28-9-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్”(లేదా...)“మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్”
మగువయె కోరెనటంచునునగరము జని పట్టుకోక నాథుడు కొని తెచ్చి గరిత కివ్వగ ముద్దిడిమగనికిఁ, గట్టినది చీర మహిళ మురియుచున్.
👌
క్రొవ్విడి వెంకట రాజారావు: జగదంబ పాత్రను పతియె అగజాజాని పరిణయపు నంకము నందున్ పగిదిగ నటించు వేళను మగనికి గట్టినది చీర మహిళ మురియుచున్.
నగరమున నాటకమ్మున మగువగ వేషము ధరించి మన్నన నొందన్ తగు విదపు రూపు గొఱకై మగనికి గట్టినది చీర మహిళ మురియుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సగమాడుదానివలెనుగనగపడతానేశివుఁడునునగజనుకోరెన్సిగలోపూవులుదురుముచుమగనికిఁగట్టినదిచీరమహిళమురియుచున్
బిగుతగు దుస్తులెన్నొ కొని పేరిమితో సతికిచ్చి దాల్చమంచు గరితఁ గోరినట్టి పురుషుషుండను గాంచుచు మందహాసియై జగతిని మేటియైన మన సంస్కృతి గొప్పదనమ్ము చెప్పుచున్ మగనికిఁ, జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్.
కందంఅగణిత బాహు బలంబున,వగచెడు సైరంధ్రిఁ గావ, వలలుండొప్పన్నగమౌ కీచకుఁ జంపగమగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్చంపకమాలఅగణిత శౌర్యమున్ గలిగి యాలిని మాలినిఁ గావనెంచుచున్నగ సముడైన కీచకుని నర్తనశాలకుఁ జేరఁ గూర్చితానగుపడి భామగా వలలుఁడంతముజేసెడు వ్యూహమల్లఁగన్మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
👌👌
🙏🙏🙏
గజ్జెలు కాళ్ళకు ఘనముగ కట్టెను విజయుడు, పెట్టెను వేళ్ళ నడుమమెట్టెలు నకులుడు, మెడలోనవేసె హారమును నగవుతో ధర్మజుడు,కేశములనల్లి జొనిపెను పూల చెండును సహదేవుడు, ముడుతలు తిప్పుచున్ త నదు మగనికి గట్టినది చీర మహిళ మురియుచు,నా భీముడు రిపుని రయముగ పరి మార్చగ దలచి నొక పరి లేవబోవ పిలిచెను పార్థుడు, బొట్టు బెట్డిముఖమున వెడల మన కుంతి మధ్య ముండుసాగె పడతితో నర్తన శాల కపుడు
సగమై దేహమున పతికి సిగలో పూవులను దురిమి చిరునగవులతోనగలను దాలిచి ప్రీతిగమగనికి, గట్టినది చీర మహిళ మురియుచున్ సగమయి దేహమందు బతి సమ్ముఖమందున కృష్ణవేణిలోసొగసుగ పూలహారమును జొన్పుచు ముద్దుగ మాటలాడుచున్నగలను మేనదాల్చి బహు నాజుకు నడ్మున ప్రీతిగొల్పగామగనికి, జీరకట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్
వగలునుసోయగంబులునవారితవేషమునందగింపగాపగలునుఱేయిపార్ధుడుబ్రుహన్నలగాగనుబుద్ధితోడుతన్అగపడక్రుష్ణనయ్యెడనునంగనరూపునుకోరెకవ్వడేమగనికిఁజీరఁగట్టెనోకమానినిమిక్కిలిసంతసించుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "బృహన్నల... కృష్ణ" టైపాట్లు
మొగుడతి మోదమొప్పగనుముద్దల భార్యకు దెచ్చె నందమౌధగధగ మంచు వెల్గు కడు దారణగల్గిన పట్టు చీర దానగుచును దాని దీసుకొని నాట్యమొనర్చెను, చాయ నిచ్చియున్మగనికి , చీరె గట్టెనొక మానిని మిక్కలి సంతసించుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మొగుడు' వ్యావహారికం. 'మగడు' అన్నది సాధురూపం.
క్రొవ్విడి వెంకట రాజారావు: అగజ వివాహ ఘట్టమను నంకమునందు విభుండు నార్యగా సొగసగురీతి చిందుగొనుచుండెడి వేళ ధవుండు చీరయే బిగుతుగ కట్ట రమ్మనుచు బిల్వగ మోదమునొంది ప్రేమతో మగనికి జీరగట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్.
గగనమునంటు వెల గనియుతెగువను జూపి కొనబోయి దీనిం దాల్చన్సొగసును జూచుటకయి తనమగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్
చం: సగమగు టెంచి జీవనము సామెత నొక్కటి జెప్పె నాస్యమున్మగటిమి కుంటుగించు మది మార్పు గ్రహించును నర్థనారిగన్తగినదనంచు యత్నమున దట్టిన యోచన నాచరింపనైమగనికి జీర గట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్వై. చంద్రశేఖర్
తగినదనంచు / తగినదటంచు గా చదువగలరు
*ఆదోని మండలంలోని *సంతేకుడ్లూరు* గ్రామంలో స్త్రీల వేష ధారణలో పురుషులు హోళీ పండుగ జరుపు కొంటారు. ఇది అక్కడి ఆచారము.దాని ఆధారంగా ఈ ప్రయత్నము: చం:ఎగబడి చీర కట్టెదరు యేడులు పైబడు వంశ చారమైతగినదటంచు గ్రామమున తాతల పద్ధతి వీడకుండగన్సొగసులు గ్రుమ్మరింప సరి చొక్కపు రంగుల హోళి యాడగన్మగనికి చీర గట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్వై. చంద్రశేఖర్
మొదటి పాదమును ఈ విధంగా సవరించితినిఎగబడి చీర కట్టెదరు నింటిలిపాదిగ సంప్రదాయమై
మగడొక నాటక మందునమగువగ నటియింపబూని మలగుచునుండన్అగణితవేగముతో దనమగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్
సమస్య :మగనికి జీర గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్ ( అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా మారిన అర్జునుడికి చిరునవ్వుతో ద్రౌపది చేసిన పని )" తగవును విస్మరించుచును దాలిమి లేనిది యూర్వశమ్మయే మగతన ముండకుండ నను మాన్యత వీడి శపించె ; నింక నే మగువ " ననంగ నర్జునుని మంచిగ జేరిన ద్రౌపదమ్మయే మగనికి జీర గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్ .( తగవు - న్యాయము ; తాలిమి - ఓర్పు )
వగలొలికెడు మగనాలిగతగవేషమువేయచీర తప్పక ధరియింపగవలసి రాగ నంతటమగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్
మిగుల గలగొను కరోనకుబెగడి గృహము విడి పనులకు వెళ్ళక యుండన్మగవాని బొజ్జ యుబుకగమగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అగవుల మునుగుచు మరువగజగమును మదిలో మదనుడు సందడి గొలుపన్సొగసుల బిగువును జూపుచుమగనికిఁ, గట్టినది చీర మహిళ మురియుచున్
నగరమునందు వేయబడు 'నాపతి నాగతి' నాటకమ్ములోవగలును వన్నెచిన్నెలను వావిరిగా నొలికించు తోయజాక్షిగ నటనమ్ముసల్పుటకు చీర ధరించుట రాక వేడగన్మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రగులగ జేయ కోపమును లావునుఁ జూపుచుఁ గీచకుండు వేపగతునిఁ జంపగా నిశిని పంపగ నెంచుచు భీమసేనునిన్సిగ కుసుమమ్ములన్ దురిమి చెన్నుగఁ దీరిచి మేని సొంపులన్మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
మగువలు,దొంగలై, తమకు భాగము నివ్వని దొంగభామినిన్తెగడగ, వారలన్ తొలగ దీసెను, మ్రుచ్చిలు చోట తోడుకైమగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్తెగువగ దోచి చీరలను తేరగ పండుగ వేళ కట్టగా!
తగదని జెప్పినన్ వినక తామసుఁడామెను వేఁచుచుండగావగలొలికించి యాతనిని వత్తును నర్తనశాలకంచు దాతెగువగ జెప్పి వానికిక దీర్చగ కోర్కె నుపక్రమించెడిన్మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
బిగుతగు దుస్తులవేలామగువలకగు మానహాని, మన సంస్కృతికిన్తగవని గౌనులు జెప్పుచుమగనికిఁ; గట్టినది చీర మహిళ మురియుచున్
తగు చీరయుతికి మడవగతెగనలసెను మగువ,చూడ తెరపై సినిమానిగనిగ దుస్తుల నిచ్చెన్మగనికిఁ, గట్టినది చీర మహిళ మురియుచున్.
మగువలకు భర్త మెచ్చంగఁ గలుగు నట సంతసమ్ము కర మెద నందమ్ముగ నచ్చు విధమ్ముగఁ దన మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్పగులును మాన మంచు మది భావనఁ జేయుచు నెవ్వ రేనియుం దగ దని మాన వచ్చు మఱి దానిని మానఁడు నూన నెన్నఁడుం దగ ధరియింప భద్ర మిడు దైవము దానిని హస్త సూత్రమున్మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్ [చీరన్ = పిలువఁగ ]
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
చీర గొనగను ముద్దిడె దార తనదుమగనికి,గట్టినది చీరమహిళ మురియుచున్ మిగుల నచ్చిన దగుచును నిగనిగలుగమెఱయు చుండుట కారణ మె మురియుటకు
సమస్యాపాదం కందమైతే మీరు తేటగీతి వ్రాసారు.
క్షంతవ్యుడను
*మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్.*ప్రయత్నం:పగతుర బిండి జేయగల పాండవ వీరులు మారు రూపునన్దిగగ విరాటరాజుకడ ధీర యుధిష్ఠిరుఁ గంకుభట్టుగా,రగిలెడు వాయునందనుడు లాఘవమేర్పడ వంటవానిగా,మగటిమి జూపు నర్జునుడు మారగ పేడిగఁ, జింత వీడుచున్మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్.
మగడొక నాటకంబునకు మానిని వేషమువేయ గోరగామగనికి జీరకట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్ మగువలు గోరునెప్పుడును మన్ననతోడను నుండుచున్ నికన్ నగవులుజిమ్ముమోముల ననారతమున్ సుఖజీవనంబునౌ
రిప్లయితొలగించండిమగువయె కోరెనటంచును
నగరము జని పట్టుకోక నాథుడు కొని తె
చ్చి గరిత కివ్వగ ముద్దిడి
మగనికిఁ, గట్టినది చీర మహిళ మురియుచున్.
👌
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిజగదంబ పాత్రను పతియె
అగజాజాని పరిణయపు నంకము నందున్
పగిదిగ నటించు వేళను
మగనికి గట్టినది చీర మహిళ మురియుచున్.
👌
తొలగించండినగరమున నాటకమ్మున
రిప్లయితొలగించండిమగువగ వేషము ధరించి మన్నన నొందన్
తగు విదపు రూపు గొఱకై
మగనికి గట్టినది చీర మహిళ మురియుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసగమాడుదానివలెనుగ
రిప్లయితొలగించండినగపడతానేశివుఁడునునగజనుకోరెన్
సిగలోపూవులుదురుముచు
మగనికిఁగట్టినదిచీరమహిళమురియుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబిగుతగు దుస్తులెన్నొ కొని పేరిమితో సతికిచ్చి దాల్చమం
చు గరితఁ గోరినట్టి పురుషుషుండను గాంచుచు మందహాసియై
జగతిని మేటియైన మన సంస్కృతి గొప్పదనమ్ము చెప్పుచున్
మగనికిఁ, జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్.
👌
తొలగించండికందం
రిప్లయితొలగించండిఅగణిత బాహు బలంబున,
వగచెడు సైరంధ్రిఁ గావ, వలలుండొప్పన్
నగమౌ కీచకుఁ జంపగ
మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్
చంపకమాల
అగణిత శౌర్యమున్ గలిగి యాలిని మాలినిఁ గావనెంచుచున్
నగ సముడైన కీచకుని నర్తనశాలకుఁ జేరఁ గూర్చితా
నగుపడి భామగా వలలుఁడంతముజేసెడు వ్యూహమల్లఁగన్
మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
👌👌
తొలగించండి🙏🙏🙏
తొలగించండిగజ్జెలు కాళ్ళకు ఘనముగ కట్టెను
రిప్లయితొలగించండివిజయుడు, పెట్టెను వేళ్ళ నడుమ
మెట్టెలు నకులుడు, మెడలోన
వేసె హా
రమును నగవుతో ధర్మజుడు,కేశ
ములనల్లి జొనిపెను పూల చెండును సహ
దేవుడు, ముడుతలు తిప్పుచున్ త
నదు మగనికి గట్టినది చీర మహిళ ము
రియుచు,నా భీముడు రిపుని రయము
గ పరి మార్చగ దలచి నొక పరి లేవ
బోవ పిలిచెను పార్థుడు, బొట్టు బెట్డి
