5-10-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అన్నము సున్నమని మోద మందిరి బంధుల్”(లేదా...)“అన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో”
మిన్నగ బూరెలున్ వడలు మేలగు లడ్లును పూతరేకులున్వెన్నెలు మీగడల్ రుచులు పేర్చిన గిన్నెలు పాయసమ్ములున్చెన్నుగ వడ్డనల్ సలుప చేడియ లెల్ల వరాల జల్లులై*యన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో*తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాన్ననెఱుంగనట్టి లయ నాకుడవంచు పరాభవింపగామన్నన చేయలేదనుచు మాన్యుడు భీమకవీంద్రు డప్పుడా యన్నము సున్నమౌననుచు నాగ్రహమందున పల్కినంతనే అన్నము సున్నమైన, ముదమందిరి బంధులు పెండ్లి విందులో
కందంఎన్నుచు సార విహీనపువన్నను బియ్యమ్ము మెరుగు పట్టినవైనన్మిన్నగ తెల్లదనంబుననన్నము సున్నమని మోద మందిరి బందుల్!ఉత్పలమాలపిన్నలు పెద్దలున్ మెరుగుపెట్టిన మేలని బియ్యమెంతురే!యెన్నడు సారహీనమని యెంచక, వర్ణమె ముఖ్యమంచు, తీరెన్నడు మారు? నిన్న గమనించితిఁ దెల్లదనంబునందు నయ్యన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అన్నము భుజించిన పిదపమన్ననతో విడియమివ్వ మరచితి రనగానున్నవి జతకుడుకలలో యన్నము, సున్నమని మోదమందిరి బందుల్.
సమస్య :అన్నము సున్నమైన ముద మందిరి బంధులు పెండ్లివిందులో ( వశ్యవాక్కు అయిన వేములవాడ భీమకవి మాటతో పలుకు పలుకై పనికిరాని అన్నముపొడిగా మారి తినదగిన దయింది .)ఎన్నగ వంటవారి నెప మెంచిరి యందరు పల్కుపల్కులై క్రన్నన క్రన్ననన్ తినుట కడ్డము వచ్చెడి యుడ్కియుడ్కకన్ మన్నిక లేని యోగిరము మంచిగ భీమకవీంద్రు మాటచే నన్నము సున్నమైన ముద మందిరి బంధులు పెండ్లివిందులో .( సున్నము - చూర్ణము ; ఓగిరము - అన్నము )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అన్ని రకాల వంటకములద్భుతరీతిగ వండి విందుకున్గ్రన్నన పంక్తిభోజనపు కాలము నందున భిక్షుడొక్కడున్దిన్నగ నార్థితో నడుగ దెల్పిరి లేదని,యేమి మాయయోఅన్నము సున్నమైన ముదమందరియందరు పెండ్లి విందునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కాని బంధువులు ముదమందడం ?
కన్నయ దొంగిలి తినె వెన్నన్నము ; సున్నమని మోద మందిరి బందుల్వెన్నుడు తెల్లగ పూయన్సన్నని గోపికలపైన చారలు బడగా
మన్నన తో నన సూయ ను గ్రన్నన సురలెల్ల జేరి కామిత మొప్పన్ చెన్నుగ జూపు మహి మ మన నన్నము సున్నమని మోద మందిరి బందుల్
తిన్న దరుగ దాంబూలమెతిన్నదనుచు నాకువక్క దెచ్చిన మీదన్పిన్నడొసంగిన దెల్లనియన్నము సున్నమని మోద మందిరి బందుల్
జొన్నన్నము దిను వారలుసన్నని వరియన్నముగని సంతసమొందన్కన్నుల కింపగు తెల్లనిఅన్నము సున్నమని మోద మందిరి బందుల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మిన్నగు చిత్రాన్నము కైఅన్నము నిలుపగ రొదగొనె నజరపు పాటున్చిన్నగ తెలియగ కాదదిఅన్నము, సున్నమని, మోద మందిరి బందుల్ (అజర:బల్లి)
ధన్యవాదములు గురువుగారు.
అన్నాకాల్షియమిదియేచెన్నుగదినుమీయెముకలజేరునువడిగాపన్నులునూడకయుండునుఅన్నముసున్నమనిమోదమందిరిబంధుల్
ఉ: మన్నన గోరి కమ్మనగు మంచిగ పాకము లెన్నొ గూర్చగన్చిన్నలు పెద్దలున్ మురియ శీఘ్రమె భక్షణ జేయ భోజ్యముల్ పన్నగ నింద్ర జాలమును భాగమటంచు సుఖాను భూతిగానన్నము సున్నమైన ముద మందిరి బంధులు పెండ్లి విందులో వై. చంద్రశేఖర్
మన్నును మ్రింగిన నెపముననన్నుల మిన్నకును జూప నఖిల జగత్తున్పన్నుగ వింతల జూడగఅన్నము సున్నమని మోదమందిరి బంధుల్ మన్నును దిన్న వ్యాజమున మాతకు జూపెను విశ్వమంతయున్ ఎన్నగ భీముడిచ్చటను హేళనజేయగ పండితాళియేపన్నుగ జూడవింతలను పంక్తిని గూర్చుని వేములాడలోఅన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో
కందంసన్నగ తెల్లగ సొగసుగమిన్నగ మఱబట్టి వండ మెతుకులు మెఱవన్చిన్నగ వడ్డన జేయగఅన్నము సున్నమని మోదమందిరి బందుల్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
ఉత్పలమాల:ఎన్నిసపర్యలేపగిది నేర్పడఁజేసిన నన్నియొకెత్తు సంపన్నుల పెండ్లియందు పలు వంటలు జేయుటొకెత్తు! అందునన్ కొన్ని మిగిల్చి కంచమున కుప్పనఁబోయక లక్షణమ్ముగన్“అన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో”(మిగులకుండ, వృథా కాకుండ...అన్నము శూన్యమైనదనే అర్థంలో....పూరణ)-కటకం వేంకటరామ శర్మ.
అన్నము నమలుట కష్టంబెన్నగ దంతములు చాల పెకలింపబడెన్చెన్నుగ వండిన మెత్తనిఅన్నము సున్నమని మోదమందిరి బందుల్
భిన్నమునౌకదంబముగవేఁగనుఁజూపులచిత్రమన్నమౌసన్ననికాయగూరలనుచాలగనిండుపలావుగానకేపన్నుగఛాయఁదోచెడినిభావనయందునవడ్డనంబునన్అన్నముసున్నమైనముదమందిరిబంధులుపెండ్లివిందులో
అన్నన్న యే మన నగును గన్నుల కింపు గొలుపంగఁ గల విచ్చట మేలన్నా పొట్టకు వీటికి నన్నము సున్న మని మోద మందిరి బంధుల్ పిన్నలఁ బెద్ద లెల్లరను వృద్ధుల నెంచి మనమ్ము లందు నాసన్నుల కీయఁ దృప్తిని భృశమ్ముగ వండిరి వేఱు వేఱుగాఁ బన్నుగ నట్లు వృద్ధులకు వడ్డన సేయఁగ వారి కింపుగా నన్నము సున్న మైన ముద మందిరి బంధులు పెండ్లి విందులో
అన్నులమిన్నమాయ శశియై తనరూపముమార్చి పెండ్లిలోనెన్నియొ వింతచేష్టితము లెల్లరు చూడ ఘటోత్కచుండునున్చిన్నమయాదులాచరణ చేయగ నచ్చట వంటకంబులందన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో
బంధులు ముదమందుట కూడా చిన్నమ(మా)య ప్రభావమే😃
అన్నా!యేమని వింటినియన్నము సున్నమని మోదమందిరి బందుల్ మన్నన లేకను బలుకుటసన్నయమేనీకువిమల! సంతస మౌనే!
అన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లివిందులోదిన్నని మాటకాదదియ తెల్పుము రాధిక!సున్నమెట్లగున్ విన్నదీ గాదు నెచ్చటను బేలతనంబున బల్కనోపునేగన్నదియైనచో చెపుమ కాంతుము మేమును దప్పకుండగన్
చిన్నది యౌటచే వయసు, చీకును పెండిలి యాడ నొల్లకేకన్నియ నేడ్వగా తెగువగా తన యన్నయ పెండ్లినాపగాతిన్నగ బోసి సున్నమను తెంపెను వియ్యము,యందు కొందరున్అన్నము సున్నమైన ముదమందిరి, బంధులు పెండ్లి విందులో.
సున్నము టైపాటు
అన్నులమిన్నయౌ దనయకన్నిట జోడగు వాని నెంచి దామిన్నగ జేసె బెండ్లి గని మెచ్చగనెల్లరు నాటి వేడ్కలన్చెన్నుగనైంద్రజాలికుడు జేసె విచిత్రములబ్బురంబుగానన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో
మిన్నగ బూరెలున్ వడలు మేలగు లడ్లును పూతరేకులున్
రిప్లయితొలగించండివెన్నెలు మీగడల్ రుచులు పేర్చిన గిన్నెలు పాయసమ్ములున్
చెన్నుగ వడ్డనల్ సలుప చేడియ లెల్ల వరాల జల్లులై
*యన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినాన్ననెఱుంగనట్టి లయ నాకుడవంచు పరాభవింపగా
మన్నన చేయలేదనుచు మాన్యుడు భీమకవీంద్రు డప్పుడా
యన్నము సున్నమౌననుచు నాగ్రహమందున పల్కినంతనే
అన్నము సున్నమైన, ముదమందిరి బంధులు పెండ్లి విందులో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఎన్నుచు సార విహీనపు
వన్నను బియ్యమ్ము మెరుగు పట్టినవైనన్
మిన్నగ తెల్లదనంబున
నన్నము సున్నమని మోద మందిరి బందుల్!
ఉత్పలమాల
పిన్నలు పెద్దలున్ మెరుగుపెట్టిన మేలని బియ్యమెంతురే!
యెన్నడు సారహీనమని యెంచక, వర్ణమె ముఖ్యమంచు, తీ
రెన్నడు మారు? నిన్న గమనించితిఁ దెల్లదనంబునందు న
య్యన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅన్నము భుజించిన పిదప
మన్ననతో విడియమివ్వ మరచితి రనగా
నున్నవి జతకుడుకలలో
యన్నము, సున్నమని మోదమందిరి బందుల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిఅన్నము సున్నమైన ముద
మందిరి బంధులు పెండ్లివిందులో
( వశ్యవాక్కు అయిన వేములవాడ భీమకవి
మాటతో పలుకు పలుకై పనికిరాని అన్నము
పొడిగా మారి తినదగిన దయింది .)
ఎన్నగ వంటవారి నెప
మెంచిరి యందరు పల్కుపల్కులై
క్రన్నన క్రన్ననన్ తినుట
కడ్డము వచ్చెడి యుడ్కియుడ్కకన్
మన్నిక లేని యోగిరము
మంచిగ భీమకవీంద్రు మాటచే
నన్నము సున్నమైన ముద
మందిరి బంధులు పెండ్లివిందులో .
( సున్నము - చూర్ణము ; ఓగిరము - అన్నము )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅన్ని రకాల వంటకములద్భుత
రిప్లయితొలగించండిరీతిగ వండి విందుకున్
గ్రన్నన పంక్తిభోజనపు కాలము నం
దున భిక్షుడొక్కడున్
దిన్నగ నార్థితో నడుగ దెల్పిరి లేదని,
యేమి మాయయో
అన్నము సున్నమైన ముదమందరి
యందరు పెండ్లి విందునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాని బంధువులు ముదమందడం ?
కన్నయ దొంగిలి తినె వె
రిప్లయితొలగించండిన్నన్నము ; సున్నమని మోద మందిరి బందుల్
వెన్నుడు తెల్లగ పూయన్
సన్నని గోపికలపైన చారలు బడగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమన్నన తో నన సూయ ను
రిప్లయితొలగించండిగ్రన్నన సురలెల్ల జేరి కామిత మొప్పన్
చెన్నుగ జూపు మహి మ మన
నన్నము సున్నమని మోద మందిరి బందుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితిన్న దరుగ దాంబూలమె
రిప్లయితొలగించండితిన్నదనుచు నాకువక్క దెచ్చిన మీదన్
పిన్నడొసంగిన దెల్లని
యన్నము సున్నమని మోద మందిరి బందుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజొన్నన్నము దిను వారలు
రిప్లయితొలగించండిసన్నని వరియన్నముగని సంతసమొందన్
కన్నుల కింపగు తెల్లని
అన్నము సున్నమని మోద మందిరి బందుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిన్నగు చిత్రాన్నము కై
రిప్లయితొలగించండిఅన్నము నిలుపగ రొదగొనె నజరపు పాటున్
చిన్నగ తెలియగ కాదది
అన్నము, సున్నమని, మోద మందిరి బందుల్
(అజర:బల్లి)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురువుగారు.
తొలగించండిఅన్నాకాల్షియమిదియే
రిప్లయితొలగించండిచెన్నుగదినుమీయెముకలజేరునువడిగా
పన్నులునూడకయుండును
అన్నముసున్నమనిమోదమందిరిబంధుల్
ఉ:
రిప్లయితొలగించండిమన్నన గోరి కమ్మనగు మంచిగ పాకము లెన్నొ గూర్చగన్
చిన్నలు పెద్దలున్ మురియ శీఘ్రమె భక్షణ జేయ భోజ్యముల్
పన్నగ నింద్ర జాలమును భాగమటంచు సుఖాను భూతిగా
నన్నము సున్నమైన ముద మందిరి బంధులు పెండ్లి విందులో
వై. చంద్రశేఖర్
మన్నును మ్రింగిన నెపమున
రిప్లయితొలగించండినన్నుల మిన్నకును జూప నఖిల జగత్తున్
పన్నుగ వింతల జూడగ
అన్నము సున్నమని మోదమందిరి బంధుల్
మన్నును దిన్న వ్యాజమున మాతకు జూపెను విశ్వమంతయున్
ఎన్నగ భీముడిచ్చటను హేళనజేయగ పండితాళియే
పన్నుగ జూడవింతలను పంక్తిని గూర్చుని వేములాడలో
అన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో
కందం
రిప్లయితొలగించండిసన్నగ తెల్లగ సొగసుగ
మిన్నగ మఱబట్టి వండ మెతుకులు మెఱవన్
చిన్నగ వడ్డన జేయగ
అన్నము సున్నమని మోదమందిరి బందుల్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
ఉత్పలమాల:
రిప్లయితొలగించండిఎన్నిసపర్యలేపగిది నేర్పడఁజేసిన నన్నియొకెత్తు సం
పన్నుల పెండ్లియందు పలు వంటలు జేయుటొకెత్తు! అందునన్
కొన్ని మిగిల్చి కంచమున కుప్పనఁబోయక లక్షణమ్ముగన్
“అన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో”
(మిగులకుండ, వృథా కాకుండ...అన్నము శూన్యమైనదనే అర్థంలో....పూరణ)
-కటకం వేంకటరామ శర్మ.
అన్నము నమలుట కష్టం
రిప్లయితొలగించండిబెన్నగ దంతములు చాల పెకలింపబడెన్
చెన్నుగ వండిన మెత్తని
అన్నము సున్నమని మోదమందిరి బందుల్
భిన్నమునౌకదంబముగవేఁగనుఁజూపులచిత్రమన్నమౌ
రిప్లయితొలగించండిసన్ననికాయగూరలనుచాలగనిండుపలావుగానకే
పన్నుగఛాయఁదోచెడినిభావనయందునవడ్డనంబునన్
అన్నముసున్నమైనముదమందిరిబంధులుపెండ్లివిందులో
అన్నన్న యే మన నగును
రిప్లయితొలగించండిగన్నుల కింపు గొలుపంగఁ గల విచ్చట మే
లన్నా పొట్టకు వీటికి
నన్నము సున్న మని మోద మందిరి బంధుల్
పిన్నలఁ బెద్ద లెల్లరను వృద్ధుల నెంచి మనమ్ము లందు నా
సన్నుల కీయఁ దృప్తిని భృశమ్ముగ వండిరి వేఱు వేఱుగాఁ
బన్నుగ నట్లు వృద్ధులకు వడ్డన సేయఁగ వారి కింపుగా
నన్నము సున్న మైన ముద మందిరి బంధులు పెండ్లి విందులో
అన్నులమిన్నమాయ శశియై తనరూపముమార్చి పెండ్లిలో
రిప్లయితొలగించండినెన్నియొ వింతచేష్టితము లెల్లరు చూడ ఘటోత్కచుండునున్
చిన్నమయాదులాచరణ చేయగ నచ్చట వంటకంబులం
దన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో
బంధులు ముదమందుట కూడా చిన్నమ(మా)య ప్రభావమే😃
తొలగించండిఅన్నా!యేమని వింటిని
రిప్లయితొలగించండియన్నము సున్నమని మోదమందిరి బందుల్
మన్నన లేకను బలుకుట
సన్నయమేనీకువిమల! సంతస మౌనే!
అన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లివిందులో
రిప్లయితొలగించండిదిన్నని మాటకాదదియ తెల్పుము రాధిక!సున్నమెట్లగున్
విన్నదీ గాదు నెచ్చటను బేలతనంబున బల్కనోపునే
గన్నదియైనచో చెపుమ కాంతుము మేమును దప్పకుండగన్
చిన్నది యౌటచే వయసు, చీకును పెండిలి యాడ నొల్లకే
రిప్లయితొలగించండికన్నియ నేడ్వగా తెగువగా తన యన్నయ పెండ్లినాపగా
తిన్నగ బోసి సున్నమను తెంపెను వియ్యము,యందు కొందరున్
అన్నము సున్నమైన ముదమందిరి, బంధులు పెండ్లి విందులో.
సున్నము టైపాటు
తొలగించండిఅన్నులమిన్నయౌ దనయకన్నిట జోడగు వాని నెంచి దా
రిప్లయితొలగించండిమిన్నగ జేసె బెండ్లి గని మెచ్చగనెల్లరు నాటి వేడ్కలన్
చెన్నుగనైంద్రజాలికుడు జేసె విచిత్రములబ్బురంబుగా
నన్నము సున్నమైన ముదమందిరి బంధులు పెండ్లి విందులో