18-10-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల”(లేదా...)“పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే”
పండుగలసంబరములభాగ్యమందిప్రేమమీరఁగతనవారిబేలలగుచువీడిపోవంగవలసినవేళయందుపర్వదినముననేడ్పింత్రుబంధుహితుల
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పండుగ పూట బంధువులతో లవకుశ సినిమాకు తీసుకు వెళ్ళిన పతితో సతి:తేటగీతిహాస్యరసమున్న చిత్రమ్ము హాయినొసఁగురమ్ము రమ్మన్న నొప్పక 'లవకుశ' కనిసీత దుఃఖమ్ము జూపించఁ జేర్చి, యేలపర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల?ఉత్పలమాలపర్వున నే వినోదమును బంచెడు చిత్రము నెంచమేలగున్సర్వులు సూడఁగన్ వెడలి సంతసమందెదమన్న నొప్పకేచర్వితమైన నీ లవకుశన్ గన సీతమ శోకమందునన్బర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే?
పనికి శలవులు లభియించ పండుగనుచుపరుగు పరుగున వత్తురు బంధు జనులువంట వార్పుల శ్రమనింటి వారి కొసగిపర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల
ఉర్వినిశాశ్వతంబనగనోక్కటిలేదనుమాటవీడుచున్సర్వముమాయయేయనెడిసత్యమునమ్మకనల్పభావమున్చర్వితచ్వణమ్మగనుసన్నిధిలేదనునూహఁజేయుచున్పర్వదినమ్మటంచుఁబరివారముబంధులనేడిపింతురే
చర్వితచర్వణమ్ముగను
దూర దేశము నుండియు జేర వచ్చి బాల్య మందలి స్మృతు లతో పరవశించి విడిచి పోలేని సమయాన వేద నమున పర్వ దినమున నేడ్పింత్రు బంధు హితుల
గర్వము మీరగన్ పిలువ గౌరవ మెంతయు యూరికేగగన్పర్వులు బెట్టగా కనగ పండుగ విందని మోదమందుచున్సర్వులు హేళనమ్ముగను సైపగలేని మాటవీచగాపర్వదినమ్మటంచు బరివారము,బంధుల నేడి పింతురే!!
పండుగనుచు చనగ పల్లెటూరువండిన రుచులన్ని మెండు రసన మరలి వచ్చువేళ మదిని కలతపర్వదినమున నేడ్పింత్రు బంధు హితులు!!
పూర్వపు సాంప్రదాయమది పుణ్యదినమ్ముప వాసముండినన్ శర్వుడనుగ్రహించునని శాస్త్రము లెల్లవచించెనంచు నే గర్వము వీడి యాకలనగన్ శివరాత్రి యిదేకదా మహా పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే
ఎంతచెప్పిన వినకుండ చెంతజేరివలదు మోమోటపడవద్దు వలదటంచుపిండివంటల తినిపించి దండిగానుపర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల
ఉర్విని పర్వమందుకడునోరిమితో పలు భక్ష్య భోజ్యముల్సర్వము నారగింపుడని సంతసమొప్పగ కోరి యర్మిలిన్చర్వితచర్వణమ్మటుల చాలని చెప్పిన నూరకుండకన్పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే
ఉర్విన దల్లిదండ్రులటు లొద్దిక తోడుత బెద్దసేయగాపూర్వపు యూసులన్ దలచి ముద్దుగ బెంచిన యాడకూతునేమర్వగ లేక బెండువడి మాతయె పెండ్లిన నప్పగింతలోపర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే.
వేడుకగ నల్గురిని జీరి విందునిచ్చుపర్వదినమున ; నేడ్పింత్రు బంధు హితులపెద్దకర్మ నాడున వార్నిబిలుచు భుక్తిగుడిప , నాదినము మృతుని గుర్తు జేయ
ఉ: ఉర్విని బుట్టు వారలకు నున్నవి రెండు కులంబులే సుమాగర్వము నున్న వారమని కష్టము లెంచగ లేని వారలైపర్వ దినమ్మటంచు పరివారము బంధుల నేడిపింతురేసర్వము గాంచెడీశు డిల చక్కన బెట్టడె గల్మి లేమిడుల్వై. చంద్రశేఖర్
సర్వ సపక్షులున్ గలచి సద్మము నందున చేరి ముందుగాపూర్వపు గొప్పనెంచుచు యపూర్వపు వంశ మటంచు పెండ్లిలోగర్వము జూపగా కరము కమ్మని వంటలఁ జేయఁ జెప్పుచున్పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే
తేటగీతిరాజసూయ యాగమునకు రాజరాజుపండుగయని దలచి రాగ భంగ పడెనుమయ సభన తాను దలచెను మౌనముగనెపర్వదినమున నేడ్పింత్రు బంధు హితులప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
సర్వమశాశ్వతంబెరిఁగి సంతతమార్తుల సేవ జేయుటేశర్వుని సేవగా దలచు సన్మతులే దినమైననందురేపర్వదినమ్మటంచుఁ; బరివారము బంధుల నేడిపింతురేగర్వితులౌచు లోభులిల కాసుల లాలస కళ్ళు గప్పగా
వచ్చెద మని వక్కాణించి తెచ్చెద మని మెండుగ బహుమానమ్ముల దండముల నొసంగి వాక్రుచ్చి కాంచక ప్రాంగణములు పర్వదినమున నేడ్పింత్రు బంధు హితులశర్వుఁడు కాచుఁ గావుతఁ బ్రజా నిచయమ్ముఁ గృపారసేక్షలన్ సర్వ జగత్తు సాధన వశం బగుఁ దత్సముపార్జ నార్థమే యుర్విని వీరి వారి వని యొక్కొక పేరునఁ బర్వ పంక్తియే పర్వ దినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే
ఆకలి యని యన్నమడుగగ నన్న మిడకమోక్ష గాములె యుపవాస దీక్షతోడ మృడుని సేవించు శివరాత్రి మేటి యైనపర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల
పండుగలసంబరములభాగ్యమంది
రిప్లయితొలగించండిప్రేమమీరఁగతనవారిబేలలగుచు
వీడిపోవంగవలసినవేళయందు
పర్వదినముననేడ్పింత్రుబంధుహితుల
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపండుగ పూట బంధువులతో లవకుశ సినిమాకు తీసుకు వెళ్ళిన పతితో సతి:
తొలగించండితేటగీతి
హాస్యరసమున్న చిత్రమ్ము హాయినొసఁగు
రమ్ము రమ్మన్న నొప్పక 'లవకుశ' కని
సీత దుఃఖమ్ము జూపించఁ జేర్చి, యేల
పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల?
ఉత్పలమాల
పర్వున నే వినోదమును బంచెడు చిత్రము నెంచమేలగున్
సర్వులు సూడఁగన్ వెడలి సంతసమందెదమన్న నొప్పకే
చర్వితమైన నీ లవకుశన్ గన సీతమ శోకమందునన్
బర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే?
పనికి శలవులు లభియించ పండుగనుచు
రిప్లయితొలగించండిపరుగు పరుగున వత్తురు బంధు జనులు
వంట వార్పుల శ్రమనింటి వారి కొసగి
పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల
ఉర్వినిశాశ్వతంబనగనోక్కటిలేదనుమాటవీడుచున్
రిప్లయితొలగించండిసర్వముమాయయేయనెడిసత్యమునమ్మకనల్పభావమున్
చర్వితచ్వణమ్మగనుసన్నిధిలేదనునూహఁజేయుచున్
పర్వదినమ్మటంచుఁబరివారముబంధులనేడిపింతురే
చర్వితచర్వణమ్ముగను
రిప్లయితొలగించండిదూర దేశము నుండియు జేర వచ్చి
రిప్లయితొలగించండిబాల్య మందలి స్మృతు లతో పరవశించి
విడిచి పోలేని సమయాన వేద నమున
పర్వ దినమున నేడ్పింత్రు బంధు హితుల
గర్వము మీరగన్ పిలువ గౌరవ మెంతయు యూరికేగగన్
రిప్లయితొలగించండిపర్వులు బెట్టగా కనగ పండుగ విందని మోదమందుచున్
సర్వులు హేళనమ్ముగను సైపగలేని మాటవీచగా
పర్వదినమ్మటంచు బరివారము,బంధుల నేడి పింతురే!!
