4, అక్టోబర్ 2021, సోమవారం

సమస్య - 3862

5-10-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నము సున్నమని మోద మందిరి బంధుల్”
(లేదా...)
“అన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో”

39 కామెంట్‌లు:

  1. మిన్నగ బూరెలున్ వడలు మేలగు లడ్లును పూతరేకులున్
    వెన్నెలు మీగడల్ రుచులు పేర్చిన గిన్నెలు పాయసమ్ములున్
    చెన్నుగ వడ్డనల్ సలుప చేడియ లెల్ల వరాల జల్లులై
    *యన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి

  2. నాన్ననెఱుంగనట్టి లయ నాకుడవంచు పరాభవింపగా
    మన్నన చేయలేదనుచు మాన్యుడు భీమకవీంద్రు డప్పుడా
    యన్నము సున్నమౌననుచు నాగ్రహమందున పల్కినంతనే
    అన్నము సున్నమైన, ముదమందిరి బంధులు పెండ్లి విందులో

    రిప్లయితొలగించండి
  3. కందం
    ఎన్నుచు సార విహీనపు
    వన్నను బియ్యమ్ము మెరుగు పట్టినవైనన్
    మిన్నగ తెల్లదనంబున
    నన్నము సున్నమని మోద మందిరి బందుల్!

    ఉత్పలమాల
    పిన్నలు పెద్దలున్ మెరుగుపెట్టిన మేలని బియ్యమెంతురే!
    యెన్నడు సారహీనమని యెంచక, వర్ణమె ముఖ్యమంచు, తీ
    రెన్నడు మారు? నిన్న గమనించితిఁ దెల్లదనంబునందు న
    య్యన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో!

    రిప్లయితొలగించండి

  4. అన్నము భుజించిన పిదప
    మన్ననతో విడియమివ్వ మరచితి రనగా
    నున్నవి జతకుడుకలలో
    యన్నము, సున్నమని మోదమందిరి బందుల్.

    రిప్లయితొలగించండి
  5. సమస్య :

    అన్నము సున్నమైన ముద
    మందిరి బంధులు పెండ్లివిందులో

    ( వశ్యవాక్కు అయిన వేములవాడ భీమకవి
    మాటతో పలుకు పలుకై పనికిరాని అన్నము
    పొడిగా మారి తినదగిన దయింది .)

    ఎన్నగ వంటవారి నెప
    మెంచిరి యందరు పల్కుపల్కులై
    క్రన్నన క్రన్ననన్ తినుట
    కడ్డము వచ్చెడి యుడ్కియుడ్కకన్
    మన్నిక లేని యోగిరము
    మంచిగ భీమకవీంద్రు మాటచే
    నన్నము సున్నమైన ముద
    మందిరి బంధులు పెండ్లివిందులో .

    ( సున్నము - చూర్ణము ; ఓగిరము - అన్నము )

    రిప్లయితొలగించండి
  6. అన్ని రకాల వంటకములద్భుత
    రీతిగ వండి విందుకున్
    గ్రన్నన పంక్తిభోజనపు కాలము నం
    దున భిక్షుడొక్కడున్
    దిన్నగ నార్థితో నడుగ దెల్పిరి లేదని,
    యేమి మాయయో
    అన్నము సున్నమైన ముదమందరి
    యందరు పెండ్లి విందునన్

    రిప్లయితొలగించండి
  7. కన్నయ దొంగిలి తినె వె
    న్నన్నము ; సున్నమని మోద మందిరి బందుల్
    వెన్నుడు తెల్లగ పూయన్
    సన్నని గోపికలపైన చారలు బడగా

    రిప్లయితొలగించండి
  8. మన్నన తో నన సూయ ను
    గ్రన్నన సురలెల్ల జేరి కామిత మొప్పన్
    చెన్నుగ జూపు మహి మ మన
    నన్నము సున్నమని మోద మందిరి బందుల్

    రిప్లయితొలగించండి
  9. తిన్న దరుగ దాంబూలమె
    తిన్నదనుచు నాకువక్క దెచ్చిన మీదన్
    పిన్నడొసంగిన దెల్లని
    యన్నము సున్నమని మోద మందిరి బందుల్

    రిప్లయితొలగించండి
  10. జొన్నన్నము దిను వారలు
    సన్నని వరియన్నముగని సంతసమొందన్
    కన్నుల కింపగు తెల్లని
    అన్నము సున్నమని మోద మందిరి బందుల్

    రిప్లయితొలగించండి
  11. మిన్నగు చిత్రాన్నము కై
    అన్నము నిలుపగ రొదగొనె నజరపు పాటున్
    చిన్నగ తెలియగ కాదది
    అన్నము, సున్నమని, మోద మందిరి బందుల్

    (అజర:బల్లి)

    రిప్లయితొలగించండి
  12. అన్నాకాల్షియమిదియే
    చెన్నుగదినుమీయెముకలజేరునువడిగా
    పన్నులునూడకయుండును
    అన్నముసున్నమనిమోదమందిరిబంధుల్

    రిప్లయితొలగించండి
  13. ఉ:

    మన్నన గోరి కమ్మనగు మంచిగ పాకము లెన్నొ గూర్చగన్
    చిన్నలు పెద్దలున్ మురియ శీఘ్రమె భక్షణ జేయ భోజ్యముల్
    పన్నగ నింద్ర జాలమును భాగమటంచు సుఖాను భూతిగా
    నన్నము సున్నమైన ముద మందిరి బంధులు పెండ్లి విందులో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. మన్నును మ్రింగిన నెపమున
    నన్నుల మిన్నకును జూప నఖిల జగత్తున్
    పన్నుగ వింతల జూడగ
    అన్నము సున్నమని మోదమందిరి బంధుల్

    మన్నును దిన్న వ్యాజమున మాతకు జూపెను విశ్వమంతయున్
    ఎన్నగ భీముడిచ్చటను హేళనజేయగ పండితాళియే
    పన్నుగ జూడవింతలను పంక్తిని గూర్చుని వేములాడలో
    అన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో

    రిప్లయితొలగించండి
  15. కందం
    సన్నగ తెల్లగ సొగసుగ
    మిన్నగ మఱబట్టి వండ మెతుకులు మెఱవన్
    చిన్నగ వడ్డన జేయగ
    అన్నము సున్నమని మోదమందిరి బందుల్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  16. ఉత్పలమాల:
    ఎన్నిసపర్యలేపగిది నేర్పడఁజేసిన నన్నియొకెత్తు సం
    పన్నుల పెండ్లియందు పలు వంటలు జేయుటొకెత్తు! అందునన్
    కొన్ని మిగిల్చి కంచమున కుప్పనఁబోయక లక్షణమ్ముగన్
    “అన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో”
    (మిగులకుండ, వృథా కాకుండ...అన్నము శూన్యమైనదనే అర్థంలో....పూరణ)
    -కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  17. అన్నము నమలుట కష్టం
    బెన్నగ దంతములు చాల పెకలింపబడెన్
    చెన్నుగ వండిన మెత్తని
    అన్నము సున్నమని మోదమందిరి బందుల్

    రిప్లయితొలగించండి
  18. భిన్నమునౌకదంబముగవేఁగనుఁజూపులచిత్రమన్నమౌ
    సన్ననికాయగూరలనుచాలగనిండుపలావుగానకే
    పన్నుగఛాయఁదోచెడినిభావనయందునవడ్డనంబునన్
    అన్నముసున్నమైనముదమందిరిబంధులుపెండ్లివిందులో

    రిప్లయితొలగించండి
  19. అన్నన్న యే మన నగును
    గన్నుల కింపు గొలుపంగఁ గల విచ్చట మే
    లన్నా పొట్టకు వీటికి
    నన్నము సున్న మని మోద మందిరి బంధుల్


    పిన్నలఁ బెద్ద లెల్లరను వృద్ధుల నెంచి మనమ్ము లందు నా
    సన్నుల కీయఁ దృప్తిని భృశమ్ముగ వండిరి వేఱు వేఱుగాఁ
    బన్నుగ నట్లు వృద్ధులకు వడ్డన సేయఁగ వారి కింపుగా
    నన్నము సున్న మైన ముద మందిరి బంధులు పెండ్లి విందులో

    రిప్లయితొలగించండి
  20. అన్నులమిన్నమాయ శశియై తనరూపముమార్చి పెండ్లిలో
    నెన్నియొ వింతచేష్టితము లెల్లరు చూడ ఘటోత్కచుండునున్
    చిన్నమయాదులాచరణ చేయగ నచ్చట వంటకంబులం
    దన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో

    రిప్లయితొలగించండి
  21. అన్నా!యేమని వింటిని
    యన్నము సున్నమని మోదమందిరి బందుల్
    మన్నన లేకను బలుకుట
    సన్నయమేనీకువిమల! సంతస మౌనే!

    రిప్లయితొలగించండి
  22. అన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లివిందులో
    దిన్నని మాటకాదదియ తెల్పుము రాధిక!సున్నమెట్లగున్
    విన్నదీ గాదు నెచ్చటను బేలతనంబున బల్కనోపునే
    గన్నదియైనచో చెపుమ కాంతుము మేమును దప్పకుండగన్

    రిప్లయితొలగించండి
  23. చిన్నది యౌటచే వయసు, చీకును పెండిలి యాడ నొల్లకే
    కన్నియ నేడ్వగా తెగువగా తన యన్నయ పెండ్లినాపగా
    తిన్నగ బోసి సున్నమను తెంపెను వియ్యము,యందు కొందరున్
    అన్నము సున్నమైన ముదమందిరి, బంధులు పెండ్లి విందులో.

    రిప్లయితొలగించండి
  24. అన్నులమిన్నయౌ దనయకన్నిట జోడగు వాని నెంచి దా
    మిన్నగ జేసె బెండ్లి గని మెచ్చగనెల్లరు నాటి వేడ్కలన్
    చెన్నుగనైంద్రజాలికుడు జేసె విచిత్రములబ్బురంబుగా
    నన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో

    రిప్లయితొలగించండి