20-10-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె”(లేదా...)“యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ బల్కు టొప్పునే”
తగవు లాడుచు నుండెడు తరుణమందు దాని వారింప యత్నించి తగిన రీతి చక్కనైనట్టి సూచన శాంత పరచు యుక్తముగ పల్కుటది సమయోచి తమ్మె !
వ్యక్తము జేయగావలె శుభంబొనరింప జనాళికెన్నడున్యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ; బల్కుటొప్పునేరిక్తపు మాటలున్ పగను రేపెడి నిష్ఠుర దుష్ప్రలాపముల్త్యక్తమొనర్పగావలె హితంబెటులౌనవి మానవాళికిన్
తేటగీతి పార్థ! సారథిగా ననుఁ బవరమునకు వేడుకొని పిల్చి మోహాన వీడనెంచి యైన వారినిఁ జంపఁగలేననుచు న యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె?ఉత్పలమాలరక్తిని యుద్ధమెంచి నను లాలస గోరుచు పార్థ! సాదిగన్వ్యక్తము సేతువే తగని యారితి మోహమునన్ విరాగివై'శక్తుడ గానటంచు' ,విడి ఛాపము, సేనకు స్ఫూర్తినింపెడున్యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ, 'బల్కు టొప్పునే?'
వక్తగనీతినావిదురువందితసద్గుణులెక్కఁజేయకేసక్తుడుగాకయోధనుడుసంగతిగానకయుద్ధమంచుదాయుక్తినికర్ణునమ్మియికయోధులఁజంపగఁజూచెనేగదాయుక్తమునైనమాటసమయోచితరీతినిఁబల్కుటోప్పునే
సమస్య :యుక్తము నైన మాట సమ యోచితరీతిని బల్కు టొప్పునే ( పాండవులను ప్రశంసిస్తూ కౌరవులను నిరసిస్తూ రాయబారిగా వచ్చినశ్రీకృష్ణుడు పలకటాన్ని నిరసిస్తూ ధృతరాష్ట్రునితో దుర్యోధనుడు )ఉత్పలమాల -------------సక్తము గాదు తండ్రి ! మది సామము లేనిది కృష్ణుబోధకున్ ;ద్యక్తము జేయగా దగునె ధాత్రిని పాండవధార్ష్ట్య బుద్ధికిన్ ?రక్తము పొంగజేయ పగ రాజుకొనున్ గద యేరికైన ! దుర్యుక్తమునైన మాట సమయోచితరీతిని బల్కు టొప్పునే ?( ధార్ష్ట్యబుద్ధి - ధిక్కారపు బుద్ధి )
దుష్టుడైనవానిదుర్మతిఁదోలగఁజేయుయత్నమునుఁజేయుతలపులయందునరసికష్టమైనట్టిమాటలఖండితముగయుక్తముగఁబల్కుటదిసమయోచితమ్మె
యుక్తమునైన మాట సమయోచిత రీతిని బల్కు టొప్పు, నేసూక్తలు జెప్పుచుందు గడుసుందరమొప్పగ విప్పిచక్కగావక్త యటంచు మెచ్చుకొని సభాముఖమందున ప్రస్తుతించి నీప్రోక్తము కర్ణపేయమని భూరిజనుల్ వినుతించునట్లుగాన్
శక్తి యుక్తులు గలవారు యుక్త మెరిగిపలుకుచుందుట పరిపాటి పదుగురెదుటవిధిగ నవసర మెదురైన వేళ ననుపయుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె
శాంతి దూతగ కౌరవ సభకుజొచ్చిసంధిపొసగఁగ జేయుము సరసిజాక్ష!పక్షపాతములేని సద్వచనములనుయుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె
నచ్చిన పనిని జేయగ మెచ్చు కొమ్మునచ్చని పనులు జేయగ నచ్చ జెప్పువినని వారిపై క్షమజూపి విడువుమనగయుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె
ఉ: భుక్తి గొనంగ వల్లభుడు ముచ్చటలాడుచు ప్రేమ మీరగన్రక్తిని బొంద ప్రేయసిని రమ్మన చేరగ దీయ , నంతలోనుక్త మొనర్చ భూషణము నొప్పగ, చప్పున దెప్పిబల్కడేయుక్తము నైన మాట సమయోచిత రీతిని బల్కు టొప్పునే ?వై. చంద్రశేఖర్
తనువుకయినగాయమ్ములు తగ్గుగానిమనసు దగిలిన పలుకులు మానవనుచునెరగి కార్యసాధన గోరి యిలను నరుడుయుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె.
భుక్తిని గోరి యభ్యకుల మోదము తోడ భజించు వేళలోశక్తికి మించు కార్యములు స్థాయికులెంతగ చెపినన్ నిరాసక్తిని చూపనేల యట సంయమనమ్మును గల్గి వారితో యుక్తము నైనమాట సమయోచిత రీతినిఁ బల్కుటొప్పునే.
గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణ ను పరిశీలించ ప్రార్థన.సమస్య: తప్పక చెప్పనొప్పు బొగ ద్రాగెడి వాడగు లోక పూజ్యుడౌ.నా పద్యం: తప్పుగ నెంచ బోకు పొగ త్రాగక యుండు నతండు దున్నయై దప్పక పుట్ట బోవుననె ధారగ సాగిన కైత నొక్కడున్ గొప్పగ మత్తు మందు గొని కూలెడి వారల నెంచి చూడగా తప్పక చెప్పనొప్పు బొగ ద్రాగెడి వాడగు లోక పూజ్యుడౌ!-మాచవోలు శ్రీధరరావు
భుక్తము చేయు వేళ మరి పోల్చుట తప్పగు భార్య వంటలన్శుక్తమదైన చారు రస శోభిత కమ్మని యమ్మ వంటతో,వ్యక్తము చేయవచ్చు నది వ్యాకులతన్ కలిగించకున్నచో!యుక్తమునైన మాట, సమయోచితరీతినిఁ, బల్కు టొప్పునే?
ఉత్పలమాల:వక్తగ నున్న సద్గురువు పట్టుదలన్బలుమార్లుఁ బల్కుగా *యుక్తమునైన మాట సమయోచిత రీతినిఁ, బల్కు టొప్పునే*రిక్త విలంబవక్రపద రీతు లవాక్కులు విద్యనేర్పుచోన్! శుక్తి ప్రభావదీప్తమగు సూక్తులు పెక్కులు చెప్పగాదగున్ ---కటకం వేంకటరామ శర్మ.
తే.గీ సకల ప్రాణులందు పలుకు సాధనముగవరము నొందెను మనుజుడు తెరపి జూడమంచి చెడులవిచక్షణ మరువకుండయుక్తముగ పల్కుటది సమయోచితమ్మెఆత్రేయ🙏🙏ఉ.మా..వ్యక్తిగ జన్మనొందితగుప్రాగ్ర్యమునైనవ రమ్ము తోడునన్ భుక్తినివెళ్ళదీయుటకుమోసము పంచన చేరనేరమే శక్తిని కూడగట్టుకొని శత్రువు నైనను గెల్వగన్ సదాయుక్తమునైన మాట సమయోచిత రీతిని బల్కు టొప్పునేఆత్రేయ🙏🙏
భక్తిని జూపి బంధులను భావ మొకించుక లేక కృష్ణుడేశక్తికి మించి యాడుచును శాంతికి భగ్నము వాటిలన్ యధాశక్తిని పాండవాగ్రజుని సాంతము సంస్తుతి జేయు నీతడే,యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ బల్కు టొప్పునే.
తేటగీతిరాయబారిగ కృష్ణుని రాజరాజుకడకు పంపుచు పాండవాగ్రజుడు సంధికొఱకు నుడివెడి మాట తగు విధముగనెయుక్తముగ బల్కుటది సమయోచితమ్మెప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్
మాట లింపైనచో నూరు మంచి దగును జేత లింపైనచోఁ గీర్తి సెలఁగు నీకు నిత్తరిం గరుణా హీన మిట్లు నర్మ యుక్తముగఁ బల్కు టది సమయోచితమ్మెసూక్తులు సెప్పఁగా వలె నరోత్తమ! పెద్దలు మెచ్చు రీతినిన్ నక్తచర ప్రభావము ఘనమ్ముగఁ గల్గిన యట్లు తోఁపఁగా రిక్తపు మాట యేల విపరీతపు టాత్రము తోడ నివ్విధిన్ యుక్తము నైన మాట సమయోచిత రీతినిఁ బల్కు టొప్పునే
వ్యక్తమొనర్చిరమ్ముయదువంశ విభూషణ మాదు కోర్కెలన్శక్తివిహీనులంచలఁతి చందముగామమునెంచ వారికిన్యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ బల్కు టొప్పు నేసక్తుఁడగాను యుద్ధమున శాంతినికోరుదు నెట్టులేనియున్
తగవు లాడుచు నుండెడు తరుణమందు
రిప్లయితొలగించండిదాని వారింప యత్నించి తగిన రీతి
చక్కనైనట్టి సూచన శాంత పరచు
యుక్తముగ పల్కుటది సమయోచి తమ్మె !
వ్యక్తము జేయగావలె శుభంబొనరింప జనాళికెన్నడున్
రిప్లయితొలగించండియుక్తమునైన మాట సమయోచితరీతినిఁ; బల్కుటొప్పునే
రిక్తపు మాటలున్ పగను రేపెడి నిష్ఠుర దుష్ప్రలాపముల్
త్యక్తమొనర్పగావలె హితంబెటులౌనవి మానవాళికిన్
తేటగీతి
రిప్లయితొలగించండిపార్థ! సారథిగా ననుఁ బవరమునకు
వేడుకొని పిల్చి మోహాన వీడనెంచి
యైన వారినిఁ జంపఁగలేననుచు న
యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె?
ఉత్పలమాల
రక్తిని యుద్ధమెంచి నను లాలస గోరుచు పార్థ! సాదిగన్
వ్యక్తము సేతువే తగని యారితి మోహమునన్ విరాగివై
'శక్తుడ గానటంచు' ,విడి ఛాపము, సేనకు స్ఫూర్తినింపెడున్
యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ, 'బల్కు టొప్పునే?'
వక్తగనీతినావిదురువందితసద్గుణులెక్కఁజేయకే
రిప్లయితొలగించండిసక్తుడుగాకయోధనుడుసంగతిగానకయుద్ధమంచుదా
యుక్తినికర్ణునమ్మియికయోధులఁజంపగఁజూచెనేగదా
యుక్తమునైనమాటసమయోచితరీతినిఁబల్కుటోప్పునే
సమస్య :
రిప్లయితొలగించండియుక్తము నైన మాట సమ
యోచితరీతిని బల్కు టొప్పునే
( పాండవులను ప్రశంసిస్తూ కౌరవులను
నిరసిస్తూ రాయబారిగా వచ్చినశ్రీకృష్ణుడు
పలకటాన్ని నిరసిస్తూ ధృతరాష్ట్రునితో దుర్యోధనుడు )
ఉత్పలమాల
-------------
సక్తము గాదు తండ్రి ! మది
సామము లేనిది కృష్ణుబోధకున్ ;
ద్యక్తము జేయగా దగునె
ధాత్రిని పాండవధార్ష్ట్య బుద్ధికిన్ ?
రక్తము పొంగజేయ పగ
రాజుకొనున్ గద యేరికైన ! దు
ర్యుక్తమునైన మాట సమ
యోచితరీతిని బల్కు టొప్పునే ?
( ధార్ష్ట్యబుద్ధి - ధిక్కారపు బుద్ధి )
దుష్టుడైనవానిదుర్మతిఁదోలగఁజేయు
రిప్లయితొలగించండియత్నమునుఁజేయుతలపులయందునరసి
కష్టమైనట్టిమాటలఖండితముగ
యుక్తముగఁబల్కుటదిసమయోచితమ్మె
యుక్తమునైన మాట సమయో
రిప్లయితొలగించండిచిత రీతిని బల్కు టొప్పు, నే
సూక్తలు జెప్పుచుందు గడు
సుందరమొప్పగ విప్పిచక్కగా
వక్త యటంచు మెచ్చుకొని సభా
ముఖమందున ప్రస్తుతించి నీ
ప్రోక్తము కర్ణపేయమని భూరి
జనుల్ వినుతించునట్లుగాన్
శక్తి యుక్తులు గలవారు యుక్త మెరిగి
రిప్లయితొలగించండిపలుకుచుందుట పరిపాటి పదుగురెదుట
విధిగ నవసర మెదురైన వేళ ననుప
యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె
శాంతి దూతగ కౌరవ సభకుజొచ్చి
రిప్లయితొలగించండిసంధిపొసగఁగ జేయుము సరసిజాక్ష!
పక్షపాతములేని సద్వచనములను
యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె
నచ్చిన పనిని జేయగ మెచ్చు కొమ్ము
రిప్లయితొలగించండినచ్చని పనులు జేయగ నచ్చ జెప్పు
వినని వారిపై క్షమజూపి విడువుమనగ
యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె
ఉ:
రిప్లయితొలగించండిభుక్తి గొనంగ వల్లభుడు ముచ్చటలాడుచు ప్రేమ మీరగన్
రక్తిని బొంద ప్రేయసిని రమ్మన చేరగ దీయ , నంతలో
నుక్త మొనర్చ భూషణము నొప్పగ, చప్పున దెప్పిబల్కడే
యుక్తము నైన మాట సమయోచిత రీతిని బల్కు టొప్పునే ?
వై. చంద్రశేఖర్
రిప్లయితొలగించండితనువుకయినగాయమ్ములు తగ్గుగాని
మనసు దగిలిన పలుకులు మానవనుచు
నెరగి కార్యసాధన గోరి యిలను నరుడు
యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె.