పండుగనుచు చనగ పల్లెటూరు
రిప్లయితొలగించండివండిన రుచులన్ని మెండు రసన
మరలి వచ్చువేళ మదిని కలత
పర్వదినమున నేడ్పింత్రు బంధు హితులు!!
రిప్లయితొలగించండిపూర్వపు సాంప్రదాయమది పుణ్యదినమ్ముప వాసముండినన్
శర్వుడనుగ్రహించునని శాస్త్రము లెల్లవచించెనంచు నే
గర్వము వీడి యాకలనగన్ శివరాత్రి యిదేకదా మహా
పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే
ఎంతచెప్పిన వినకుండ చెంతజేరి
రిప్లయితొలగించండివలదు మోమోటపడవద్దు వలదటంచు
పిండివంటల తినిపించి దండిగాను
పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల
ఉర్విని పర్వమందుకడునోరిమితో పలు భక్ష్య భోజ్యముల్
రిప్లయితొలగించండిసర్వము నారగింపుడని సంతసమొప్పగ కోరి యర్మిలిన్
చర్వితచర్వణమ్మటుల చాలని చెప్పిన నూరకుండకన్
పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే
ఉర్విన దల్లిదండ్రులటు లొద్దిక తోడుత బెద్దసేయగా
రిప్లయితొలగించండిపూర్వపు యూసులన్ దలచి ముద్దుగ బెంచిన యాడకూతునే
మర్వగ లేక బెండువడి మాతయె పెండ్లిన నప్పగింతలో
పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే.
వేడుకగ నల్గురిని జీరి విందునిచ్చు
రిప్లయితొలగించండిపర్వదినమున ; నేడ్పింత్రు బంధు హితుల
పెద్దకర్మ నాడున వార్నిబిలుచు భుక్తి
గుడిప , నాదినము మృతుని గుర్తు జేయ
ఉ:
రిప్లయితొలగించండిఉర్విని బుట్టు వారలకు నున్నవి రెండు కులంబులే సుమా
గర్వము నున్న వారమని కష్టము లెంచగ లేని వారలై
పర్వ దినమ్మటంచు పరివారము బంధుల నేడిపింతురే
సర్వము గాంచెడీశు డిల చక్కన బెట్టడె గల్మి లేమిడుల్
వై. చంద్రశేఖర్
సర్వ సపక్షులున్ గలచి సద్మము నందున చేరి ముందుగా
రిప్లయితొలగించండిపూర్వపు గొప్పనెంచుచు యపూర్వపు వంశ మటంచు పెండ్లిలో
గర్వము జూపగా కరము కమ్మని వంటలఁ జేయఁ జెప్పుచున్
పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే
తేటగీతి
రిప్లయితొలగించండిరాజసూయ యాగమునకు రాజరాజు
పండుగయని దలచి రాగ భంగ పడెను
మయ సభన తాను దలచెను మౌనముగనె
పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
సర్వమశాశ్వతంబెరిఁగి సంతతమార్తుల సేవ జేయుటే
రిప్లయితొలగించండిశర్వుని సేవగా దలచు సన్మతులే దినమైననందురే
పర్వదినమ్మటంచుఁ; బరివారము బంధుల నేడిపింతురే
గర్వితులౌచు లోభులిల కాసుల లాలస కళ్ళు గప్పగా
వచ్చెద మని వక్కాణించి తెచ్చెద మని
రిప్లయితొలగించండిమెండుగ బహుమానమ్ముల దండముల నొ
సంగి వాక్రుచ్చి కాంచక ప్రాంగణములు
పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల
శర్వుఁడు కాచుఁ గావుతఁ బ్రజా నిచయమ్ముఁ గృపారసేక్షలన్
సర్వ జగత్తు సాధన వశం బగుఁ దత్సముపార్జ నార్థమే
యుర్విని వీరి వారి వని యొక్కొక పేరునఁ బర్వ పంక్తియే
పర్వ దినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే
రిప్లయితొలగించండిఆకలి యని యన్నమడుగగ నన్న మిడక
మోక్ష గాములె యుపవాస దీక్షతోడ
మృడుని సేవించు శివరాత్రి మేటి యైన
పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల