26, అక్టోబర్ 2021, మంగళవారం

సమస్య - 3883

27-10-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నీల మెఱ్ఱబాఱె నీలవేణి”
(లేదా...)
“నీలము లెఱ్ఱబాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

41 కామెంట్‌లు:

  1. వాలము చేత గైకొనుచు వంగల భూమిని శాస్త్రి వర్యుడే
    కేలును బట్టి కన్నియను కేకలు వేయుచు కొల్కతందునన్
    పూలను గ్రుచ్చ మల్లెలను పొందుగ భామిని హృత్తునందునన్
    నీలము లెఱ్ఱబాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్

    రిప్లయితొలగించండి

  2. కాంత నల్లనైన కళగల మోమంచు
    ముద్దుగోరి చెంత మొగుడు చేర
    సిగ్గుతోడనామె బుగ్గలెఱ్ఱగ మార
    నీలమెఱ్ఱబాఱె నీలవేణి.

    రిప్లయితొలగించండి
  3. ప్రోద్దువాలుతఱినిపోడిమిమీరగా
    సంధ్యసిగ్గునందుసంగమించె
    నలుపురూపుపోయినాతియెఱ్ఱగమారె
    నీలమెఱ్ఱబారెనీలవేణి

    రిప్లయితొలగించండి
  4. సమస్య :

    నీలము లెర్రబారె రమ
    ణీరమణీయవిలాసరేఖలన్

    ( ఇంద్రనీలమణుల అంత:పురమందిరంలో
    సత్యభామతో శ్రీకృష్ణుడు )

    ఓ లలనా ! త్వదీయమగు
    నుజ్వలమౌ యరుణారుణంబదే
    చేలము గాలితాకిడికి
    చిక్కని చక్కని వెల్గులీన ; దాం
    బూలపు మోవియే కదలి
    ముచ్చట గొల్ప ; పదాల పారణిన్
    నీలము లెర్రబారె రమ
    ణీ ! రమణీయవిలాసరేఖలన్ .

    రిప్లయితొలగించండి
  5. నల్లనైన గురులు నాజూకు మో ముతో
    ప్రియుని చెంత చేర ప్రేమ మీఱ
    బిగియ గౌగ లించి పెదవిపై చుంబింప
    నీల మెఱ్ఱ బారె నీల వేణి

    రిప్లయితొలగించండి
  6. పదవి గోరి నెలత పలుమార్లు నర్థించె
    ప్రజల మనసు గెలిచె రయముగాను
    నాయకత్వమరయ నాన్చుడుంజూసిన
    నీల మెఱ్ఱబాఱె నీలవేణి!!


    రిప్లయితొలగించండి
  7. చాలిననీలవర్ణుగనిసంబరమందుచుసీతసిగ్గుతో
    చేలముచాటునన్రమణుఁజేరెనుదోసిలినిండముత్యముల్
    పోలగపద్మరాగమణి, పోడిమిమీరగరాముగుప్పిటన్
    నీలములెఱ్ఱబారెరమణీరమణీయవిలాలరేఖలన్

    రిప్లయితొలగించండి

  8. వేలుపు దాయ తారకుని పేరడగించు సుతుండ గోరుచున్
    ఫాలుడు పెండ్లియాడెగద పార్వతి నంత సురాళికోరగా
    క్ష్వేళగళుండ గాంచిసతి చెంపలు సిగ్గిల యామె బుగ్గలౌ
    నీలములెఱ్ఱబాఱె రమణీ రమణీయవిలాసరేఖలున్

    రిప్లయితొలగించండి
  9. ఎఱ్ఱనైన బల్బు లింపుగా నుండగా
    వింత శోభ లెగసె వేడ్క గదిని
    అతివ లోని కేగ నడుగిడి నంతనే
    నీలమెఱ్ఱ బాఱె నీలవేణి.

    రిప్లయితొలగించండి
  10. సంధ్యనుదిటి పైన సంగమ చిహ్నమా?
    సూర్యకిరణ వెలుగు సుందరమ్మె
    బుగ్గ కెంపు రంగు మొగ్గలు తొడుగగా
    నీల మెఱ్ఱ బాఱె నీల నేణి!!

