8-10-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్”(లేదా...)“బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ”
ఏలర తెలుగది యక్కరయేలేని చదువని యెరుగు మింగ్లీషొకటే మేలును గూర్చునటంచనబాలవ్యాకరణము జదవన్ దోషమగున్.
మేలగు రచనలు వచ్చుఁను బాల వ్యాకరణము చదువన్ : దోష మగున్ బేలవ మై చదువరులవ హేళన కున్ గురి యగునని యెరుగగ వలయున్
కాల గతిని బాషలగాలము పెనవేసె తెలుగు గాసట బిసటైచాలు విమర్శల పెనుగుట"బాలవ్యకరణముఁ జదువన్ దోషమగున్"
వీలగు కైతలు వ్రాయగబాలవ్యాకరణముఁ జదువన్ ; దోషమగున్మేలుగ సంధుల సలుపకఆలిఖితము జేసి శంకరార్యుల కంపన్
నాబోంట్లకుహేలగ పద్యము వ్రాయగతేలిక పద్ధతులనెంచి తెలియక రీతిన్చాలీచాలని బుద్ధినిబాలవ్యాకరణము జదువన్ దోషమగున్చదవేస్తే ఉన్నమతి పోయిందట ( నా బోంట్లకు)చాలించంగను వృత్తిబాధ్యతల విశ్రాంతుండునై ప్రీతిగన్కాలక్షేపముజేయగా దగిన సత్కార్యంబుగా నెంచుచున్ శ్రీలంగూర్చెడు పద్యసూనములచే శ్రీభారతిన్ గొల్వగానేలాగైనను నేర్వగావలయునన్ నిచ్ఛాళువై మందుడైబాలవ్యాకరణమ్మునున్ జదువినన్ బాండిత్యమే లుప్తమౌ
క్రొవ్విడి వెంకట రాజారావు: వీలుగ నాంగ్లపు భాషను వాలకముగ నభ్యసించు వారల కెపుడున్ తేలికగా నెఱుకపడని బాలవ్యాకరణము జదువన్ దోషమగున్.
బాలురు పండితులౌదురుబాలవ్యాకరణముఁ జదువన్, దోషమగున్మేలొనరించనియాటలకాలము యాంత్రిక ముగవృధ గాగడపినచో
శా: కాలాతీతము నయ్యె విద్య బడయన్ కాలాను సారమ్ము గానాలోచింపగ రీతి నెట్టులగుచో నానంద ముప్పొంగగా చాలా కాలము వేచి చూచి విధిగా ఛాత్రుండ నైయెప్ప నేబాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్త మౌ ?వై. చంద్రశేఖర్
చాలున్ వ్యర్థపు మాటలింక నిది విశ్వంబందు మాటాడరీనేలన్ మాత్రమె యొప్పు తెల్గనుచునా నీచుండు తా పల్కుచున్ గాలంబెంతయొ మారెగాదె యిక యాంగ్లంబొక్కటే నేర్వుమా బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ.
కాలంబేగతి మారిపోయినది పోగాలంబు దాపించెనావేలంవెర్రిగ నింగిలీసు చదువే విజ్ఞాన దాయందురాబాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌలీలన్ బల్కగ పాడియౌన? జనులీరీతిన్ బ్రచారింతురా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వీలుగ 'రెన్ యండ్ మార్టిన్'ఆలన పాలన విడిచిన యాంగ్లము నేర్వన్మేలగు తెలుగును విడువగబాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్ (ఆంగ్ల భాష వ్యాకరణానికి 'Wren and Martin' ప్రామాణిక గ్రంధము)
మూలము తెలుంగు ప్రజలకుబాలవ్యాకరణముఁ ; జదువన్ దోషమగున్మలినములగు దుష్టపు రచనలు,వీని బరితెగినమ్మ నైతికమగునా?
మూడు నాలుగు పాదములు కూడా గురువుతో మొదలవ్వాలి.సవరించండి. అసనారె
ఇలా సరి చేశానండీ ధన్యవాదాలు!మూలము తెలుంగు ప్రజలకుబాలవ్యాకరణముఁ ; జదువన్ దోషమగున్మాలిన్యంబౌ రాతలు,వీలున జదువంగ వలయు వేల్పుల కథలన్
క్రొవ్విడి వెంకట రాజారావు: వీలుంగూడిన రీతి నాంగ్లమును సంప్రీతిన్ సదా నేర్చుచున్ ఆలాపమ్ముల నాడుచుండి చను విద్యార్థుల్ కఠోరమ్మునై సౌలభ్యంబుగ నేర్వరాని కరణిన్ శబ్దంబులన్ నించునౌబాలవ్యాకరణమ్మునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ
చాలనుచు మాని యక్షరమాలను సరిగా నెరుగక మందస్మితుడైబాలుడు పొత్తము జేకొనిబాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్
చాలినభాషాసమకరవాలముచేతనుగలిగినపాండితియగునీకాలముమాయాజాలముబాలవ్యాకరణముఁజదివినదోషమగున్
ఏలానీమముదప్పుటన్నవతతానైపుణ్యవాగ్ధారలన్చాలీచాలనిపాండితీమహిమతోజాలంబులన్వేయుటల్మైలంబడ్డదిమాత్రుగర్భమదిగోమేసెన్గదాగడ్డినేబాలవ్యాకరణముఁజదువన్పాండిత్యమేలుప్తమౌ
కందంతాలిమి నేర్చినవన్నియుమేలుగ మననమ్ము సేయ మింగుడు వడదే!పేలవపు జ్ఞాపకమ్మునబాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్శార్దూలవిక్రీడితములీలామాత్ర ప్రవృత్తిఁ బద్యముల సంప్రీతంబుగన్ వ్రాయుచున్మేలన్ రీతిగఁ గంది వారలవియే మెచ్చంగ, జృంభింపఁగన్వాలాయమ్మని నేర్వ నొప్పుననఁగన్ పాఠాంతరాల్లేనిదౌబాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ!
కందంచాలు తెలుగు ,తెలుగు జదువచాలా దోషముగను అపచారము దలచేవేళన, పాఠ్యాంశములుగబాలవ్యాకరణము జదువన్ దోషమగున్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్
చాలీచాలని వేతనమ్ము గొనుచున్ సాగించు సంసారమున్వేళాపాళలు లేని కృత్యములతో వేదించు రాజ్యమ్ములోనేలాజీవనయానమంచు పరభాషే ముద్దుగాన్ శ్రోతకున్బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ
స్థూలముసూక్ష్మములెఱుగకకాలముతోకలసిమెలసిఁగదులుచువసుధన్,మేలగుసూత్రములెంచకబాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్”కొరుప్రోలు రాధాకృష్ణ రావు
కేలీ లీలను జదువుమ బాలా! యేలా భయమ్ము వడయఁగ నీకుం జాలుం జాలును నీ వన బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్ (చదువన్ = చదువను)కాలం బెల్ల నిరర్థకం బగును దుష్కార్యంబ చింతింప దుశ్శీలుం జేరిన సజ్జ నోత్తముఁడు దుశ్శీలుండునౌ రీతినిన్ హాలాహాల నిభంపుఁ గావ్యమును, వ్రాయన్ దానిఁ బాటింపకే బాలవ్యాకరణంబునున్, జదివినన్ బాండిత్యమే లుప్తమౌ
మేలౌ పద్యములభ్యసించు కవికిన్ మేధస్సు పెంపొందునాబాలవ్యాకరణంబునున్ జదివినన్; బాండిత్యమే లుప్తమౌగేలిన్ సేయుచు మూలసూత్రములనాక్షేపించి వాచాలతన్గీలింపంగ పదంబులెట్లు గనునంగీకారమా వ్రాఁతలే
మేలగు భాషా ఙ్ఞానముబాలవ్యాకరణముఁ జదువన్, దోషమగున్హేలగ తమ భాష మరచిబాలురు పరభాషనెంచి పరవశమగుటన్.
బాలా!యేమని యంటివిబాలవ్యాకరణము జదువ దోషమగున్ ?మేలగు నూతన రచనకుచాలుదువిల గవివతంస సరసన నుండన్
ఏలీలన్ వచియింతు నా స్థితినినే నీవేళ దుర్భాగ్యుడన్కాలాతీతము జర్గిపోయినది నాకాంక్షెట్లు సిద్ధించునోనేలన్ వీడియు సాము జేసినటులౌనేనిప్డు భారంబుతోబాలా వ్యాకరణంబునున్ జదివినన్పాండిత్యమే లుప్తమౌ.
బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాడిత్యమే లుప్తమౌబాలా!యేమని యంటివిప్పుడ,యహో పాండిత్యమే లుప్తమాబాలవ్యాకరణంబునున్ జదివినన్ బద్యాలదోషంబులేలీలన్ గానగరావు సుంతయుగనున్ లేలిహ్యమానంబుగా
రిప్లయితొలగించండిఏలర తెలుగది యక్కర
యేలేని చదువని యెరుగు మింగ్లీషొకటే
మేలును గూర్చునటంచన
బాలవ్యాకరణము జదవన్ దోషమగున్.
