28-10-2021 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నలకూబరు మంచమందు నల్లులు సేరెన్”(లేదా...)“కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే”
సమస్య :కొల్లలు కొల్లలయ్యె నల కూబరు మంచమునందు నల్లులే ( ఎంత దిక్పాలక పుత్రుడైనా సోమరిగా నిద్రాళువై కాలం గడిపితే జరిగే పరిణామం ఇదే ! )" అల్ల కుబేరనందను ; డ హా ! మరి చక్కని వా " డటంచు మే నెల్లను పొంగజేయు నుతు లెన్నియొ పొందుచు రంభగూడుచున్ మెల్లన నల్లనన్ నిదుర మేల్కొనకుండుట కారణమ్ముగా కొల్లలు కొల్లలయ్యె నల కూబరు మంచమునందు నల్లులే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వలగనిరాజునుబట్టగఅలుపెరుగకనరితిరుగగయామినియందున్కలలోకలవరమందగనలకూబరుమంచమందునల్లులుసేరెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అలరావణాసురుండేబలవంతముసేయ రంభబావురుమనియెన్కలవర పాటున వాడనినలకూబరు మంచమందు నల్లులు సేరెన్
ఇలలో మనుజుల రక్తము నలవోక గ బీల్చు నట్టి యల్ప క్రిములకున్ గలవే తరతమ భేదము నలకూబరు మంచ మందు నల్లులు సే రెన్
మల్లెలు సల్లుకున్న మరి మంచిసుగంధము రాసుకున్న తానుల్లము సంతసిల్ల కొమ రూర్వసితోడను బొందు గూడినన్బల్లిదుడైననేమి తన పాన్పుననుద్భవ మందె గాంచగాకొల్లలు కొల్లలయ్య నలకూబరు మంచమునందు నల్లులే
ఎల్లలుదాటగాప్రభువునేర్పునుజూపుచుభోగమందునన్చిల్లరచేతలన్తనదుచేవనుజెప్పగలక్ష్మిపుత్రుడైకల్లలుకాటువేయప్రజకాగలకార్యమునెంచిచూడగాకొల్లలుకొల్లలయ్యెనలకూబరుమంచమునందునల్లులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో యతి తప్పింది. "ఎల్లలు దాటగాను ప్రభు వెంతయొ నేర్పున భోగమందుచున్" అందామా?
గమనించలేదుక్షమించండి
సవరణతోఎల్లలుదాటగానుప్రభువెంతయునేర్పునభోగమందుచున్చిల్లరచేతలన్తనదుచేవను. జూపగలక్ష్మిపుత్రుడైకల్లలుకాటువేయప్రజకాగలకార్యమునెంచిఁజూడగా
పలువురి కొంపల యందునపలుదినములు గడిపెడు పరి వ్రాజకు డతడేచెలమరి యింటగడిపె కానల, కూబరుమంచమందు నల్లులు సేరెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చలిపులి సందడి సేయగగిలిగింతలు పెట్ట రంభ, గీరుచు గడిపెన్కలవర మందుచు రాతిరి-నలకూబరు మంచ మందు నల్లులు సేరెన్!
ధన్యవాదములు
కందంజలజల గురిసెను వానలుజలతస్కరు వెలుగు లేక చకచక చేరెన్పలు కీటకములు, యా వానల ,కూబరు మంచమందు నల్లులు సేరెన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.కూబరు-మనోజ్ఞమైన
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కీటకములు+ఆ' అన్నపుడు యడాగమం రాదు.
చెల్లెలు పిల్చెనంచు తన శ్రీమతి తోడ ప్రయాణమయ్యె నాపల్లెకు రాత్రి పాళమున బస్సది యందక ప్రాంగణమ్మునన్ బల్లల పైననుండిరి ప్రభాతపు వేళను నాడు జేరగా కొల్లలు కొల్లలయ్యె నల, కూబరు మంచమునందు నల్లులే.
