గాంధీ మహాత్ముని ఆశయము రామరాజ్యము. ఎన్నికల వేళ అన్ని రాజకీయ పక్షములు రామరాజ్య స్థాపన కు వాగ్దానము చేస్తాయి. గెలిచిన తరువాత మాట మారుస్తాయి. ఇదే అంశమై నా ప్రయత్నము:
చం:
పలుకుదురెల్ల పక్షములు భారత దేశము రామరాజ్యమై వెలుగును తాము గెల్వగనె వేగమె జూడు మటంచు, నేతలే గెలిచిన మారు బల్కుచును గేలి ప్రసంగము జేయుచుండనై కలత పడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్
పలుజగడమ్ములెంచి పరపాలన నంతముజేయ దీక్షతో విలువలు లేని నాయకులు పెత్తనమున్ గొని యేలు చుండగా ఫలముల పొంద లేక ప్రజ బాధలు పొంద స్వతంత్ర దేశమున్ కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్
తేటగీతి భారతావనిన మత వివాదములు, కు లాల ఘర్షణలు పెరిగి లజ్జితమ్ము కాగ, లౌకిక వాదులు గాసి ననిరి గాంధి పుట్టిన దినమని కలత పడుము ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఉండవల్లి సెంటర్
రిప్లయితొలగించండివిందు నిచ్చెద రమ్మని బంధువొకడు
పిలిచెననుచును మురిసెడి ప్రియుని తోడ
మధువు మాంసముండవనుచు మగువ పలికె
గాంధి పుట్టిన దినమని కలత పడుము.
తేటగీతి
రిప్లయితొలగించండిమద్యపానమ్ము మానంగ మంచిదనుచు
జాతి పితగఁ దా బోధించ రీతి విడచి
వారి విగ్రహఁపున్ నీడ సారనమ్మ
గాంధి పుట్టిన దినమని కలతపడుము!
చంపకమాల
తెలివిని ద్రుంచి రాక్షసుని తీరుగ మార్చెడు మద్యపానమున్,
వెలుగులు పంచ జాతిపిత వీడమటంచును బోధఁ జేసినన్
నిలుపఁగ వారి విగ్రహము నీడన నంగడి నమ్మ మద్యమే
కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య :
రిప్లయితొలగించండికలతపడంగ నొప్పు గద
గాంధి జనించిన యిద్దినంబునన్
( నాటి గాంధీజయంతికి నేటి గాంధీజయంతికి
ఎంత వ్యత్యాసం ! )
కులమత సర్పముల్ బుసలు
కొట్టుచునుండె దురాగ్రహంబునన్ ;
లలనల మానభంగములు
లావగుచుందెను రోజురోజుకున్ ;
జెలువగు దేశభక్తి మరి
చేరదు పౌరహృదంతరంబులన్ ;
కలతపడంగ నొప్పు గద !
గాంధి జనించిన యిద్దినంబునన్ .
యువకు లందరు దేశపు యోధులగుచు
రిప్లయితొలగించండిప్రగతి కై పాటు పడుచు పలికి రిట్లు
గాంధి పుట్టిన దినమని : కలత పడుము
సమ సమాజము సృష్టింప శక్తి కొలది
రెండవ పాదంలో పడుచును అని సవరణ చేయడమైనది
తొలగించండినెలతవీధినిదిరుగనునేరమగును
రిప్లయితొలగించండికులములేదనిఁజెప్పినకూడులేదు
సత్యవాక్కునకీభూమిచాలదవ్వు
గాంధిపుట్టినదినమనికలతపడుము
కులమనుగజ్జిజీవులకుకూర్చుచుదుర్మదగంధమలందుచున్
రిప్లయితొలగించండికలకనుకంటిపాపలనుకాదనుతీరునసంచరించుచున్
పులుముచునాభిజాత్యమునుపోందికలేకనుభేదమెంచగా
కలతపడంగనోప్పుగదగాంధిజనించినయిద్దినంబునన్
రిప్లయితొలగించండిపిలువగ సంగడీడొకడు పెండ్లి దినమ్మని యామతింపుకై
లలనను వెంటతీసుకొని రంజనమందుచు నేగనేమిరా
పలలము కాపిశాయనపు వడ్డన నేడు నిషిద్దమంచనన్
కలత పడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశాంతి నీయని క్రియలను సలుపు చుండి
నిజము నెంచక నేగుచు నిరతమంత
మద్యమును పీల్చునట్టి యో మనిషి! నేడు
గాంధి పుట్టిన దినమని కలత బడుము.