మేలగు రచనలు వచ్చుఁను
రిప్లయితొలగించండిబాల వ్యాకరణము చదువన్ : దోష మగున్
బేలవ మై చదువరులవ
హేళన కున్ గురి యగునని యెరుగగ వలయున్
కాల గతిని బాషల
రిప్లయితొలగించండిగాలము పెనవేసె తెలుగు గాసట బిసటై
చాలు విమర్శల పెనుగుట
"బాలవ్యకరణముఁ జదువన్ దోషమగున్"
వీలగు కైతలు వ్రాయగ
రిప్లయితొలగించండిబాలవ్యాకరణముఁ జదువన్ ; దోషమగున్
మేలుగ సంధుల సలుపక
ఆలిఖితము జేసి శంకరార్యుల కంపన్
నాబోంట్లకు
రిప్లయితొలగించండిహేలగ పద్యము వ్రాయగ
తేలిక పద్ధతులనెంచి తెలియక రీతిన్
చాలీచాలని బుద్ధిని
బాలవ్యాకరణము జదువన్ దోషమగున్
చదవేస్తే ఉన్నమతి పోయిందట ( నా బోంట్లకు)
చాలించంగను వృత్తిబాధ్యతల విశ్రాంతుండునై ప్రీతిగన్
కాలక్షేపముజేయగా దగిన సత్కార్యంబుగా నెంచుచున్
శ్రీలంగూర్చెడు పద్యసూనములచే శ్రీభారతిన్ గొల్వగా
నేలాగైనను నేర్వగావలయునన్ నిచ్ఛాళువై మందుడై
బాలవ్యాకరణమ్మునున్ జదువినన్ బాండిత్యమే లుప్తమౌ
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివీలుగ నాంగ్లపు భాషను
వాలకముగ నభ్యసించు వారల కెపుడున్
తేలికగా నెఱుకపడని
బాలవ్యాకరణము జదువన్ దోషమగున్.
బాలురు పండితులౌదురు
రిప్లయితొలగించండిబాలవ్యాకరణముఁ జదువన్, దోషమగున్
మేలొనరించనియాటల
కాలము యాంత్రిక ముగవృధ గాగడపినచో
శా:
రిప్లయితొలగించండికాలాతీతము నయ్యె విద్య బడయన్ కాలాను సారమ్ము గా
నాలోచింపగ రీతి నెట్టులగుచో నానంద ముప్పొంగగా
చాలా కాలము వేచి చూచి విధిగా ఛాత్రుండ నైయెప్ప నే
బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్త మౌ ?
వై. చంద్రశేఖర్
రిప్లయితొలగించండిచాలున్ వ్యర్థపు మాటలింక నిది విశ్వంబందు మాటాడరీ
నేలన్ మాత్రమె యొప్పు తెల్గనుచునా నీచుండు తా పల్కుచున్
గాలంబెంతయొ మారెగాదె యిక యాంగ్లంబొక్కటే నేర్వుమా
బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ.
కాలంబేగతి మారిపోయినది పోగాలంబు దాపించెనా
రిప్లయితొలగించండివేలంవెర్రిగ నింగిలీసు చదువే విజ్ఞాన దాయందురా
బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ
లీలన్ బల్కగ పాడియౌన? జనులీరీతిన్ బ్రచారింతురా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివీలుగ 'రెన్ యండ్ మార్టిన్'
రిప్లయితొలగించండిఆలన పాలన విడిచిన యాంగ్లము నేర్వన్
మేలగు తెలుగును విడువగ
బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్
(ఆంగ్ల భాష వ్యాకరణానికి 'Wren and Martin' ప్రామాణిక గ్రంధము)
మూలము తెలుంగు ప్రజలకు
రిప్లయితొలగించండిబాలవ్యాకరణముఁ ; జదువన్ దోషమగున్
మలినములగు దుష్టపు రచ
నలు,వీని బరితెగినమ్మ నైతికమగునా?
మూడు నాలుగు పాదములు కూడా గురువుతో మొదలవ్వాలి.సవరించండి. అసనారె
తొలగించండిఇలా సరి చేశానండీ ధన్యవాదాలు!
