24-9-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కర్ణుఁ డిచ్చె ద్రౌపదికిఁ గోకలను దయను”(లేదా...)“కోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను కర్ణుఁ డొప్పుగన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్రొవ్విడి వెంకట రాజారావు: కోటిరుడడగ కవచము కుండలములుకర్ణుడిచ్చె; ద్రౌపదికి గోకలను దయనునొసగె శ్రీకృష్ణ పరమాత్మ యుత్తమమగుభక్తితో వేడినంతట బాళిజూపి
కవచ కుండలములు కోర గట్టుదాయకర్ణుడిచ్చె,ద్రౌపదికి గోకలను దయనుకూడి సభలోన ఘన నంద గోప బాలకుండొసగెను వేడుచు నామె కోరినంత
గోత్రభిదుడు కొర కవచకుండలములగర్ణుడిచ్చె, ద్రౌపదికిఁ గోకలను దయనుయాదవాన్వయుడిచ్చె సభాంతరమునగోమలాంగియె యార్తితో గోరినంత.
మారు వేషాన నింద్రుడు మాయ జేసి కుండ లమ్ములు కవచము కోరినంత గర్ణు ఢిచ్చె : ద్రౌపదికి గోకలను దయను సభనొసంగెను కృష్ణుడు సంతసించి
సమస్య :కోకలు ద్రౌపదీసతికి గోర్కె నొసంగెను కర్ణు డొప్పుగన్ ( శబ్దాలు సరిగా ఉచ్చరించలేని చవట నోట కృష్ణుడు కర్ణుడైనాడు )ఉత్పలమాల ..................వాకొనరాని వాక్కులకు వాడొక వాగుడుకాయయే సుమా !చేకొని కృష్ణుడంచు నన జెల్వుగ నాలుక తిర్గబోదుగా !నేకముగా పదంబునిక యిట్టుల మార్చుచు బల్కె వింతగా " కోకలు ద్రౌపదీసతికి గోర్కె నొసంగెను కర్ణు డొప్పుగన్ . "
క్రొవ్విడి వెంకట రాజారావు:వీకగు భక్తితో తెలచ వేగమె కృష్ణుడు నెమ్మితోడుతన్కోకలు ద్రౌపదీ సతికి కోర్కెనొసంగెను; కర్ణుడొప్పుగన్తా కవచమ్ము పోగులను దానము జేసెను నింగినుండియున్వాకిలి వద్దకా ద్యుపతి వచ్చి వితమ్ముగ కోరినంతటన్.
కుంగోరినవరమునుగొంకులేకశిరముదాల్చినపుత్రుడైశీఘ్రగతినికర్ణుడిచ్చె;ద్రౌపదికికోకలనుదయనుకృష్ణుడిచ్చెనుశీఘ్రమేకృపనుజూపి
కుంతిగోరిన
కె.వి.యస్. లక్ష్మి: కోటిరు డడగ కవచంబు కుండలములుకర్ణుడిచ్చె; ద్రౌపదికి గోకలను దయనునిచ్చి గోపయ్య కృపతోడ నిల్చి గాచెనిండు సభలోన ముదముతో నెంతగాను
తేటగీతిచేరి మూకగ పాండవ చిత్రకథనుబాలలచ్చట చర్చింప, బయట నుండివింటి, యచ్చెరు వందగ పేర్చిరిట్లుకర్ణుఁ డిచ్చె ద్రౌపదికిఁ గోకలను దయనుఉత్పలమాలకేకలువేయుచున్ దుమికి గెంతెడు బాలలు నొక్కడొక్కడున్మూకగ జేరి ముంగిటను ముచ్చట పాండవ చిత్రరాజమున్కూకటి వేళ్ళతోఁ బెరికి గూర్చిన మేటి నవీన గాథలోకోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను కర్ణుఁ డొప్పుగన్
హ్రీకుడు కాగితమ్ముపయి నిట్టుల వ్రాసెను తేట తెన్గునన్ గోకలు ద్రౌపదీ సతికి గోర్కెనొసంగెను కృష్ణుడొప్పుగన్ బోకిరి పుత్రుడద్దిగని భోగముఁ గృష్ణును కర్ణుజేయగాసూకరుడేగుదెంచి యది చూచి పఠించెనమాయకమ్ముగాకోకలు ద్రౌపదీసతికి గోర్కెనొసంగెను కర్ణుడొప్పుగన్.
తోకలులేని కోతులగు తుంటరి బాలురు పల్కిరివ్విధిన్సాకెను కుంతిదేవి బహు సంబరమందుచు సూర్యపుత్రునిన్కోకలు ద్రౌపదీసతికి గోరియొసంగెను కర్ణుడొప్పుగన్నాకముకేగి ధర్మజుడు నర్తకి యూర్వశి శాపమందెగాభీకరమైన భీష్మునని భీముడు చంపెను బావమెచ్చగా
ఇచ్చె కవచ కుండలముల నింద్రునకెవరంటి? నెవరికి పతులేవురంటి? తెలుపుకృష్ణుడిచ్చెను సభలోన కృష్ణకేమి?కర్ణు డిచ్చె, ద్రౌపదికి, గోకలను దయను.
ఉ: లోకము నందు గ్రంథములు లోభ్యము నెంచి పరీక్ష జేయగన్తాఁకదు నిట్టి కల్పనము తర్కము కందని ప్రత్యయమ్ము గన్చేకొనుటెట్లు నిట్టులగు చిత్తము తల్లడబెట్టు వ్రాతలన్కోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను కర్ణుఁ డొప్పుగన్గ్రంథములు=మహా భారత కథ పై వ్రాసిన గ్రంథములులొభ్యము=ఆశ కలిగించునదివై. చంద్రశేఖర్
ఆ కుల కాంత వేడికొన వ్యాకుల చిత్తను గావనెంచుచున్శ్రీకరు డిచ్చె దాను నిజ చెల్వము జూపి, మహా విశేషమౌ కోకలు ద్రౌపదీ సతికిఁ; గోర్కె నొసంగెను కర్ణు డొప్పుగన్నాకవిభుండు గోరఁగ ననాదరమెంచక దంశ కుండలుల్.
బవరమున పార్థు విడి యన్య పాండుసుతులవిడిచిపెట్టెద నని మాత పృథకభయముకర్ణుఁ డిచ్చె ; ద్రౌపదికిఁ గోకలను దయనుకన్నడిడె నామె మానము గాపు గడకు
నిండు సభలోకి శిగబట్టి నీడ్చుకొచ్చుకౌరవులనుండి రక్షణ గోరు కృష్ణతనను వేడగ నందనందనసునిశితకర్ణుఁ డిచ్చె ద్రౌపదికిఁ గోకలను దయను
కేకలు వెట్టి వేడుకొన కృష్ణు డొసంగెనుబ్రేమ మీరగన్కోకలు ద్రౌపదీ సతికి గోర్కె నొసంగెను,కర్ణుడొప్పగన్నాక పురీశు డడ్గ దిననాథుడువద్దని యన్నగాని తానా కవచమ్ము కుండలము లర్థికినిచ్చెను దానకర్ణుడై.
అనేక భర్తృక గావున బంధకి యనంబడు, నిట్టి దాని విగత వస్త్ర జేసి తెచ్చినను ధర్మవిరోధమ్ము లేదని కర్ణుండనెన్ కేకలు వేయుచున్ సతిని కేశములంటి పరాభవించగాశోకముతోడ కృష్ణ కడు స్రుక్కుచునుండ సభాంతరమ్మునన్ పోకిరి మాటలన్ బలికె మూర్ఖత ద్రౌపతిఁ గాంచి, యెవ్విధిన్కోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను కర్ణుఁ డొప్పుగన్
ఆ కరుణామయుండు పరమాత్ముడు మాధవుడక్షయంబుగాకోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను; కర్ణుఁ డొప్పుగన్జేకొనుడంచు దానముల జేసెను కాదనకెల్లవారికిన్;ప్రాకట ధర్మ సూక్ష్మమిది పంచుటె పెంచును మంచినెన్నగా
దేవరాజగు మఘునకు దీసి తనదుకవచ కుండలముల డుగంగ దయకలిగికర్ణుడిచ్చె,ద్రౌపదికి గోకలను దయను జారవిడిచెను దేవతల్ సంతసించభక్తరక్షక! నీకివె వందనములు
కవచ కుండలము లడుగ గట్టుదాయకర్ణుఁ డిచ్చె, ద్రౌపదికిఁ గోకలను దయనుకృష్ణ భగవానుడొసగెను కృపనుబూనిదాతయొక్కరు వస్త్రప్రదాతయొకరు
భక్తగణ రక్షకుండు కృపా రసేక్షణుండు దుష్ట సంచయ శిక్షకుండు కృష్ణుఁడోర్వకయె విలపింప దుర్యోధనుండుకర్ణుఁ డిచ్చె ద్రౌపదికిఁ గోకలను దయనునాక ధరాత లాశ్రిత జనవ్రజ దుఃఖ మహాబ్ధి దాటఁగానౌకకు వాసుదేవుఁడు ఘనమ్ముగ కర్ణము కాఁగఁ గర్ణుఁడంబ్రాకట నాముఁ డయ్యె నిల భామ సభక్తి నుతింప నార్తినింగోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను కర్ణుఁ డొప్పుగన్ [సహజ కర్ణకుండలములతోఁ బుట్టి నందుకు వసుసేనుఁడు కర్ణుఁడు కాఁగ దుఃఖాబ్ధి తరణమునకుఁ గర్ణము కాఁగ కృష్ణుఁడు కర్ణుఁ డుగుట సమంజసమే కదా.]
శోకముతోడ నాయబల స్రుక్కుచు గృష్ణుని గోరనత్తఱిన్ కోకలు ద్రౌపదీసతికి గోర్కెనొసంగెను, గర్ణుడొప్పుగన్ నాకపుఱేడు కోరగను నమ్రతయొప్పగ గుండలంబులన్ గూకటి వ్రేళ్ళతో నొలిచి కోరికతీరగ నిచ్చెనేగదా
గోకుల నందనందనుఁడు కోమలి కృష్ణ మొరాలకించి తానా కులకాంత మానధనమందరి ముందర రక్షజేయగన్కోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను, కర్ణుఁ డొప్పుగన్వ్యాకులమోర్చి వాసవుడు యాచనసేయగ నిచ్చె వర్మమున్
ఇవ్వు దానము నాకని యింద్రుడడుగ,కవచ కుండలముల గోసి కడిగి నెత్రు,కర్ణుఁ డిచ్చె ; ద్రౌపదికిఁ గోకలను దయనుకృష్ణు డిచ్చెను, కురుసభ దృష్టి చెదర.
వజ్రి యడిగిన యంతనే వడిగ తనదుకవచకుండలములనట ఘనముగానుకర్ణుడిచ్చె, ద్రౌపదికి గోకలును దయదినక్షయంబగునట్లుగానచ్యుతుండు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
తొలగించండికోటిరుడడగ కవచము కుండలములు
కర్ణుడిచ్చె; ద్రౌపదికి గోకలను దయను
నొసగె శ్రీకృష్ణ పరమాత్మ యుత్తమమగు
భక్తితో వేడినంతట బాళిజూపి
కవచ కుండలములు కోర గట్టుదాయ
రిప్లయితొలగించండికర్ణుడిచ్చె,ద్రౌపదికి గోకలను దయను
కూడి సభలోన ఘన నంద గోప బాల
కుండొసగెను వేడుచు నామె కోరినంత
రిప్లయితొలగించండిగోత్రభిదుడు కొర కవచకుండలముల
గర్ణుడిచ్చె, ద్రౌపదికిఁ గోకలను దయను
యాదవాన్వయుడిచ్చె సభాంతరమున
గోమలాంగియె యార్తితో గోరినంత.
మారు వేషాన నింద్రుడు మాయ జేసి
రిప్లయితొలగించండికుండ లమ్ములు కవచము కోరినంత
గర్ణు ఢిచ్చె : ద్రౌపదికి గోకలను దయను
సభనొసంగెను కృష్ణుడు సంతసించి
సమస్య :
రిప్లయితొలగించండికోకలు ద్రౌపదీసతికి
గోర్కె నొసంగెను కర్ణు డొప్పుగన్
( శబ్దాలు సరిగా ఉచ్చరించలేని చవట నోట కృష్ణుడు కర్ణుడైనాడు )
ఉత్పలమాల
..................
వాకొనరాని వాక్కులకు
వాడొక వాగుడుకాయయే సుమా !
చేకొని కృష్ణుడంచు నన
జెల్వుగ నాలుక తిర్గబోదుగా !
నేకముగా పదంబునిక
యిట్టుల మార్చుచు బల్కె వింతగా
" కోకలు ద్రౌపదీసతికి
గోర్కె నొసంగెను కర్ణు డొప్పుగన్ . "
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
తొలగించండివీకగు భక్తితో తెలచ వేగమె కృష్ణుడు నెమ్మితోడుతన్
కోకలు ద్రౌపదీ సతికి కోర్కెనొసంగెను; కర్ణుడొప్పుగన్
తా కవచమ్ము పోగులను దానము జేసెను నింగినుండియున్
వాకిలి వద్దకా ద్యుపతి వచ్చి వితమ్ముగ కోరినంతటన్.
కుంగోరినవరమునుగొంకులేక
రిప్లయితొలగించండిశిరముదాల్చినపుత్రుడైశీఘ్రగతిని
కర్ణుడిచ్చె;ద్రౌపదికికోకలనుదయను
కృష్ణుడిచ్చెనుశీఘ్రమేకృపనుజూపి
కుంతిగోరిన
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికె.వి.యస్. లక్ష్మి:
తొలగించండికోటిరు డడగ కవచంబు కుండలములు
కర్ణుడిచ్చె; ద్రౌపదికి గోకలను దయను
నిచ్చి గోపయ్య కృపతోడ నిల్చి గాచె
నిండు సభలోన ముదముతో నెంతగాను
తేటగీతి
రిప్లయితొలగించండిచేరి మూకగ పాండవ చిత్రకథను
బాలలచ్చట చర్చింప, బయట నుండి
వింటి, యచ్చెరు వందగ పేర్చిరిట్లు
కర్ణుఁ డిచ్చె ద్రౌపదికిఁ గోకలను దయను
ఉత్పలమాల
కేకలువేయుచున్ దుమికి గెంతెడు బాలలు నొక్కడొక్కడున్
మూకగ జేరి ముంగిటను ముచ్చట పాండవ చిత్రరాజమున్
కూకటి వేళ్ళతోఁ బెరికి గూర్చిన మేటి నవీన గాథలో
కోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను కర్ణుఁ డొప్పుగన్
రిప్లయితొలగించండిహ్రీకుడు కాగితమ్ముపయి నిట్టుల వ్రాసెను తేట తెన్గునన్
గోకలు ద్రౌపదీ సతికి గోర్కెనొసంగెను కృష్ణుడొప్పుగన్
బోకిరి పుత్రుడద్దిగని భోగముఁ గృష్ణును కర్ణుజేయగా
సూకరుడేగుదెంచి యది చూచి పఠించెనమాయకమ్ముగా
కోకలు ద్రౌపదీసతికి గోర్కెనొసంగెను కర్ణుడొప్పుగన్.
తోకలులేని కోతులగు తుంటరి బాలురు పల్కిరివ్విధిన్
రిప్లయితొలగించండిసాకెను కుంతిదేవి బహు సంబరమందుచు సూర్యపుత్రునిన్
కోకలు ద్రౌపదీసతికి గోరియొసంగెను కర్ణుడొప్పుగన్
నాకముకేగి ధర్మజుడు నర్తకి యూర్వశి శాపమందెగా
భీకరమైన భీష్మునని భీముడు చంపెను బావమెచ్చగా
రిప్లయితొలగించండిఇచ్చె కవచ కుండలముల నింద్రునకెవ
రంటి? నెవరికి పతులేవురంటి? తెలుపు
కృష్ణుడిచ్చెను సభలోన కృష్ణకేమి?
కర్ణు డిచ్చె, ద్రౌపదికి, గోకలను దయను.
ఉ:
రిప్లయితొలగించండిలోకము నందు గ్రంథములు లోభ్యము నెంచి పరీక్ష జేయగన్
తాఁకదు నిట్టి కల్పనము తర్కము కందని ప్రత్యయమ్ము గన్
చేకొనుటెట్లు నిట్టులగు చిత్తము తల్లడబెట్టు వ్రాతలన్
కోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను కర్ణుఁ డొప్పుగన్
గ్రంథములు=మహా భారత కథ పై వ్రాసిన గ్రంథములు
లొభ్యము=ఆశ కలిగించునది
వై. చంద్రశేఖర్
ఆ కుల కాంత వేడికొన వ్యాకుల చిత్తను గావనెంచుచున్
రిప్లయితొలగించండిశ్రీకరు డిచ్చె దాను నిజ చెల్వము జూపి, మహా విశేషమౌ
కోకలు ద్రౌపదీ సతికిఁ; గోర్కె నొసంగెను కర్ణు డొప్పుగన్
నాకవిభుండు గోరఁగ ననాదరమెంచక దంశ కుండలుల్.
బవరమున పార్థు విడి యన్య పాండుసుతుల
రిప్లయితొలగించండివిడిచిపెట్టెద నని మాత పృథకభయము
కర్ణుఁ డిచ్చె ; ద్రౌపదికిఁ గోకలను దయను
కన్నడిడె నామె మానము గాపు గడకు
నిండు సభలోకి శిగబట్టి నీడ్చుకొచ్చు
రిప్లయితొలగించండికౌరవులనుండి రక్షణ గోరు కృష్ణ
తనను వేడగ నందనందనసునిశిత
కర్ణుఁ డిచ్చె ద్రౌపదికిఁ గోకలను దయను
కేకలు వెట్టి వేడుకొన కృష్ణు డొసంగెను
రిప్లయితొలగించండిబ్రేమ మీరగన్
కోకలు ద్రౌపదీ సతికి గోర్కె నొసంగెను,
కర్ణుడొప్పగన్
నాక పురీశు డడ్గ దిననాథుడు
వద్దని యన్నగాని తా
నా కవచమ్ము కుండలము లర్థికి
నిచ్చెను దానకర్ణుడై.
అనేక భర్తృక గావున బంధకి యనంబడు, నిట్టి దాని విగత వస్త్ర జేసి
రిప్లయితొలగించండితెచ్చినను ధర్మవిరోధమ్ము లేదని కర్ణుండనెన్
కేకలు వేయుచున్ సతిని కేశములంటి పరాభవించగా
శోకముతోడ కృష్ణ కడు స్రుక్కుచునుండ సభాంతరమ్మునన్
పోకిరి మాటలన్ బలికె మూర్ఖత ద్రౌపతిఁ గాంచి, యెవ్విధిన్
కోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను కర్ణుఁ డొప్పుగన్
ఆ కరుణామయుండు పరమాత్ముడు మాధవుడక్షయంబుగా
రిప్లయితొలగించండికోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను; కర్ణుఁ డొప్పుగన్
జేకొనుడంచు దానముల జేసెను కాదనకెల్లవారికిన్;
ప్రాకట ధర్మ సూక్ష్మమిది పంచుటె పెంచును మంచినెన్నగా
దేవరాజగు మఘునకు దీసి తనదు
రిప్లయితొలగించండికవచ కుండలముల డుగంగ దయకలిగి
కర్ణుడిచ్చె,ద్రౌపదికి గోకలను దయను
జారవిడిచెను దేవతల్ సంతసించ
భక్తరక్షక! నీకివె వందనములు
కవచ కుండలము లడుగ గట్టుదాయ
రిప్లయితొలగించండికర్ణుఁ డిచ్చె, ద్రౌపదికిఁ గోకలను దయను
కృష్ణ భగవానుడొసగెను కృపనుబూని
దాతయొక్కరు వస్త్రప్రదాతయొకరు
భక్తగణ రక్షకుండు కృపా రసేక్ష
రిప్లయితొలగించండిణుండు దుష్ట సంచయ శిక్షకుండు కృష్ణుఁ
డోర్వకయె విలపింప దుర్యోధనుండు
కర్ణుఁ డిచ్చె ద్రౌపదికిఁ గోకలను దయను
నాక ధరాత లాశ్రిత జనవ్రజ దుఃఖ మహాబ్ధి దాటఁగా
నౌకకు వాసుదేవుఁడు ఘనమ్ముగ కర్ణము కాఁగఁ గర్ణుఁడం
బ్రాకట నాముఁ డయ్యె నిల భామ సభక్తి నుతింప నార్తినిం
గోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను కర్ణుఁ డొప్పుగన్
[సహజ కర్ణకుండలములతోఁ బుట్టి నందుకు వసుసేనుఁడు కర్ణుఁడు కాఁగ దుఃఖాబ్ధి తరణమునకుఁ గర్ణము కాఁగ కృష్ణుఁడు కర్ణుఁ డుగుట సమంజసమే కదా.]
శోకముతోడ నాయబల స్రుక్కుచు గృష్ణుని గోరనత్తఱిన్
రిప్లయితొలగించండికోకలు ద్రౌపదీసతికి గోర్కెనొసంగెను, గర్ణుడొప్పుగన్
నాకపుఱేడు కోరగను నమ్రతయొప్పగ గుండలంబులన్
గూకటి వ్రేళ్ళతో నొలిచి కోరికతీరగ నిచ్చెనేగదా
గోకుల నందనందనుఁడు కోమలి కృష్ణ మొరాలకించి తా
రిప్లయితొలగించండినా కులకాంత మానధనమందరి ముందర రక్షజేయగన్
కోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను, కర్ణుఁ డొప్పుగన్
వ్యాకులమోర్చి వాసవుడు యాచనసేయగ నిచ్చె వర్మమున్
ఇవ్వు దానము నాకని యింద్రుడడుగ,
రిప్లయితొలగించండికవచ కుండలముల గోసి కడిగి నెత్రు,
కర్ణుఁ డిచ్చె ; ద్రౌపదికిఁ గోకలను దయను
కృష్ణు డిచ్చెను, కురుసభ దృష్టి చెదర.
వజ్రి యడిగిన యంతనే వడిగ తనదు
రిప్లయితొలగించండికవచకుండలములనట ఘనముగాను
కర్ణుడిచ్చె, ద్రౌపదికి గోకలును దయది
నక్షయంబగునట్లుగానచ్యుతుండు.