2, అక్టోబర్ 2021, శనివారం

సమస్య - 3860

3-10-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పండు విడిచి తొక్కనుఁ దినవలె మేల్గనఁగన్”
(లేదా...)
“మొదటనె పండు జార్చుకొని ముద్దుగఁ దొక్క భుజింప మేలగున్”
(కంజర్ల రామాచార్య గారికి ధన్యవాదాలతో)

32 కామెంట్‌లు:

  1. అండగనమరినశిష్యుని
    దండముతోడనుఁదనుగనఁదప్పునుదిద్దన్
    మెండుగగురువునుపూనగ
    పండువిడిచితోక్కనుఁదినవలెమేల్గనన్

    రిప్లయితొలగించండి
  2. అండగ నుండక గొందఱు
    మెండుగ మోసములు జేసి మిడికెడు వారై
    దండుగ గా భాషింతురు
    "పండు విడిచి తొక్కను దినవలె మే ల్గ నగన్ "

    రిప్లయితొలగించండి
  3. కదనమునందుశత్రువునుకన్పడనోక్కడవిడ్వరాదులే
    అదనుగవైరినంతటనునందునవీఁకపట్టగావలెన్
    సదయుఁఞుగాగసంగరముశాంతినిఁగోరినవర్తనంబుతో
    మోదటనెపండుజార్చుకోనిముద్దుగణదోక్కభుజింపమేల్గనన్

    రిప్లయితొలగించండి
  4. గుండుగ నుండెడు ఫలమదె,
    మండెడు వేసంగిలోన పండును, చలువే,
    యెండించి, తాళ ఫలమున
    పండు విడిచి, తొక్కనుఁ దినవలె మేల్గనఁగన్

    రిప్లయితొలగించండి

  5. ఎండన బడితిరు గెదవట
    కొండా నీవాకలనుచు కుములకు, వంటల్
    వండనె లేదింక నిదిగొ
    పండు, విడిచి తొక్కనుఁ దిన వలె మేల్గనగన్.

    రిప్లయితొలగించండి
  6. నిండుగ నూరేళ్ళు బ్రతుక
    మెండుగ మొలకలు దినవలె మృణ్మయపాత్రన్
    వండిన యాకులు కాయలు
    పండు విడిచి తొక్కనుఁ దినవలె మేల్గనఁగన్

    రిప్లయితొలగించండి
  7. సమస్య :

    మొదటనె పండు జార్చుకొని
    ముద్దుగ దొక్క భుజింప మేలగున్

    ( దైవబలాన్ని వీడి సైనికబలాన్ని కోరుకొన్న రారాజు చేసినపని తమకు క్షేమకరమని బావగారితో పలుకుతున్న అర్జునుడు )

    చంపకమాల
    ...................

    చెదరని భక్తి నాది యదు
    శేఖర ! మా కెపు డండదండవౌ
    సదమలమూర్తి నీవు కద !
    సత్యసమంచితు నిన్నువీడి యా
    కదనపు సేన గోరుకొనె
    కౌరవనాథుడు ; మంచి మాకయెన్ ;
    మొదటనె పండు జార్చుకొని
    ముద్దుగ దొక్క భుజింప - మేలగున్ .

    రిప్లయితొలగించండి
  8. చం:

    పదవిని వీడు కాలమున వచ్చెడు పద్దులు వేతనాదులన్
    వదలక సేకరించ వలె వాసిగ లేశము సంశయింపకన్
    తదుపరి మాస దేయముగ దక్కుడు పింఛను బొంద నివ్విధిన్
    మొదటనె పండు జార్చుకొని ముద్దుగ తొక్క భుజింప, మేలగున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  9. మెండుగనుండ విటమిను సి
    భండన సేయగ కరోన బలమేర్పడగన్
    ఖండితముగ ప్రతి దినమున
    పండును ,విడచి తొక్కను, దినవలె మేల్గనగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుణనిధితో తల్లి

      ముదముగ బెండ్లి జేసితిమి పుణ్యగుణాలయ
      సారసాక్షితో
      కుదురుగ వంశవృద్ధియగు గోర్కెను నేలక కోమలాంగి
      యా
      మదవతి మోజునంబడుచు మాయని మచ్చను దెచ్చితే నిధీ!
      మొదటనె పండుజార్చుకొని ముద్దుగ తొక్కభుజింప
      మేలగున్ ?

      తొలగించండి
  10. దండిగ చూత ఫలంబులు
    మెండుగ మధురసముతోడ మెరయుచు నుండెన్
    నిండుమనముతో విడువక
    పండు, విడిచి తొక్కనుఁ, దినవలె మేల్గనఁగన్

    రిప్లయితొలగించండి
  11. చంపకమాల:
    కుదురుగ నుండలేడు తన కూటమి నాయకుడోర్వలేడు యే
    పదవిన నాల్గునాళ్ళు పొరపాటున తృప్తిగ సాగలేడు నె
    మ్మదియిసుమంతలేక యవమాన హృదిన్ విడె క్రొత్త రంగుతోన్
    “మొదటనె పండు జార్చుకొని ముద్దుగఁ దొక్క భుజింప మేలగున్”
    -కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  12. పండుగ దినమున గొలువగ
    ఖండపరశువుని దయయగు కదళీ ఫలమున్
    మెండు మధుమేహము గలుగ
    పండు విడిచి తొక్కనుఁ దినవలె మేల్గనఁగన్

    రిప్లయితొలగించండి
  13. వదులుము తిండియావనిక వార్థకమున్ మితమౌ రతీబునే
    గదుకుట మంచిదంద్రు ఖాదము లందున హెచ్చుగా నికన్
    విదురులు నీదు స్నేహువులు వెజ్జులు చెప్పిన రీతి గ్రోలుమా
    మొదటనె పండు, జార్చుకొని ముద్దుగ దొక్క, భుజింప మేలగున్.

    రిప్లయితొలగించండి
  14. అదనుగజూచిసింహమొక
    అందపులేడిషికారినెంచగా
    పదములజోరులోపరుగు
    పాఠవమెంతనొనుల్లసిల్లగా
    కుదువుగదుంకిపట్టుకొని
    గొంతునుకొర్కుచు చంపిప్రాణమున్
    మొదటనె పండు జార్చుకొని
    ముద్దుగఁ దొక్క భుజింప మేలగున్”
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  15. వదలక పద్యభావనలపాదములన్నియు గూర్చిఁబేర్చగన్
    విదితము విన్నవారలకు విస్తృత మందగ దేటదెల్లమై
    ముదముగఁబోలిఁబాకమదిముచ్చటగొల్పుచు ద్రాక్షపండునై
    మొదటనె పండు జార్చుకొని ముద్దుగఁ దొక్క భుజింప మేలగున్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  16. వరూధిని ప్రవరునితో

    పదపడి యొంటి దాన, ననివార్యసుమాస్త్రహతాంతరాత్మనై
    బెదిరితి, కౌగిటన్ బొదవి భీతిని మాన్పుచు స్వర్గసౌఖ్యసం
    పదగొను మన్న మూర్ఖమతివా! మరణాంతరసౌఖ్యమందగన్
    మొదటనె పండు జార్చుకొని ముద్దుగఁ దొక్క భుజింప మేలగున్?

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  17. కందం
    పండది యెంగిలిదైనను,
    బండును విడి తొక్క నిడినఁ బ్రభువులు గుడువన్
    మెండగు శిష్టుల 'భక్తిని'
    బండు విడిచి తొక్కనుఁ దినవలె 'మేల్గనఁగన్'

    చంపకమాల
    ముదుసలి యెంగిలించి ఫలముల్ భుజియింప నొసంగ గైకొనెన్
    సదమల భక్తి మెచ్చుచును సద్గుణ రాముడు, పారవశ్యతన్
    విదురుడొసంగఁ దొక్కఁ గొనె వెన్నుడు, దైవము వత్సలత్వమై
    మొదటనె పండు జార్చుకొని ముద్దుగఁ దొక్క భుజింప, మేలగున్!

    రిప్లయితొలగించండి
  18. కందం
    కండగల మామిడి ఫలము
    ఖండన యొనరించగ తునకలు పాపాయిన్
    దండిగ తిన, తండ్రి దలచె
    పండు విడిచి, తొక్కను దినవలె మేల్గనగన్


    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  19. పదుగురుబోవు మార్గమును బట్టిచరించక నొంటిగా చరిం
    చెదనను మూర్ఖ మానవుడు చేసెడు చేష్టలు వింత గొల్పుతా
    నదటున తల్చునెందులకునందరు నామ్ర ఫలంబు తిందురో
    మొదటనె పండు జార్చుకొని ముద్దుగఁ దొక్క భుజింప మేలగున్

    రిప్లయితొలగించండి
  20. కదుకొను తీపి రోగమది కమ్మని పండ్లను గ్రోల హెచ్చుగా
    పిదప శరీరమున్ వడిగ పెంపొన రించును నిశ్చయమ్ముగా
    నొదవ నరోగ భావమిల నుత్తమ మార్గము పెంచ పోషణన్
    మొదటనె పండు జార్చుకొని ముద్దుగఁ దొక్క భుజింప మేలగున్

    రిప్లయితొలగించండి
  21. మెండుగ విటమిను లుండెడు
    పండదిసూయరటి పండు పరికించంగన్
    పండును దినుటయు కంటెను
    పండునువిడిచి తొక్కను దినవలె మేల్గనగన్

    రిప్లయితొలగించండి
  22. ఖండము లొనరింపఁ దగదు
    మెండుగ నెన్నఁడు భృశమ్ము మెత్త నయిన యీ
    పండుఁ దిను టట్లు కాదుర
    పండు! విడిచి తొక్కనుఁ దినవలె మేల్గనఁగన్


    కుదురుగ నుంతురే యిచటఁ గోరిన పండిన పండ్ల నుంచఁగాఁ
    బదుగురు తిర్గు చోటున నపాత్రులు గైకొన కూర కుందురే
    పదిలము కా దయో పరుల పాలగు నంటిని యిట్టు లక్కటా
    మొదటనె పండు, జార్చుకొని ముద్దుగఁ దొక్క, భుజింప మేలగున్

    రిప్లయితొలగించండి
  23. చంపకమాల:
    ఎదగని గొఱ్ఱెతోక సిరి యిబ్బడి ముబ్బడి కాదు జేబులో
    మదుపును నమ్మి నమ్మకపు మాటున సొమ్ము ను నిల్వజేయగా
    నదియును దీర్ఘ కాల సమయమ్మున పూర్ణత నందు వడ్డియే
    “మొదటనె పండు జార్చుకొని ముద్దుగఁ దొక్క భుజింప మేలగున్”
    -కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  24. ముదుసలి యెంగిలిన్ దినుచు మోదమునొందిన రామువోలెనే
    మొదటనె పండుజార్చుకొని ముద్దుగ దొక్కభుజింప మేలగున్
    గదనముజేయగోరుచును గౌరవరాజు సుయోధనుండుదా
    మదమున గోరె సైన్యమును మాత్రమె వెన్నునిగాక పోలికన్

    రిప్లయితొలగించండి
  25. ముదిరెనవిద్య లోకమున మూర్ఖపు పోకడ హెచ్చె జూడగా
    వదలి పరంపరానుగత వైద్య విధానములోరగించుచున్
    వదరెదరిట్లు కొందరిల పథ్యమె మేలని నూత్న సూత్రముల్
    మొదటనె పండు జార్చుకొని ముద్దుగఁ దొక్క భుజింప మేలగున్

    రిప్లయితొలగించండి
  26. పండుగ వేళ ప్రసాదము
    దండుగయో వాని కిడుట దంభకుడా పా
    షండుండిటు బల్కునెపుడు
    పండు విడిచి తొక్కనుఁ దినవలె మేల్గనఁగన్

    రిప్లయితొలగించండి
  27. కం.
    మెండుగ దేవులు ముక్కో
    ట్లుండగ బాబాలవెంట యూరేగుట యి
    ట్లుండును పరికింపంగన్
    పండు విడిచి తొక్కనుఁ దినవలె మేల్గనఁగన్

    రిప్లయితొలగించండి
  28. సవినయ మంత్రి వర్యులును సద్గణు
    లైన ప్రధాను లుండగన్
    భవితను జక్క దిద్దగల భాసుర
    మైన ప్రవక్తలుండ మా
    నవులను భాగ్యవంతులుగ
    నడ్పెడు జ్యోతిష శాస్త్రులుండగా
    గవులను గొప్పవారనుచు గౌరవ
    మిచ్చుట వ్యర్థమే సుమా.

    రిప్లయితొలగించండి