    రిప్లయితొలగించండి
  11. లాలన జేయుచున్ సతిని లాలిత
    మైన ముఖారవిందమున్
    లాలస భావ మొప్పగ కులాంగను
    ముద్దుల తోడముంచగా
    నాలలనాంగి సిగ్గువడె నాయమ
    యానన మాయె కెంపుగా
    నీలము లెర్రబారె రమణీ రమణీయ
    విలాస రేఖలన్

    రిప్లయితొలగించండి
  12. ఉత్పలమాల:
    కోలను ద్రుంచి రాముఁడతి కోమలి జానకి వంకఁ జూడ, పూ
    మాలనువైచి సమ్మతిని మైథిలి దెల్ప, వివాహ వేడుకన్
    బ్రాలుగ ముత్యముల్ దొరలె వర్ణవిశేషత వర్తిలన్ ధృతిన్
    “నీలము లెఱ్ఱబాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్”
    ---కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  13. కాలమేగు దెంచె కాంతుల జిమ్మెడు
    కల్వపూల వైరి నిల్వనింగి
    పూర్వదిక్కు నందు పూష జాడగనగ
    నీల మెర్రవారె నీలవేణి

    నీలాకాశము

    మేలగు పారిజాతమును మెచ్చుచు రుక్మిణి కిచ్చినట్టులన్
    వీనుల సోకినంత తనువెల్లను భగ్గన కృష్ణుదూరుచున్
    తాళగలేక మత్సరము తల్లడమొందగ భామకన్నులన్
    నీలము లెర్రవారె రమణీ రమణీయ విలాసరేఖలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హాలికులైన రాజులకు హ్లాదముబంచుచు నేలలోపలన్
      బాలికలే లభించునట పావనభూమి విదేహ రాజ్యమన్
      మేలములాడగా మగడు మిక్కిలి సిగ్గున సీతకన్నులన్
      నీలము లెర్రవారె రమణీ రమణీయ విలాసరేఖలన్

      తొలగించండి
  14. సిగ్గుతోటినీదు బుగ్గలే యెరుపెక్కె
    ముచ్చటైననీదుమోములోని
    రక్తవర్ణమే పరావర్తనము చెంది
    నీల మెఱ్ఱబాఱె నీలవేణి

    రిప్లయితొలగించండి
  15. ( చెలి నీలమణి తో )

    నా మగడు సతతము నలుగురి ముందు నా
    యింతి పొగడిక విన హృదయమంత
    భగ భగమని మండ వక్షము పైనున్న
    నీల మెఱ్ఱబాఱె నీలవేణి !

    రిప్లయితొలగించండి
  16. (బామ్మ మనుమరాలు నీలవేణితో పలికిన పలుకులు)

    చూలి వీవు  కదలి జూచిన తప్పక
    గ్రహణ మొర్రి బిడ్డ  కల్గు నంద్రు
    సూర్య గ్రహణ మిదియు చూడకు నభమున
    నీల మెఱ్ఱబాఱె, నీలవేణి

    రిప్లయితొలగించండి
  17. నీలిమేఘఛాయ నెనరైన నగవుతో
    నిందువదన కనుల విందుఁజేయ
    చక్కని చెలికాడు చెక్కిలి మీటఁగ
    నీల మెఱ్ఱబాఱె నీలవేణి

    రిప్లయితొలగించండి
  18. మేలగు ముత్యముల్‌ శిరము‌మీద అయోనిజ పోయ మేనుపై
    నీలపు కాంతితో మెరిసి నేలకు జారుచు నుండె కాంచగన్,
    మాలిని సీతపై మన కుమారుడు రాముడు పోయుచుండ యా
    నీలపు పూస లన్నియును నెమ్మది గా వదనంబు తాకుచున్
    రాలుచు నుండ మారి నభి రామపు రోహిత కాంతు లొప్పుచున్,
    నీలము లెర్ర బారె రమణీ, రమణీయ విలాస రేఖలన్
    మౌలిని గాంచుమా యనుచు మన్నియ రాణిని కాంచి పేర్కొనెన్


    సీతా,కళ్యాణ సమయములో దశరథుడు కౌసల్య ను గాంచి పలికిన పలుకులు

    రిప్లయితొలగించండి
  19. ఆటవెలది
    పసిడి బుగ్గ సొట్ట పై మోజు పడి ముద్దు
    కోరె చిన్న వాడు కొద్ది సిగ్గు
    చెంది, నంత కొమ్మ చెక్కిలి నిగనిగ
    నీల మెఱ్ఱ బాఱె నీల వేణి.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  20. ఆటవెలది
    కలికి నీదు వన్నె కాశ్మీర ఫలమట్లు
    నీలి కురుల జడయె గాలమౌచు
    దాక సోయగమ్ము సోకి నా యంగుళి
    నీల మెఱ్ఱబాఱె నీలవేణి!

    ఉత్పలమాల
    మాలిని! నీదు వన్నెగన మాగిన నెర్రటి పండు వర్ణమై
    నీలి కురుల్ జడన్ వలపు నింపుచు గాలము వైచి లాగ నే
    దేలుచు సోక నెంచ నిను దీర మదీయ కరాంగుళీయపున్
    నీలము లెఱ్ఱబాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిమిత్రులెవరైనా వాట్సప్ లో ప్రచురించ మనవి. నా చరవాణి నిన్న ప్రయాణంలో పోయింది.

      తొలగించండి
    2. కరాంగుళీయపున్/ నీలము:
      “నీ” స్థిరము కావున ను గాగమము రాదండి.

      తొలగించండి
    3. ఆర్యా! ధన్యవాదశతము. తరుణోపాయము సూచింప ప్రార్ధన.

      తొలగించండి
  21. కలియుగంపు మహిమ కనబడు నట్లుగ
    నీలమెఱ్ఱబాఱె నీలవేణి!
    బమ్మెర యగు నండ్రు తిమ్మెరగనిలను
    తిమ్మెరయగు భామ!బమ్మెరగను

    రిప్లయితొలగించండి
  22. కాలము చెల్లు కారణము,కాంతివిహీనపు గుర్తులాయనన్
    నీలములెఱ్ఱబాఱె రమణీ! రమణీయ విలాస రేఖలన్
    ఫాలము యౌవనంబు తఱి భాసురమౌచును గాంతితోడుతన్
    లాలన జేయునట్లుగను రమ్యపు పోకడ గానవచ్చుగా

    రిప్లయితొలగించండి
  23. సిగ్గె యగును గొప్ప సింగార మువిదకు
    సిగ్గులు మొలకెత్త బుగ్గ పైన
    ముద మొసంగ నీదు ముద్దు ముక్కు పుడక
    నీల మెఱ్ఱవాఱె నీలవేణి


    నీలము లయ్యె ముత్యములు నీరజ నేత్రు కరమ్ము లందుఁ దా
    లీలగ నుంచ రాఘవుఁడు లేమ శిరమ్మున నంత హర్ష క
    ల్లోలిత జానకీ సతి శిరో వర దేశము నుండి జాఱఁగా
    నీలము లెఱ్ఱవాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్

    రిప్లయితొలగించండి
  24. చౌక రంగు వేసి షాంపుతో కడుగగా
    నీల మెఱ్ఱబాఱె నీలవేణి
    కురులు; నలుపు వెలసి, తరుణి బాధపడగ
    మగడు తెచ్చె నొక్క మంచి రంగు.

    రిప్లయితొలగించండి
  25. హేలగ చేలముల్ దొడిగి యింపుగ జానకి మీనకేతునిన్
    గోలవిధమ్ముగా మిగిలి కూర్మినిఁ జూపగ, రామునుండి యా
    శీలవతీ లలామ నెఱిశీర్షము పైఁ బడి జాలువాఱగా
    నీలము లెఱ్ఱబాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్

    రిప్లయితొలగించండి
  26. ఈనాటి సమస్య..
    నీలభ మెఱ్ఱ బాఱగను నింగిని దోచగ నింద్రచాపమై
    బేలగ సంధ్య కౌగిటిని వీడగ సూర్యుడు నిద్రమత్తుతో
    హేలగ సంద్ర మంతయును నింపుగ నెఱ్ఱని బాటబర్చగా
    నీలములెఱ్ఱబాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్ !!

    రిప్లయితొలగించండి
  27. లీలగ వింటినెత్త గని ప్రీతి వరించె మహీజ యంతటన్
    హేల వివాహబంధమున నిర్వురు గూడిన వేళనా తలం
    బ్రాలుగ ముత్యముల్ దొరలె రాముని చేతుల నుండి నాతిపై
    నీలము లెఱ్ఱబాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్

    రిప్లయితొలగించండి