గాంధీ మహాత్ముని ఆశయము రామరాజ్యము. ఎన్నికల వేళ అన్ని రాజకీయ పక్షములు రామరాజ్య స్థాపన కు వాగ్దానము చేస్తాయి. గెలిచిన తరువాత మాట మారుస్తాయి. ఇదే అంశమై నా ప్రయత్నము:
రిప్లయితొలగించండిచం:
పలుకుదురెల్ల పక్షములు భారత దేశము రామరాజ్యమై
వెలుగును తాము గెల్వగనె వేగమె జూడు మటంచు, నేతలే
గెలిచిన మారు బల్కుచును గేలి ప్రసంగము జేయుచుండనై
కలత పడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్
వై. చంద్రశేఖర్
లలనలు రాత్రివేళలను రక్షణగోరకె సంచరించగా
రిప్లయితొలగించండితలచగ నొప్పునౌ నిజ స్వతంత్ర్యము చేకురెనంచు బల్కగా
నలుగగ రేబవళ్ళనక నాతులు క్రూరమృగాళి చేతిలో
కలత పడంగ నొప్పుగద గాంధి జనించిన యిద్దినంబునన్
నేటి యువత మాట
తొలగించండిమందు లేనట్టి విందది మాకు పడదు
చిందు లేయని క్లబ్బులు చెల్లబోవు
బందు సేయగ విందులు బారు లిపుడు
గాంధి పుట్టిన దినమని కలత పడుము
నెయ్యుని బిలిచితివి నేడు నిఘసమునకు
రిప్లయితొలగించండిమాంసమును తొలుతనె గొన మరచితివిగ
పురమునందు నాయంగడి మూసియుండు
గాంధి పుట్టిన దినమని , కలతపడుము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచెలఁగుచు వీధి కొక్కటిగ సీధువు లంగడు లుప్పతిల్లగా
రిప్లయితొలగించండినలవడి మంద భాగ్యు లపహాసము పాలయి వీధినిన్ బడన్
నెలతలు దుఃఖ మందు నిక నీల్గుచు వేసరి మూగ బోవగన్
గలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్
పొలయుచు నుండె హింసలును
రిప్లయితొలగించండిబూలసమానపు టాడ పిల్లలున్
విలవిల లాడినన్ వినక ప్రీత్యణు
మాత్రము లేక వారలన్
నలుపుచునుండ్రి నీచులు వినా
దయ, క్రూర వికార చిత్తులై
కలతపడంగ నొప్పుగద గాంధి జ
నించిన యిద్దినంబునన్
చంపకమాల:
రిప్లయితొలగించండిమొలనొక నూలుపంచె మది ముప్పురి గొన్న స్వదేశ భక్తి ని
ర్మలమగు శాంతచిత్తము విరామమెఱుంగని కార్య దక్షతన్
సలిపిన పోరుపుణ్యమది సత్ఫలమందని నేటి దుస్థితిన్
”“కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్”
--కటకం వేంకటరామశర్మ.
సంత సించును భారత జాతి యంత
రిప్లయితొలగించండిగాంధి పుట్టిన దినమని; కలతపడుము
దినదినము మన దేశంపు జనము సత్య,
శాంతములకు దూరంబుగ జరిగి నపుడు
శలవు ననుభవింతుమనిన వలను పడదు
రిప్లయితొలగించండిసురను సేవింతు మనుకొన్న దొరకదాయె
మాంస భక్ష్యమ్ముల కొరకై మధన పడుము
గాంధి పుట్టిన దినమని కలతపడుము
భరతమాతకు దాస్యము బాపినట్టి
రిప్లయితొలగించండిజాతిపిత జన్మదినమున నీతివీడి
దొంగచాటుగ మద్యమ్ము దొరగుచుండ
“గాంధి పుట్టిన దినమని కలతపడుము”
పలుజగడమ్ములెంచి పరపాలన నంతముజేయ దీక్షతో
రిప్లయితొలగించండివిలువలు లేని నాయకులు పెత్తనమున్ గొని యేలు చుండగా
ఫలముల పొంద లేక ప్రజ బాధలు పొంద స్వతంత్ర దేశమున్
కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజాతిపిత కలగనె నాడు సామ్య వాద
రిప్లయితొలగించండినిలయ రామరాజ్యమగుచు నిలుచు ననుచు
నాటి కేదనె కవి మరో నాడు; నేడు
గాంధి పుట్టిన దినమని కలత పడుము
(1971 లో సినీ కవి శ్రీ ఆరుద్ర గారిచే రచింపబడి యిప్పటికీ బదులు లేని ప్రశ్నగా మిగిలిన " గాంధి పుట్టిన దేశమా యిది..." పాట నేపథ్యంలో చేసిన పూరణ)
పంచి పెట్టితిని మిఠాయి బంధువులకు
రిప్లయితొలగించండిగాంధి పుట్టినదినమని ,కలత పడుము
గాడ్సె! చంపినం దులకును గాంధినిసుమి
మనిషి మనిషిని జంపుట కనగ గలమె?
కలవరమొందె మానసము గాంచ నరాచకమెల్ల తావులన్
రిప్లయితొలగించండికలలవి కల్లలాయె, మనగాంధి మహాత్ముని యాశయంబులే
వెలవెలబోయె, కల్కము వివేక విహీనత నివ్వటిల్లగన్
కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్
కారఁ దొలఁగింప నెద మమకార మూని
రిప్లయితొలగించండికరము తనవారి పైన ముష్కురుల కకట
నిరతి గద్దె నిడి పలికి నేటి గాంధి
గాంధి పుట్టిన దినమని కలఁతపడుము
కలవర మేల నిక్క మిది గాంధి మహాత్మఁడు సత్య సంధుఁడే
యిల నట “సత్యమేవ జయ తీతి” యనంగ నొకింత మార్చిరే
యిలనె “యసత్య మేవ జయ తీతి” యనంగను నేత లక్కటా
కలఁతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅలుపు నొకింతలేకయునునాంగ్లుల బాఱగజేసి మాత వే
రిప్లయితొలగించండికలలనుసార్ధకమ్ముగను గానగజేసిన గాంధి చావుకున్
గలతపడంగ నొప్పుకద గాంధిజనించిన యిద్దినంబునన్
నెలతలు బండితుల్ జనులు నెమ్మిని నంజలినీయ యొప్పగున్
కులమత భేద భావముల గూల్చి రగిల్చి స్వతంత్ర భావనన్
రిప్లయితొలగించండితిలకు పటేలు గాంధి పరదేశపు పాలన రూపుమాపినన్
కలలను వమ్ము జేసి జన కంటకులై జను నేతలన్ గనన్
కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్
తేటగీతి
రిప్లయితొలగించండిభారతావనిన మత వివాదములు, కు
లాల ఘర్షణలు పెరిగి లజ్జితమ్ము
కాగ, లౌకిక వాదులు గాసి ననిరి
గాంధి పుట్టిన దినమని కలత పడుము
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్