ముఖమున వెడల మన కుంతి మధ్య ముండు
సాగె పడతితో నర్తన శాల కపుడు
👌
తొలగించండిసగమై దేహమున పతికి
రిప్లయితొలగించండిసిగలో పూవులను దురిమి చిరునగవులతో
నగలను దాలిచి ప్రీతిగ
మగనికి, గట్టినది చీర మహిళ మురియుచున్
సగమయి దేహమందు బతి సమ్ముఖమందున కృష్ణవేణిలో
సొగసుగ పూలహారమును జొన్పుచు ముద్దుగ మాటలాడుచున్
నగలను మేనదాల్చి బహు నాజుకు నడ్మున ప్రీతిగొల్పగా
మగనికి, జీరకట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్
👌👌
తొలగించండివగలునుసోయగంబులునవారితవేషమునందగింపగా
రిప్లయితొలగించండిపగలునుఱేయిపార్ధుడుబ్రుహన్నలగాగనుబుద్ధితోడుతన్
అగపడక్రుష్ణనయ్యెడనునంగనరూపునుకోరెకవ్వడే
మగనికిఁజీరఁగట్టెనోకమానినిమిక్కిలిసంతసించుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"బృహన్నల... కృష్ణ" టైపాట్లు
మొగుడతి మోదమొప్పగను
రిప్లయితొలగించండిముద్దల భార్యకు దెచ్చె నందమౌ
ధగధగ మంచు వెల్గు కడు దారణ
గల్గిన పట్టు చీర దా
నగుచును దాని దీసుకొని నాట్యమొ
నర్చెను, చాయ నిచ్చియున్
మగనికి , చీరె గట్టెనొక మానిని
మిక్కలి సంతసించుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మొగుడు' వ్యావహారికం. 'మగడు' అన్నది సాధురూపం.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅగజ వివాహ ఘట్టమను నంకమునందు విభుండు నార్యగా
సొగసగురీతి చిందుగొనుచుండెడి వేళ ధవుండు చీరయే
బిగుతుగ కట్ట రమ్మనుచు బిల్వగ మోదమునొంది ప్రేమతో
మగనికి జీరగట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్.
👌
తొలగించండిగగనమునంటు వెల గనియు
రిప్లయితొలగించండితెగువను జూపి కొనబోయి దీనిం దాల్చన్
సొగసును జూచుటకయి తన
మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం:
రిప్లయితొలగించండిసగమగు టెంచి జీవనము సామెత నొక్కటి జెప్పె నాస్యమున్
మగటిమి కుంటుగించు మది మార్పు గ్రహించును నర్థనారిగన్
తగినదనంచు యత్నమున దట్టిన యోచన నాచరింపనై
మగనికి జీర గట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్
వై. చంద్రశేఖర్
తగినదనంచు / తగినదటంచు గా చదువగలరు
తొలగించండి*ఆదోని మండలంలోని *సంతేకుడ్లూరు* గ్రామంలో స్త్రీల వేష ధారణలో పురుషులు హోళీ పండుగ జరుపు కొంటారు. ఇది అక్కడి ఆచారము.దాని ఆధారంగా ఈ ప్రయత్నము:
తొలగించండిచం:
ఎగబడి చీర కట్టెదరు యేడులు పైబడు వంశ చారమై
తగినదటంచు గ్రామమున తాతల పద్ధతి వీడకుండగన్
సొగసులు గ్రుమ్మరింప సరి చొక్కపు రంగుల హోళి యాడగన్
మగనికి చీర గట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్
వై. చంద్రశేఖర్
👌👌
తొలగించండిమొదటి పాదమును ఈ విధంగా సవరించితిని
తొలగించండిఎగబడి చీర కట్టెదరు నింటిలిపాదిగ సంప్రదాయమై
మగడొక నాటక మందున
రిప్లయితొలగించండిమగువగ నటియింపబూని మలగుచునుండన్
అగణితవేగముతో దన
మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిమగనికి జీర గట్టెనొక
మానిని మిక్కిలి సంతసించుచున్
( అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా మారిన అర్జునుడికి చిరునవ్వుతో ద్రౌపది చేసిన పని )
" తగవును విస్మరించుచును
దాలిమి లేనిది యూర్వశమ్మయే
మగతన ముండకుండ నను
మాన్యత వీడి శపించె ; నింక నే
మగువ " ననంగ నర్జునుని
మంచిగ జేరిన ద్రౌపదమ్మయే
మగనికి జీర గట్టెనొక
మానిని మిక్కిలి సంతసించుచున్ .
