబునన్
    యెల్లరు సన్నుతించ యుమ యెక్కి
    చనెన్ దునుమాడె రక్కసున్.

    రిప్లయితొలగించండి
  23. బుసలు గొట్టుచు దరిజేర భోగి,యంత
    పిల్లి పోరాటమున జంపె,బెద్దపులిని
    వేటగాడొకడు పొదల చాటునుండి
    చంపె బాణాన గలిగెడు తెంపు తోడ

    రిప్లయితొలగించండి
  24. మెల్లగ నాగుపామొకటి మేడను బ్రాకుచు నుండునత్తఱిన్
    పిల్లిదురంబునందునిమె,పెద్దపులింగడు విక్రమించుచున్
    జల్లుమనంగ నొక్కపరి చాపుచు కోరలుమీదికుంజనన్
    పల్లమునెత్తులంగనక పాఱెను సోముడు గుండెపట్టుచున్

    రిప్లయితొలగించండి
  25. పల్లియలోన గొల్లెతల భావమునందున బాలుడిండ్లలో
    మెల్లగ దూరి వెన్నలును మీగడలన్నియు దొంగిలించెడిన్
    పిల్లి; దురంబునం దునిమె పెద్దపులిం గడు విక్రమించుచున్
    బల్లిదుడీతడంద్రు పురవాసులకెన్నిక కంసవైరియే

    రిప్లయితొలగించండి
  26. చంపు మూషికము నెపుడు సంతసాన
    పిల్లి పోరాటము న;జంపె పెద్దపులిని
    వీరవిక్రమమునుచూపి వేటగాడు
    వలనుబంధించిగొంపోవువడిగతాను.

    రిప్లయితొలగించండి