30-10-2021 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్”(లేదా...)“అంబరమందుఁ జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్”
కుంబిలుని జన్మదినమనియంబుజలోచన కొనెనొక యాచ్ఛాదనమున్ సుందర చిత్రము లుగనాఅంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంబరమున మడుగునగలయంబును తొండమున పీల్చి హమ్మని యూదన్డంబపు కరి,యానీటన్యంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
సంబరమాయెగజగతికిఅంబుదశ్రేణియుకదలగనానందముతోశంభుఁడుజార్చగగంగనుఅంబరమునఁజేపలీదెనందమ్మోలుకన్
సమస్య :అంబరమందు జేపలు న యంబుగ నీదె మనోహరమ్ముగన్ ( రాయలవారి సభలో ఇంద్రజాల ప్రదర్శన )శంబరు డింద్రజాలికుడు సన్మతి విద్యను కృష్ణరాయడే సంబరమందుచున్ సతుల జక్కగ నుంచుక చూచుచుండ ; నా డంబరమొప్ప వింత ఘన టంకృతి జేయుచు సల్ప ; నీలమౌ అంబరమందు జేపలు న యంబుగ నీదె మనోహరమ్ముగన్ .
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కందంఅంబువు రాలక తమ ప్రాణంబు నిలువదని సరసున నలిగెడు గతిలోనంబుద గర్జన వినపడనంబరమునఁ, జేఁప లీఁదె నందమ్మొలుకన్ఉత్పలమాలఅంబువు రాలకే కొలను నందున జీవనమెట్లు సాగు? ప్రాణంబులు నిల్చునెట్ల? నుచు నల్గుచు చింతను గ్రుంగుచుండ నయ్యంబుద గర్జనల్ బ్రతుకునాశకు నూపిరులూద వేగమేయంబరమందుఁ, జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సంబరపడిమీననయనచుంబనరుచినేకనుగొన సుందరిమదిలోసంబరమే యంబరమైఅంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
సంబరముగ దీపావళిచుంబిత గగనాల వెల్గు జువ్వల వెలుగుల్-వెంబడి కనపడెనవిగొఅంబరమున జేపలీదె నందమ్మొలుకన్
ధన్యవాదములు
అంబురుహాక్షి జన్మదినమంచు నెఱంగిన ప్రేమికుండు తాసంబరమందితెచ్చె నొక చక్కటి తెల్లని కోక దానిపై యంబువు నందునన్ బిసరుహమ్ములు యంచలు గల్గినట్టియా యంబరమందుఁ జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సంబరమందమత్స్యములసన్ననివస్త్రముపైనిగీయగాఅంబకమందుపాపలవియందముతోడుతచిందులేయనారంభయుదాల్చెదానిఁగనిరాగముఁదీయుచునాడెముద్దుగాఅంబరమందుచేపలునయంబుననీదెమనోహరమ్ముగన్అంబకము-కన్ను
సంబరముగ గు వ్వలెగిరెనంబరమునఁ ; జేఁప లీఁదె నందమ్మొలుకన్నంబుధి నందున హాయిగ పంబిన యుత్సా హమొంది భయపడ కుండన్
అంబుల రణమును బహు యాడంబరముగ తెరని నిలుప నంతటది వినోదంబై తోచెనొకో నీ లాంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'బహు+ఆడంబరము' అన్నపుడు యడాగమం రాదు. 'అంతట+అది' అన్నపుడు సంధి లేదు. *కడు నాడంబరముగ.. నంత నది..* అనండి.
ధన్యవాదాలండి🙏. సవరించితిని. అంబుల రణమును కడు నాడంబరముగ తెరని నిలుప నంతనది వినోదంబై తోచెనొకో నీ లాంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
అంబరమందు పతంగులుసంబరముగ నెగురవేయు సందడిచూడన్అంబకములకవి తోచినవంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
సంబర ముడిగిన వగుచుదా మంబరమును జూచు చుండె నలసిన దరిలో నంబుద ములు గర్జింపగ నంబరమున :జేప లీ దె నంద మ్మొలు కన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణభంగం. *సంబర ముడిగినవై తా మంబరమును...* అనండి.