ఉత్పలమాల:ఎల్లలు లేని భోగముల నీ కలభాషిణి రంభ పొందులో“కొల్లలు కొల్లలయ్యె, నలకూబరు మంచమునందు నల్లులే”నల్లులు మంచమందు రతినాధుని సేనయె క్రొత్త జంటకున్ ।తెల్లగ తెల్లవారినను తీరవు క్రీడలు నిద్ర రాకనే ।।---కటకం వేంకటరామ శర్మ.
అలసటనెరుగక నిరతముపలురకముల పంచభక్ష్య పరమాన్నంబుల్కలగలిపి తినిపరుండెడునలకూబరు మంచమందు నల్లులు సేరెన్
కలవవి పువ్వులు కొల్లలునలకూబరు మంచమందు; నల్లులు సేరెన్వలసిన రక్తము ద్రాగగమలకలు గల పేద నులక మంచములోనన్
ఇల్లును వాకిలింగనక నెన్నడు వీధులబట్టి తిర్గుచున్చిల్లర నేస్తగాండ్రెపుడు చిల్లులు వెట్టుచునుండ జేబులన్తల్లడమేమెరుంగక నితాంత సుఖంబుల తేలి సోలగన్కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే
కలతలు నల్లుల రీతినిఁజెలఁగిన మదిమంచమందు చిక్కునె నిదురల్సలుపఁగ రావణ దౌష్ట్యమునలకూబరు మంచమందు నల్లులు సేరెన్! ఉత్పలమాలఉల్లపు మంచమున్గలతలూనము సేయఁగ నల్లులట్లుగన్జెల్లునె నిద్రకున్? సతియె చిక్కగ రావణుఁడెంచి దౌష్ట్యమున్దల్లడపెట్ట వేదనను దారుణ శాపమునీయు దాక సూ!కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే!
(శోభన రాత్రి మామ యల్లునితో పలికిన పలుకులు) కల్లయు గాదదిన్ నిజము కానుక నేటికి శోభ నంబవన్చెల్లును 'ఆఫ్రికన్ ఎబొని' చెక్కల మంచమె యం చు కొంటినేమెల్లగ జెప్పుచుంటి నెప మెన్నక సర్దుకొనుండు నే లపైకొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే (ఆఫ్రికన్ ఎబొని : మిక్కిలి ఖరీదైన నల్లని చెక్క;నలకూబరు : నల్లని మనోజ్ఞ మైన))
అలరుచు పండుకొనిరి కూనల కూబరు మంచమందు ; నల్లులు సేరెన్తొలగిన మంచము నందున ,ఫలమేమియు లేదటంచు వాడక నుండన్కూబర = మనోజ్ఞము.
ఎల్లలు మీరగన్ వలపు యెంకిని జూడగ కోర్కెలూరగన్మల్లెలుజాజులన్ గొనుచు మైకపు టూహల నూగితేలుచున్అల్లరి జేయగా చెలగి హత్తుకు ముద్దిడి ,శయ్యజేరగన్కొల్లలు కొల్లలయ్యె నల, కూబరు మంచము నందు నల్లులే !!
వలచిన రంభయె చేరెనునలకూబరు మంచమందు; నల్లులు చేరెన్ నులకల మంచము నందునుతలకొని శయనించువాడు తల్లడమందన్ఒక విదేశీయుని పాట్లుఉల్లము రంజిలన్ వినగ నూర్వశి రంభలె భారతాంగనల్పిల్లకు పైకమిచ్చి కడుపేదది యైనను పల్లెటూరునన్తుళ్ళుచు బెండ్లియాడ బహుతోషము నందుచు సుందరాంగినిన్కొల్లలు కొల్లలయ్యె నల కూబరు మంచమునందు నల్లులే
తల్లికి తిండి పెట్టడతిదౌష్ట్యము జూపుచు లోభియౌచు దాచిల్లర కాసులైననఱ జేయుచు చౌకగ చిక్కెనంచునాపొల్లగు వస్తువుల్ గొనుచు మూర్ఖముగా నడయాడు నయ్యయోకొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే
ఇల నెఱుకుల కడ పందులు కలుఁగుల లోన నెలుకలు నగరుల శునకముల్ కలవా రింటను బిల్లులు నలకూబరు మంచ మందు నల్లులు సేరెన్ఉల్లము తల్లడిల్లఁగ సహోదరు తోడుత జోడు మద్దులై గొల్లల మందలో నిలువ ఘోరముగాఁ బలు వత్సరమ్ములే చల్లగఁ జేర రిత్తవడి చాగఁగ నత్తరిఁ బాను పక్కటా కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచము నందు నల్లులే
తొలిరేయి చూడంగ దోమలు పీడించె నని రంభ పలికెను మనసు విప్పి ,దుప్పటి వలదంచు దోమ తెర యొకటి కట్టించ రాకుండె గాలి యనుచు గోలను చేసెగా కుమరుండు, గదిలోని మంచమున్ బయటకు మార్చి సుఖము పొందమని పలుక కందెను కాయము నల్లుల తోనని తల్ల డిల్లె, సరిగ జూచి నలకూబరు మంచమందు నల్లులు చేరెనెటుల తెలుపగ వలయుచెలియ లార తప్పించుము నులక మంచమీ దినమున, చెక్క మంచము ,మెత్త నైన పరుపు నిడుమని ధనపతి భార్య పలికె రంభ భాధ బాప దలచి రమ్య గతిని
సమస్య :
రిప్లయితొలగించండికొల్లలు కొల్లలయ్యె నల
కూబరు మంచమునందు నల్లులే
( ఎంత దిక్పాలక పుత్రుడైనా సోమరిగా నిద్రాళువై
కాలం గడిపితే జరిగే పరిణామం ఇదే ! )
" అల్ల కుబేరనందను ; డ
హా ! మరి చక్కని వా " డటంచు మే
నెల్లను పొంగజేయు నుతు
లెన్నియొ పొందుచు రంభగూడుచున్
మెల్లన నల్లనన్ నిదుర
మేల్కొనకుండుట కారణమ్ముగా
కొల్లలు కొల్లలయ్యె నల
కూబరు మంచమునందు నల్లులే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివలగనిరాజునుబట్టగ
రిప్లయితొలగించండిఅలుపెరుగకనరితిరుగగయామినియందున్
కలలోకలవరమందగ
నలకూబరుమంచమందునల్లులుసేరెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅలరావణాసురుండే
రిప్లయితొలగించండిబలవంతముసేయ రంభబావురుమనియెన్
కలవర పాటున వాడని
నలకూబరు మంచమందు నల్లులు సేరెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇలలో మనుజుల రక్తము
రిప్లయితొలగించండినలవోక గ బీల్చు నట్టి యల్ప క్రిములకున్
గలవే తరతమ భేదము
నలకూబరు మంచ మందు నల్లులు సే రెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమల్లెలు సల్లుకున్న మరి మంచి
రిప్లయితొలగించండిసుగంధము రాసుకున్న తా
నుల్లము సంతసిల్ల కొమ రూర్వసి
తోడను బొందు గూడినన్
బల్లిదుడైననేమి తన పాన్పున
నుద్భవ మందె గాంచగా
కొల్లలు కొల్లలయ్య నలకూబరు మం
చమునందు నల్లులే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఎల్లలుదాటగాప్రభువునేర్పునుజూపుచుభోగమందునన్
రిప్లయితొలగించండిచిల్లరచేతలన్తనదుచేవనుజెప్పగలక్ష్మిపుత్రుడై
కల్లలుకాటువేయప్రజకాగలకార్యమునెంచిచూడగా
కొల్లలుకొల్లలయ్యెనలకూబరుమంచమునందునల్లులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది. "ఎల్లలు దాటగాను ప్రభు వెంతయొ నేర్పున భోగమందుచున్" అందామా?
గమనిం
తొలగించండిచలేదుక్షమించండి
సవరణతో
తొలగించండిఎల్లలుదాటగానుప్రభువెంతయునేర్పునభోగమందుచున్చిల్లరచేతలన్తనదుచేవను. జూపగలక్ష్మిపుత్రుడై
కల్లలుకాటువేయప్రజకాగలకార్యమునెంచిఁజూడగా
రిప్లయితొలగించండిపలువురి కొంపల యందున
పలుదినములు గడిపెడు పరి వ్రాజకు డతడే
చెలమరి యింటగడిపె కా
నల, కూబరుమంచమందు నల్లులు సేరెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచలిపులి సందడి సేయగ
రిప్లయితొలగించండిగిలిగింతలు పెట్ట రంభ, గీరుచు గడిపెన్
కలవర మందుచు రాతిరి-
నలకూబరు మంచ మందు నల్లులు సేరెన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండికందం
రిప్లయితొలగించండిజలజల గురిసెను వానలు
జలతస్కరు వెలుగు లేక చకచక చేరెన్
పలు కీటకములు, యా వా
నల ,కూబరు మంచమందు నల్లులు సేరెన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
కూబరు-మనోజ్ఞమైన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కీటకములు+ఆ' అన్నపుడు యడాగమం రాదు.
చెల్లెలు పిల్చెనంచు తన శ్రీమతి తోడ ప్రయాణమయ్యె నా
రిప్లయితొలగించండిపల్లెకు రాత్రి పాళమున బస్సది యందక ప్రాంగణమ్మునన్
బల్లల పైననుండిరి ప్రభాతపు వేళను నాడు జేరగా
కొల్లలు కొల్లలయ్యె నల, కూబరు మంచమునందు నల్లులే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండిఎల్లలు లేని భోగముల నీ కలభాషిణి రంభ పొందులో
“కొల్లలు కొల్లలయ్యె, నలకూబరు మంచమునందు నల్లులే”
నల్లులు మంచమందు రతినాధుని సేనయె క్రొత్త జంటకున్ ।
తెల్లగ తెల్లవారినను తీరవు క్రీడలు నిద్ర రాకనే ।।
---కటకం వేంకటరామ శర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅలసటనెరుగక నిరతము
రిప్లయితొలగించండిపలురకముల పంచభక్ష్య పరమాన్నంబుల్
కలగలిపి తినిపరుండెడు
నలకూబరు మంచమందు నల్లులు సేరెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలవవి పువ్వులు కొల్లలు
తొలగించండినలకూబరు మంచమందు; నల్లులు సేరెన్
వలసిన రక్తము ద్రాగగ
మలకలు గల పేద నులక మంచములోనన్
ఇల్లును వాకిలింగనక నెన్నడు వీధులబట్టి తిర్గుచున్
రిప్లయితొలగించండిచిల్లర నేస్తగాండ్రెపుడు చిల్లులు వెట్టుచునుండ జేబులన్
తల్లడమేమెరుంగక నితాంత సుఖంబుల తేలి సోలగన్
కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే
కలతలు నల్లుల రీతినిఁ
రిప్లయితొలగించండిజెలఁగిన మదిమంచమందు చిక్కునె నిదురల్
సలుపఁగ రావణ దౌష్ట్యము
నలకూబరు మంచమందు నల్లులు సేరెన్!
ఉత్పలమాల
ఉల్లపు మంచమున్గలతలూనము సేయఁగ నల్లులట్లుగన్
జెల్లునె నిద్రకున్? సతియె చిక్కగ రావణుఁడెంచి దౌష్ట్యమున్
దల్లడపెట్ట వేదనను దారుణ శాపమునీయు దాక సూ!
కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే!
(శోభన రాత్రి మామ యల్లునితో పలికిన పలుకులు)
రిప్లయితొలగించండికల్లయు గాదదిన్ నిజము కానుక నేటికి శోభ నంబవన్
చెల్లును 'ఆఫ్రికన్ ఎబొని' చెక్కల మంచమె యం చు కొంటినే
మెల్లగ జెప్పుచుంటి నెప మెన్నక సర్దుకొనుండు నే లపై
కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే
(ఆఫ్రికన్ ఎబొని : మిక్కిలి ఖరీదైన నల్లని చెక్క;
నలకూబరు : నల్లని మనోజ్ఞ మైన))
అలరుచు పండుకొనిరి కూ
రిప్లయితొలగించండినల కూబరు మంచమందు ; నల్లులు సేరెన్
తొలగిన మంచము నందున ,
ఫలమేమియు లేదటంచు వాడక నుండన్
కూబర = మనోజ్ఞము.
ఎల్లలు మీరగన్ వలపు యెంకిని జూడగ కోర్కెలూరగన్
రిప్లయితొలగించండిమల్లెలుజాజులన్ గొనుచు మైకపు టూహల నూగితేలుచున్
అల్లరి జేయగా చెలగి హత్తుకు ముద్దిడి ,శయ్యజేరగన్
కొల్లలు కొల్లలయ్యె నల, కూబరు మంచము నందు నల్లులే !!
వలచిన రంభయె చేరెను
రిప్లయితొలగించండినలకూబరు మంచమందు; నల్లులు చేరెన్
నులకల మంచము నందును
తలకొని శయనించువాడు తల్లడమందన్
ఒక విదేశీయుని పాట్లు
ఉల్లము రంజిలన్ వినగ నూర్వశి రంభలె భారతాంగనల్
పిల్లకు పైకమిచ్చి కడుపేదది యైనను పల్లెటూరునన్
తుళ్ళుచు బెండ్లియాడ బహుతోషము నందుచు సుందరాంగినిన్
కొల్లలు కొల్లలయ్యె నల కూబరు మంచమునందు నల్లులే
తల్లికి తిండి పెట్టడతిదౌష్ట్యము జూపుచు లోభియౌచు దా
రిప్లయితొలగించండిచిల్లర కాసులైననఱ జేయుచు చౌకగ చిక్కెనంచునా
పొల్లగు వస్తువుల్ గొనుచు మూర్ఖముగా నడయాడు నయ్యయో
కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే
ఇల నెఱుకుల కడ పందులు
రిప్లయితొలగించండికలుఁగుల లోన నెలుకలు నగరుల శునకముల్
కలవా రింటను బిల్లులు
నలకూబరు మంచ మందు నల్లులు సేరెన్
ఉల్లము తల్లడిల్లఁగ సహోదరు తోడుత జోడు మద్దులై
గొల్లల మందలో నిలువ ఘోరముగాఁ బలు వత్సరమ్ములే
చల్లగఁ జేర రిత్తవడి చాగఁగ నత్తరిఁ బాను పక్కటా
కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచము నందు నల్లులే
తొలిరేయి చూడంగ దోమలు పీడించె నని రంభ పలికెను మనసు విప్పి ,
రిప్లయితొలగించండిదుప్పటి వలదంచు దోమ తెర యొకటి కట్టించ రాకుండె గాలి యనుచు
గోలను చేసెగా కుమరుండు, గదిలోని మంచమున్ బయటకు మార్చి సుఖము
పొందమని పలుక కందెను కాయము నల్లుల తోనని తల్ల డిల్లె,
సరిగ జూచి నలకూబరు మంచమందు నల్లులు చేరెనెటుల తెలుపగ వలయు
చెలియ లార తప్పించుము నులక మంచ
మీ దినమున, చెక్క మంచము ,మెత్త నైన
పరుపు నిడుమని ధనపతి భార్య పలికె
రంభ భాధ బాప దలచి రమ్య గతిని