తొలగించండిమూలము తెలుంగు ప్రజలకు
బాలవ్యాకరణముఁ ; జదువన్ దోషమగున్
మాలిన్యంబౌ రాతలు,
వీలున జదువంగ వలయు వేల్పుల కథలన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివీలుంగూడిన రీతి నాంగ్లమును సంప్రీతిన్ సదా నేర్చుచున్
ఆలాపమ్ముల నాడుచుండి చను విద్యార్థుల్ కఠోరమ్మునై
సౌలభ్యంబుగ నేర్వరాని కరణిన్ శబ్దంబులన్ నించునౌ
బాలవ్యాకరణమ్మునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ
చాలనుచు మాని యక్షర
రిప్లయితొలగించండిమాలను సరిగా నెరుగక మందస్మితుడై
బాలుడు పొత్తము జేకొని
బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్
చాలినభాషాసమకర
రిప్లయితొలగించండివాలముచేతనుగలిగినపాండితియగునీ
కాలముమాయాజాలము
బాలవ్యాకరణముఁజదివినదోషమగున్
ఏలానీమముదప్పుటన్నవతతానైపుణ్యవాగ్ధారలన్
రిప్లయితొలగించండిచాలీచాలనిపాండితీమహిమతోజాలంబులన్వేయుటల్
మైలంబడ్డదిమాత్రుగర్భమదిగోమేసెన్గదాగడ్డినే
బాలవ్యాకరణముఁజదువన్పాండిత్యమేలుప్తమౌ
కందం
రిప్లయితొలగించండితాలిమి నేర్చినవన్నియు
మేలుగ మననమ్ము సేయ మింగుడు వడదే!
పేలవపు జ్ఞాపకమ్మున
బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్
శార్దూలవిక్రీడితము
లీలామాత్ర ప్రవృత్తిఁ బద్యముల సంప్రీతంబుగన్ వ్రాయుచున్
మేలన్ రీతిగఁ గంది వారలవియే మెచ్చంగ, జృంభింపఁగన్
వాలాయమ్మని నేర్వ నొప్పుననఁగన్ పాఠాంతరాల్లేనిదౌ
బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ!
కందం
రిప్లయితొలగించండిచాలు తెలుగు ,తెలుగు జదువ
చాలా దోషముగను అపచారము దలచే
వేళన, పాఠ్యాంశములుగ
బాలవ్యాకరణము జదువన్ దోషమగున్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
చాలీచాలని వేతనమ్ము గొనుచున్ సాగించు సంసారమున్
రిప్లయితొలగించండివేళాపాళలు లేని కృత్యములతో వేదించు రాజ్యమ్ములో
నేలాజీవనయానమంచు పరభాషే ముద్దుగాన్ శ్రోతకున్
బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్థూలముసూక్ష్మములెఱుగక
రిప్లయితొలగించండికాలముతోకలసిమెలసిఁగదులుచువసుధన్,
మేలగుసూత్రములెంచక
బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్”
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
కేలీ లీలను జదువుమ
రిప్లయితొలగించండిబాలా! యేలా భయమ్ము వడయఁగ నీకుం
జాలుం జాలును నీ వన
బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్
(చదువన్ = చదువను)
కాలం బెల్ల నిరర్థకం బగును దుష్కార్యంబ చింతింప దు
శ్శీలుం జేరిన సజ్జ నోత్తముఁడు దుశ్శీలుండునౌ రీతినిన్
హాలాహాల నిభంపుఁ గావ్యమును, వ్రాయన్ దానిఁ బాటింపకే
బాలవ్యాకరణంబునున్, జదివినన్ బాండిత్యమే లుప్తమౌ
మేలౌ పద్యములభ్యసించు కవికిన్ మేధస్సు పెంపొందునా
రిప్లయితొలగించండిబాలవ్యాకరణంబునున్ జదివినన్; బాండిత్యమే లుప్తమౌ
గేలిన్ సేయుచు మూలసూత్రములనాక్షేపించి వాచాలతన్
గీలింపంగ పదంబులెట్లు గనునంగీకారమా వ్రాఁతలే
మేలగు భాషా ఙ్ఞానము
రిప్లయితొలగించండిబాలవ్యాకరణముఁ జదువన్, దోషమగున్
హేలగ తమ భాష మరచి
బాలురు పరభాషనెంచి పరవశమగుటన్.
బాలా!యేమని యంటివి
రిప్లయితొలగించండిబాలవ్యాకరణము జదువ దోషమగున్ ?
మేలగు నూతన రచనకు
చాలుదువిల గవివతంస సరసన నుండన్
ఏలీలన్ వచియింతు నా స్థితిని
రిప్లయితొలగించండినే నీవేళ దుర్భాగ్యుడన్
కాలాతీతము జర్గిపోయినది నా
కాంక్షెట్లు సిద్ధించునో
నేలన్ వీడియు సాము జేసినటులౌ
నేనిప్డు భారంబుతో
బాలా వ్యాకరణంబునున్ జదివినన్
పాండిత్యమే లుప్తమౌ.
బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాడిత్యమే లుప్తమౌ
రిప్లయితొలగించండిబాలా!యేమని యంటివిప్పుడ,యహో పాండిత్యమే లుప్తమా
బాలవ్యాకరణంబునున్ జదివినన్ బద్యాలదోషంబులే
లీలన్ గానగరావు సుంతయుగనున్ లేలిహ్యమానంబుగా