అంబరవీథిరమ్యసలిలాశ్రయసాంద్రఖనీలిమంబు చొక్కంబగు నీరు, తల్లహరికమ్రపరంపరవీచిడోలలందంబుధిజుండు నావయగు, నట్లుగ తారలు కొర్రమీనులైయంబరమందు చేపలు నయమ్మున నీదె మనోహరమ్మునన్.కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
అంబుజ నాభు మహిమ మకరంబులఁ దారా గ్రహముల రంజిలుచును మోదంబునఁ గర్కటములతోనంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్ చుంబన కేళి సల్పుచును జోద్యమ బంగరు రంగు లీనుచున్ సంబర మంబరమ్మును భృశమ్ముగఁ దాఁకుచు నుండఁ దోఁగి పుణ్యాంబువు లందు దోవతిని నాడుచు నుండఁగఁ బాండురంపు నా యంబర మందుఁ జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్
అంబుదముల సొగసు గనుమనంబరమున,జేపలీదె నందమ్మొలుకన్ నంబువు లెక్కువ గల్గుటయంబువులే ప్రాణముకద యాచేపలకున్
కం.కంబము చివరన గగన పథంబునెగిరె 'కొయ్‌నొబోరి' తళతళమని యాడంబరముగ; పోలికగననంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్!జాపనీయులు కొయ్ (koi) చేపలను బలముకు మరియు పట్టుదలకు చిహ్నములుగా భావిస్తారు. పిల్లలకు ఆ లక్షణములు అబ్బవలెననే సదుద్ధేశముతో బాలల దినోత్సవము రోజున కొయ్ చేపల రూపములో ఉండే గాలిపటాలను స్తంబముల చివర ఎగురవేస్తారు. వాటిని 'koinobori' అంటారు.
అంబుద శ్రేణులన్ వరుస నారయ చక్కగనుండె చూడుమాయంబరమందు,జేపలు నయంబుగ నీదెమనోహరంబుగన్ నంబువు లెక్కువౌ కతన యబ్బగ వేడుక మానసంబునన్సంబర మొప్పగా మిగుల సంతుల తోడను నక్కొలన్ దమిన్
అంబుధరంబులలముకొననంబరమునఁ, జేఁప లీఁదె నందమ్మొలుకన్సంబరమున నంబుధిలోనంబరమణి తాపమణగ నానందమునన్
రిప్లయితొలగించండికుంబిలుని జన్మదినమని
యంబుజలోచన కొనెనొక యాచ్ఛాదనమున్
సుందర చిత్రము లుగనా
అంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంబరమున మడుగునగల
రిప్లయితొలగించండియంబును తొండమున పీల్చి హమ్మని యూదన్
డంబపు కరి,యానీటన్
యంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంబరమాయెగజగతికి
రిప్లయితొలగించండిఅంబుదశ్రేణియుకదలగనానందముతో
శంభుఁడుజార్చగగంగను
అంబరమునఁజేపలీదెనందమ్మోలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిఅంబరమందు జేపలు న
యంబుగ నీదె మనోహరమ్ముగన్
( రాయలవారి సభలో ఇంద్రజాల ప్రదర్శన )
శంబరు డింద్రజాలికుడు
సన్మతి విద్యను కృష్ణరాయడే
సంబరమందుచున్ సతుల
జక్కగ నుంచుక చూచుచుండ ; నా
డంబరమొప్ప వింత ఘన
టంకృతి జేయుచు సల్ప ; నీలమౌ
అంబరమందు జేపలు న
యంబుగ నీదె మనోహరమ్ముగన్ .
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఅంబువు రాలక తమ ప్రా
ణంబు నిలువదని సరసున నలిగెడు గతిలో
నంబుద గర్జన వినపడ
నంబరమునఁ, జేఁప లీఁదె నందమ్మొలుకన్
ఉత్పలమాల
అంబువు రాలకే కొలను నందున జీవనమెట్లు సాగు? ప్రా
ణంబులు నిల్చునెట్ల? నుచు నల్గుచు చింతను గ్రుంగుచుండ న
య్యంబుద గర్జనల్ బ్రతుకునాశకు నూపిరులూద వేగమే
యంబరమందుఁ, జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసంబరపడిమీననయన
రిప్లయితొలగించండిచుంబనరుచినేకనుగొన సుందరిమదిలో
సంబరమే యంబరమై
అంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసంబరముగ దీపావళి
రిప్లయితొలగించండిచుంబిత గగనాల వెల్గు జువ్వల వెలుగుల్-
వెంబడి కనపడెనవిగొ
అంబరమున జేపలీదె నందమ్మొలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండిఅంబురుహాక్షి జన్మదినమంచు నెఱంగిన ప్రేమికుండు తా
సంబరమందితెచ్చె నొక చక్కటి తెల్లని కోక దానిపై
యంబువు నందునన్ బిసరుహమ్ములు యంచలు గల్గినట్టియా
యంబరమందుఁ జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసంబరమందమత్స్యములసన్ననివస్త్రముపైనిగీయగా
రిప్లయితొలగించండిఅంబకమందుపాపలవియందముతోడుతచిందులేయనా
రంభయుదాల్చెదానిఁగనిరాగముఁదీయుచునాడెముద్దుగా
అంబరమందుచేపలునయంబుననీదెమనోహరమ్ముగన్
అంబకము-కన్ను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంబరముగ గు వ్వలెగిరె
రిప్లయితొలగించండినంబరమునఁ ; జేఁప లీఁదె నందమ్మొలుకన్
నంబుధి నందున హాయిగ
పంబిన యుత్సా హమొంది భయపడ కుండన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంబుల రణమును బహు యా
రిప్లయితొలగించండిడంబరముగ తెరని నిలుప నంతటది వినో
దంబై తోచెనొకో నీ
లాంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బహు+ఆడంబరము' అన్నపుడు యడాగమం రాదు. 'అంతట+అది' అన్నపుడు సంధి లేదు. *కడు నాడంబరముగ.. నంత నది..* అనండి.