( తగవు - న్యాయము ; తాలిమి - ఓర్పు )
👌
తొలగించండివగలొలికెడు మగనాలిగ
రిప్లయితొలగించండితగవేషమువేయచీర తప్పక ధరియిం
పగవలసి రాగ నంతట
మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిగుల గలగొను కరోనకు
రిప్లయితొలగించండిబెగడి గృహము విడి పనులకు వెళ్ళక యుండన్
మగవాని బొజ్జ యుబుకగ
మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅగవుల మునుగుచు మరువగ
రిప్లయితొలగించండిజగమును మదిలో మదనుడు సందడి గొలుపన్
సొగసుల బిగువును జూపుచు
మగనికిఁ, గట్టినది చీర మహిళ మురియుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినగరమునందు వేయబడు 'నాపతి నాగతి' నాటకమ్ములో
రిప్లయితొలగించండివగలును వన్నెచిన్నెలను వావిరిగా నొలికించు తోయజా
క్షిగ నటనమ్ముసల్పుటకు చీర ధరించుట రాక వేడగన్
మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరగులగ జేయ కోపమును లావునుఁ జూపుచుఁ గీచకుండు వే
రిప్లయితొలగించండిపగతునిఁ జంపగా నిశిని పంపగ నెంచుచు భీమసేనునిన్
సిగ కుసుమమ్ములన్ దురిమి చెన్నుగఁ దీరిచి మేని సొంపులన్
మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
👌
తొలగించండిమగువలు,దొంగలై, తమకు భాగము నివ్వని దొంగభామినిన్
రిప్లయితొలగించండితెగడగ, వారలన్ తొలగ దీసెను, మ్రుచ్చిలు చోట తోడుకై
మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
తెగువగ దోచి చీరలను తేరగ పండుగ వేళ కట్టగా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితగదని జెప్పినన్ వినక తామసుఁడామెను వేఁచుచుండగా
రిప్లయితొలగించండివగలొలికించి యాతనిని వత్తును నర్తనశాలకంచు దా
తెగువగ జెప్పి వానికిక దీర్చగ కోర్కె నుపక్రమించెడిన్
మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
👌
తొలగించండిబిగుతగు దుస్తులవేలా
రిప్లయితొలగించండిమగువలకగు మానహాని, మన సంస్కృతికిన్
తగవని గౌనులు జెప్పుచు
మగనికిఁ; గట్టినది చీర మహిళ మురియుచున్
👌
తొలగించండితగు చీరయుతికి మడవగ
రిప్లయితొలగించండితెగనలసెను మగువ,చూడ తెరపై సినిమా
నిగనిగ దుస్తుల నిచ్చెన్
మగనికిఁ, గట్టినది చీర మహిళ మురియుచున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమగువలకు భర్త మెచ్చం
రిప్లయితొలగించండిగఁ గలుగు నట సంతసమ్ము కర మెద నంద
మ్ముగ నచ్చు విధమ్ముగఁ దన
మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్
పగులును మాన మంచు మది భావనఁ జేయుచు నెవ్వ రేనియుం
దగ దని మాన వచ్చు మఱి దానిని మానఁడు నూన నెన్నఁడుం
దగ ధరియింప భద్ర మిడు దైవము దానిని హస్త సూత్రమున్
మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
[చీరన్ = పిలువఁగ ]
👌👌
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిచీర గొనగను ముద్దిడె దార తనదు
రిప్లయితొలగించండిమగనికి,గట్టినది చీరమహిళ మురియుచున్
మిగుల నచ్చిన దగుచును నిగనిగలుగ
మెఱయు చుండుట కారణ మె మురియుటకు
సమస్యాపాదం కందమైతే మీరు తేటగీతి వ్రాసారు.
తొలగించండిక్షంతవ్యుడను
తొలగించండి*మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్.*
రిప్లయితొలగించండిప్రయత్నం:
పగతుర బిండి జేయగల పాండవ వీరులు మారు రూపునన్
దిగగ విరాటరాజుకడ ధీర యుధిష్ఠిరుఁ గంకుభట్టుగా,
రగిలెడు వాయునందనుడు లాఘవమేర్పడ వంటవానిగా,
మగటిమి జూపు నర్జునుడు మారగ పేడిగఁ, జింత వీడుచున్
మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్.
👌
తొలగించండిమగడొక నాటకంబునకు మానిని వేషమువేయ గోరగా
రిప్లయితొలగించండిమగనికి జీరకట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
మగువలు గోరునెప్పుడును
మన్ననతోడను నుండుచున్ నికన్
నగవులుజిమ్ముమోముల ననారతమున్ సుఖజీవనంబునౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి