10-10-2021 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అతివకున్ మొలిచె మీసము లంచుఁ గనిరి”(లేదా...)“అతివకు మీసముల్ మొలిచెనంచు ముదంబునఁ గాంచి రెల్లరున్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గ్రంధుల సమస్య వలనను రమణి కమరెఁ వింత యగు రూపమని వెజ్జు వివర మిచ్చె నతివకు మొలిచె మీసము లంచు గనిరి యబ్బుర ము నంది జనులిల హా యనిరి గ
రాణిరుద్రమపురుషునిరాజసమునపౌరుకుశలంబుగానగపోరుసలిపెవీరనారిగభాసించెవిస్మయముగఅతివకుమోలిచెమీసములంచుఁగనిరి
అతివలు బేలలౌదురను నందరి యూహల ద్రోసిపుచ్చుచున్పతి హరివెంట యుద్ధమున బాల్గొని రాక్షసవీరుజంపగాస్తుతమతి సత్యభామయట తోడుగనిల్చుచు ఠీవినొల్కగానతివకు మీసముల్ మొలిచెనంచు ముదంబున గాంచి రెల్లరున్
క్రొవ్విడి వెంకట రాజారావు: వెలది వలె నాటకమ్మున వేష మాడు పురుషుడట మఱపున మీసమున కనబడ చూచునట్టి నాహూతులు చోద్యమొంది నతివకు మొలచె మీసములంచు గనిరి.
వీధి నాటక మాడెడు వేషగాడుతరుణి పాత్రను ధరియింప తరలివచ్చెమరచె వేగిరపాటున గొరుగుకొనుటఅతివకు మొలిచె మీసము లంచుఁ గనిరి
తేటగీతికోరి సఖులభిమన్యుని గుంపుఁగూడిమొలకమీసము సోకుచు పురులఁ ద్రిప్ప"సుందరుండు మొగతనమ్ముఁ జూపనెంచనతివకు, మొలిచె మీసము" లంచుఁ గనిరిచంపకమాలఅతులిత వీరశేఖరుఁడు నయ్యభిమన్యుడు గుంపుఁజేరుచున్గుతుకము మీర మాటికిని గోటను మీటఁగ గోరమీసమున్నతమయినంతటన్ "మొగతనమ్మున జొప్పడఁ జూపనెంచగానతివకు, మీసముల్ మొలిచె"నంచు ముదంబునఁ గాంచి రెల్లరున్
కె.వి.యస్. లక్ష్మి: అందమనగ మురియుచు అతివ కొనియె రంగు రంగుల క్రీములు రమ్యముగను పూసి జూడగ మెఱిసెడి మూతి గాంచి నతివకు మొలచె మీసములంచు గనిరి.
కుతిలము చెందినట్టి పతి కూర్చము పండె నటంచు రంగువే సి తరుణి జేరపిల్చెనని చెంతకు జేరి పరాయణమ్ము నేకతమున ముద్దులాడుతరి కాంతము ఖమ్మును శ్యామమంటగా నతివకు మీసముల్ మొలిచెనంచు ముదంబున గాంచిరెల్లరున్.
అమాయక పతి ని కాపాడే పత్ని గా నా ప్రయత్నము: చం: కుతకుత లాడమానసము కొంటెగ పిల్లలు కోతి చేష్టలన్సతతము జుట్టు పీకుచును సంతస మొందుచు గంతులేయగన్పతియని గాచ నెంచి పని పట్టగ వారల బుద్ధి జెప్పనైయతివకు మీసముల్ మొలిచె నంచు ముదంబున గాచి రెల్లరున్
కూర్చమునకు రంగునువేసి కొమ్మజేరిముద్దులాడగ నారంగు ముగ్దకంటనదియె గాంచినచెలులెల్ల రచ్చెరువుననతివకు మొలిచె మీసములంచు గనిరి.
పలుకరించ వచ్చిన మంత్రివర్యుని నిలదీసి ప్రశ్నించుటందామె దెగువ నడపఅతివకు మొలిచె మీసము లంచుఁ గనిరిపురమునందు జనులు కడుముదము తోడ
సమస్య :అతివకు మీసముల్ మొలిచె నంచు ముదంబున గాంచి రెల్లరున్ ( విశ్వనాథవారి నాటికలో నాగమ్మపాత్ర ధరించిన రామారావుగారు మీసం తీయకుండానే నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు . )ధృతమతి విశ్వనాథ రచి యించిన 'నాయకురాలు' నాటికన్ స్మితముఖసుందరుండయిన శిష్యుడు రాముడు నాగమాంబయై స్తుతులను పొందినాడు తన సొంపగు మీసము తీయకుండగా ;" నతివకు మీసముల్ మొలిచె "నంచు ముదంబున గాంచి రెల్లరున్ .
అతి ధృతి యున్న పూరుషులు నైననుజేయని గొప్ప కార్యమున్నతిదృఢమైన చిత్తమున నంగన యెక్కె హిమాలయంబునున్స్తుతియొనరించి కొందరును సోద్యముతో గని యిట్టు లాడి రీ'యతివకు మీసముల్ మొలిచెనంచు',ముదంబున గాంచిరెల్లరున్
చంపకమాల:స్ఫుతినుకు నంతరిక్షమున జుక్కల దాపున నిల్పినారు, వాక్పతి రచనల్ చెడంగ దృఢ కాయము చిత్తము బెంచినారు,యగ్రత పలుశాఖ లందు మహరాణులు తగ్గ రు పూరుషాళితోన్న“తివకు మీసముల్ మొలిచెనంచు ముదంబునఁ గాంచి రెల్లరున్”-కటకం వేంకటరామ శర్మ.
అబల గాదు ప్రబల సైన్యమందు చేరమీస మున్నట్టి నేతల మీరి గెలువదుష్కర ప్రతిభ లెన్నియో దొరకొన జనులతివకు మొలిచె మీసము లంచుఁ గనిరి
అతివలవేషమందు జనులందరి మన్ననలొందు నట్లుగానతి సహజంబుగానటనమాతడు సల్పుచు నుండ నొక్కనాడతివగవేషమేయతనయాస్యమునందున మీసముండగాఅతివకు మీసముల్ మొలిచెనంచుముదంబునఁ గాంచి రెల్లరున్
కలియుగ మహిమలివి యని కాంతలంతయతివకు మొలిచె మీసములంచు గనిరియాడపిల్లలు మగవారి ననుసరించతారు మారుగ మారిరి దలచ మదిని
చారు నయన గంధ మలఁది చనుచు నుండఁ జంప కంబని భ్రమ సెంది చామ నాసికఁ గని వ్రాలఁగ భ్రమర సంఘమ్ము వింత నతివకు మొలిచె మీసము లంచుఁ గనిరివెతలకు నోర్చి విత్తులను బ్రీతి సెలంగఁగ సంగ్రహించి యాతత బల వర్ధ కౌషధ వితానము నింపుగ వాడి కావఁగా నత మృదు కాండ సంయుతము నాటిన విత్తు లవెల్లఁ, జెప్పఁగా నతివకు మీ సముల్, మొలిచె నంచు ముదంబునఁ గాంచి రెల్లరున్ [మీ సముల్ = మీకు సమ మైన వారు]
అతివకు మీసముల్ మొలిచె నంచును ముదంబున గాంచిరెల్లరున్ నతివల మోదమున్ గనగ నచ్చెరువందితి నొక్కసారిగాగతిపయ ధర్మమున్ వినుడు గాంతకు మీసముగల్గకారణంబతులిత జన్యులోపముగ భావన జేతును సుమ్ము నమ్ముమా
(NTR నాగమ్మ పాత్రను మీసముతోనే నటించిన సందర్భములో)ప్రతిభను జూపెగా మగువ పాత్ర ధరించి ప్రశంసలందెనాస్తుతమతి నందమూరి బిగి జూపెను మీసముతో నటించెనా మతకరి నాగమాంబ వలె మైమరపించె సభాంగణంబునందతివకు మీసముల్ మొలిచెనంచు ముదంబునఁ గాంచి రెల్లరున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగ్రంధుల సమస్య వలనను రమణి కమరెఁ
రిప్లయితొలగించండివింత యగు రూపమని వెజ్జు వివర మిచ్చె
నతివకు మొలిచె మీసము లంచు గనిరి
యబ్బుర ము నంది జనులిల హా యనిరి గ
రాణిరుద్రమపురుషునిరాజసమున
రిప్లయితొలగించండిపౌరుకుశలంబుగానగపోరుసలిపె
వీరనారిగభాసించెవిస్మయముగ
అతివకుమోలిచెమీసములంచుఁగనిరి
అతివలు బేలలౌదురను నందరి యూహల ద్రోసిపుచ్చుచున్
రిప్లయితొలగించండిపతి హరివెంట యుద్ధమున బాల్గొని రాక్షసవీరు
జంపగా
స్తుతమతి సత్యభామయట తోడుగనిల్చుచు ఠీవినొల్కగా
నతివకు మీసముల్ మొలిచెనంచు ముదంబున గాంచి రెల్లరున్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివెలది వలె నాటకమ్మున వేష మాడు
పురుషుడట మఱపున మీసమున కనబడ
చూచునట్టి నాహూతులు చోద్యమొంది
నతివకు మొలచె మీసములంచు గనిరి.
వీధి నాటక మాడెడు వేషగాడు
రిప్లయితొలగించండితరుణి పాత్రను ధరియింప తరలివచ్చె
మరచె వేగిరపాటున గొరుగుకొనుట
అతివకు మొలిచె మీసము లంచుఁ గనిరి
తేటగీతి
రిప్లయితొలగించండికోరి సఖులభిమన్యుని గుంపుఁగూడి
మొలకమీసము సోకుచు పురులఁ ద్రిప్ప
"సుందరుండు మొగతనమ్ముఁ జూపనెంచ
నతివకు, మొలిచె మీసము" లంచుఁ గనిరి
చంపకమాల
అతులిత వీరశేఖరుఁడు నయ్యభిమన్యుడు గుంపుఁజేరుచున్
గుతుకము మీర మాటికిని గోటను మీటఁగ గోరమీసమున్
నతమయినంతటన్ "మొగతనమ్మున జొప్పడఁ జూపనెంచగా
నతివకు, మీసముల్ మొలిచె"నంచు ముదంబునఁ గాంచి రెల్లరున్
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిఅందమనగ మురియుచు అతివ కొనియె
రంగు రంగుల క్రీములు రమ్యముగను
పూసి జూడగ మెఱిసెడి మూతి గాంచి
నతివకు మొలచె మీసములంచు గనిరి.
రిప్లయితొలగించండికుతిలము చెందినట్టి పతి కూర్చము పండె నటంచు రంగువే
సి తరుణి జేరపిల్చెనని చెంతకు జేరి పరాయణమ్ము నే
కతమున ముద్దులాడుతరి కాంతము ఖమ్మును శ్యామమంటగా
నతివకు మీసముల్ మొలిచెనంచు ముదంబున గాంచిరెల్లరున్.
అమాయక పతి ని కాపాడే పత్ని గా నా ప్రయత్నము:
రిప్లయితొలగించండిచం:
కుతకుత లాడమానసము కొంటెగ పిల్లలు కోతి చేష్టలన్
సతతము జుట్టు పీకుచును సంతస మొందుచు గంతులేయగన్
పతియని గాచ నెంచి పని పట్టగ వారల బుద్ధి జెప్పనై
యతివకు మీసముల్ మొలిచె నంచు ముదంబున గాచి రెల్లరున్
రిప్లయితొలగించండికూర్చమునకు రంగునువేసి కొమ్మజేరి
ముద్దులాడగ నారంగు ముగ్దకంట
నదియె గాంచినచెలులెల్ల రచ్చెరువున
నతివకు మొలిచె మీసములంచు గనిరి.
పలుకరించ వచ్చిన మంత్రివర్యుని నిల
రిప్లయితొలగించండిదీసి ప్రశ్నించుటందామె దెగువ నడప
అతివకు మొలిచె మీసము లంచుఁ గనిరి
పురమునందు జనులు కడుముదము తోడ
సమస్య :
రిప్లయితొలగించండిఅతివకు మీసముల్ మొలిచె
నంచు ముదంబున గాంచి రెల్లరున్
( విశ్వనాథవారి నాటికలో నాగమ్మపాత్ర ధరించిన రామారావుగారు మీసం తీయకుండానే నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు . )
ధృతమతి విశ్వనాథ రచి
యించిన 'నాయకురాలు' నాటికన్
స్మితముఖసుందరుండయిన
శిష్యుడు రాముడు నాగమాంబయై
స్తుతులను పొందినాడు తన
సొంపగు మీసము తీయకుండగా ;
" నతివకు మీసముల్ మొలిచె "
నంచు ముదంబున గాంచి రెల్లరున్ .
అతి ధృతి యున్న పూరుషులు నైనను
రిప్లయితొలగించండిజేయని గొప్ప కార్యము
న్నతిదృఢమైన చిత్తమున నంగ
న యెక్కె హిమాలయంబునున్
స్తుతియొనరించి కొందరును సోద్య
ముతో గని యిట్టు లాడి రీ
'యతివకు మీసముల్ మొలిచెనంచు',
ముదంబున గాంచిరెల్లరున్
చంపకమాల:
రిప్లయితొలగించండిస్ఫుతినుకు నంతరిక్షమున జుక్కల దాపున నిల్పినారు, వా
క్పతి రచనల్ చెడంగ దృఢ కాయము చిత్తము బెంచినారు,య
గ్రత పలుశాఖ లందు మహరాణులు తగ్గ రు పూరుషాళితో
న్న“తివకు మీసముల్ మొలిచెనంచు ముదంబునఁ గాంచి రెల్లరున్”
-కటకం వేంకటరామ శర్మ.
అబల గాదు ప్రబల సైన్యమందు చేర
రిప్లయితొలగించండిమీస మున్నట్టి నేతల మీరి గెలువ
దుష్కర ప్రతిభ లెన్నియో దొరకొన జను
లతివకు మొలిచె మీసము లంచుఁ గనిరి
అతివలవేషమందు జనులందరి మన్ననలొందు నట్లుగా
రిప్లయితొలగించండినతి సహజంబుగానటనమాతడు సల్పుచు నుండ నొక్కనా
డతివగవేషమేయతనయాస్యమునందున మీసముండగా
అతివకు మీసముల్ మొలిచెనంచుముదంబునఁ గాంచి రెల్లరున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలియుగ మహిమలివి యని కాంతలంత
రిప్లయితొలగించండియతివకు మొలిచె మీసములంచు గనిరి
యాడపిల్లలు మగవారి ననుసరించ
తారు మారుగ మారిరి దలచ మదిని
చారు నయన గంధ మలఁది చనుచు నుండఁ
రిప్లయితొలగించండిజంప కంబని భ్రమ సెంది చామ నాసి
కఁ గని వ్రాలఁగ భ్రమర సంఘమ్ము వింత
నతివకు మొలిచె మీసము లంచుఁ గనిరి
వెతలకు నోర్చి విత్తులను బ్రీతి సెలంగఁగ సంగ్రహించి యా
తత బల వర్ధ కౌషధ వితానము నింపుగ వాడి కావఁగా
నత మృదు కాండ సంయుతము నాటిన విత్తు లవెల్లఁ, జెప్పఁగా
నతివకు మీ సముల్, మొలిచె నంచు ముదంబునఁ గాంచి రెల్లరున్
[మీ సముల్ = మీకు సమ మైన వారు]
అతివకు మీసముల్ మొలిచె నంచును ముదంబున గాంచిరెల్లరున్
రిప్లయితొలగించండినతివల మోదమున్ గనగ నచ్చెరువందితి నొక్కసారిగా
గతిపయ ధర్మమున్ వినుడు గాంతకు మీసముగల్గకారణం
బతులిత జన్యులోపముగ భావన జేతును సుమ్ము నమ్ముమా
(NTR నాగమ్మ పాత్రను మీసముతోనే నటించిన సందర్భములో)
రిప్లయితొలగించండిప్రతిభను జూపెగా మగువ పాత్ర ధరించి ప్రశంసలందెనా
స్తుతమతి నందమూరి బిగి జూపెను మీసముతో నటించెనా
మతకరి నాగమాంబ వలె మైమరపించె సభాంగణంబునం
దతివకు మీసముల్ మొలిచెనంచు ముదంబునఁ గాంచి రెల్లరున్