ధన్యవాదాలండి🙏. సవరించితిని.
తొలగించండిఅంబుల రణమును కడు నా
డంబరముగ తెరని నిలుప నంతనది వినో
దంబై తోచెనొకో నీ
లాంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
అంబరమందు పతంగులు
రిప్లయితొలగించండిసంబరముగ నెగురవేయు సందడిచూడన్
అంబకములకవి తోచిన
వంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంబర ముడిగిన వగుచుదా
రిప్లయితొలగించండిమంబరమును జూచు చుండె నలసిన దరిలో
నంబుద ములు గర్జింపగ
నంబరమున :జేప లీ దె నంద మ్మొలు కన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. *సంబర ముడిగినవై తా మంబరమును...* అనండి.
అంబరవీథిరమ్యసలిలాశ్రయసాంద్రఖనీలిమంబు చొ
రిప్లయితొలగించండిక్కంబగు నీరు, తల్లహరికమ్రపరంపరవీచిడోలలం
దంబుధిజుండు నావయగు, నట్లుగ తారలు కొర్రమీనులై
యంబరమందు చేపలు నయమ్మున నీదె మనోహరమ్మునన్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅంబుజ నాభు మహిమ మక
రిప్లయితొలగించండిరంబులఁ దారా గ్రహముల రంజిలుచును మో
దంబునఁ గర్కటములతో
నంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్
చుంబన కేళి సల్పుచును జోద్యమ బంగరు రంగు లీనుచున్
సంబర మంబరమ్మును భృశమ్ముగఁ దాఁకుచు నుండఁ దోఁగి పు
ణ్యాంబువు లందు దోవతిని నాడుచు నుండఁగఁ బాండురంపు నా
యంబర మందుఁ జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్
అంబుదముల సొగసు గనుమ
రిప్లయితొలగించండినంబరమున,జేపలీదె నందమ్మొలుకన్
నంబువు లెక్కువ గల్గుట
యంబువులే ప్రాణముకద యాచేపలకున్
కం.
రిప్లయితొలగించండికంబము చివరన గగన ప
థంబునెగిరె 'కొయ్‌నొబోరి' తళతళమని యా
డంబరముగ; పోలికగన
నంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్!
జాపనీయులు కొయ్ (koi) చేపలను బలముకు మరియు పట్టుదలకు చిహ్నములుగా భావిస్తారు. పిల్లలకు ఆ లక్షణములు అబ్బవలెననే సదుద్ధేశముతో బాలల దినోత్సవము రోజున కొయ్ చేపల రూపములో ఉండే గాలిపటాలను స్తంబముల చివర ఎగురవేస్తారు. వాటిని 'koinobori' అంటారు.
అంబుద శ్రేణులన్ వరుస నారయ చక్కగనుండె చూడుమా
రిప్లయితొలగించండియంబరమందు,జేపలు నయంబుగ నీదెమనోహరంబుగన్
నంబువు లెక్కువౌ కతన యబ్బగ వేడుక మానసంబునన్
సంబర మొప్పగా మిగుల సంతుల తోడను నక్కొలన్ దమిన్
అంబుధరంబులలముకొన
రిప్లయితొలగించండినంబరమునఁ, జేఁప లీఁదె నందమ్మొలుకన్
సంబరమున నంబుధిలో
నంబరమణి తాపమణగ నానందమునన్