14, అక్టోబర్ 2021, గురువారం

సమస్య - 3871

15-10-2021 (వారం)
కవిమిత్రులారా,
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరనారీ సోదరుండు పంక్తిముఖుండౌ”
(లేదా...)
“పరనారిం గనుచుండు రావణుఁడు నిర్ద్వంద్వంబుగన్ జెల్లిగన్”

47 కామెంట్‌లు:

  1. అరయన్మాయాజాలము
    తరతమభేదములెఱుగనితమ్ముడుకాగన్
    పరసతిచెట్టన్బట్టెను
    పరనారీసోదరుండుపంక్తిముఖుండౌ

    రిప్లయితొలగించండి
  2. తరుణి యయోనిజ చేరి వి
    వరించె శూర్పణఖ యిట్లు ప్రహసము తో నిన్
    మరులు గొని తెచ్చె నెవడన
    పరనారీ, సోదరుండు పంక్తిముఖుండౌ.

    రిప్లయితొలగించండి
  3. సురలును మెచ్చె డు రాముడు
    పరనారీ సోదరుండు : పంక్తి ముఖుండౌ
    వరుసలు వావుల నెరుగక
    పర నారు లను చెర పట్టు పాలసుడు గదా !

    రిప్లయితొలగించండి
  4. సమస్య :

    పరనారిం గనుచుండు రావణుడు
    నిర్ద్వంద్వంబుగన్ జెల్లిగన్

    ( శ్రీలంకలో తన పేరు పెట్టుకొన్న కొందరి మనస్సుల నావేశించిన రావణుడు పరస్త్రీలను ఇలా చూస్తున్నాడు )

    పరమోదారులు సింహళ ప్రజలు ; నా
    వంతైన దౌష్ట్యంబునే
    యెరుగంజాలరు;సంస్కృతిప్రియులు;వా
    రెంతెంత సౌహార్దులో !
    ధరియింపన్ దన పేరునే ; మదులలో
    దాగున్న చైతన్యమై
    పరనారిం గనుచుండు రావణుడు
    నిర్ద్వంద్వంబుగన్ జెల్లిగన్ .

    రిప్లయితొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తరుణుల కనుగును బంచును
    పరనారీ సోదరుండు; పంక్తిముఖుండౌ
    మరులొందెడి దుర్మార్గుడు
    విరిబోడుల వెంబడించి పృథ్విని యందున్.

    రిప్లయితొలగించండి

  6. చిరు ప్రాయంబున నా విభీషణుడు వాచించెన్ వయస్యుండ్రతో
    హరనామమ్మును వీడడయ్యె ద్విజుడా యజ్ఞారి ధర్మమ్మునే
    నిరతమ్మాచరణమ్ము సేయునతడే నిష్ణాతు డాతండెగా
    పరనారిం గనుచుండు రావణుడు నిర్ద్వంద్వంబుగన్ జెల్లిగన్.

    రిప్లయితొలగించండి
  7. హరిలోచనుడై హరిహరి!
    పరనారీ సోదరుండు పంక్తిముఖుండౌ
    పరిణామంబులు విరివిగ
    జరుగుచునున్నవిజగమున జాగ్రత్తసుమీ

    రిప్లయితొలగించండి
  8. వరుస కలుపగ నన్నయగును
    పరనారీ సోదరుండు ; పంక్తిముఖుండౌ
    పరనారీ లోలుండుగ
    ఆ రామాయణ చరితము నభ్యాసించన్

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. కందం
      దొరికిన సుమసుందరులన్
      మురిపెమున గొనుచుఁ, గురూపి ముందుకు రాగన్
      మరియాదగఁ జెల్లి యనెడు
      పరనారీ సోదరుండు పంక్తిముఖుండౌ!

      మత్తేభవిక్రీడితము
      విరులై తోచిన సుందరీమణుల నిర్భీతిన్ ప్రలోభమ్మునన్
      సరసాలాడగఁ బట్టి యప్సర శపించన్ మారడే! సీత నా
      ధరణీజాతను ఖైదుజేసెగద! సాధ్యమ్మే? యనాకారియౌ
      పరనారిం గనుచుండు రావణుఁడు నిర్ద్వంద్వంబుగన్ జెల్లిగన్!

      🖌️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

      తొలగించండి
    2. కందం
      మరులన్ జూపుచు రాముని
      బురికొల్పుచుఁ గోల్పడంగ ముక్కును జెవులున్
      ధరపతికి శూర్పణఖ యను
      పరనారీ సోదరుండు పంక్తిముఖుండౌ!

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. మరుడాడించెడినాటకంబిలనునీమాయన్గనన్జాలమే
    నరుడీకాలముసోదరిన్గనెనుతానాధుండనన్ఁజూడగన్
    పరుడాయెన్గదజానకీపతియునీపాపంబుసంఘమ్ముదే
    పరనారిగనుచుండురావణుఁడునిర్ద్వంద్వంబుగన్ఁజెల్లిగన్

    రిప్లయితొలగించండి
  11. అరయగ వైవాహితయౌ
    పరనారీ సోదరుండు పంక్తిముఖుండౌ
    వరముగ హరి చేతులలో
    మరణించగ మ్రుచ్చిలించె మానిని సీతన్

    రిప్లయితొలగించండి
  12. అరుదుగ లభియించు కలిని
    పరనారీ సోదరుండు; పంక్తిముఖుండౌ
    నరరూప రాక్షసుడు కడు
    తరచుగ తారసపడు కలు ద్రాగెడివాడై

    మరు బాణంబులుగా మదిన్ దలచుచున్ మత్తుండునై కోరికన్
    పరనారిం గనుచుండు రావణుడు;నిర్ద్వంద్వంబుగన్జెల్లిగన్
    కరుకైనట్టి నఖంబులన్ దనరెడిన్ కామాతురన్ జూచుగా
    సిరియౌ సీతను దొంగలించుటకు సంసిద్ధుండుగా జేయగన్

    రిప్లయితొలగించండి
  13. చెరబట్టెంగద జానకీ సతిని సచ్చీ
    లాంగినిన్ దుష్టుడై
    వర గర్వాంధుడు క్రూర కర్ముడు,
    మహా వక్ర స్వభావుంబుతో
    పరనారిన్ గనుచుండు రావణుడు,
    నిర్ద్వద్వంబుగన్ జెల్లిగన్
    పరమాత్ముండు రఘూద్భవుండు
    గను సద్భావంబు తోనెప్పుడున్

    రిప్లయితొలగించండి
  14. మత్తేభము :
    హరునిన్ నిత్యముఁ గొల్చు బ్రాహ్మణుడు బ్రహ్మ్యంశోద్భవుండాతడే !
    హరికిన్నాదిగ భృత్యుడై మెలిగె! ఆహా!ఏమి చిత్రంబొకో?!
    పరనారీ వ్యసనమ్మదే తొలిచె భావమ్మందు!
    పౌలస్త్య తం
    “పర నారిం గనుచుండు రావణుఁడు నిర్ద్వంద్వంబుగన్ జెల్లిగన్”
    ---కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  15. వరుసల మిళితము జరుగును
    పరనారీ సోదరుండు పంక్తి ముఖుండౌ
    తరుణము లగుపడు నవముగ
    నరకొర మొరయుచు పిలువగ 'అంకుల్!' 'ఆంటీ!'

    రిప్లయితొలగించండి
  16. తరుణుల్వేవురు కోరిరావణుని చెంతంజేరిరేగాని తా
    నరయన్ సాధ్వుల నెన్నడేనికలలోనైనన్ విమోహింపకన్
    పరనారిం గనుచుండు రావణుఁడు నిర్ద్వంద్వంబుగన్ జెల్లిగన్
    వరసాఫల్యముగోరి జానకిని నిర్బంధించె తా లంకలో

    రిప్లయితొలగించండి
  17. మ:

    దురితావేశము పొంగిపొర్ల భ్రమతో దూషింప స్త్రీ జాతినే
    వరమై నిర్భయ ధర్మ సూత్ర మగుటన్ వ్యత్యాసమే గల్గగా
    పరనారిం గనుచుండు రావణుడు నిర్ద్వంద్వంబు గన్ జెల్లిగన్
    వరుసల్ గల్పడె భారతావనిని తా వాసించ నీ వేళనున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. దొరవారే నైజామున
    పరనారీ సోదరుండు, పంక్తిముఖుండౌ
    దురితుడు,మోహము తోడన్
    చెరబట్ట నబలల నెర్ర జెండా మొలిచెన్

    రిప్లయితొలగించండి
  19. వర సద్ధర్మ పరాయణుండెపుడు భావంబున్ జగన్మాతనే
    పరనారిం గనుచుండు; రావణుఁడు నిర్ద్వంద్వంబుగన్ జెల్లిగన్
    పరనారిం బరికింపడెన్నడును పాపాత్ముండు మాయావియై
    చెరబట్టెన్ రఘురాము బత్ని నకటా చెల్లించె మూల్యంబునే

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. పర వనితా లోలుఁడు క్రూ
      ర రావణుఁడు బల్లిదుఁ డసుర వరుఁడు నిద్రై
      క రతుఁ డగు కుంభకర్ణుని
      పరనారీ! సోదరుండు పంక్తిముఖుండౌ

      [పర నారీ = ఓ శ్రేష్ఠ నారీ]


      అరి వీరోగ్రుఁడు బ్రహ్మ వంశజుఁడు దైత్యశ్రేణి నాథుండునున్
      వర దర్పుండు పులస్త్య పౌత్రుఁడును విశ్వఖ్యాత కామార్తుఁడున్
      హర భక్తుం డసురుండు శూర్పణఖ నత్యం తాదరస్ఫూర్తినిం
      బరనారిం గనుచుండు రావణుఁడు నిర్ద్వంద్వంబుగన్ జెల్లిగన్

      తొలగించండి
  21. దురమందున్ విజయమ్మునొంది హరిపై దుర్వారమౌ శక్తితో
    వరగర్వమ్మున మించుచున్ బడచె రంభా సంగమమ్మున్ వడిన్
    కరుణన్ వీడి కుజన్ హరించె తనువున్ గాంక్షించి, క్రవ్యాశి యౌ
    పరనారిం గనుచుండు రావణుఁడు నిర్ద్వంద్వంబుగన్ జెల్లిగన్

    రిప్లయితొలగించండి