18, అక్టోబర్ 2021, సోమవారం

సమస్య - 3875

19-10-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పొగఁ ద్రాగెడివాఁడు లోకపూజ్యుం డగురా"
(లేదా...)
"తప్పక చెప్పనొప్పుఁ బొగఁ ద్రాగెడివాఁడగు లోకపూజ్యుఁడే"

(జి. ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలతో...)

58 కామెంట్‌లు:

  1. సమస్య :

    తప్పక చెప్పనొప్పు బొగ
    ద్రాగెడివాడగు లోకపూజ్యుడే

    ( చింతచెట్టు క్రింద చుట్టను కాలుస్తూ చిలకమర్తి వారి నవలానాయకుడు గణపతి పాఠప్రవచనం )

    చెప్పిన పాఠమున్ మరపు
    జెందక గట్టిగ వల్లెవేయుడీ !
    చప్పున నాచరింపుడిక
    చక్కగ చుట్టల చుట్టుకొంచు ; నే
    తప్పును లేదురా ! హనుమ
    ధాటిగ లంకను గాల్చె చుట్టచే ;
    తప్పక చెప్పనొప్పు బొగ
    ద్రాగెడివాడగు లోకపూజ్యుడే .

    రిప్లయితొలగించండి
  2. విగతుండగు జగ మందున
    పొగ ద్రా గెడు వాడు :లోక పూజ్యుo డగు రా
    మగటిమి చే దుష్ట తతుల
    తగు రీతిగ శిక్ష వేయు ధర్మా త్ము o డై

    రిప్లయితొలగించండి
  3. ఆగనివిసపుంన్మంటల
    తోనటమెఱయుచునుబుకుచుధూమమురాగా
    తగద్రావెసెగనుశంభుడు
    పొగద్రావెడివాడులోకపూజ్యుండగురా

    రిప్లయితొలగించండి
  4. తప్పువు రోగ బాధలును ద్రాగిన
    గల్గును బ్రాణ నష్టముల్
    తప్పక జెప్పనొప్పు బొగ ద్రాగని
    వాడగు లోకపూజ్యు డే
    ముప్పును బొందకుండు మరి ముఖ్య
    ముగా సుఖ జీవితంబిలన్
    దిప్పలు దొల్గి సాగు గద తీరును
    వంతలు మాని వేసినన్

    రిప్లయితొలగించండి

  5. సుగుణము లెచ్చుగ గలిగిన
    పొగత్రాగనివారిమధ్య మూర్ఖుండున్నన్
    వగచును కదవాడిట్టుల
    పొగఁ ద్రాగెడివాఁడు లోకపూజ్యుం డగురా

    రిప్లయితొలగించండి
  6. మెప్పులఁబోఁకవేగఁగనిమేలునుఁజేయుచుపాలనంబునన్
    కప్పురవాసనన్జనులకష్టముఁదీర్చుచురాజునుండగా
    విప్పుచుధూమమున్సెగనువెట్టగఁజూచినతాల్మితోనటన్
    తప్పకఁజెప్పనోప్పుఁబోగఁద్రావెడివాడగులోకపూజ్యుడే

    రిప్లయితొలగించండి
  7. పొగచూరు శ్వాసకోశము
    దిగజారును సుస్థమింక దినదినమునకున్
    పొగరుగ వదరకుమెట్టుల
    పొగఁ ద్రాగెడివాఁడు లోకపూజ్యుం డగురా?

    రిప్లయితొలగించండి
  8. సవరణతో
    ఆగనివిషపుజ్వాలల
    తూగుచుమెఱయుచునుబుకుచుధూమమురాగా
    తగఁద్రావెసెగనుశంభుడు
    పోగఁద్దావెడివాఁడులోకపూజ్యుండగురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి రెండవ పాదాలను లఘువుతో ప్రారంభించండి.

      తొలగించండి
    2. గమనించలేకపోయితినిక్షమించండి
      సవరణతో
      పగఁగనివిషపుజ్వాలల
      రగులుచుమెఱయుచునుబుకుచురయమునరాగా
      తగఁద్రావెసెగనుశంభుడు
      పోగఁద్రావెడివాఁడులోకపూజ్యుండగుగా
      రగులుచుమెఱయుచునుబుకుచు

      తొలగించండి
  9. ఉ:

    విప్పక దెల్పుటెట్లగును పెద్దల చేష్టలు గొప్ప సేయగన్
    రప్పున రాజకీయములు రంజిల నల్లుచు గుప్పు గుప్పనన్
    తిప్పలు ద్రోసిరాజనుచు తేరగ రొక్కము నొక్కుచుండగన్
    తప్పక చెప్పనొప్పు బొగ త్రాగెడి వాడగు లోక పూజ్యుడే

    గుప్పు గుప్పు=పొగ ఊదుట

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. గొప్పలుచెప్పబోకుమిటు కోరి రుజన్ కొనితెచ్చుకోకు యె
    ట్లొప్పును సత్యదూరమును లోకవిరుద్ధపు మాటలిట్లనన్ -
    "తప్పక చెప్పనొప్పుఁ బొగఁ ద్రాగెడివాఁడగు లోకపూజ్యుఁడే"?
    తప్పుగచెప్పబోకుమిటు తల్లడముల్ చవిచూపు మిత్రమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తెచ్చుకోకు మెట్లొప్పును" అనండి.

      తొలగించండి
  11. కందం
    జగమే పారిశ్రామిక
    మగుచున్ గాలుష్య 'ధూమ' మలమ మరుతుఁడే
    మిగిలింపఁగ స్వచ్ఛత నా
    పొగఁ ద్రాగెడివాఁడు లోకపూజ్యుం డగురా!

    ఉత్పలమాల
    చొప్పడగన్ పరిశ్రమలు సూ! కలుషంపు నియంత్రణమ్ము దా
    మెప్పటికప్పుడున్ విడువ నీ జగమున్ విషవాయు'ధూమ'ముల్
    దిప్పలముంచఁ, గ్రోలుచును దేల్చును స్వచ్ఛత వాయుదేవుడున్
    దప్పక చెప్పనొప్పుఁ 'బొగఁ' ద్రాగెడివాఁడగు లోకపూజ్యుఁడే!

    రిప్లయితొలగించండి
  12. జగలుడు కాలజ్ఞానము
    తెగబడిచెప్పెనిటుల సుమతీ వినదగురా
    అగచరుడేమంత్రి యగును
    పొగఁ ద్రాగెడివాఁడు లోకపూజ్యుం డగురా


    జగలుడు = మోసగాడు
    అగచరుడు = కోతి

    రిప్లయితొలగించండి
  13. ఎగువగు వానకు గుళ్ళిన
    నగరపు చెత్త యిడు కంపు నాసిక పొందన్
    అగరును గాల్చగ వచ్చిన
    పొగఁ ద్రాగెడివాఁడు లోకపూజ్యుం డగురా

    రిప్లయితొలగించండి

  14. తప్పదు పొట్టకూటికని తామొక వృత్తిగ స్వీకరించువా
    రిప్పుడు లోకమందునను హెచ్చుగనుండిరి బీడి కార్మికుల్
    తప్పని చెప్పినన్ వినక త్రాగుచు పేదల బ్రోచు వారినే
    తప్పక చెప్పనొప్పుఁ బొగఁ ద్రాగెడివాఁడగు లోకపూజ్యుఁడే

    రిప్లయితొలగించండి
  15. ఉత్పలమాల:
    తిప్పలుఁ వెట్టి నాలి కడు దీనత నొంటరి జేయు వాఁడు తా
    నప్పులు జేసి తీర్చ తన యాలిని ప్రక్కకు పంపువాడు ఛీ!
    గొప్ప ల కోసమై మధువు గ్రోలెడు మూర్ఖుని కంటె వీఁడె మేల్
    "తప్పక చెప్పనొప్పుఁ బొగఁ ద్రాగెడివాఁడగు లోకపూజ్యుఁడే"
    ---కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తిప్పలు వెట్టి' అన్నపుడు అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
    2. ధన్యవాదములార్యా.🙏...సవరించెద
      ఉత్పలమాల:
      తిప్పలు వెట్టి నాలి కడు దీనత నొంటరి జేయు వాఁడు తా
      నప్పులు జేసి తీర్చ తన యాలిని ప్రక్కకు పంపువాడు ఛీ!
      గొప్ప ల కోసమై మధువు గ్రోలెడు మూర్ఖుని కంటె వీఁడె మేల్
      "తప్పక చెప్పనొప్పుఁ బొగఁ ద్రాగెడివాఁడగు లోకపూజ్యుఁడే"
      ---కటకం వేంకటరామ శర్మ.

      తొలగించండి
  16. రిప్లయిలు
    1. తిప్పలు తప్పవంచెపుడు దెప్పిన వైద్యులు నొప్పు కోక తాన్
      గుప్పున గుప్పుమంచు పొగ గొప్పగ త్రాగెడు వాడు చప్పునన్
      తప్పని, లోకమందున పొగ త్రాగుట ముప్పని,మాని,చూపినన్
      తప్పక చెప్పనొప్పుఁ, బొగఁ ద్రాగెడివాఁడగు లోకపూజ్యుఁడే.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "లోకమందు పొగ త్రాగుట..." అనండి.

      తొలగించండి
    3. ఇలా మార్పు చేశాను గురువు గారు ధన్యవాదాలు!

      తిప్పలు తప్పవంచెపుడు దెప్పిన వైద్యులు నొప్పు కోక తాన్
      గుప్పున గుప్పుమంచు పొగ గొప్పగ త్రాగెడు వాడు చప్పునన్
      తప్పని, లోకమందు పొగ త్రాగుట ముప్పని,మాని,చూపినన్
      తప్పక చెప్పనొప్పుఁ, బొగఁ ద్రాగెడివాఁడగు లోకపూజ్యుఁడే.

      తొలగించండి
  17. పొగ త్రాగుటయు నహితమది
    తగదని ప్రకటన లిడుచును తరచుగ సినిమా
    తగునని  తగులుగ జూపగ
    పొగఁ ద్రాగెడివాఁడు లోకపూజ్యుం డగురా

    రిప్లయితొలగించండి
  18. జూపగ బదులు జూపును కూడా ప్రయోగించవచ్చు.

    రిప్లయితొలగించండి
  19. కందం
    అగజ తలయూచి నంతనె
    తొగచెలి తాలుపు విషాగ్ని ధూమము గ్రోలెన్
    జగములఁ గావఁ దలచు నా
    పొగఁ ద్రాగెడివాఁడు లోకపూజ్యుం డగురా!

    ఉత్పలమాల
    చొప్పడ, క్షీరసాగరము జోడు సురాసురులెల్లఁ జిల్కఁ జే
    దొప్పను గాలకూట విష' ధూమము' గ్రోలెను గౌరియొప్పఁగన్
    గొప్పున గంగతోనలరు గోపతి శీఘ్రమె లోకరక్షకై
    తప్పక, చెప్పనొప్పుఁ 'బొగఁ' ద్రాగెడివాఁడగు లోకపూజ్యుఁడే!

    రిప్లయితొలగించండి
  20. నగజాధిపు నర్చించుచు
    దగురీతిని కార్తికమున తత్పరుడై ప
    న్నగ భూషణుని సవనపుం
    బొగద్రాగెడు వాడు లోక పూజ్యుండగురా

    తప్పని దెల్సియున్ దనదు తామసబుద్ధిని నాపలేక పెన్
    ముప్పును దెచ్చునట్టి కడు మోసపు దుర్వ్యసనమ్ము నంటుచున్
    గుప్ఫని ధూమమేఘముల గుప్పుచు లోకుల హింసబెట్టుటన్
    దప్పక చెప్పనొప్పు! బొగద్రాగెడి వాడగు లోకపూజ్యుడే?

    రిప్లయితొలగించండి
  21. గొప్పలు చెప్పకుండ కడుఁ గూర్మినిఁ బంచుచు పేదవారికిన్
    చెప్పుచు మంచి మాటలను చెన్నగు శ్రీహరిఁ గూర్చి నిత్యమున్
    తప్పులు చేయకుండగను తద్దయు ప్రీతిని నుండ కోవెలన్
    తప్పక చెప్పనొప్పుఁ, బొగఁ ద్రాగెడివాఁడగు లోకపూజ్యుఁడే

    రిప్లయితొలగించండి
  22. సగణ విగత ధూమపు లీ
    జగ దవన పరు లమరులు విచక్షణు లట్లుం
    దగ నమృతమ్మును, గోరక
    పొగఁ, ద్రాగెడి వాఁడు లోక పూజ్యుం డగురా


    ముప్పులు మూరి నంతట నమోఘ మెడందఁ బ్రశాంతి కల్గఁగాఁ
    దెప్పిఱు దీవు తత్క్షణము తీరు మనోవ్యథ చుట్ట కాల్చినం
    జొప్పడఁ గొల్వు చక్కఁగను జుట్టల యంగడి నీకు నివ్విధిం
    దప్పక చెప్ప నొప్పుఁ బొగఁ ద్రాగెడి వాఁ డగు లోక పూజ్యుఁడే

    రిప్లయితొలగించండి
  23. అగమ్యపు బ్రదుకునొందును
    బొగద్రాగెడువాడు,లోకపూజ్యుండగురా
    నీగమాదుల నరసియుండియు
    దగువిధముగ సేవజేయ తత్పర బుద్ధిన్

    రిప్లయితొలగించండి
  24. తప్పుగ నెంచ బోకు పొగ త్రాగక యుండు నతండు దున్నయై
    దప్పక పుట్ట బోవుననె ధారగ సాగిన కైత నొక్కడున్
    గొప్పగ మత్తు మందు గొని కూలెడి వారల నెంచి చూడగా
    తప్పక చెప్పనొప్పు బొగ ద్రాగెడి వాడగు లోక పూజ్యుడౌ!

    రిప్లయితొలగించండి
  25. అప్పయశాస్త్రి!వేవినుమ యప్పుల పాలుగ నిజ్జగంబునన్
    దప్పక చెప్పనొప్పుబొగద్రాగెడువాడ,గు లోకపూజ్యుడే
    యెప్పుడు రామనామమును నిష్టతతోడను మానసంబునన్
    నిప్పటిలంగి ధ్యానమున నెందును జూడకయుండుచో నికన్

    రిప్లయితొలగించండి
  26. తెగులుగొనును మితిమీఱుచు
    పొగఁ ద్రాగెడివాఁడు; లోకపూజ్యుండగురా
    తగని పనుల దెగనాడుచు
    జగతిని ధర్మంబు నిలుపు సత్పురుషుండే

    రిప్లయితొలగించండి
  27. కం:ఎగరగ భూతగణమ్ముల్
    భగభగ యన నా స్మశానవాటిక నగ్నుల్
    సెగ నెంచని శంకరుడై
    పొగఁ ద్రాగెడివాఁడు లోకపూజ్యుం డగురా
    (శంకరుడు=శాంతి కలిగించేవాడు,శివుడు.శివుడు అలాంటి పరిస్థితి లో ఉంటాడు కనుక పొగ త్రాగుతూనే ఉంటాడు.)

    రిప్లయితొలగించండి
  28. ఉ:ఎప్పుడు చూచినన్ తగవులే గృహమందున వచ్చుచుండగా
    "తిప్పలు వచ్చు నే పగిది దీర్పుల జెప్పిన" నంచు మెల్లగా
    తప్పుక పోయి ధూమమును త్రాగుచు నుండుట మేలు కాదొకో
    "తప్పక చెప్పనొప్పుఁ బొగఁ ద్రాగెడివాఁడగు లోకపూజ్యుఁడే"

    రిప్లయితొలగించండి