29-9-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్”(లేదా...)“దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే”
సమస్య :దారుణ కృష్ణసర్పము సు ధల్ వెలిగ్రక్కుచునుండె జూడరే ( ప్రసన్నవదనంతో అగ్రపూజను అందుకొంటున్న శ్రీకృష్ణుని చూచి ఈర్ష్యతో శిశుపాలుడు )ఉత్పలమాల ...................కారణమేమి లేక నను కాంతను వేరుగ జేయ నెంచెనే !వారణ జేసినన్ బదులు బల్కడు మార్గము మార దల్పడే !భీరులు జేరుచున్ భజన బెల్లుగ సల్పిన దేవుడాయెగా !దారుణ కృష్ణసర్పము సు ధల్ వెలిగ్రక్కుచునుండె జూడరే !( కాంతను - రుక్మిణిని )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధీరముగా శ్రీ కృష్ణుడు తోరముగా నాట్య మాడి త్రుంచ నహంబున్ మారిన కాళీయు డనెడు దారుణ సర్పము గనుడు సుధల్ వెలి గ్రక్కెన్
చక్కని పూరణ. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: భూరి మెడను భూషణమగు దారుణ సర్పము గనుడు; సుధల్ వెలిగ్రక్కెన్ క్షీరాబ్ధి మోదమిడుచున్ చారణులకు దానవులకు శ్రమఫలితమునై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర యుద్ధఘట్టపు ప్రత్యక్ష వ్యాఖ్యాతగా... కందంభారత! మోహము వీడుమునేరక కర్తృత్వము నని నీదనఁ దగునే?మారుమని గీతఁ బలుకులదారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్!ఉత్పలమాలభారత! మోహమున్ విడచి పట్టుమ! వింటిని యుద్ధభూమిలోనేరక కర్తవన్నిటికి నీవను భ్రాంతిని వీడ మంచుఁదాసారధి విశ్వరూపమున సర్వమెఱుంగగ గీతజెప్పుచున్దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
కూరిమిమీరదేవరాక్షసులుకూటమితోడనుచిల్కసమద్రమున్తారుగవాసుకిన్దనరదర్వికిగట్టినతాడుఁజేసిరేకోరలుసాచునట్టిఘనకౌశలుడయ్యెడశాంతుడయ్యెగాదారుణక్రుష్ణసర్పముసుధల్వెలిగ్రక్కుచునుండెఁజూడరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు. *కూరిమి దేవరాక్షసులు కూటమి..." అనండి. లేకుంటే గణభంగం.
తప్పుగాపరాకునవ్రాసితినిక్షమించగలరు
సంద్రమున్
భురిగ పంచి ధనము మూలేరుగ గెలిచి యొక కల్లరీడు సతతమాచోరుడు నీతులు చెప్పెను దారుణసర్పముఁ గనుడు సుధల్ వెలిగ్రక్కెన్.
చేరంబోయినమడుగునునీరంబులనున్నపామునేరుపుతోడన్పోరునధర్మముదెలిపెనుదారుణసర్పమున్గనుఁడుసుధల్వెలిగ్రక్కెన్
ఉ: పారగ జేసి రొక్కమును భారము మీదె యటంచు నెన్నికన్కోరెను వోటు వేయమని క్రూరుడు పూర్వము నెంచి చూడగన్మారిన వానిగన్ బ్రజల మన్నన బొందగ మాయసేయనైదారుణ కృష్ణ సర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండె జూడరే వై. చంద్రశేఖర్
నేరము లెన్నియో సలుపు నీచుడు మంత్రిగ గెల్చి నంతనే భూరి ప్రజాధనమ్మునిక బొక్కుచు సత్పురుషుండ నంచు తాభీరములన్ వచించుచును ఫేరవులన్ క్షమియించనంచనన్ దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే.
క్రొవ్విడి వెంకట రాజారావు: తీరుగ ద్యూతము నాడక గౌరున ధర్మజు గెలిచియు కస్తిపడునటుల్ తారాడుచు రారాజను దారుణ సర్పము గనుడు సుధల్ వెలిగ్రక్కెన్.
తోరణములాగ పొడవగుదారుణ సర్పముఁ గనుఁడు, సుధల్ వెలిగ్రక్కెన్సౌరభముల్ జిలుకు సురభియేరీతిగనౌ! నిరతము నిచ్చున్ విషమున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'లాగ' అనడం వ్యావహారికం. "తోరణము వోలె" అనండి.
వేరొక తావున గనరాదీ రసపోషణ నిపుణత దెల్పెడు శిల్పాతోరణ సౌందర్య గరిమదారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'శిల్పతోరణము' అనడం సాధువు కదా?
కారణకారణమ్ము తన కంఠమునన్ గరళంబు దాల్చితావారణజేసె లోకముల పల్లటముల్, గళమందు గ్రాలగాదారుణ కృష్ణసర్పము, సుధల్ వెలి గ్రక్కుచు నుండెఁ జూడరేగౌరుడు మూర్ధమందు తెలి కాంతులు నింపుచు నాల్గు దిక్కులన్
*కారణకారణుండు
మారణ సలుపు విషమునిడుదారుణ సర్పముఁ ; గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్క్షీర సముద్రము , దానినిదారుణ సర్పము నగముకు తాడై చిలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "మారణము సల్పు విషమిడు" అనండి. 'నగమునకు' అనడం సాధువు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కారణకారణుని మెడనుదారుణ సర్పముఁ గనుఁడు, సుధల్ వెలిగ్రక్కెన్గౌరుడు మూర్ధమునందునసారించుచు చంద్రికలను సకల జగములన్
క్రొవ్విడి వెంకట రాజారావు: తీరునుగాని చందమున తియ్యని మాటలు పల్కుచుండుచున్ గౌరునొనర్చి జూదమున కంకుని గెల్చి సుయోధనుండటన్ భూరిగ బాధనొందునటు ముమ్మరమౌ నటనమ్ము జేయుటన్ దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే1
దారుణ 'కాన్సరు' వ్యాధి నివారణ 'కీమో థెరపి'గ వాడగ విషమున్జోరున యౌషధ మేర్పడదారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్
నేరమయంపు జీవితము నిర్భయమున్ గడియించి సొమ్ములన్ధారుణి పైన నున్నతపు స్థానము పొందగ కోర్కెపుట్టగాచేరెను రాజకీయముల, చెన్నగు పల్కుల నాడు చున్ భళా!దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే.
మారణ తత్వమున్కలిగి మాయురె మానుష జాతి భీతికిన్కారణమైననేమి తను కమ్మని యమ్మతనంబు చూపుచున్ప్రాణము బెట్టి సంతుకను రాగము బంచుచు పుట్టనుండు యీదారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే
ఓ రమణీమణీ! తగిన యోచన జేయుము స్వర్ణ లంకలోఆ రఘురామునిన్ విడచి హ్లాదమునొందుము నాదుతోడుతన్మీరకయుందురీ సతులు మిక్కిలి భక్తిని నీదునాజ్ఞలన్సారసలోచనా! తెలిసి చక్కగ నేలుము రాజ్ఞివైదగన్ దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె చూడరే
వేరిక దిక్కు లేరనుచు వేడ మహేశుఁడు మ్రింగెనయ్యెడన్మారణ ధూమమున్ జలధి మంథన వేళ విషాగ్ని రేపగాదారుణ కృష్ణసర్పము; సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే భూరికృపాకరుండు హరి మోహినియై కలశంబు చేగొనన్
చేరగ భయపడు నటులుగనీరము దావిషముజేయ,నిర్భయముగనానీరజనాభుడు ద్రొక్కగదారుణ సర్పము గనుడు సుధల్ వెలిగ్రక్కెన్
వేరయినట్టి రాష్ట్రమున పేదకు రాజ్యము నిత్తునంచు దాబీరములాడి ముఖ్యపదవిన్ గొని హీనజనంబునంత, విడ్డూరము గొల్ప, నేతలు కడున్ మొరగున్ సలుపంగఁ జూడగాదారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే.
వారక తిరిగి తిరిగి యావారిధి నొడ్డాణ మనఁగఁ బన్నుగఁ జెలఁగం బేరిమి మందర గిరి కొని దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలి గ్రక్కెన్దారగ ధర్మమే యనుచు దైత్య కులోద్భవ రాజ కోటికిం గోరిన స్త్రీల నెల్లరను గొంకక పొందుట సర్వ నిర్జరౌ ఘారి వచించె నౌర జనకాత్మజతో ఘన రాజనీతినిన్ దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే
మి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
నీరము నంతయున్ విషమునింపుచు భీతిని గల్గజేయగానీరజనాభు డత్తఱిని నిర్భయమొందుచు బాపఱేనినిన్ నారడి వెట్టగా మిగుల,హాహరి!కావుమ యంచు కోరియాదారుణకృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండె జూడరే
సమస్య :
రిప్లయితొలగించండిదారుణ కృష్ణసర్పము సు
ధల్ వెలిగ్రక్కుచునుండె జూడరే
( ప్రసన్నవదనంతో అగ్రపూజను అందుకొంటున్న శ్రీకృష్ణుని చూచి ఈర్ష్యతో శిశుపాలుడు )
ఉత్పలమాల
...................
కారణమేమి లేక నను
కాంతను వేరుగ జేయ నెంచెనే !
వారణ జేసినన్ బదులు
బల్కడు మార్గము మార దల్పడే !
భీరులు జేరుచున్ భజన
బెల్లుగ సల్పిన దేవుడాయెగా !
దారుణ కృష్ణసర్పము సు
ధల్ వెలిగ్రక్కుచునుండె జూడరే !
( కాంతను - రుక్మిణిని )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధీరముగా శ్రీ కృష్ణుడు
రిప్లయితొలగించండితోరముగా నాట్య మాడి త్రుంచ నహంబున్
మారిన కాళీయు డనెడు
దారుణ సర్పము గనుడు సుధల్ వెలి గ్రక్కెన్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిభూరి మెడను భూషణమగు
దారుణ సర్పము గనుడు; సుధల్ వెలిగ్రక్కెన్
క్షీరాబ్ధి మోదమిడుచున్
చారణులకు దానవులకు శ్రమఫలితమునై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర యుద్ధఘట్టపు ప్రత్యక్ష వ్యాఖ్యాతగా...
రిప్లయితొలగించండికందం
భారత! మోహము వీడుము
నేరక కర్తృత్వము నని నీదనఁ దగునే?
మారుమని గీతఁ బలుకుల
దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్!
ఉత్పలమాల
భారత! మోహమున్ విడచి పట్టుమ! వింటిని యుద్ధభూమిలో
నేరక కర్తవన్నిటికి నీవను భ్రాంతిని వీడ మంచుఁదా
సారధి విశ్వరూపమున సర్వమెఱుంగగ గీతజెప్పుచున్
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండికూరిమిమీరదేవరాక్షసులుకూటమితోడనుచిల్కసమద్రమున్
రిప్లయితొలగించండితారుగవాసుకిన్దనరదర్వికిగట్టినతాడుఁజేసిరే
కోరలుసాచునట్టిఘనకౌశలుడయ్యెడశాంతుడయ్యెగా
దారుణక్రుష్ణసర్పముసుధల్వెలిగ్రక్కుచునుండెఁజూడరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*కూరిమి దేవరాక్షసులు కూటమి..." అనండి. లేకుంటే గణభంగం.
తప్పుగాపరాకునవ్రాసితినిక్షమించగలరు
తొలగించండిసంద్రమున్
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిభురిగ పంచి ధనము మూ
లేరుగ గెలిచి యొక కల్లరీడు సతతమా
చోరుడు నీతులు చెప్పెను
దారుణసర్పముఁ గనుడు సుధల్ వెలిగ్రక్కెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేరంబోయినమడుగును
రిప్లయితొలగించండినీరంబులనున్నపామునేరుపుతోడన్
పోరునధర్మముదెలిపెను
దారుణసర్పమున్గనుఁడుసుధల్వెలిగ్రక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిపారగ జేసి రొక్కమును భారము మీదె యటంచు నెన్నికన్
కోరెను వోటు వేయమని క్రూరుడు పూర్వము నెంచి చూడగన్
మారిన వానిగన్ బ్రజల మన్నన బొందగ మాయసేయనై
దారుణ కృష్ణ సర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండె జూడరే
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినేరము లెన్నియో సలుపు నీచుడు మంత్రిగ గెల్చి నంతనే
భూరి ప్రజాధనమ్మునిక బొక్కుచు సత్పురుషుండ నంచు తా
భీరములన్ వచించుచును ఫేరవులన్ క్షమియించనంచనన్
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితీరుగ ద్యూతము నాడక
గౌరున ధర్మజు గెలిచియు కస్తిపడునటుల్
తారాడుచు రారాజను
దారుణ సర్పము గనుడు సుధల్ వెలిగ్రక్కెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితోరణములాగ పొడవగు
రిప్లయితొలగించండిదారుణ సర్పముఁ గనుఁడు, సుధల్ వెలిగ్రక్కెన్
సౌరభముల్ జిలుకు సురభి
యేరీతిగనౌ! నిరతము నిచ్చున్ విషమున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లాగ' అనడం వ్యావహారికం. "తోరణము వోలె" అనండి.
వేరొక తావున గనరా
రిప్లయితొలగించండిదీ రసపోషణ నిపుణత దెల్పెడు శిల్పా
తోరణ సౌందర్య గరిమ
దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శిల్పతోరణము' అనడం సాధువు కదా?
కారణకారణమ్ము తన కంఠమునన్ గరళంబు దాల్చితా
రిప్లయితొలగించండివారణజేసె లోకముల పల్లటముల్, గళమందు గ్రాలగా
దారుణ కృష్ణసర్పము, సుధల్ వెలి గ్రక్కుచు నుండెఁ జూడరే
గౌరుడు మూర్ధమందు తెలి కాంతులు నింపుచు నాల్గు దిక్కులన్
*కారణకారణుండు
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమారణ సలుపు విషమునిడు
రిప్లయితొలగించండిదారుణ సర్పముఁ ; గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్
క్షీర సముద్రము , దానిని
దారుణ సర్పము నగముకు తాడై చిలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మారణము సల్పు విషమిడు" అనండి. 'నగమునకు' అనడం సాధువు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికారణకారణుని మెడను
రిప్లయితొలగించండిదారుణ సర్పముఁ గనుఁడు, సుధల్ వెలిగ్రక్కెన్
గౌరుడు మూర్ధమునందున
సారించుచు చంద్రికలను సకల జగములన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితీరునుగాని చందమున తియ్యని మాటలు పల్కుచుండుచున్
గౌరునొనర్చి జూదమున కంకుని గెల్చి సుయోధనుండటన్
భూరిగ బాధనొందునటు ముమ్మరమౌ నటనమ్ము జేయుటన్
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే1
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదారుణ 'కాన్సరు' వ్యాధి ని
రిప్లయితొలగించండివారణ 'కీమో థెరపి'గ వాడగ విషమున్
జోరున యౌషధ మేర్పడ
దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేరమయంపు జీవితము నిర్భయమున్ గడియించి సొమ్ములన్
రిప్లయితొలగించండిధారుణి పైన నున్నతపు స్థానము పొందగ కోర్కెపుట్టగా
చేరెను రాజకీయముల, చెన్నగు పల్కుల నాడు చున్ భళా!
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమారణ తత్వమున్కలిగి మాయురె మానుష జాతి భీతికిన్
రిప్లయితొలగించండికారణమైననేమి తను కమ్మని యమ్మతనంబు చూపుచున్
ప్రాణము బెట్టి సంతుకను రాగము బంచుచు పుట్టనుండు యీ
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిఓ రమణీమణీ! తగిన యోచన జేయుము స్వర్ణ లంకలో
ఆ రఘురామునిన్ విడచి హ్లాదమునొందుము నాదుతోడుతన్
మీరకయుందురీ సతులు మిక్కిలి భక్తిని నీదునాజ్ఞలన్
సారసలోచనా! తెలిసి చక్కగ నేలుము రాజ్ఞివైదగన్
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె చూడరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేరిక దిక్కు లేరనుచు వేడ మహేశుఁడు మ్రింగెనయ్యెడన్
రిప్లయితొలగించండిమారణ ధూమమున్ జలధి మంథన వేళ విషాగ్ని రేపగా
దారుణ కృష్ణసర్పము; సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే
భూరికృపాకరుండు హరి మోహినియై కలశంబు చేగొనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేరగ భయపడు నటులుగ
రిప్లయితొలగించండినీరము దావిషముజేయ,నిర్భయముగనా
నీరజనాభుడు ద్రొక్కగ
దారుణ సర్పము గనుడు సుధల్ వెలిగ్రక్కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేరయినట్టి రాష్ట్రమున పేదకు రాజ్యము నిత్తునంచు దా
రిప్లయితొలగించండిబీరములాడి ముఖ్యపదవిన్ గొని హీనజనంబునంత, వి
డ్డూరము గొల్ప, నేతలు కడున్ మొరగున్ సలుపంగఁ జూడగా
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివారక తిరిగి తిరిగి యా
రిప్లయితొలగించండివారిధి నొడ్డాణ మనఁగఁ బన్నుగఁ జెలఁగం
బేరిమి మందర గిరి కొని
దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలి గ్రక్కెన్
దారగ ధర్మమే యనుచు దైత్య కులోద్భవ రాజ కోటికిం
గోరిన స్త్రీల నెల్లరను గొంకక పొందుట సర్వ నిర్జరౌ
ఘారి వచించె నౌర జనకాత్మజతో ఘన రాజనీతినిన్
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే
మి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండినీరము నంతయున్ విషమునింపుచు భీతిని గల్గజేయగా
రిప్లయితొలగించండినీరజనాభు డత్తఱిని నిర్భయమొందుచు బాపఱేనినిన్
నారడి వెట్టగా మిగుల,హాహరి!కావుమ యంచు కోరియా
దారుణకృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండె జూడరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి