14-10-2021 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు”(లేదా...)“వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో”
లోనదాగియుండులోకమ్మునేలుచువాఁడువెదుకదోరకువాఁడుకాఁడుమౌనిముద్రమదినిమర్మంబుదెలియగయత్నమింతఁజేయుయానమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(తండ్రితో ప్రహ్లాదుడాడిన మాటలు)ప్రేమతోడ బిలువ వేగిరమే వచ్చునార్తజనుల బ్రోచె డక్షధరుడుపగతుడనుచు దలచు ప్రతిఘుల కెప్పుడువాఁడు వెదుక దొరకు వాఁడు గాఁడు.
చేడియ'చెప్పవేమనలఁజేరగబాలుఁడువచ్చెగానిటన్పోడిమిమీరనాట్యములపోందుగవెన్నలదోంగిలింపగాఆడునులోకముల్కననియాటనుబోమ్మలనివ్విధిన్వడిన్వాఁడెవడందువావెదకిపట్టుకోనందగువాఁడుగాదులే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములండిగురువులకుప్రణామములు
గురుదేవులకు మరియు కవిమిత్రులందరికీ రేపటి మహర్నవమి పర్వదిన శుభాకాంక్షలు.ఆటవెలదిఅవగుణుండటంచు నవనీతచోరునిగోపికలు యశోదఁ గ్రుంగఁజేయఁగట్టుపడి జననికి పట్టుపడెనె కానివాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు!ఉత్పలమాల"వేడుకఁ జూతువా వటువు వెన్నుడు దోచెను గొల్లలిండ్లలోపాడిని సూ! యశోద!" యని పంకజలోచనలెల్ల నిందలన్గూడఁగఁ దల్లియే మదిని గోల్పడ నారడిఁ జిక్కెఁ గాని యవ్వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
ఏడి సహస్రమౌళి యని యెందులకిట్టుల యడ్గు చుంటివో మోడుల కేమితెల్యు బహు మూర్థుని గొప్ప దనంబు కాంచగన్ వీడుమటంచు చెప్పెదను వేరము నాహరి తోడ శ్రేష్ఠునిన్ వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనంగ దగువాఁడు గాదుపో.
సకల జనుల నెల్ల చక్కగా నాడించు మహితుఁ డగుచు తాను మరుగు నుండ గనగ దలచి జనులు గనిపెట్ట యత్నింప వాడు వెదుక దొరకు వాడు గాడు
కనుల జూడలేము వినుట తప్ప, తడిమితాక లేము తరిచి తరిచి, రుచియు వాసన పొడ లేని వాడె దేవుడనిన?వాఁడు వెదుక, దొరకువాఁడు గాఁడు.
అతడులేనిచోటు యవనిలో కనరాదుకాని కంటి కతడు కాన రాడుహృదిని యొదిగియుండు పదిలముగ, బయటవాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు ఈడనుతానెయుండుమరియేడనుజూచిన నాడనుండు నేవాడను వాడువీడనక వావిరియై ప్రతి జీవియందునన్వీడకతానెదన్ నిలచి వేడుకజూచుచునుండు నిచ్చలున్వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'చోటు+అవనిలో' అన్నపుడు సంధి నిత్యం. "స్థాన మవనిలో.." అందామా? అలాగే 'హృదిని నొదిగియుండు' అనండి.
ధన్యవాదములు గురువుగారూ_/|\_అతడులేని స్థానమవనిలో కనరాదుకాని కంటి కతడు కాన రాడుహృదిని నొదిగియుండు పదిలముగ, బయటవాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
ఒదిగియుండువాడు యెదలోన మదనుడైఅదను చూచి విడుచు పదను శరముమధురభావలహరి మదితాకకుండినవాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వాడు+ఎదలోన' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "వాడు మదిలోన" అనండి.
సూచించిన సవరణతో....ఒదిగియుండువాడు మదిలోన మదనుడైఅదను చూచి విడుచు పదను శరముమధురభావలహరి మదితాకకుండినవాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
ఉత్పలమాల:“వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో”చూడగ వామనుండనినఁ జొచ్చె నభోతల మంత లోనె ,పారాడెడు కూనడన్న తన యంగిట విశ్వము నంతఁజూపె ,తానాడిన యాటలెల్ల పరమాత్మ యె తాననిఁ బోధ సేయుటే!- కటకం వేంకటరామశర్మ.
ధన్యవాదములార్యా 🙏
నీడగ యుండు మానవుడ నిత్యముచూచుచు నీదు చర్యలన్గూడుచు నుండె నాతడతిగూఢముగా ప్రతిరోజు తప్పులన్వాడెవడందువా వెదకి పట్టు కొనందగు వాడు కాడుపోవాడిల నిర్వికారుడయి పాపులద్రుంచును గాచు శిష్టులన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. "నీడగ నుండు..." అనండి.
ఉ: వీడని నీడగా జనుల వేదన దీర్చగ నెల్ల వేళలన్వేడుక మీర ప్రాంతమును వేగమె వృద్ధిని జేయ నెంచనైవాడిమి గెల్వనెన్నికలు వంకలు బెట్టిరి లోకులిట్లనన్వాడెవడందువా వెదకి పట్టు కొనందగు వాడు గాడు పోవై. చంద్రశేఖర్
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు
నేటి దినములందు నిజమౌ నెనరులేదుపేరు కొరకెగాక పేద వారికష్టకాల మందు గరుణ జూపించెడివాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
పాడెద నేను భక్తిగను పాండవ రక్షకు గూర్చి ఎప్పుడున్కాడుగ దుర్లభుండిలన కాంతుడు, భక్తికి మెచ్చివచ్చుగాపాడుమనంబుగల్గినువు పార్ధునిసారధిగూర్చిగేలిగన్"వాఁడెవఁడందువా?", "వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో"
పాడెదనేనుభక్తిగను పాండవరక్షకుగూర్చిఎప్పుడున్కాడుగదుర్లభుండుసిరికాంతుడు, భక్తికిమెచ్చివచ్చుగాపాడుమనంబుగల్గినువు పార్ధునిసారధిగూర్చిగేలిగన్"వాఁడెవఁడందువా?", వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నువు' అన్నది ధాన్యపుటర్థం. నీవు అనే అర్థంలో ప్రయోగించరాదు.
సమస్య :వాడెవ డందువా వెదకి పట్టుకొనం దగువాడు గాదుపో ( వెన్నతీసుకోనీయకుండా " కుండలో గుమ్మడు ఉన్నాడు . నిన్నెత్తుకుపోతాడు " అన్న యశోదతో కన్నయ్య పలుకులు - అమ్మ సమాధానం )" వేడుక మాటలాడెదవు వెన్నను తీసిన గుమ్మడడ్డునా ?వాడెట ? కానిపింపడుగ ;వట్టిది ; లేడుగ కుండలోన ; నే నాడెద ; వానితో " ననెడి యల్లరికన్నని దల్లి పల్కెడిన్ " వాడెవ డందువా ? వెదకి పట్టుకొనం దగువాడు గాదుపో ! "
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వాడు దొరకు మదిని వదలక హరియనివెదుక నెక్క డైన వెలయజేసి ఆత్మబోధము తెలియమిచే యెవరికినివాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
కూడిన భక్తి భావములకున్ కడు వశ్యుడు-యెట్టిదోషముల్వాడికి లేవు-భక్త సులభాశ్రిత దివ్య మనోజ్ఞ తత్వమున్మెండుగ నిండియుండు పరమేశ్వర తత్త్వము-లో దలంచినన్--"వాడెవడందువా వెదకి పట్టుకొనందగువాడు గాదుపో."
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. 'వశ్యుడు+ఎట్టి' అన్నపుడు యడాగమం రాదు.
జోడుగబుద్దితో మనసుచుట్టునుబొందినవైరమెంచగాచీడపరంపరై తొలుచుఇంద్రియబేరమునచ్చలేకనేబాడిగెగట్టితప్పుకొనుపాపపుపంకిలదాటకుండగావాడెవడందువా వెదికిపట్టుకొనందగువాడుగాదుపో ...తోకల...
కృతజ్ఞతలు పూజ్యశ్రీ
ఆడినమాటలెల్ల పరిహాసపు పాత్రములై చెలంగఁ దానోడుచుఁ బార్టిలోఁ బదవి నొప్పనటంచు విదేశయానముల్వేడుకగా నొనర్చుచు నవీనపు కాంగ్రెసులోన ముఖ్యుఁడౌవాఁడెవఁడందువా? వెదకి పట్టుకొనం దగువాఁడు గాదు పో.
వాడును వీడనిన్ గనక పట్టి వికారము నందు నెట్టెడిన్చేడియలైన, వాడు మది చేరిన తట్టు కొనంగ సాధ్యమే ?వాడు సుమాస్త్రముల్ విడిచి భర్గుని సైతము తల్లడించె నవ్వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో
మానసంబునందు లీనమయినగానివాడు వెదుక దొరకువాడు గాడుదొరకు భక్తి కలిగి నిరతము సేవించునెడల సందియంబు బడగవలదు
వారకుండ నకట వత్తువు వోదువు నా కొఱ కనుదినము నీ కొఱకు నొకండు వచ్చి యుండు దండ నొక్క దినము వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడువీడక యెల్ల వారలను వింతగ నుందురు పూరు షేంద్రులే తోడుగ నిద్ద ఱం దొకఁడు దూఱఁగ లోపల బాహ్య మందుఁ దారాడును గోచరమ్ముగ నరాలికి నన్యుఁడు లోని వాఁడహో వాఁడెవఁ డందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో
వాఁడల వల్లవాంగనల వల్వల దోచిన చిత్త చోరుడవ్వాఁడె ప్రసన్నతన్ సతికి వల్వలొసంగిన తాప హారియవ్వాఁడె సమస్తభూతతతి పాప తమో దురితాపహారియున్వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో
వాఁడి వాడి కుసుమ బాణంబులవి జేర్చువాడిపోని ప్రణయబంధమందువాఁడె జీవనమున వాసంతము దలిర్చువాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
లోన నుండు వాడు లోతైన పురుషుడుచేరి కూరుచుండె చిత్తమందుసాక్షియైన వాడు చక్షువుకందనివాడు, వెదుక దొరకువాడు గాదు గోపికల పరివేదనగాఢపు నిద్రలోన నను గారడి జేసెడి వేణువూది తానాడగ బిల్చి కొంతవడి హ్లాదముబంచి నిమేషమున్ భళా!జాడను దెల్యకుండగనె జారెనె చేడియ! చిత్తచోరుడౌవాడెవ డందువా? వెదకి పట్టుకొనం దగువాడు గాడుపో !
లోనదాగియుండులోకమ్మునేలుచు
రిప్లయితొలగించండివాఁడువెదుకదోరకువాఁడుకాఁడు
మౌనిముద్రమదినిమర్మంబుదెలియగ
యత్నమింతఁజేయుయానమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి(తండ్రితో ప్రహ్లాదుడాడిన మాటలు)
ప్రేమతోడ బిలువ వేగిరమే వచ్చు
నార్తజనుల బ్రోచె డక్షధరుడు
పగతుడనుచు దలచు ప్రతిఘుల కెప్పుడు
వాఁడు వెదుక దొరకు వాఁడు గాఁడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేడియ'చెప్పవేమనలఁజేరగబాలుఁడువచ్చెగానిటన్
రిప్లయితొలగించండిపోడిమిమీరనాట్యములపోందుగవెన్నలదోంగిలింపగా
ఆడునులోకముల్కననియాటనుబోమ్మలనివ్విధిన్వడిన్
వాఁడెవడందువావెదకిపట్టుకోనందగువాఁడుగాదులే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండిగురువులకుప్రణామములు
తొలగించండిగురుదేవులకు మరియు కవిమిత్రులందరికీ రేపటి మహర్నవమి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఆటవెలది
అవగుణుండటంచు నవనీతచోరుని
గోపికలు యశోదఁ గ్రుంగఁజేయఁ
గట్టుపడి జననికి పట్టుపడెనె కాని
వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు!
ఉత్పలమాల
"వేడుకఁ జూతువా వటువు వెన్నుడు దోచెను గొల్లలిండ్లలో
పాడిని సూ! యశోద!" యని పంకజలోచనలెల్ల నిందలన్
గూడఁగఁ దల్లియే మదిని గోల్పడ నారడిఁ జిక్కెఁ గాని య
వ్వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఏడి సహస్రమౌళి యని యెందులకిట్టుల యడ్గు చుంటివో
మోడుల కేమితెల్యు బహు మూర్థుని గొప్ప దనంబు కాంచగన్
వీడుమటంచు చెప్పెదను వేరము నాహరి తోడ శ్రేష్ఠునిన్
వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనంగ దగువాఁడు గాదుపో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసకల జనుల నెల్ల చక్కగా నాడించు
రిప్లయితొలగించండిమహితుఁ డగుచు తాను మరుగు నుండ
గనగ దలచి జనులు గనిపెట్ట యత్నింప
వాడు వెదుక దొరకు వాడు గాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికనుల జూడలేము వినుట తప్ప, తడిమి
రిప్లయితొలగించండితాక లేము తరిచి తరిచి, రుచియు
వాసన పొడ లేని వాడె దేవుడనిన?
వాఁడు వెదుక, దొరకువాఁడు గాఁడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅతడులేనిచోటు యవనిలో కనరాదు
రిప్లయితొలగించండికాని కంటి కతడు కాన రాడు
హృదిని యొదిగియుండు పదిలముగ, బయట
వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
ఈడనుతానెయుండుమరియేడనుజూచిన నాడనుండు నే
వాడను వాడువీడనక వావిరియై ప్రతి జీవియందునన్
వీడకతానెదన్ నిలచి వేడుకజూచుచునుండు నిచ్చలున్
వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'చోటు+అవనిలో' అన్నపుడు సంధి నిత్యం. "స్థాన మవనిలో.." అందామా? అలాగే 'హృదిని నొదిగియుండు' అనండి.
ధన్యవాదములు గురువుగారూ_/|\_
తొలగించండిఅతడులేని స్థానమవనిలో కనరాదు
కాని కంటి కతడు కాన రాడు
హృదిని నొదిగియుండు పదిలముగ, బయట
వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
ఒదిగియుండువాడు యెదలోన మదనుడై
రిప్లయితొలగించండిఅదను చూచి విడుచు పదను శరము
మధురభావలహరి మదితాకకుండిన
వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వాడు+ఎదలోన' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "వాడు మదిలోన" అనండి.
సూచించిన సవరణతో....
తొలగించండిఒదిగియుండువాడు మదిలోన మదనుడై
అదను చూచి విడుచు పదను శరము
మధురభావలహరి మదితాకకుండిన
వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
ఉత్పలమాల:
రిప్లయితొలగించండి“వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో”
చూడగ వామనుండనినఁ జొచ్చె నభోతల మంత లోనె ,పా
రాడెడు కూనడన్న తన యంగిట విశ్వము నంతఁజూపె ,తా
నాడిన యాటలెల్ల పరమాత్మ యె తాననిఁ బోధ సేయుటే!
- కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములార్యా 🙏
తొలగించండినీడగ యుండు మానవుడ నిత్యము
రిప్లయితొలగించండిచూచుచు నీదు చర్యలన్
గూడుచు నుండె నాతడతి
గూఢముగా ప్రతిరోజు తప్పులన్
వాడెవడందువా వెదకి పట్టు
కొనందగు వాడు కాడుపో
వాడిల నిర్వికారుడయి పాపుల
ద్రుంచును గాచు శిష్టులన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"నీడగ నుండు..." అనండి.
ఉ:
రిప్లయితొలగించండివీడని నీడగా జనుల వేదన దీర్చగ నెల్ల వేళలన్
వేడుక మీర ప్రాంతమును వేగమె వృద్ధిని జేయ నెంచనై
వాడిమి గెల్వనెన్నికలు వంకలు బెట్టిరి లోకులిట్లనన్
వాడెవడందువా వెదకి పట్టు కొనందగు వాడు గాడు పో
వై. చంద్రశేఖర్
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండినేటి దినములందు నిజమౌ నెనరులేదు
రిప్లయితొలగించండిపేరు కొరకెగాక పేద వారి
కష్టకాల మందు గరుణ జూపించెడి
వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాడెద నేను భక్తిగను పాండవ రక్షకు గూర్చి ఎప్పుడున్
రిప్లయితొలగించండికాడుగ దుర్లభుండిలన కాంతుడు, భక్తికి మెచ్చివచ్చుగా
పాడుమనంబుగల్గినువు పార్ధునిసారధిగూర్చిగేలిగన్
"వాఁడెవఁడందువా?", "వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో"
పాడెదనేనుభక్తిగను పాండవరక్షకుగూర్చిఎప్పుడున్
తొలగించండికాడుగదుర్లభుండుసిరికాంతుడు, భక్తికిమెచ్చివచ్చుగా
పాడుమనంబుగల్గినువు పార్ధునిసారధిగూర్చిగేలిగన్
"వాఁడెవఁడందువా?", వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నువు' అన్నది ధాన్యపుటర్థం. నీవు అనే అర్థంలో ప్రయోగించరాదు.
సమస్య :
రిప్లయితొలగించండివాడెవ డందువా వెదకి
పట్టుకొనం దగువాడు గాదుపో
( వెన్నతీసుకోనీయకుండా " కుండలో గుమ్మడు ఉన్నాడు . నిన్నెత్తుకుపోతాడు " అన్న యశోదతో కన్నయ్య పలుకులు - అమ్మ సమాధానం )
" వేడుక మాటలాడెదవు
వెన్నను తీసిన గుమ్మడడ్డునా ?
వాడెట ? కానిపింపడుగ ;
వట్టిది ; లేడుగ కుండలోన ; నే
నాడెద ; వానితో " ననెడి
యల్లరికన్నని దల్లి పల్కెడిన్
" వాడెవ డందువా ? వెదకి
పట్టుకొనం దగువాడు గాదుపో ! "
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివాడు దొరకు మదిని వదలక హరియని
రిప్లయితొలగించండివెదుక నెక్క డైన వెలయజేసి
ఆత్మబోధము తెలియమిచే యెవరికిని
వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికూడిన భక్తి భావములకున్ కడు వశ్యుడు-యెట్టిదోషముల్
రిప్లయితొలగించండివాడికి లేవు-భక్త సులభాశ్రిత దివ్య మనోజ్ఞ తత్వమున్
మెండుగ నిండియుండు పరమేశ్వర తత్త్వము-లో దలంచినన్--
"వాడెవడందువా వెదకి పట్టుకొనందగువాడు గాదుపో."
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'వశ్యుడు+ఎట్టి' అన్నపుడు యడాగమం రాదు.
ధన్యవాదములు
తొలగించండిజోడుగబుద్దితో మనసు
రిప్లయితొలగించండిచుట్టునుబొందినవైరమెంచగా
చీడపరంపరై తొలుచు
ఇంద్రియబేరమునచ్చలేకనే
బాడిగెగట్టితప్పుకొను
పాపపుపంకిలదాటకుండగా
వాడెవడందువా వెదికి
పట్టుకొనందగువాడుగాదుపో
...తోకల...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికృతజ్ఞతలు పూజ్యశ్రీ
తొలగించండిఆడినమాటలెల్ల పరిహాసపు పాత్రములై చెలంగఁ దా
రిప్లయితొలగించండినోడుచుఁ బార్టిలోఁ బదవి నొప్పనటంచు విదేశయానముల్
వేడుకగా నొనర్చుచు నవీనపు కాంగ్రెసులోన ముఖ్యుఁడౌ
వాఁడెవఁడందువా? వెదకి పట్టుకొనం దగువాఁడు గాదు పో.
వాడును వీడనిన్ గనక పట్టి వికారము నందు నెట్టెడిన్
రిప్లయితొలగించండిచేడియలైన, వాడు మది చేరిన తట్టు కొనంగ సాధ్యమే ?
వాడు సుమాస్త్రముల్ విడిచి భర్గుని సైతము తల్లడించె న
వ్వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో
మానసంబునందు లీనమయినగాని
రిప్లయితొలగించండివాడు వెదుక దొరకువాడు గాడు
దొరకు భక్తి కలిగి నిరతము సేవించు
నెడల సందియంబు బడగవలదు
వారకుండ నకట వత్తువు వోదువు
రిప్లయితొలగించండినా కొఱ కనుదినము నీ కొఱకు నొ
కండు వచ్చి యుండు దండ నొక్క దినము
వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
వీడక యెల్ల వారలను వింతగ నుందురు పూరు షేంద్రులే
తోడుగ నిద్ద ఱం దొకఁడు దూఱఁగ లోపల బాహ్య మందుఁ దా
రాడును గోచరమ్ముగ నరాలికి నన్యుఁడు లోని వాఁడహో
వాఁడెవఁ డందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో
వాఁడల వల్లవాంగనల వల్వల దోచిన చిత్త చోరుడ
రిప్లయితొలగించండివ్వాఁడె ప్రసన్నతన్ సతికి వల్వలొసంగిన తాప హారియ
వ్వాఁడె సమస్తభూతతతి పాప తమో దురితాపహారియున్
వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో
వాఁడి వాడి కుసుమ బాణంబులవి జేర్చు
రిప్లయితొలగించండివాడిపోని ప్రణయబంధమందు
వాఁడె జీవనమున వాసంతము దలిర్చు
వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు
లోన నుండు వాడు లోతైన పురుషుడు
రిప్లయితొలగించండిచేరి కూరుచుండె చిత్తమందు
సాక్షియైన వాడు చక్షువుకందని
వాడు, వెదుక దొరకువాడు గాదు
గోపికల పరివేదన
గాఢపు నిద్రలోన నను గారడి జేసెడి వేణువూది తా
నాడగ బిల్చి కొంతవడి హ్లాదముబంచి నిమేషమున్ భళా!
జాడను దెల్యకుండగనె జారెనె చేడియ! చిత్తచోరుడౌ
వాడెవ డందువా? వెదకి పట్టుకొనం దగువాడు గాడుపో !