రిప్లయితొలగించండిభుక్తిని గోరి యభ్యకుల మోదము తోడ భజించు వేళలో
శక్తికి మించు కార్యములు స్థాయికులెంతగ చెపినన్ నిరా
సక్తిని చూపనేల యట సంయమనమ్మును గల్గి వారితో
యుక్తము నైనమాట సమయోచిత రీతినిఁ బల్కుటొప్పునే.
గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణ ను పరిశీలించ ప్రార్థన.
రిప్లయితొలగించండిసమస్య: తప్పక చెప్పనొప్పు బొగ ద్రాగెడి వాడగు లోక పూజ్యుడౌ.
నా పద్యం:
తప్పుగ నెంచ బోకు పొగ త్రాగక యుండు నతండు దున్నయై
దప్పక పుట్ట బోవుననె ధారగ సాగిన కైత నొక్కడున్
గొప్పగ మత్తు మందు గొని కూలెడి వారల నెంచి చూడగా
తప్పక చెప్పనొప్పు బొగ ద్రాగెడి వాడగు లోక పూజ్యుడౌ!
-మాచవోలు శ్రీధరరావు
భుక్తము చేయు వేళ మరి పోల్చుట తప్పగు భార్య వంటలన్
రిప్లయితొలగించండిశుక్తమదైన చారు రస శోభిత కమ్మని యమ్మ వంటతో,
వ్యక్తము చేయవచ్చు నది వ్యాకులతన్ కలిగించకున్నచో!
యుక్తమునైన మాట, సమయోచితరీతినిఁ, బల్కు టొప్పునే?
ఉత్పలమాల:
రిప్లయితొలగించండివక్తగ నున్న సద్గురువు పట్టుదలన్బలుమార్లుఁ బల్కుగా
*యుక్తమునైన మాట సమయోచిత రీతినిఁ, బల్కు టొప్పునే*
రిక్త విలంబవక్రపద రీతు లవాక్కులు విద్యనేర్పుచోన్!
శుక్తి ప్రభావదీప్తమగు సూక్తులు పెక్కులు చెప్పగాదగున్
---కటకం వేంకటరామ శర్మ.
తే.గీ
రిప్లయితొలగించండిసకల ప్రాణులందు పలుకు సాధనముగ
వరము నొందెను మనుజుడు తెరపి జూడ
మంచి చెడులవిచక్షణ మరువకుండ
యుక్తముగ పల్కుటది సమయోచితమ్మె
ఆత్రేయ🙏🙏
ఉ.మా..
వ్యక్తిగ జన్మనొందితగుప్రాగ్ర్యమునైనవ రమ్ము తోడునన్
భుక్తినివెళ్ళదీయుటకుమోసము పంచన చేరనేరమే
శక్తిని కూడగట్టుకొని శత్రువు నైనను గెల్వగన్ సదా
యుక్తమునైన మాట సమయోచిత రీతిని బల్కు టొప్పునే
ఆత్రేయ🙏🙏
భక్తిని జూపి బంధులను భావ మొకించుక లేక కృష్ణుడే
రిప్లయితొలగించండిశక్తికి మించి యాడుచును శాంతికి భగ్నము వాటిలన్ యధా
శక్తిని పాండవాగ్రజుని సాంతము సంస్తుతి జేయు నీతడే,
యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ బల్కు టొప్పునే.
తేటగీతి
రిప్లయితొలగించండిరాయబారిగ కృష్ణుని రాజరాజు
కడకు పంపుచు పాండవాగ్రజుడు సంధి
కొఱకు నుడివెడి మాట తగు విధముగనె
యుక్తముగ బల్కుటది సమయోచితమ్మె
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
మాట లింపైనచో నూరు మంచి దగును
రిప్లయితొలగించండిజేత లింపైనచోఁ గీర్తి సెలఁగు నీకు
నిత్తరిం గరుణా హీన మిట్లు నర్మ
యుక్తముగఁ బల్కు టది సమయోచితమ్మె
సూక్తులు సెప్పఁగా వలె నరోత్తమ! పెద్దలు మెచ్చు రీతినిన్
నక్తచర ప్రభావము ఘనమ్ముగఁ గల్గిన యట్లు తోఁపఁగా
రిక్తపు మాట యేల విపరీతపు టాత్రము తోడ నివ్విధిన్
యుక్తము నైన మాట సమయోచిత రీతినిఁ బల్కు టొప్పునే
వ్యక్తమొనర్చిరమ్ముయదువంశ విభూషణ మాదు కోర్కెలన్
రిప్లయితొలగించండిశక్తివిహీనులంచలఁతి చందముగామమునెంచ వారికిన్
యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ బల్కు టొప్పు నే
సక్తుఁడగాను యుద్ధమున శాంతినికోరుదు నెట్టులేనియున్