8, అక్టోబర్ 2021, శుక్రవారం

సమస్య - 3866

9-10-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అంధుఁడు గణించెఁ జుక్కల నంబరమున”
(లేదా...)
“జన్మాంధుండు గణించెఁ నభ్రమున నక్షత్రమ్ములెల్లన్ వడిన్”

22 కామెంట్‌లు:

  1. విమలవిజ్ఞానశాస్త్రంబువిస్త్రుతముగ
    చూపెదారినిమనిషికిచూపునిచ్చి
    కంటగాననివస్తువుగానవచ్చె
    అంధుఁడుగణించెఁజుక్కలనంబరమున

    రిప్లయితొలగించండి
  2. కొత్తగ లెక్కలు నేర్చిన కుర్రకుంక
    గణన చేయుటె ధ్యాసగ గనినవన్ని
    ఉత్సుకతను లెక్కింపగ నురుకుచును గు
    ణాంధుడు గణించె జుక్కల నంబరమున

    గుణాంధుడు = బుద్ధి లేనివాడు

    రిప్లయితొలగించండి
  3. గగన మందలి తారల గణ న సేయ
    జగతి యందున నేరికి సాధ్య పడదు
    అంధుడు గణించె జుక్కల నంబరమున
    ననెడి మాటల నమ్మరీ యవని యందు

    రిప్లయితొలగించండి

  4. శార్దూలము:
    పెన్మార్పుల్గనవైద్యరంగమునఁ జొప్పించంగ నూత్నాకృతుల్
    తన్మూలంబులనింద్రియమ్ము లను చిత్రంగా నవీనించ, గీ
    రన్మూకే గళమెత్తి పాడ ,గతినిన్రాణించె లుప్తాంగుడే
    “జన్మాంధుండు గణించెఁ నభ్రమున నక్షత్రమ్ములెల్లన్ వడిన్”
    -కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి

  5. సన్మార్గమ్ము జరించువారెకదరా సచ్చీలురౌ వారికిన్
    సన్మానమ్మును సేయువారమనియా సంఘమ్మదే తెల్పగా
    మన్మండ్లేడుగురున్న వాడొసగెసంబంధీకులన్ పెక్కుగా
    జన్మాంధుండు గణించెఁ నభ్రమున నక్షత్రమ్ములెల్లన్ వడిన్

    రిప్లయితొలగించండి
  6. సన్మార్గంబునసంయమీంద్రుడతడేసాధించెనాలోచనన్
    తన్మాత్రుండగుమౌనిదాతపసుతోతాల్మిన్గనన్సాధ్యమౌ
    ఉన్మాదంబునపారలౌకికముతాలోనున్నసత్యంబునన్
    జన్మాంధుండుగణించెనభ్రముననక్షత్రంబులెల్లన్వడిన్

    రిప్లయితొలగించండి

  7. ఎన్నికలనిల్చి గెలుపుకై యెంతగానొ
    యత్నములజేయు వాడితో ననుచరుడొక
    డోట్ల లెక్కను చెప్పెనే యోర్మి తోడ
    నంధుఁడు గణించెఁ జుక్కల నంబరమున

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గణితశాస్త్ర గుట్టులనెల్ల కఱచి యుండి
    సంఖ్య లందలి చిక్కులు చక్కజేయు
    చీకును నుడువు లెన్నియొ జెప్ప మనగ
    అంధుడు గణించె చుక్కల నంబరమున.

    రిప్లయితొలగించండి
  9. శా:

    జన్మాంధుండగుటేని నిశ్చయముగా సాగింప వ్యాపారమే
    మన్మో హంబున జేరదీసె నిపుణున్ మర్మంబులే దెల్వనై
    సన్మార్గమ్మును మాని కల్ల దనమున్ జవ్వాడ చింతించుచున్
    జన్మాంధుండు గణించె నభ్రమున నక్షత్రమ్ము లెల్లన్ వడిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. జ్యోతిషాదిశాస్త్రమ్ముల యోగ్యుడతడు
    వాస్తు విజ్ఞాని విఖ్యాత పండితుడని
    గణుతికెక్కి గడించిన గర్వి ధనమ
    దాంధుఁడు గణించెఁ జుక్కల నంబరమున

    రిప్లయితొలగించండి
  11. సమస్య :

    జన్మాంధుండు గణించె నభ్రమున న
    క్షత్రమ్ములెల్లన్ వడిన్

    ( రాయబారియైన నారాయణుణ్ణి దుష్టచతుష్టయం బంధించబోతే స్వామి విశ్వరూపుడైనాడు. పుట్టుగ్రుడ్డికి కళ్లు వచ్చాయి.అప్పుడు అతడు చేసినపని )

    శార్దూలవిక్రీడితము
    -----------------

    ఉన్మాదంబున కృష్ణు గట్టుటకునై
    యూగాడుచున్ దుష్టు లా
    సన్మాన్యున్ ఘను జుట్టుముట్టగను వి
    శ్వంబైన యామూర్తినే
    కన్మూతన్ ధృతరాష్ట్రుడే వదలుచున్
    గాంచెన్మహాధన్యుడై ;
    జన్మాంధుండు గణించె నభ్రమున న
    క్షత్రమ్ములెల్లన్ వడిన్ .

    రిప్లయితొలగించండి
  12. హితులిరువురు గడలి దరికేగియుండ
    ధ్వనిని విని యచటికి వచ్చు తరగలన్ని
    యంధుఁడు గణించెఁ ; జుక్కల నంబరమున
    నరయుచు గణించలేకుండె నతనిసఖుడు

    రిప్లయితొలగించండి
  13. పుడమియందునాతండొక పుట్టుగుడ్డి
    నేత్ర దానముబడసెను నేటిదినము
    చీకటితొలంగి కన్నుల, చింత తొలగి
    అంధుఁడు గణించెఁ జుక్కల నంబరమున

    రిప్లయితొలగించండి
  14. ఉన్మాదమ్మున కౌరవుల్ కదియగా నుద్దేశమే భగ్నమై
    పెన్మార్పుల్ హరి విశ్వరూపమును చూపించన్ తటస్థింపగా
    సన్మార్గమ్మునబోపుపెద్దలట నాశ్చర్యమ్ముతో మ్రొక్కగా
    సన్మానమ్మున రాజు కోర హరియా సంకల్పమీడేర్చగా
    జన్మాంధుండు గణించెఁ నభ్రమున నక్షత్రమ్ములెల్లన్ వడిన్

    రిప్లయితొలగించండి
  15. చిన్ముద్రాంకిత దివ్య తేజము మదిన్ సేవించుచున్ నిత్యమా
    సన్మార్గుండటులొందె సద్గురు కటాక్షంబంతటన్ శ్రద్ధతో
    తన్మంత్రంబు పఠింపగా నమరె నిధ్యానంబపూర్వంబుగా
    జన్మాంధుండు గణించెఁ నభ్రమున నక్షత్రమ్ములెల్లన్ వడిన్

    రిప్లయితొలగించండి
  16. తేటగీతి
    విశ్వనాథ వారల సిరివెన్నెలందుఁ
    దనర వెన్నెలన్ వెలుగు బృందావనమ్ము
    సెలఁగి గానంపుటూహల చిత్రమల్లి
    నంధుఁడు గణించెఁ జుక్కల నంబరమున

    శార్దూలవిక్రీడితము
    మన్మోహన్! సిరివెన్నెలన్ మహిత నిర్మాణంపు సచ్చిత్రమున్
    సన్మార్గుండగు విశ్వనాథులొకరున్ సంధించె సత్కీర్తిమై
    యున్మేషంబున గాయకుండు నటుఁడై యూహించి చంద్రద్యుతిన్
    జన్మాంధుండు గణించెఁ నభ్రమున నక్షత్రమ్ములెల్లన్ వడిన్

    రిప్లయితొలగించండి
  17. చుక్కలను గణింపఁ దరమె సూర్య చంద్రు
    ల కయిన నలినజున కైన నకట వితత
    నాక మగునె పత్రమ్ము వివేక మందు
    నంధుఁడు గణించెఁ జుక్కల నంబరమున


    కన్మా దైవము తోడు నుండఁ గలదే కా రాని కార్యం బహో
    సన్మానమ్మున కాతఁ డర్హుఁ డగుఁ దా సంరంభ మేపారఁగన్
    విన్మా సత్యము సెప్పు చుంటిని మనో నేత్రమ్మునం జక్కఁగా
    జన్మాంధుండు గణించెఁ నభ్రమున నక్షత్రమ్ము లెల్లన్ వడిన్

    రిప్లయితొలగించండి
  18. నిర్భయ దిశ చట్టంబులు నిల్చె నిరువు
    గ బ్రతుకు చెడిన వనితకు  కలుగ నెఱియు
    నేరము ఋజువై చెరసాల నెలవుగా మ
    దాంధుఁడు గణించెఁ జుక్కల నంబరమున

    రిప్లయితొలగించండి
  19. తేటగీతి
    కురుపతి దృతరాష్ట్రుడు ఘన కురుసభందు
    కృష్ణుడు వచియించిన సంధి కృత్య మును పె
    డచెవి నిడి మాటలాడకుండనె గడిపెను
    అంధుడు గణించె జుక్కల నంబరమున.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  20. జన్మాంతర్గత వాసనల్ యొకని వీక్షన్ సంగ్రహించన్ గడున్
    సన్మార్గంబున నేత్ర దానము నిడన్ సన్మిత్రు డొక్కండు తా
    మున్ముందుండగ, క్రొత్త కన్ను తనలో పూరించ దృష్టిన్ , భళా
    జన్మాంధుండు గణించె నభ్రమున నక్షత్రమ్ము లెల్లన్ వడిన్.

    రిప్లయితొలగించండి
  21. జన్మాంధుండయితేమి జ్యోతిషమునన్ చంగుండు సంఘంబునన్
    సన్మానమ్ముల నెన్నియో వడసె నా శాస్త్రంబునన్ దిట్టగా
    తన్మూలంబుగ మానసంబున గ్రహస్థానంబు లూహించుచున్
    జన్మాంధుండు గణించెఁ నభ్రమున నక్షత్రమ్ములెల్లన్ వడిన్

    రిప్లయితొలగించండి